పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదాజగర సంవాదము

  •  
  •  
  •  

7-430-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మునివల్లభుఁ డజగరుఁ డను
సుయుండు హిరణ్యకశిపు సూనుండును ము
న్నొరించిన సంవాదము
వినుమీ యర్థంబునందు వెలయు నరేంద్రా!

టీకా:

ముని = మునులలో; వల్లభుడు = శ్రేష్ఠుడు; అజగరుడు = అజగరుడు(కొండచిలువుడు); అను = అనెడి; సునయుండు = మంచినీతిగలవాడు; హిరణ్యకశిపు = హిరణ్యకశిపుని; సూనుండును = పుత్రుడును; మున్ను = పూర్వము; ఒనరించిన = చేసిన; సంవాదము = సంభాషణము; వినుము = వినుము; ఈ = ఈ; అర్థంబునన్ = సందర్భము; అందున్ = లో; వెలయున్ = ప్రసిద్ధమైనది; నరేంద్రా = రాజా.

భావము:

మహారాజా! ధర్మరాజా! పూర్వకాలంలో “అజగరు”డని మరొక పేరు గల “సునయుడు” అనెడి మునీశ్వరునికి, హిరణ్యకశిపుని కుమారుడైన “ప్రహ్లాదుడికి” సంవాదం జరిగింది. దానిలో పరమహంస ధర్మాలు, వాటి మహత్మ్యమూ చక్కగా వివరింపబడ్డాయి. ఆ వివరాలు చెప్తాను శ్రద్ధగా విను.