పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదాజగర సంవాదము

  •  
  •  
  •  

7-430-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మునివల్లభుఁ డజగరుఁ డను
సుయుండు హిరణ్యకశిపు సూనుండును ము
న్నొరించిన సంవాదము
వినుమీ యర్థంబునందు వెలయు నరేంద్రా!

టీకా:

ముని = మునులలో; వల్లభుడు = శ్రేష్ఠుడు; అజగరుడు = అజగరుడు(కొండచిలువుడు); అను = అనెడి; సునయుండు = మంచినీతిగలవాడు; హిరణ్యకశిపు = హిరణ్యకశిపుని; సూనుండును = పుత్రుడును; మున్ను = పూర్వము; ఒనరించిన = చేసిన; సంవాదము = సంభాషణము; వినుము = వినుము; ఈ = ఈ; అర్థంబునన్ = సందర్భము; అందున్ = లో; వెలయున్ = ప్రసిద్ధమైనది; నరేంద్రా = రాజా.

భావము:

మహారాజా! ధర్మరాజా! పూర్వకాలంలో “అజగరు”డని మరొక పేరు గల “సునయుడు” అనెడి మునీశ్వరునికి, హిరణ్యకశిపుని కుమారుడైన “ప్రహ్లాదుడికి” సంవాదం జరిగింది. దానిలో పరమహంస ధర్మాలు, వాటి మహత్మ్యమూ చక్కగా వివరింపబడ్డాయి. ఆ వివరాలు చెప్తాను శ్రద్ధగా విను.

7-431-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తొల్లి భగవత్ప్రియుం డయిన ప్రహ్లాదుండు కతిపయామాత్య సమేతుండై లౌకికతత్వంబు నెఱింగెడికొఱకు లోకంబుల సంచరించుచు నొక్కనాఁడు కావేరీతీరంబున సహ్యపర్వతతటంబున ధూళిధూసరితంబు లయిన కరచరణాద్యవయవంబులతోడ గూఢంబైన నిర్మల తేజంబుతోఁ గర్మాకారవచోలింగ వర్ణాశ్రమాదుల నెవ్వరికి నెఱుంగఁ బడక నేల నిద్రించుచు నజగర వ్రతధరుండైన మునిం గని డాయం జని విధివత్ప్రకారంబున నర్చించి మునిచరణంబులకు శిరంబు మోపి మ్రొక్కి యతని చరిత్రంబు దెలియ నిచ్చయించి యిట్లనియె.

టీకా:

తొల్లి = పూర్వము; భగవత్ = భగవంతునికి; ప్రియుండు = ఇష్ఠుడు; అయిన = ఐన; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; కతిపయి = అనేకమంది; అమాత్య = మంత్రులతో; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; లౌకికతత్వంబున్ = లోకధర్మమును; ఎఱింగెడి = తెలిసికొనుట; కొఱకు = కోసము; లోకంబులన్ = లోకమునందు; సంచరించుచున్ = తిరుగుతు; ఒక్క = ఒక; నాడు = దినమున; కావేరీ = కావేరీనది; తీరంబునన్ = గట్టువద్ద; సహ్య = సహ్య యనెడి; పర్వత = పర్వతము యొక్క; తటంబునన్ = చరియయందు; ధూళి = ధూళితో; ధూసరితంబులు = మాసిపోయినవి; అయిన = ఐన; కర = చేతులు; చరణ = చేతులు; ఆది = మున్నగు; అవయవంబుల్ = అంగముల; తోడన్ = తోటి; గూఢంబు = రహస్యమైనది; ఐన = అయిన; నిర్మల = స్వచ్ఛమైన; తేజంబున్ = తేజస్సు; తోన్ = తో; కర్మ = పనులు; ఆకార = రూపము; వచస్ = మాటలు; లింగ = చిహ్నము; వర్ణ = చాతుర్వర్ణములోనిది; ఆశ్రమ = చతురాశ్రమములలోనిది; ఎవ్వరి = ఎవరి; కిన్ = కి; ఎఱుంగబడక = తెలిసికొనరాక; నేలన్ = భూమిపైన; నిద్రించుచున్ = నిద్రపోతూ; అజగర = కొండచిలువవలెకదలుటలేని; వ్రత = దీక్ష; ధరుండు = తీసుకొన్నవాడు; ఐన = అయిన; మునిన్ = మునిని; కని = కనుగొని; డాయన్ = దగ్గరకు; చని = వెళ్ళి; విధివత్ప్రకారంబునన్ = పద్ధతిప్రకారముగా; అర్చించి = పూజించి; ముని = ముని యొక్క; చరణంబుల్ = కాళ్ళ; కున్ = కు; శిరంబున్ = తలను; మోపి = తాకించి; మ్రొక్కి = నమస్కరించి; అతని = అతని యొక్క; చరిత్రంబున్ = చరిత్రను; తెలియన్ = తెలిసికొన; ఇచ్ఛయించి = కోరి; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.

భావము:

మహాభక్తుడైన ప్రహ్లాదుడు చక్రవర్తిగా రాజ్యం ఏలుతూ, ఒకమారు లౌకిక వ్యవహారాలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవాలని, కొందరు మంత్రులను వెంటబెట్టుకుని లోకసంచారానికి బయలుదేరాడు. అలా వెళ్తూ కావేరీ తీరం చేరుకున్నాడు. అక్కడ సహ్యపర్వతాలు విస్తరించి ఉన్నాయి. ఆ పర్వత సానువులలో సంచరిస్తుండగా, ప్రహ్లాదుడు అక్కడ దుమ్ముకొట్టుకుపోయిన దేహంతో అజగరవ్రత దీక్షలో ఉన్న ఒక మునీశ్వరుడు కనబడ్డాడు. శరీరం ధూళిదూసరితం అయినా ఆయన అద్భుతమైన తేజస్సు నిగూఢంగా ప్రకాశిస్తున్నది. ఆయన కార్యం వలన కానీ, ఆకారం వలన కానీ, మాట వలన కానీ, లింగభేదం వలన కానీ, వర్ణాశ్రమాదుల వలన కానీ, ఏ మాత్రం గుర్తించడానికి వీలులేకుండా, కొండచిలువ (అజగరం) వలె నిర్వికారంగా నేలపై పడుకుని ఉన్నాడు. ప్రహ్లాదుడు ఆ మునీశ్వరుని సమీపించి, యథావిధిగా పూజించి, నమస్కరించాడు. ఆయన పవిత్ర చరిత్ర తెలుసుకోవాలని ఇలా పలికాడు.

7-432-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"భూమి నుద్యోగి యై భోగి యై యుండెడి-
రుని కైవడి మునినాథ! నీవు
నశరీరము దాల్చి దలవు చిత్ర ము-
ద్యమయుక్తునకుఁ గాని నము లేదు
నవంతునకుఁ గాని గు భోగములు లేవు-
భోగికిఁ గాని సంపూర్ణమైన
నువు లే దుద్యోగనభోగములు లేక-
నేల నూరక పడి నిద్ర పోవు

7-432.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీకు నెట్లు గలిగె నిరుపమ దేహంబు
ముఁడ వార్యుఁడవు విశారదుఁడవు
బుద్ధినిధివి జనులఁ బొగడవు దెగడవు
నిద్ర ప్రతిదినంబు నిలుప నేల?"

టీకా:

భూమిన్ = ప్రపంచమునందు; ఉద్యోగి = కృషిచేయువాడు; ఐ = అయ్యి; భోగి = సుఖించువాడు; ఐ = అయ్యి; ఉండెడి = ఉండునట్లు; నరుని = మానవుని; కైవడి = వలె; ముని = మునులలో; నాథ = శ్రేష్ఠుడ; నీవు = నీవు; ఘన = గొప్ప; శరీరమున్ = దేహమును; తాల్చి = ధరించి; కదలవు = ఎక్కడికివెళ్ళవు; చిత్రము = విచిత్రమైనది; ఉద్యమయుక్తుని = కష్టపడెడివాని; కున్ = కి; కాని = తప్పించి ఇతరులకు; ధనము = సంపద; లేదు = లేదు; ధనవంతున్ = ధనముగలవాని; కున్ = కి; కాని = తప్పించి; తగు = తగిన; భోగములు = సుఖానుభములు; లేవు = లేవు; భోగి = సుఖానుభవముగలవాని; కిన్ = కి; కాని = తప్పించి; సంపూర్ణమైన = పూర్తి, పుష్కలమైన; తనువు = చక్కటిదేహము; లేదు = కలుగదు; ఉద్యోగ = ప్రయత్నములు; ధన = సంపదలు; భోగములు = భోగములు; లేక = లేకుండగనే; నేలన్ = నేలపైన; ఊరక = ఉట్టినే; పడి = పడియుండి; నిద్రపోవు = నిద్రించుచున్న.
నీవు = నీవు; కున్ = కు; ఎట్లు = ఏవిధముగ; కలిగెన్ = కలిగినది; నిరుపమ = సాటిలేని; దేహంబు = దేహము; సముడవు = సమత్వభావముగల వాడవు; ఆర్యుడవు = పూజ్యుడవు; విశారదుడవు = విద్వాంసుడవు; బుద్ధినిధివి = జ్ఞానమునకునాశ్రయుడవు; జనులన్ = ప్రజలను యెవరిని; పొగడవు = వందింపవు; తెగడవు = నిందింపవు; నిద్రన్ = నిద్రావస్థను; ప్రతిదినము = ప్రతిరోజు; నిలుపన్ = నిలుపుకొనుట; ఏల = ఎందుకు.

భావము:

“ఓ మునివర్యా! మహాభోగి వలె జీవితం గడిపేవాడి లాంటి గొప్ప శరీరాన్ని పొందిన నీవు, కదలకుండా ఇలా శయనించి ఉన్నావు. నీవు సామాన్యుడవు కావు. పరమాద్భుతమైన మూర్తివి. నీ నడవడిక బహు విచిత్రంగా ఉన్నది. లోకంలో ఏంతో కష్టపడి ప్రయత్నించే వాడికే కానీ ధనం లభించదు. ధనం ఉన్నవాడికే కాని భోగాలు జరుగవు. భోగాలు ఉన్నవాడు తప్ప బాగా శరీరపోషణ చేసుకోలేడు. అలా బాగా పోషణ జరుగుతున్న వాని శరీరం సౌందర్యంతో ప్రకాశిస్తుంది. కానీ ఏ వృత్తిలోనూ శ్రమించకుండా, ఏ ధన భోగాలూ లేకుండా, ఏ ప్రయత్నం లేకుండానే కటిక రాతి నేల మీద పడుకుని నిద్రించే నీకు ఇంతటి అసమాన సుందర దేహం ఎలా వచ్చింది. నీవు మహానుభావుడవు, పూజనీయుడవు, తత్త్వవిశారదుడవు, సర్వసముడవు, జనులను దూషించవు, భూషించవు. సమదృష్టి అలవరచుకున్న స్థితప్రజ్ఞుడవు. అటువంటి నీవు ఇలా ప్రతిదినం నిద్రలో ఎందుకు గడుపుతున్నావు స్వామీ! చెప్పు. తెలుసుకోవాలని ఉంది” అని అన్నాడు ప్రహ్లాదుడు.

7-433-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లు ప్రహ్లాదుం డడిగిన వికసితముఖుం డయి మునీంద్రుండు తదీయ మధురాలాపసుధారసప్రవాహంబులు కర్ణంబులఁ బరిపూర్ణంబులైన నతని నవలోకించి యిట్లనియె.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; అడిగినన్ = అడుగగా; వికసిత = వికసించిన, వెలుగుతున్న; ముఖుండు = ముఖముగలవాడు; అయి = అయ్యి; ముని = మునులలో; ఇంద్రుండు = శ్రేష్ఠుడు; తదీయ = అతని యొక్క; మధుర = తీయని; ఆలాప = పలుకుల; సుధారస = అమృతపు; ప్రవాహంబులు = వెల్లువలు; కర్ణంబులన్ = చెవులందు; పరిపూర్ణంబులు = నిండినవి; ఐనన్ = కాగా; అతనిన్ = అతనిని; అవలోకించి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అలా పలికిన ప్రహ్లాదుని మధురమైన మాటలు, సుధారసంలా వీనులకు విందు చేయగా, ఆ అజగర ముని ఆనందంతో వికసించిన ముఖం కలవాడై అతనితో ఇలా అన్నాడు.

7-434-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఆంతరంగికదృష్టి నంతయు నెఱుఁగుదు-
వార్యసమ్మతుఁడ వీ సురవర్య!
విశ్వజంతువుల ప్రవృత్తి నివృత్తిల-
క్షణముల నీ యెఱుంనివి లేవు
గవంతుఁ డగు హరి పాయక నీ మనో-
వీథి రాజిల్లుచు వెలుఁగుఱేని
క్రమమున బహుళాంధకారంబు బరిమార్చుఁ-
రమ సాత్వికుఁడవు ద్రబుద్ధి

7-434.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వైన నీవు నన్ను డిగెదు గావున
విన్న ధర్మ మెల్ల విస్తరింతు
నిన్నుఁ జూడఁ గలిగె నీతోడి మాటలు
నాత్మశుద్ధి గలిగె నఘచరిత!

టీకా:

ఆంతరింగిక = అంతర, దివ్య; దృష్టిన్ = దృష్టితో; అంతయున్ = సర్వమును; ఎఱుగుదువు = తెలిసినవాడవు; ఆర్య = పెద్దలకు; సమ్మతుడవు = ప్రియమైనవాడవు; ఈవు = నీవు; అసుర = రాక్షసులలో; వర్య = మేటివి; విశ్వ = జగత్తునందలి యెల్ల; జంతువుల = జీవుల యొక్క; ప్రవృత్తి = కర్మమార్గము; నివృత్తి = జ్ఞానమార్గముల; లక్షణములన్ = రీతులందు; నీ = నీకు; ఎఱుంగనివి = తెలియనివి; లేవు = లేవు; భగవంతుడు = షడ్గుణైశ్వర్యుడు; అగు = అయిన; హరి = విష్ణుమూర్తి; పాయక = విడువక; నీ = నీ యొక్క; మనోవీథి = చిత్తమునందు; రాజిల్లుచున్ = ప్రకాశించుచు; వెలుగుఱేని = చంద్రుని {వెలుగుఱేడు - వెలుగు (కాంతులు)గల ఱేడు (రాజు), చంద్రుడు}; క్రమమున = వలె; బహుళ = దట్టపు; అంధకారంబున్ = చీకటిని; పరిమార్చున్ = అణచివేయును; పరమ = అతిగొప్ప; సాత్వికుడవు = సత్త్వగుణప్రధానుడవు; భద్ర = శుభకరమైన; బుద్ధివి = బుద్ధిగలవాడవు; ఐన = అయిన.
నీవు = నీవు; నన్నున్ = నన్ను; అడిగెదు = అడిగితివి; కావున = కనుక; విన్న = నే విన్నట్టి; ధర్మము = ధర్మము; ఎల్లన్ = అంతయు; విస్తరింతున్ = వివరముగ తెలిపెదను; నిన్నున్ = నిన్ను; చూడన్ = చూచుట; కలిగెన్ = సంభవించినది; నీ = నీ; తోడి = తోటి; మాటలు = సంభాషణలు; ఆత్మన్ = చిత్తమునకు; శుద్ధి = నైర్మల్యము; కలిగెన్ = కలిగినది; అనఘ = పాపములేని; చరిత = నడవడికగలవాడ.

భావము:

“ఓ పుణ్యాత్మా! దానవోత్తమా! ప్రహ్లాదా! నేను నిన్ను దర్శించగలిగాను. నీతో మాట్లాడుట వలన నా మనస్సు పరిశుద్ధ మయింది. దివ్యదృష్టితో నీకు సమస్తమూ తెలుస్తాయి; నీవు పెద్దలకు ప్రియమైన వాడవు; పరమ సాత్త్వికుడవు; విశ్వంలోని ప్రాణికోటి యొక్క ప్రవృత్తి నివృత్తి మార్గాలలో నీకు తెలియనివి లేవు; నీ హృదయంలో అజ్ఞానాంధకారం దరిజేరకుండా భగవంతుడు సుర్యుడి లాగా ప్రకాశిస్తున్నాడు; సుబుద్ధివి నీవు; నీకు తెలియనిది ఏముంది? అయనా నీవు ధర్మ జిజ్ఞాసతో అడుగుతున్నావు; కాబట్టి నేను విన్న ధర్మమును నీకు వివరిస్తాను.

7-435-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వినుము; ప్రవాహకారిణి యై విషయంబులచేతం బూరింపరాని తృష్ణచేతం బడి కర్మంబులఁ బరిభ్రామ్యమాణుండ నైన నేను నానావిధ యోనుల యందుఁ బ్రవేశించుచు వెడలుచు నెట్టకేలకు మనుష్య దేహంబు ధరియించి యందు ధర్మంబున స్వర్గద్వారంబును నధర్మంబున శునకసూకరాది తిర్యగ్జంతు యోని ద్వారంబుల నొంది క్రమ్మఱ మనుష్యుండై పుట్టవలయు నని వివేకించి సుఖరక్షణదుఃఖ మోక్షంబులకొఱకు ధర్మంబు చేయు దంపతుల వ్యవహారంబు గని సర్వక్రియానివృత్తి గలిగిన జీవుండు స్వతంత్రుండై ప్రకాశించు నని నిర్ణయించి భోగంబులు మనోరథజాత మాత్రంబులు గాని శాశ్వతంబులు గావని పరీక్షించి నివృత్తుండనై యుద్యోగంబు లేక నిద్రించుచుఁ బ్రారబ్దభోగంబు లననుభవించుచు నుండుదు; నివ్విధంబునఁ దనకు సుఖరూపంబైన పురుషార్థంబు దన యందుఁ గలుగుట యెఱుంగక పురుషుండు శైవాలజాల నిరుద్ధంబు లైన శుద్ధజలంబుల విడిచి యెండమావులు జలంబు లని పాఱెడు మూఢుని వడువున సత్యంబుగాని ద్వైతంబుఁ జొచ్చి ఘోరసంసారచక్ర పరిభ్రాంతుం డై, దైవతంత్రంబు లైన దేహాదులచేత నాత్మకు సుఖంబును దుఃఖనాశంబునుం గోరుచు నిరీశుం డైనవాని ప్రారంభంబులు నిష్ఫలంబు లగు; నదియునుం గాక మర్త్యునకు ధనంబు ప్రాప్తంబయిన నది దుఃఖకరంబు గాని సుఖకరంబు గాదు; లోభవంతు లయిన ధనవంతులు నిద్రాహారంబులు లేక రాజ చోర యాచక శత్రు మిత్రాది సర్వస్థలంబు లందును శంకించుచు దానభోగంబులు మఱచి యుండుదురు; ప్రాణార్థవంతులకు భయంబు నిత్యంబు; శోకమోహ భయక్రోధ రాగ శ్రమాదులు వాంఛామూలంబులు; వాంఛ లేకుండవలయును.

టీకా:

వినుము = వినుము; ప్రవాహ = ప్రవహించు, గమన; కారిణి = లక్షణముగలది; ఐ = అయ్యి; విషయంబుల్ = ఇంద్రియార్థముల; పూరింప = తృప్తిపరచ; రాని = శక్యముగాని; తృష్ణన్ = మిక్కిలి యాశ యందు; పడి = పడిపోయి; కర్మంబులన్ = కర్మములందు; పరిభ్రామ్యమాణుండను = తిరుగుచున్నవాడను; ఐన = అయిన; నేను = నేను; నానా = అనేక; విధ = రకముల; యోనులన్ = గర్భముల, క్షేత్రముల; అందున్ = లో; ప్రవేశించుచన్ = చేరుచు; వెడలుచు = బయటపడుచు; ఎట్టకేలకు = ఏదోవిధముగ; మనుష్య = మానవుని; దేహంబు = దేహమును; ధరియించి = పొంది; అందున్ = దానిలో; ధర్మంబునన్ = ధర్మవర్తనలచేత; స్వర్గ = స్వర్గలోకపు; ద్వారంబునున్ = వాకిలిని; శునక = కుక్క; సూకర = పంది; ఆది = మున్నగు; తిర్యక్ = స్థిరత్వములేని; జంతు = జంతువుల; యోనిద్వారంబులన్ = గర్భద్వారములను; ఒంది = పొంది; క్రమ్మఱ = మరల; మనుష్యుండు = మానవుడను; ఐ = అయ్యి; పుట్టవలయున్ = జన్మించవలెనని; వివేకించి = విచారించుకొని; సుఖ = సుఖమును; రక్షణ = కాపాడుకొనుట; దుఃఖ = దుఃఖమునుండి; మోక్షంబుల = విముక్తుల; కొఱకు = కోసము; ధర్మంబున్ = సద్వర్తనము; చేయు = చేసెడి; దంపతుల = భార్యాభర్తల; వ్యవహారంబున్ = వ్యర్థప్రయత్నములను; కని = చూసి; సర్వ = ఎల్ల; క్రియా = పనులను; నివృత్తి = మానుట; కలిగిన = కలిగినట్టి; జీవుండు = మానవుడు; స్వతంత్రుండు = దేనియందు లోబడనివాడు; ఐ = అయ్యి; ప్రకాశించున్ = విలసిల్లును; అని = అని; నిర్ణయించి = నిశ్చయించుకొని; భోగంబులు = సుఖదుఃఖానుభవములు; మనోరథ = తలపులలో; జాత = కలిగినవి; మాత్రంబులు = మాత్రమే; కాని = తప్పించి; శాశ్వతంబులు = స్థిరములు; కావు = కావు; అని = అని; పరీక్షించి = తరచిచూసి; నివృత్తుండను = కర్మబంధముల నుండి మరల్చబడిన వాడను; ఐ = అయ్యి; ఉద్యోగంబు = ప్రయత్నము, వృత్తి; లేక = లేకుండగనే; నిద్రించుచున్ = నిద్రపోవుచు; ప్రారబ్ధ = పూర్వ సంచిత కర్మానుసార; భోగంబులన్ = అనుభవములను; అనుభవించుచున్ = అనుభవించుచు; ఉండుదు = ఉండెదను; ఈ = ఈ; విధంబునన్ = విధముగ; తన = తన; కున్ = కు; సుఖ = సుఖము; రూపంబు = అనెడిది; ఐన = అయిన; పురుషార్థంబున్ = వస్తువులు; తన = తన; అందున్ = ఎడల; కలుగుట = కలుగుటను; ఎఱుంగక = తెలిసికొనక; పురుషుండు = మానవుడు; శైవాల = నాచు తెట్టుల; జాల = సమూహములచే; నిరుద్ధంబులు = కప్పబడినవి; ఐన = అయిన; శుద్ద = మంచి; జలంబులన్ = నీటిని; విడిచి = వదలివేసి; ఎండమావులు = మృగతృష్ణలను; జలంబులు = నీరు; అని = అని భ్రమించి; పాఱెడు = పరిగెత్తెడి; మూఢుని = అవివేకి; వడువునన్ = వలె; సత్యంబు = నిజము; కాని = కానట్టి; ద్వైతంబున్ = ద్వంద్వభావనలను; చొచ్చి = చేరి; ఘోర = భయంకరమైన; సంసార = సంసారము యనెడి; చక్ర = చక్రమునందు; పరిభ్రాంతుండు = భ్రాంతిలో తిరుగువాడు; ఐ = అయ్యి; దైవ = దేవునిచే; తంత్రంబులు = నియమింపబడుచున్నవి; ఐన = అయిన; దేహ = దేహము; ఆదులన్ = మొదలగువాని; చేతన్ = వలన; ఆత్మ = ఆత్మ; కున్ = కు; సుఖంబును = సుఖమును; దుఃఖనాశంబునున్ = దుఃఖముపోవుటను; కోరుచున్ = కోరుకొనుచు; నిరీశుండు = ఈశ్వరునితెలియనివాడు; ఐన = అయిన; వానిన్ = వాడి; ప్రారంభంబులున్ = ప్రయత్నములు; నిష్ఫలంబులు = నిరర్థకములు; అగు = అగును; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; మర్త్యున్ = మానవుని; కున్ = కు; ధనంబు = సంపద; ప్రాప్తంబు = లభించినది; అయిన = ఐనట్టిది; అది = మున్నగునవి; దుఃఖ = దుఃఖమును; కరంబు = కలిగించునది; కాని = తప్పించి; సుఖ = సుఖమును; కరంబు = కలిగించునది; కాదు = కాదు; లోభవంతుండు = ఆశాబద్ధులు; అయిన = ఐన; ధనవంతులు = మిక్కిలి ధనముగలవారు; నిద్ర = నిద్రను; ఆహారంబులు = ఆహారములు; లేక = లేకుండగ; రాజ = రాజులవలన; చోర = దొంగలవలన; యాచక = అడుగుకొనేవారివలన; శత్రు = శత్రువులవలన; మిత్ర = స్నేహితులు; ఆది = మున్నగు; సర్వ = అన్ని; స్థలంబులన్ = చోటులందు; శంకించుచున్ = సందేహించుచు; దాన = ఒకరికి పెట్టుట; భోగంబులున్ = తా ననుభవించుటలు; మఱచి = మైమరచిపోయి; ఉండుదురు = ఉండెదరు; ప్రాణ = ప్రాణులు; అర్థ = సంపదలు; వంతుల్ = గలవారల; కున్ = కి; భయంబు = భయము; నిత్యంబు = శాశ్వతము; శోక = వ్యసనము; మోహ = మోహము; భయ = భీతి; క్రోధ = కోపము; రాగ = అనురాగము; శ్రమ = అలసట; ఆదులు = మున్నగునవి; వాంఛా = తృష్ణ, కోరికల; మూలంబులు = వలనపుట్టునవి; వాంఛ = (కావున) విషయతృష్ణ; లేక = లేకుండగ; ఉండవలయును = ఉండవలెను.

భావము:

ఓ ప్రహ్లాదా! వినవయ్యా! విషయసుఖాల చేత తృప్తిపొందుట సాధ్యం కాని పని. అలా తృప్తి చెందకుండా పరుగులు పెట్టిస్తూ ఉండేది తృష్ణ లేదా దురాశ. అట్టి తృష్ణ వెంటబడి నేను కర్మబంధాలలో చిక్కుకుని సంసార చక్రంలో పరిభ్రమించాను. అనేక రకాలైన జన్మలు ఎత్తాను. మరణించాను. ఈ పరిభ్రమణంలో చిట్టచివరకు ఎట్టకేలకు మానవ దేహం ధరించాను. ఆయా జన్మలలో ధర్మాలూ, పుణ్యాలూ, అధర్మాలూ, పాపాలూ చేసి అటు స్వర్గ ద్వారాలూ, ఇటు శునక సూకరాది జంతు గర్భాలలోనూ పుట్టి నానా బాధలూ పడి పడి, వివేకించి మానవ జన్మ ఎత్తాను. సుఖం సంపాదన కోసం, దుఃఖ విముక్తి కోసం ధర్మం చేసే దంపతులను చూసాను. సమస్త క్రియల నుంచీ విముక్తి పొందిన జీవుడు స్వతంత్రుడై ప్రకాశిస్తాడని నిర్ణయించుకున్నాను. భోగాలు కోరికల వలన జనించేవే కానీ, శాశ్వతాలు కావని పరీక్షించి నిర్ధారించుకున్నాను. కర్మబంధాల నుండి నివృత్తి పొంది; ఏ ప్రయత్నమూ, ఏ కోరికలూ లేకుండా ఇలా నిద్రిస్తూ, ప్రారబ్ధ భోగాలు అనుభవిస్తూ పడి ఉన్నాను.
ఈ విధంగా మానవుడు తనకు కావలసిన సుఖరూపమైన పురుషార్థం తనలోనే జన్మిస్తుందని తెలుసుకోలేక పోతున్నాడు. పరిశుద్ధమైన జల ప్రవాహాన్ని విడిచిపెట్టి, ఎండమావుల వెంట పరుగెత్తే మూర్ఖుని వలె, జీవుడు అసత్యమైన ద్వైతంలో పడి పోతున్నాడు. ఘోర సంసార చక్రంలో పడి తిరుగుతున్నాడు. దైవ తంత్రాలైన దేహాదులచేత ఆత్మకు సుఖమునూ, దుఃఖనాశనమూ కోరుకునే నిరీశు డైనట్టివాని ప్రయత్నాలు నిష్ఫలాలు అవుతాయి. అంతేకాక, మానవుడికి ధనం లభిస్తే అది దుఃఖం కలిగిస్తుందే కాని, సుఖాన్ని కలిగించదు. లుబ్దులైన ధనవంతులు నిద్రాహారాలు మాని ప్రభువులనూ, చోరులనూ, యాచకులనూ, శత్రువులనూ, మిత్రులనూ అందరినీ అనుమానిస్తూ ఉంటారు; దానం చేయటం, అనుభవించటం మరచిపోతారు. నిత్యం దుఃఖంతో బాధ పడుతూ ఉంటారు. ప్రాణం మీద, ధనం మీదా మమకారం ఉన్నవాళ్ళను నిత్యం భయం వెంటాడుతూ ఉంటుంది. శోకం, మోహం, భయం, క్రోధం, రాగం, శ్రమ మున్నగు వాటికి కోరికలే కారణం. కాబట్టి, కోరికలు లేకుండా ఉండటం శ్రేయస్కరం.

7-436-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఘల్ గూర్చిన తేనె మానవులకున్ సంప్రాప్త మైనట్లు లో
తుల్ గూర్చిన విత్తముల్ పరులకుం బ్రాపించుఁ బ్రాప్తాశి యై
తిరుగం బోని మహోరగంబు బ్రదుకున్ దీర్ఘాంగమై యుండియుం
జికాలం బగు వాని వర్తనములం జింతించి యేకాంతి నై.

టీకా:

సరఘల్ = తేనెటీగలు; కూర్చిన = కూడబెట్టిన; తేనెన్ = తేనెను; మానవుల్ = నరుల; కున్ = కు; సంప్రాప్తము = లభించినది; ఐన = అయిన; అట్లు = విధముగా; లోభరతుల్ = పిసినారులు; కూర్చిన = కూడబెట్టిన; విత్తముల్ = సంపదలు; పరుల్ = ఇతరుల; కున్ = కు; ప్రాప్తించున్ = చేరును; ప్రాప్త = లభించినది; అశి = తినునది; ఐ = అయ్యి; తిరుగంబోని = సంచరించనట్టి; మహోరగంబు = కొండచిలువ {మహోరగము - మహా (పెద్ద) ఉరగము (పాము), కొండచిలువ}; బ్రతుకున్ = చాలాకాలము జీవించును; దీర్ఘ = పెద్ద; అంగము = దేహముగలది; ఐ = అయ్యి; ఉండియున్ = ఉండినప్పటికిని; చిరకాలంబు = చాలాకాలముజీవించునవి; అగు = అయిన; వాని = వాటి; వర్తనములన్ = నడవడులను; చింతించి = తలపోసి; ఏకాంతిని = ఒంటరివాడను; ఐ = అయ్యి.

భావము:

తేనెటీగలు కూడబెట్టిన తేనె, ఇతరుల పాలైనట్లు, లోభులు సంపాదించిన ధనం కూడా పరులకు ప్రాప్తిస్తుందే తప్ప సంపాదించిన వాడికి ఉపయోగపడదు. లభించినదే తిని కదలకుండా పడి ఉండే పెనుసర్పం కూడా చాలాకాలం బ్రతుకుతుంది. నేను చాలా కాలం ఒక కొండ చెలువను పరిశీలించి, ఈ నీతిని నేర్చుకున్నాను. అందుకని, నేను కూడా ఈ ఏకాంతవాసం చేస్తున్నాను.

7-437-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గరమును జుంటీఁగయు
నిగురువులుగాఁ దలంచి నిశ్చింతుఁడ నై
వినస్థలిఁ గర్మంబుల
జిబిజి లేకున్నవాఁడ గౌరవవృత్తిన్.

టీకా:

అజగరమును = కొండచిలువ; జుంటీగయున్ = తేనెటీగలు; నిజ = నిజమైన; గురువులు = మార్గదర్శకులుగ; తలంచి = భావించి; నిశ్చింతుడను = విచారములనుబాసిన వాడను; ఐ = అయ్యి; విజన = నిర్జన, ఎవరులేని; స్థలిన్ = చోటునందు; కర్మంబులన్ = కర్మములవలని; గజిబిజి = కలతలు; లేక = లేకుండగ; ఉన్నవాడన్ = ఉన్నాడను; గౌరవ = మంచి, మునుల; వృత్తిన్ = నడవడికతో.

భావము:

కొండచిలువ, తేనెటీగ నాకు గురువులుగా స్వీకరించాను. వాటి నుంచి నేను సుగుణాలను నేర్చుకున్నాను. నిశ్చింతగా, ఇలా ఈ నిర్జన ప్రదేశంలో ఏ కర్మబంధాల గందరగోళం లేకుండా ముని వృత్తిలో ఇలా జీవిస్తున్నాను.

7-438-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జిన వల్కల దుకూలాంబరంబులు గట్టి-
యైన గట్టక యైన లరుచుందు;
నాందోళికా రథ య నాగములనెక్కి-
యైన నెక్కక యైన రుగుచుందుఁ;
ర్పూర చందన స్తూరికా లేప-
మైన భూరజ మైన లదికొందు;
ర్మశయ్యల నైనఁ ర్ణ శిలా తృణ-
స్మంబులం దైన బండు చుందు;

7-438.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మానయుక్త మైన మానహీనం బైనఁ
దీయ నైన మిగులఁ దిక్త మైన
గుడుతు సగుణ మైన గుణవర్జితం బైన
ల్ప మైనఁ జాల ధిక మైన

టీకా:

అజిన = తోలు; వల్కలన్ = నారబట్టలను; దుకూల = పట్టు; అంబరంబులున్ = బట్టలను; కట్టి = కట్టుకొని; ఐనన్ = అయినను; కట్టక = కట్టకుండగ; ఐనన్ = అయినను; అలరుచుందున్ = చక్కగనుందును; ఆందోళిక = పల్లకి; రథ = రథము; హయ = గుఱ్ఱము; నాగములన్ = ఏనుగులను; ఎక్కి = ఎక్కి; ఐనన్ = అయినను; ఎక్కక = ఎక్కకుండగ; ఐనన్ = అయినను; అరుగుచుందున్ = వెళ్ళుచుందును; కర్పూర = కర్పూరము; చందన = గంధము; కస్తూరికా = కస్తూరి; లేపము = పూత; ఐనన్ = అయినను; భూరజము = నేలమీది దుమ్మును; ఐనన్ = అయినను; అలదికొందున్ = పూసికొనెదను; భర్మ = బంగారపు; శయ్యలన్ = పడకలమీద; ఐనన్ = అయినను; పర్ణ = ఆకులు; శిలా = రాళ్ళు; తృణ = గడ్డి; భస్మంబుల = బూడిదల; అందున్ = లోన; ఐనన్ = అయినను; పండుచుందున్ = పడుకొనెదను.
మాన = మన్ననతో; యుక్తంబు = కూడినది; ఐనన్ = అయినను; మాన = మన్నన; హీనంబు = లేనిది; ఐనన్ = అయినను; తీయన = తియ్యటిది; ఐనన్ = అయినను; మిగుల = మిక్కిలి; తిక్తము = చేదుగాయున్నది; ఐనన్ = అయినను; కుడుతున్ = తినెదను; సగుణము = శ్రేష్ఠమైనది; ఐనన్ = అయినను; గుణవర్జితంబు = చెడిపోయినది {గుణవర్జితము - గుణము (శ్రేష్ఠత్వము) వర్జితంబు (పోయినది), పాడైపోయినది}; ఐనన్ = అయినను; అల్పము = కొంచెము; ఐనన్ = అయినను; అధికము = ఎక్కువ; ఐన = అయినను;

భావము:

నేను పట్టుబట్టలు కానీ, నారబట్టలు కానీ, జంతు చర్మాలు కానీ ఏది లభిస్తే వాటిని ఎలా చక్కగా ధరిస్తానో, ఏవీ దొరకకపోతే అలాగే చక్కగా దిగంబరంగానే ఉంటాను; పల్లకీలమీద కానీ, రథాలమీద కానీ, గుఱ్ఱాలమీద కానీ, ఏనుగులమీద కానీ ఎలా ప్రయాణం చేస్తానో, లేదంటే నడచి అలానే ప్రయాణం చేస్తాను; చందనం, కస్తూరి, అగరు వంటి సౌందర్య లేపనాలు ఉంటే శరీరానికి పూసుకుంటాను, అంత ఆనందంగానూ నేలమీది దుమ్ము అయినా దేహానికి పట్టిస్తాను; బంగారంలాంటి పాన్పులమీద కానీ, ఆకుల పరుపు పై కానీ, గడ్డిమేటలమీద కానీ, రాయి రెప్పలమీద కానీ, బూడిదనేలలో గానీ ఎక్కడైనా నిశ్చింతగానే పండుకుంటాను; మానానమానాలు పట్టించుకోను; లభించింది భుజిస్తాను; అది బాగుండవచ్చు, బాగుండకపోవచ్చు, తియ్యగా ఉండవచ్చు, కటిక చేదుగా ఉండవచ్చు, కొంచమే కావచ్చు, ఎక్కువదే కావచ్చు; మనస్సులో దేనిని గురించీ నాకు చింత లేదు.

7-439-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లే ని యెవ్వరి నడుగను
రా ని చింతింపఁ బరులు ప్పించినచోఁ
గా ని యెద్దియు మానను
ఖేము మోదమును లేక క్రీడింతు మదిన్.

టీకా:

లేదు = ఈవస్తువు లేదు; అని = అని; ఎవ్వరిన్ = ఎవరిని; అడుగను = అడగను; రాదు = దొరకదు; అని = అని; చింతింపన్ = బాధపడను; పరులు = ఇతరులు; రప్పించినచో = తెప్పించిన యెడల; కాదు = కాదు; అని = అని; ఎద్దియున్ = దేనిని; మానను = మానివేయను; ఖేదము = దుఃఖము; మోదమునున్ = సంతోషములు; లేక = లేకుండగ; క్రీడింతున్ = విహరించెదను; మదిన్ = మనసునందు.

భావము:

నాకు ఏ వస్తు వైనా లేదు అని మరొకరిని అడగను. ఏదైనా సరే నాకు దొరక లేదు అని బాధపడను. ఎవరు ఏమి తెప్పించి పెట్టినా వద్దని వదిలేయను, కర్మారబ్ధమైన దేనినైన వలదు అనను. చిత్తంలో దుఃఖం గాని, సుఖం గాని లేక ఆనందిస్తు ఉంటాను.
– (ప్రహ్లాద అజగర సంవాద ఘట్టంలో అజగరవ్రతధారి యైన ముని ప్రహ్లాదునికి తన గురించి చెప్తున్న సందర్భంలోది ఈ పద్యం. అజగర వ్రత నియమాలు అప్రయత్నం; అయాచితం, అవాఛితం, అనింద్యం, అక్రోధనం మొదలైన లక్షణాలతో అజగరంలా ఉండటం. అజగరం అంటే కొండచిలువ. అది ఆహారం కోసం ఎటూ వెళ్ళదు. ఒకచోట కదలకుండా ఉంటుంది. ఎప్పుడు దొరికితే అప్పుడే దొరికిన ఆహారం చిన్న పెద్ద అని, మంచి చెడు అని లేకుండ రుచి పచుల పట్టింపు లేక మింగుతుంది. కొన్ని నెలలు దొరకకపోయినా అలా నిరాహారంగానే ఉంటుంది. అయినా పెద్ద దేహంతో మిల మిల మెరుస్తు ఉంటుంది.)

7-440-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిందింప బరుల నెన్నఁడు
వందింప ననేక పీడ చ్చిన మది నా
క్రందింప విభవముల కా
నందింపఁ బ్రకామ వర్తనంబున నధిపా!

టీకా:

నిందింపన్ = దూషింపను; పరులన్ = ఇతరులను; ఎన్నడున్ = ఎప్పుడు; వందింపన్ = పొగడను; అనేక = ఎన్నో; పీడన్ = ఇక్కట్లు; వచ్చినన్ = వచ్చినప్పటికిని; మదిన్ = మనసునందు; ఆక్రందింపన్ = దుఃఖించను; విభవముల్ = వైభవముల; కున్ = కు; ఆనందింపన్ = ఆనందపడను; ప్రకామ = ఇష్టమువచ్చినట్లు; వర్తనంబునన్ = మెలగుటచేత; అధిపా = రాజా;

భావము:

ఓ ప్రహ్లాద మహారాజా! నేను ఇతరులను ఎవరినీ నిందించటం కానీ, స్తుతించటం కానీ ఎన్నడూ చేయను. ఎన్ని కష్టాలు వచ్చినా బాధపడను. ఎన్ని భోగభాగ్యాలు వచ్చినా ఆనందించను. ఎప్పుడూ స్వేచ్ఛగా, నిశ్చింతగా, సంతృప్తిగా ఉంటాను.

7-441-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు గోరికలు లేక యొక్క సమయంబున దిగంబరుఁడనై పిశాచంబు చందంబున నుండుచుఁ బెక్కు దినంబులుం గోలెఁ బెనుఁబాఁప వర్తనంబుఁ గైకొని నిమీలితలోచనత్వంబున నేకాంతభావంబు విష్ణుని యందు జేర్చి వికల్పంబు భేదగ్రాహకచిత్తవృత్తులఁ జిత్తంబు నర్థరూప విభ్రమంబు గల మనంబు నందు మనంబును నహంకారంబు నందు నహంకారంబును మాయ యందు మాయను నాత్మానుభూతి యందు లయంబు నొందించి సత్యంబు దర్శించుచు విరక్తి నొంది స్వానుభవంబున నాత్మస్థితుండనై యుండుదు; నీవు భగవత్పరుండవు గావున రహస్యం బైన పరమహంసధర్మంబు స్వానుభవగోచరం బైన తెఱంగున నీకు హృద్గోచరంబగు నట్లు చెప్పితి" ననిన విని.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; కోరికలు = కోరికలు; లేక = లేకుండగ; ఒక్క = ఒక; సమయంబునన్ = సమయములో; దిగంబరుండను = దిసమొలవాడను; ఐ = అయ్యి; పిశాచంబు = దయ్యము; చందంబునన్ = వలె; ఉండుచున్ = ఉంటూ; పెక్కు = చాలా; దినంబులంగోలెన్ = రోజులనుండి; పెనుపాప = పెద్దపాము, కొండచిలువ; వర్తనంబున్ = నడవడిని; కైకొని = స్వీకరించి; నిమీలిత = అరమోడ్పు; లోచనత్వంబునన్ = చూపులతో; ఏకాంత = ఏకాగ్రమైన; భావంబునన్ = భావముతో; విష్ణుని = విష్ణుమూర్తి; అందున్ = ఎడల; వికల్పంబున్ = భ్రాంతిని; భేద = భేదబుద్ధిని; గ్రాహక = కలిగించెడి; చిత్త = మనో; వృత్తులన్ = ధర్మములను; చిత్తంబునన్ = చిత్తమునందు; అర్థ = వస్తు; రూప = రూపముల; విభ్రమంబు = భ్రాంతులు; కల = కలిగినట్టి; మనంబున్ = మనసు; అందున్ = లో; మనంబునున్ = మనస్సును; అహంకారంబున్ = అహంకారము; అందునన్ = లో; అహంకారంబున్ = నేనడిభావము; మాయ = మాయ; అందున్ = లో; మాయను = మాయను, ప్రకృతిని; ఆత్మానుభూతి = ఆత్మ సాక్షాత్కారము; అందున్ = లో; లయంబున్ = లీనము; ఒందించి = పొందించి; సత్యంబున్ = సత్యమును; దర్శించుచు = చూచుచు; విరక్తిన్ = విరాగమును; ఒంది = పొంది; స్వానుభవంబునన్ = ఆత్మానుభమునందు; ఆత్మస్థితుండను = ఆత్మస్థితినియెరిగినవాడను; ఐ = అయ్యి; ఉండుదున్ = ఉండెదను; నీవు = నీవు; భగవత్పరుండవు = భాగవతుడవు; కావునన్ = కనుక; రహస్యంబు = రహస్యమైనది; ఐన = అయినట్టి; పరమహంస = పరమహంసత్వపు; ధర్మంబున్ = లక్షణములను; స్వానుభవ = నాఅనుభవమునకు; గోచరంబు = తెలిసినది; ఐన = అయిన; తెఱంగునన్ = విధముగ; నీవు = నీవు; కున్ = కు; హృత్ = హృదయమునకు; గోచరంబు = తెలిసినది; అగున్ = అయ్యెడి; అట్లు = విధముగ; చెప్పితిన్ = చెప్పితిని; అనినన్ = అనగా; విని = విని.

భావము:

ఈ విధంగా ఏ కోరికలూ లేకుండా పూర్వం కొన్నాళ్ళు పిశాచం లాగ దిగంబరంగా తిరిగాను. ఇప్పుడు చాలా రోజులనుండి పెద్దకొండచిలువలాగా కళ్ళు మూసుకుని, భావం భగవంతుడైన శ్రీమహావిష్ణువుపై లగ్నం చేసి ఇలా ఉన్నాను. భ్రాంతిని భేదభావం చూపే చిత్తవృత్తిలోనూ, చిత్తమును అర్థరూపములపై పరిభ్రమించే మనస్సులోనూ, మనస్సును అహంకారంలోనూ, అహంకారమును మాయలోనూ, మాయను ఆత్మానుభూతిలోనూ కేంద్రీకరించి విలీనం చేశాను. అది మొదలు సత్యదర్శనం చేస్తూ విరక్తి భావం పొందాను. స్వానుభవంతో ఆత్మస్థితి అలవరచుకున్నాను. నీవు ప్రహ్లాద! భక్తశిఖామణివి, పరమ భాగవతుడవు కాబట్టి ఈ రహస్యమైన పరమహంస ధర్మమును నాకు తెలిసినంతవరకు నీకు అర్థం అయ్యే లాగా చెప్పాను.” అని ఆ అజగరముని అన్నాడు.

7-442-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ను నజగరమునివల్లభు
నుజేంద్రుఁడు పూజ చేసి గ వీడ్కొని నె
మ్మమున సంతోషించుచుఁ
నియెన్ నిజ గేహమునకు శికులతిలకా!

టీకా:

ఘనున్ = గొప్పవానిని; అజగర = అజగరుడు యనెడి; ముని = ముని; వల్లభున్ = ప్రభువును; దనుజేంద్రుండు = దానవరాజు; పూజ = అర్చనలు; చేసి = చేసి; తగన్ = శ్రీఘ్రమే; వీడ్కొని = సెలవుతీసుకొని; నెఱి = నిండు; మనమునన్ = మనసుతో; సంతోషించుచున్ = సంతోషించుచు; చనియెన్ = వెళ్ళెను; నిజ = తన; గేహమున్ = ఇంటి; కున్ = కి; శశికులతిలకా = ధర్మరాజా {శశికులతిలకుడు - శశి (చంద్ర) కుల (వంశమునకు) తిలకా (ముఖ్యాభరణమైన వాడు), ధర్మరాజు}.

భావము:

ఓ చంద్రవంశ వరేణ్యా! ధర్మరాజా! అలా చెప్పిన అజగర మునీశ్వరుని మాటలు విని, ఆయనను పూజించి, నమస్కరించి, సెలవు తీసుకుని ప్రహ్లాదుడు ఆహ్లాదంగా తన అంతఃపురానికి వెళ్ళాడు.”

7-443-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన యుధిష్ఠరుం డిట్లనియె.

టీకా:

అనినన్ = అనగా; యుధిష్టరుండు = ధర్మరాజు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా చెప్తున్న నారదమహర్షితో ధర్మరాజు ఇలా అన్నాడు.

7-444-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుఁ బోటి జడగృహస్థుఁడు
మునివల్లభ! యిట్టి పదవి మోదంబున నే
నువునఁ జెందును వేగమ
వినిపింపుము నేఁడు నాకు విజ్ఞాననిధీ!

టీకా:

ననున్ = నా; పోటి = వంటి; జడ = అజ్ఞానియైన; గృహస్థుడు = గృహస్తాశ్రమమున ఉండువాడు; ముని = మునులలో; వల్లభ = ప్రభూ; యిట్టి = ఇటువంటి; పదవి = స్థితి; మోదంబునన్ = సంతోషముతో; ఏ = ఎట్టి; అనువునన్ = రీతిగ; చెందును = పొందగలడో; వేగమ = శ్రీఘ్రమే; వినిపింపుము = చెప్పుము; నేడు = ఇప్పుడు; నా = నా; కున్ = కు; విజ్ఞాన = విశిష్ట జ్ఞానమునకు; నిధీ = నెలవైనవాడా.

భావము:

“ఓ నారద మునీశ్వరా! నీవు గొప్ప జ్ఞాననిధివి. నీవు చెప్పిన ఈ పరమార్థం, ప్రబోధం బాగా నచ్చింది. కానీ నా బోటి అజ్ఞాని అయిన గృహస్థుడు అటువంటి పదవిని ఎలా అందుకోగలడో ఆ మార్గం ఇప్పుడు నాకు త్వరగా చెప్పు.”