పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : వర్ణాశ్రమ ధర్మంబులు

  •  
  •  
  •  

7-426-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వినుము; వనప్రస్థునకున్
మునికథితము లైన నియమములు గల వా చొ
ప్పు వనగతుఁడై మెలఁగెడి
నుఁడు మహర్లోకమునకు మనించు నృపా!

టీకా:

వినుము = వినుము; వనప్రస్థున్ = వానప్రస్థున; కున్ = కు; ముని = మునులచే; కథితములు = చెప్పబడినవి; ఐన = అయిన; నియమములు = నియమనిష్ఠలు; కలవు = ఉన్నవో; ఆచొప్పున = ఆలాగున; వనన్ = అడవియందు; గతుడు = చేరినవాడు; ఐ = అయ్యి; మెలగెడి = వర్తించెడి; ఘనుడు = గొప్పవాడు; మహర్లోకమున్ = మహర్లోకమున; కున్ = కు; గమనించు = పోవును; నృపా = రాజా {నృపా - నృ (నరులను) పా (పాలించువాడు), రాజు}.

భావము:

వినవయ్యా నరనాథా! ధర్మజా! ఇక వానప్రస్థాశ్రమ ధర్మాలు చెప్తాను. వానప్రస్థాశ్రమం స్వీకరించిన వాడు అడవులకు వెళ్ళి మునివృత్తి అవలంబించాలి. ఋషీశ్వరులు నియమించిన నియమాలు పాటించిన పుణ్యాత్ముడు మహర్లోకం చేరతాడు.