పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : వర్ణాశ్రమ ధర్మంబులు

  •  
  •  
  •  

7-424-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శిమున మేన సంస్కృతులు చేయక చందనభూషణాద్యలం
ణము లెల్ల మాని ఋతుకాలములన్ నిజభార్యఁ బొందుచుం
రుణుల జూడఁ బాఱక ధృవ్రతుఁడై మధు మాంస వర్జి యై
గురుతరవృత్తితో మెలఁగు కోవిదుఁ డొక్క గృహస్థు భూవరా!

టీకా:

శిరమున = తలయందు; మేనన్ = శరీరమునందు; సంస్కృతులున్ = అభ్యంగనాదిసంస్కారములు; చేయక = చేయకుండగ; చందన = గంధధారణ; భూషణ = సొమ్ములు; ఆది = మొదలగు; అలంకరణములు = అలంకారములు; ఎల్లన్ = అన్నిటిని; మాని = విడిచిపెట్టి; ఋతు = ఋతముగల, అనువగు; కాలమునన్ = సమయమునందే; నిజ = తన; భార్యన్ = భార్యను; పొందుచున్ = కలియుచు; తరుణులన్ = ఇతరయౌవనవతులను; చూడబాఱక = మోహపడక; ధృత = గట్టి; వ్రతుడు = నిష్ఠగలవాడు; ఐ = అయ్యి; మధు = మద్యము మొదలగునవి; మాంస = మాంసాహారములను; వర్జి = విడిచిపెట్టినవాడు; ఐ = అయ్యి; గురుతరవృత్తి = పెద్దరికము; తోన్ = తోటి; మెలగు = ప్రవర్తించెడి; కోవిదుడు = పండితుడు; ఒక్క = గొప్ప; గృహస్థు = కాపురస్థుడు; భూవర = రాజా.

భావము:

రాజా! ధర్మరాజా! శిరోజసంస్కారాలు, అభ్యంగనాదిసంస్కారాలు మానుట; చందనం, భూషణాలు మున్నగు అలంకారాలు విడిచిపెట్టుట; తన భార్యను ఋజువైన సమయంలో మాత్రమే పొందుట; ఇతర స్త్రీలను చూసి మోహం చెందకుండా ఉండుట; చక్కని మన స్థైర్యం కలిగి ఉండుట; మధు మాంస విసర్జన; మిక్కిలి ఉత్తమమైన నడవడికతో మెలగుట కలిగి తన ధర్మం నిర్వర్తించు కోవిదుడే ఉత్తమ గృహస్థుడు.