పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : వర్ణాశ్రమ ధర్మంబులు

  •  
  •  
  •  

7-416.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మార్దవమునఁ బతికి జ్జన భోజన
యన పాన రతులు రపవలయు
విభుఁడు పతితుఁడైన వెలఁది పాతివ్రత్య
హిమఁ బుణ్యుఁ జేసి నుపవలయు.

టీకా:

నిలయమున్ = ఇంటినందుండుట; పాటించి = ధరించి; నిర్మల = శుచిత్వముగల; దేహ = దేహముగలామె; ఐ = అయ్యి; శృంగారము = అలంకారము; ఏప్రొద్దున్ = ఎల్లప్పుడు; చేయవలయు = చేసికొనవలెను; సత్యము = బొంకులేని; ప్రియ = ప్రియకరమైన; ఆలాప = మాటలాడుటయందు; చతుర = నేరుపుగలది; ఐ = అయ్యి; ప్రాణేశు = భర్త యొక్క; చిత్తంబు = మనసు; ప్రేమన్ = ప్రేమతో; రంజింపవలయు = సంతసిల్లజేయవలెను; దాక్షిణ్య = మర్యాద, ఓపిక; సంతోష = తృప్తి; ధర్మ = న్యాయము; మేధ = తెలివి; ఆదులన్ = మున్నగువానిచే; దైవతము = దేవుడు; అని = అని; ప్రియున్ = భర్తను; తలపవలయున్ = భావింపవలెను; నాథుడు = భర్త; ఏ = ఎట్టి; పద్ధతిన్ = విధముగా; నడచున్ = మెలగునో; ఆ = అట్టి; పద్ధతిని = విధముగా; నడచి = చరించి; తత్ = అతని; బంధులన్ = బంధువులతో; నడపవలయున్ = వర్తింపవలెను.
మార్దవమునన్ = సౌమ్యతతో; పతికి = భర్తకు; మజ్జన = స్నానము; బోజన = భోజనము; శయన = పడక; పాన = పానీయసేవన; రతులు = సంభోగములను; జరపవలయున్ = ఆచరించవలెను; విభుడు = భర్త; పతితుడు = భ్రష్టుడు; ఐన = అయిన; వెలది = స్త్రీ {వెలది - వెలది (నిర్మలము)గలామె, స్త్రీ}; పాతివ్రత్య = పతివ్రతాధర్మమముయొక్క {పతివ్రత -పతియేదైవముగాగల యామె}; మహిమన్ = ప్రభావముతో; పుణ్యున్ = శుద్ధునిగా; చేసి = చేసి; మనుపవలయు = రక్షింపవలెను.

భావము:

స్త్రీ ధర్మాలు తమను తమ గృహాలను చక్కగా తీర్చి దిద్దుకొనుట, శరీరమును సుందరంగా నిర్మలంగా ఉంచుకొనుట, సత్యం ప్రియకరంగా పలుకుట, చాతుర్యంతో కూడిన వచన మాధుర్యం కలిగి ఉండి పతి మనస్సు రంజింప జేయుట, దాక్షిణ్యం, సంతోషం, ధర్మచింతన, మేధా చింతన కలిగి భర్తను దైవతమునిగా భావించుట, భర్త విధానానికి అనుగుణంగా మెలగుట, బంధువులతో సౌమ్యంగా మేలగుట, భర్తకు స్నాన పాన పడక భోజన సమకూర్చి సౌఖ్యం కలిగించుట. ఒకవేళ పతి పతితుడు అయితే తన పాతివ్రత్య బలంతో అతనిని ఉద్ధరించి, ఉత్తమునిగా తీర్చిదిద్దుకోవాలి.