పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : వర్ణాశ్రమ ధర్మంబులు

  •  
  •  
  •  

7-412-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మును శౌచముఁ దపమును
మును మార్దవముఁ గృపయు త్యజ్ఞాన
క్షలును హరిభక్తియు హ
ర్షము నిజలక్షణము లగ్రజాతికి నధిపా!

టీకా:

దమము = బాహ్యేంద్రియనిగ్రహము; శౌచము = శుచిత్వము; తపమును = తపస్సు; శమమును = అంతరింద్రియనిగ్రహము; మార్దవమున్ = సౌమ్యత; కృపయున్ = దయ; సత్య = నిజము; జ్ఞాన = జ్ఞానము; క్షమలును = ఓర్పులు; హరిభక్తి = విష్ణుభక్తి; హర్షము = సంతోషము; నిజ = స్వాభావికమైన; లక్షణములు = లక్షణములు; అగ్రజాతి = ఉత్తమకులము,బ్రాహ్మణుల; కిన్ = కు; అధిపా = రాజా.

భావము:

బహిరింద్రియ నిగ్రహం, అంతరింద్రియ నిగ్రహం, శుచిత్వం, తపస్సు, సౌమ్యత, దయ, సత్యం, జ్ఞానం, క్షమ, విష్ణుభక్తి, హర్షము ఉత్తమ కులస్తులకు స్వాభావికమైన లక్షణములు.