పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : వర్ణాశ్రమ ధర్మంబులు

  •  
  •  
  •  

7-410.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యెడరుచోట నృపతి కీ నాల్గువృత్తులుఁ
గుఁ; బ్రతిగ్రహంబు గదు; తలఁప
నాపదవసరముల ధముఁ డెక్కువజాతి
వృత్తి నున్న దోషవిధము గాదు.
చతురాశ్రమ ధర్మములు

టీకా:

విను = వినుము; కర్షణ = కర్షక {కర్షణవృత్తి - పొలము దున్ని జీవించెడి జీవిక, కర్షకవృత్తి}; ఆదిక = మొదలగు; వృత్తి = జీవికల; కంటెను = కంటె; మేలు = ఉత్తమము; యాచింపనొల్లని = ఒకరిని అడుగని; అట్టి = అటువంటి; వృత్తి = జీవిక; ప్రాప్తంబున్ = తనకు లభించినదానిని; కైకొని = తీసుకొని; బ్రతుకు = జీవించుట; కంటెను = కంటె; లెస్స = మంచిది; అనుదినంబును = ప్రతిదినము; ధాన్యము = ధాన్యమును; అడిగికొనుట = యాచించుట, ముష్టి; యాయవారము = ధాన్యపు ముష్టి; కంటెను = కంటె; అధిక = ఎక్కువ; కల్యాణంబు = శ్రేయము; పఱిగయెన్నుల = కోసేసినచేలోరాలినయెన్నుల; ధాన్య = ధాన్యముగింజలు; భక్షణంబు = తినుట; శిలవృత్తి = పరిగలేరుకొనెడి; శ్రేయము = మేలైనది; మాపణములన్ = అంగడులవద్ద; పడ్డ = పడిపోయిన; గింజలు = గింజలు; తిని = తిని; బ్రతుకుగనుట = జీవించుట.
ఎడరుచోట = ఆపద సంభవించినప్పుడు; నృపతి = రాజున; కిన్ = కు; ఈ = ఈ; నాల్గు = నాలుగు (4); వృత్తులు = జీవికలు; తగు = తగినవే; ప్రతిగ్రహము = యాచన, తీసుకొనుట; తగదు = తగినదికాదు; తలపన్ = తరచిచూసినచో; ఆపద = విపత్కర; అవసరములలో = సమయములో; అధముడు = తక్కువజాతివాడు; ఎక్కువజాతి = తనకంటెనెక్కువజాతివాని; వృత్తిన్ = జీవికలో; ఉన్నన్ = అవలంభించినను; దోష = తప్పు; విధము = పద్ధతి; కాదు = కాదు.

భావము:

ధర్మరాజా! విను. పొలం దున్ని జీవించే కర్షక వృత్తి మొదలైన వాని వల్ల కొంత జీవ హింస జరుగుతుంది. కాబట్టి వాని కంటె యాచించ కుండా లభించిన దానితో జీవించే వృత్తి “అయాచితం” మంచిది. దానికంటే ప్రతి దినమూ బియ్యము అర్థించి బ్రతుకుట “యాయవారం” మేలు. అలా యాచించి బ్రతికే కంటే పొలాలలో రాలిన పరిగలు ఏరుకుని జీవనం గడపటం మంచిది. అలా వరిమళ్ళ యందు రాలిన ఎన్నులు ప్రోగుచేసుకుని బ్రతికే “శిలావృత్తి” కంటె బజారులో కొట్ల వద్ద పడిన గింజలు ఏరుకుని బ్రతకటం మేలు. భంగపడిన రోజులలో క్షత్రియుడు ఈ నాలుగు వృత్తులను చేయవచ్చు; కాని అతనికి దానం గ్రహించటం మాత్రం నిషిద్ధం. ఆపత్కాలంలో నిమ్నజాతి వారు, అగ్రజాతుల వారి వృత్తులను స్వీకరించటం దోషం కాదు.