పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : వర్ణాశ్రమ ధర్మంబులు

  •  
  •  
  •  

7-408-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నఘాత్మ! సకల వర్ణాశ్రమాచార స-
మ్మత ధర్మ మెయ్యది మానవులకు?
నే ధర్మమున నరుం డిద్ధ విజ్ఞానము-
క్తియుఁ బ్రాపించుఁ? ద్మజునకు
సాక్షాత్సుతుండవు ర్వజ్ఞుఁడవు నీకు-
నెఱుఁగరానిది ధర్మ మింత లేదు;
నారాయణపరాయ స్వాంతు లనఘులు-
శాంతులు సదయులు సాధువృత్తి

7-408.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మెఱయుచున్న ఘనులు మీవంటి వా రెద్ది
రమధర్మ మనుచు క్తిఁ దలఁతు
ట్టి ధర్మరూప ఖిలంబు నెఱిఁగింపు;
వినఁగ నిచ్ఛ గలఁదు విమలచరిత!"

టీకా:

అనఘాత్మా = పుణ్యాత్మా; సకల = అఖిలమైన; వర్ణ = చాతుర్వర్ణముల {చాతుర్వర్ణములు - 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్ర వర్ణములు}; ఆశ్రమ = చతురాశ్రమముల {చతురాశ్రమములు - 1బ్రహ్మచర్యము 2గార్హస్థ్యము 3వానప్రస్థము 4సన్యాసము}; ఆచార = ఆచారవ్యవహారములు; సమ్మత = అంగీకారయోగ్యమైన; ధర్మము = పద్ధతులు; ఎయ్యది = ఏది; మానవుల్ = నరుల {మానవులు - మనువువలన పుట్టినవారు, నరులు}; కున్ = కు; ఏ = ఎట్టి; ధర్మమున = ధర్మమునాచరించుటచే; నరుండు = మానవుడు; ఇద్ధ = మేలైన; విజ్ఞానమున్ = విజ్ఞానమును; భక్తియు = భక్తి; ప్రాపించున్ = పొందును; పద్మజున్ = బ్రహ్మదేవుని; కున్ = కి; సాక్షాత్ = స్వయముగ; సుతుండవు = కొడుకువు; సర్వ = సర్వమును; అజ్ఞుడవు = తెలిసినవాడవు; నీ = నీ; కున్ = కు; ఎఱుగ = తెలిసికొనుటకు; రానిది = అలవికానిది; ధర్మము = సదాచారము; ఇంతన్ = కొంచముకూడ; లేదు = లేదు; నారాయణ = విష్ణుని యందు; పరాయణ = తత్పరులైన; స్వాంతులు = మనసుగలవారు; అనఘులు = పుణ్యులు; శాంతులు = నిత్యశమసంపన్నులు; సదయులు = కరుణగలవారు; సాధువృత్తిన్ = సద్వర్తనమున.
మెఱయుచున్న = ప్రకాశించుచున్న; ఘనులు = గొప్పవారు; మీ = మీ; వంటి = లాంటి; వారు = వారు; ఎద్ది = ఏదయితే; పరమ = మేలైన; ధర్మము = స్వభావము; అనుచున్ = అనుచు; భక్తిన్ = భక్తితో; తలతురు = భావించెదరో; అట్టి = అటువంటి; ధర్మ = ధర్మముయొక్క; రూపము = రీతి; అఖిలంబున్ = అంతయును; ఎఱిగింపుము = తెలుపుము; వినగన్ = వినుటకు; ఇచ్ఛ = కోరిక; కలదు = కలిగినది; విమల = స్వచ్ఛమైన; చరిత = నడవడికగలవాడ.

భావము:

“పుణ్యాత్మా! నీవు సాక్షాత్తు పద్మసంభువుడైన బ్రహ్మదేవుని మానస పుత్రుడవు. స్వచ్ఛమైన నడవడిక కలవాడవు. సర్వదా నారాయణ చరణ స్మరణ పరాయణుడవు. శాంతమూర్తివి. దయాహృదయుడవు. సర్వజ్ఞుడవు. సకల ధర్మాలూ, ఆచార వ్యవహారాలూ నీకు తెలుసు. నీవు ఎరుగని ధర్మం లేదు. అన్ని వర్ణాల వారికి పనికివచ్చే ఉత్తమమైన ధర్మం ఏది? ఏ ధర్మం ఆచరిస్తే మానవునికి నిర్మలమైన భక్తి జ్ఞానాలు ప్రాప్తం అవుతాయి? తమ వంటి వారు ఏది ఉత్తమ ధర్మం అని భావిస్తారు? అటువంటి ధర్మస్వరూపాన్ని వివరంగా చెప్పండి. నాకు వినాలని కుతూహలంగా ఉంది.