పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : త్రిపురాసుర సంహారము

  •  
  •  
  •  

7-401-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు విష్ణుండు మోహనాకారంబున ధేను వయి వచ్చి త్రిపుర మధ్య కూపామృతరసంబు ద్రావిన నెఱింగి శోకాకులచిత్తు లయిన రసకూపపాలకులం జూచి మహాయోగి యైన మయుండు వెఱఁగుపడి దైవగతిం జింతించి శోకింపక యిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; విష్ణుండు = విష్ణుమూర్తి; మోహన = మోహింజేసెడి; ఆకారంబునన్ = ఆకారముతో; ధేనువు = ఆవు; అయి = అయ్యి; వచ్చి = వచ్చి; త్రిపుర = త్రిపురముల; మధ్య = నడిమి; కూప = బావియందలి; అమృత = అమృతపు; రసంబు = ద్రవమును; త్రావినన్ = తాగేయగా; ఎఱింగి = తెలిసికొని; శోక = దుఃఖముచే; ఆకుల = కలతబారిన; చిత్తులు = మనసులుగలవారు; అయిన = ఐన; రస = అమృతరసపు; కూప = బావి; పాలకులన్ = కాపలాదారులను; చూచి = చూసి; మహా = గొప్ప; యోగి = యోగబలముగలవాడు; ఐన = అయిన; మయుండు = మయుడు; వెఱగుపడి = ఆశ్చర్యపోయి; దైవగతిన్ = విధివిలాసమును; చింతించి = విచారించి; శోకింపక = దుఃఖింపక; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అలా విష్ణుమూర్తి మోహనాకారంలో పాడిఆవుగా వచ్చి త్రిపురాల మధ్య గల బావిలోంచి సిద్ధరసం అంతా త్రాగేసిన విషయం తెలుసుకుని, ఆ కూపపాలకులు గుండెలు బాదుకుని దుఃఖించారు. వారిని చూసి మహాయోగి అయిన మయుడు జరిగినది తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. అది విధివిలాసంగా గ్రహించి దుఃఖించక ఇలా అన్నాడు.