పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : త్రిపురాసుర సంహారము

  •  
  •  
  •  

7-398-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సిద్ధామృతరస మహిమను
శుద్ధమహావజ్రతుల్య శోభిత తను లై
వృద్ధిం బొందిరి దానవు
లుద్ధత నిర్ఘాత పావకోపము లగుచున్.

టీకా:

సిద్ధ = యోగసిద్ధమైన; అమృత = అమృతపు; రస = ద్రవము యొక్క; మహిమను = ప్రభావముచేత; శుద్ధ = స్వచ్ఛమైన; మహా = గొప్ప; వజ్ర = వజ్రముతో; తుల్య = సమానమైన; శోభిత = ప్రకాశించెడి; తనులు = దేహములుగలవారు; ఐ = అయ్యి; వృద్ధింబొందిరి = పెంపొందిరి; దానవులు = రాక్షసులు; ఉద్ధతన్ = అతిశయముతో; నిర్ఘాత = పిడుగులలోని; పావక = నిప్పులకు; ఉపములు = పోల్చదగినవారు; అగుచున్ = అగుచు.

భావము:

ఆ సిద్ధరస ప్రభావం వలన ఆ రక్కసులందరూ పునరుజ్జీవితులు అయ్యారు, వజ్రాల వంటి దృఢమైన దేహాలతో చిచ్చర పిడుగుల వలె బలసంపన్నులు అయ్యారు.