పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : త్రిపురాసుర సంహారము

  •  
  •  
  •  

7-393-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లోకాధినాథు లెల్లను
శోకాతురు లగుచు శరణు జొచ్చిరి దుష్టా
నీ విదళనాకుంఠున్
శ్రీకంఠున్ భువనభరణ చిత్తోత్కంఠున్.

టీకా:

లోకాధినాథులు = లోకపాలకులు; ఎల్లను = అందరు; శోక = దుఃఖముచే; ఆతురులు = పీడింపబడినవారు; అగుచున్ = అగుచు; శరణు = రక్షణకై; చొచ్చిరి = ఆశ్రయించిరి; దుష్టానీకవిదళనాకుంఠున్ = పరమశివుని {దుష్టానీకవిదళనాకుంఠుడు - దుష్ట (రాక్షసుల) అనీక (సైన్యమును) విదళన (చీల్చివేయుటయందు) అకుంఠున్ (అనర్గళుడు), శివుడు}; శ్రీకంఠున్ = పరమశివుని {శ్రీకంఠుడు - వ్యు. శ్రీ కఠే అస్య, బ.వ్రీ., కంఠమున వన్నెకలవాడు, శివుడు}; భువనభరణచిత్తోత్కంఠున్ = పరమశివుని {భువనభరణచిత్తోత్కంఠుడు - భువన (లోకములన) భరణ (కాపాడుటయందు) చిత్త (హృదయమున) ఉత్కంఠుడు (ఉత్కంఠగలవాడు), శివుడు}.

భావము:

దిక్పాలకులు అందరు రక్కసుల బాధలు భరించలేక శోకార్తులు అయ్యారు. అపుడు వారందరూ వెళ్ళి లోకశుభంకరుడూ, దుష్టనాశంకరుడూ అయిన శంకరుని శరణువేడారు.