పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుడు స్తుతించుట

  •  
  •  
  •  

7-381.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రముఁ గృపజేసితివి మేలు వారిజాక్ష!
నీ నృసింహావతారంబు నిష్ఠతోడఁ
గిలి చింతించువారలు దండధరుని
బాధ నొందరు మృత్యువు బారిఁ పడరు."

టీకా:

దేవదేవా = నరసింహ {దేవదేవుడు - దేవుళ్ళకే దేవుడు, హరి}; అఖిలదేవేశ = నరసింహ {అఖిలదేవేశుడు - ఎల్లదేవతలకు ఈశ్వరుడు, విష్ణువు}; భూతభావన = నరసింహ {భూతభావనుడు - సర్వజీవులను కాపాడువాడు, విష్ణువు}; వీడు = ఇతడు; నా = నా; చేతన్ = నుండి; వరమున్ = వరములను; పడసి = పొంది; మత్ = నా యొక్క; సృష్టి = పుట్టింపబడిన; జనుల్ = వారి; చేన్ = వలన; మరణంబున్ = చావును; ఒందక = పొందనని; మత్తుడు = గర్వించినవాడు; ఐ = అయ్యి; సకల = సర్వ; ధర్మములు = వేదధర్మములను; చెఱచి = పాడుచేసి; నేడు = ఈ దినమున; భాగ్యంబునన్ = అదృష్టబలమువలన; నీ = నీ; చేతన్ = చేతిలో; హతుడు = మరణించినవాడు; అయ్యెన్ = కాగలిగెను; కల్యాణము = శుభములు; అమరెన్ = కలిగెను; లోకముల్ = లోకములు; ఎల్లన్ = అన్నిటికిని; బాలున్ = కుఱ్ఱవానిని; ఈతని = ఇతనిని; మహా = గొప్ప; భాగవత = విష్ణుభక్తులలో; శ్రేష్ఠున్ = ఉత్తముని; బ్రతికించితివి = కాపాడితివి; మృత్యు = మరణ; భయము = భయమును; పాసి = దూరముచేసి.
వరమున్ = వరమును; కృపజేసితివి = దయతో యిస్తివి; మేలు = లెస్స, మంచిది; వారిజాక్ష = నరసింహ {వారిజాక్షుడు - వారిజ(పద్మమువంటి) అక్షుడు(కన్నులుగలవాడు), విష్ణువు}; నీ = నీ యొక్క; నృసింహ = నరసింహ; అవతారంబున్ = అవతారమును; నిష్ఠ = స్థిరమైన పూనిక; తోడన్ = తోటి; తగిలి = విడువక; చింతించు = మననముచేయు; వారలు = వారు; దండధరునిబాధన్ = యమయాతనలను {దండధరుడు - దండించుటను ధరించినవాడు, యముడు}; ఒందరు = పొందరు; మృత్యువు = మరణము; బారిన్ = వాతను; పడరు = పడరు.

భావము:

“ఓ పద్మాక్షా! నరసింహావతారా! సర్వేశ్వరా! నీవు దేవతోత్తము లందరి పైన దేవుడవు. ఈ హిరణ్యకశిపుడు నా చేత సృష్టించబడిన ప్రాణుల చేత చావని విధంగా నా వల్ల వరం పొంది గర్వించాడు; సకల ధర్మాలను మంటగలిపాడు; ఈ రోజు అదృష్టవశాత్తు నీ చేతిలో మరణం పొందాడు; లోకాలు అన్నిటికి మేలు కలిగింది. ఈ పిల్లాడు ప్రహ్లాదుడు పరమ భాగవతశ్రేష్ఠుడు; ఇతనికి దయతో మృత్యుభయం లేకుండా వరం ప్రసాదించావు. నీ నరసింహ అవతారాన్ని నిష్ఠతో ఉపాసించే వారు యముని వలన బాధలు బడరు; మృత్యుభయంపొందరు.”