పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుడు స్తుతించుట

  •  
  •  
  •  

7-379.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తఁడు రణమున నేఁడు నా యంగమర్శ
మున నిర్మల దేహుఁడై వ్యమహిమ
పగతాఖిల కల్మషుఁ డైఁ తనర్చి
పుణ్యలోకంబులకు నేఁగుఁ బుణ్యచరిత!"

టీకా:

ఘన = మిక్కిలి పెద్దవానినుండి; సూక్ష్మ = మిక్కిలి చిన్నవానివరకు; భూత = జీవుల; సంఘాతంబు = సమూహము; లోపల = లోను; ఎల్ల = సమస్తమైన; వాంఛలున్ = కోరికలను; మాని = వదలివేసి; ఎవ్వరైనన్ = ఎవరైనసరే; నీ = నీ; చందమునన్ = విధముగ; నన్నున్ = నన్ను; నెఱయన్ = నిండుగా; సేవించినన్ = కొలచినచో; మత్ = నా యొక్క; భక్తులు = భక్తులు; అగుదురు = అయ్యెదరు; మత్ = నాకు; పరుల్ = చెందినవారి; కున్ = కి; గుఱి = దృష్టాంతముగ; చేయన్ = చూపుటకు; నీవ = నీవే; యోగ్యుడవు = తగినవాడవు; ఐతివి = అయినావు; ఇటమీద = ఇప్పటినుండి; వేద = వేదములచే; చోదితము = నిర్ణయింపబడినవి; ఐన = అయిన; విధము = పద్ధతి; తోడన్ = తోటి; చిత్తంబున్ = మనసును; నా = నా; మీదన్ = ఎడల; చేర్చి = లగ్నముచేసి; మీ = మీ యొక్క; తండ్రి = తండ్రి; కిన్ = కి; ప్రేత = అపర, (పరలోకయాత్రకైన); కర్మములు = కర్మలు; సంప్రీతిన్ = ఇష్టపూర్తిగా; చేయుము = చేయుము; అతడు = అతడు.
రణంబునన్ = యుద్ధమున; నేడు = ఈ దినమున; నా = నా యొక్క; అంగ = శరీర; మర్శనమునన్ = స్పర్శచేత; నిర్మల = పావనమైన; దేహుడు = దేహముహలవాడు; ఐ = అయ్యి; నవ్య = నూతనమైన; మహిమన్ = వైభవముతో; అపగత = పోగొట్టబడిన; అఖిల = సమస్తమైన; కల్మషుడు = పాపములుగలవాడు; ఐ = అయ్యి; తనర్చి = ఒప్పి; పుణ్యలోకంబుల్ = పుణ్యలోకముల; కున్ = కు; ఏగున్ = వెళ్ళును; పుణ్యచరిత = పావనమైననడవడికగలవాడ.

భావము:

పావన మూర్తీ! ప్రహ్లాదా! నీలాగే ఎవరైనా సరే చిన్నవారైనా, పెద్దవారైనా, ఎల్లవాంఛలూ మాని నన్ను ఉపాసిస్తారో, వాళ్ళు నా భక్తులు, నా భక్తులలో నువ్వు ఉత్తముడవు. ఇంక నీవు నీ మనస్సు నా మీద నిలిపి సంతోషంగా వేదోక్తవిధిగా నీ తండ్రికి ఉత్తర క్రియలు చెయ్యి. అతడు నా శరీరస్పర్శతో నిర్మల దేహం పొందాడు. కల్మషాలు కడిగేసుకుని పుణ్యలోకాలకు పయనిస్తాడు.”