పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుడు స్తుతించుట

  •  
  •  
  •  

7-372-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నీ యట్టి సుజ్ఞాన నిపుణు లేకాంతులు-
గోర్కులు నా యందుఁ గోర నొల్ల;
ట్లైనఁ బ్రహ్లాద! సురేంద్రభర్తవై-
సాగి మన్వంతర మయ మెల్ల
నిఖిలభోగంబులు నీవు భోగింపుము-
ల్యాణబుద్ధి నా థలు వినుము;
కలభూతములందు సంపూర్ణుఁ డగు నన్ను-
జ్ఞేశు నీశ్వరు నాత్మ నిలిపి

7-372.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్మచయము లెల్ల ఖండించి పూజన
మాచరింపు మీశ్వరార్పణముగ;
భోగముల నశించుఁ బుణ్యంబు; వ్రతములఁ
బాప సంచయములు పాయు నిన్ను.

టీకా:

నీ = నీ; అట్టి = వంటి; సుజ్ఞాన = మంచిజ్ఞానమునందు; నిపుణులు = నేర్పుగలవారు; ఏకాంతులున్ = అంతరంగభక్తులు; నా = నా; అందున్ = నుండి; కోరన్ = కోరుకొనుటను; ఒల్లరు = అంగీకరించరు; అట్లైనన్ = అలా అయినప్పటికిని; ప్రహ్లాద = ప్రహ్లాదుడ; అసురేంద్ర = రాక్షసులకు; భర్తవు = రాజు యైనవాడవు; ఐ = అయ్యి; సాగి = ప్రవర్తిల్లి; మన్వంతర = మన్వంతర {మన్వంతరంబు - ఒక మనువు పాలించు కాలపరిమితి, డెబ్బైయొక్క మహాయుగములు}; సమయము = కాలము; ఎల్లన్ = అంతయును; నిఖిల = సమస్తమైన; భోగంబులున్ = అనుభవింపదగినవానిని {అష్టభోగములు - 1నిథి 2నిక్షేపము 3జల 4పాషాణ 5అక్షీణ 6ఆగామి 7సిద్ధ 8సాధ్యములు మరియొకవిధమున 1గృహము 2శయ్య 3వస్త్రము 4ఆభరణము 5స్త్రీ 6పుష్పము 7గంధము 8తాంబూలము}; నీవు = నీవు; భోగింపుము = అనుభవింపుము; కల్యాణ = మంగళకరమైన; బుద్ధిన్ = బుద్ధితో; నా = నా గురించిన; కథలున్ = గాథలను; వినుము = వినుము; సకల = సర్వ; భూతములు = జీవుల; అందున్ = లోను; సంపూర్ణుడు = నిండి ఉండు వానిని; అగు = అయిన; నన్నున్ = నన్ను; యజ్ఞేశున్ = నారాయణుని; ఈశ్వరున్ = నారాయణుని; ఆత్మన్ = మనసున; నిలిపి = ధరించి.
కర్మ = కర్మముల; చయమున్ = సమూహములను; ఎల్లన్ = సమస్తమును; ఖండించి = త్రుంచి; పూజనము = అర్చన, కైంకర్యము; ఆచరింపుము = చేయుము; ఈశ్వర = భగవతునికి; అర్పణము = సమర్పించినది; కాన్ = అగునట్లు; భోగములన్ = బోగములవలన; నశించున్ = తొలగిపోవును; పుణ్యంబున్ = పుణ్యములు; వ్రతములన్ = దీక్షలతోటి; పాప = పాపములు; సంచయములు = కూడబెట్టినవి; పాయున్ = తొలగిపోవును; నిన్నున్ = నిన్ను.

భావము:

“ప్రహ్లాదా! నీ వంటి మంచి జ్ఞాన సంపన్నులు, ఏకాంత భక్తులు, కోరికలు ఏవీ కోరుకోరు. అయినా కూడా నీవు దానవ చక్రవర్తివి అయి మన్వంతరం కాలం సకల భోగాలూ అనుభవించు. శుభప్రదమైన బుద్ధితో నా గాథలు విను. సర్వ భూతాతంరాత్ముడను అయిన నన్ను యజ్ఞేశునిగా, పరమేశ్వరునిగా తెలుసుకుని ఆత్మలో నిత్యం ఆరాధించు. కర్మబంధాలు ఖండిచి, ఈశ్వరార్పణ బుద్ధితో నన్ను పూజించు. సుఖాలనూ అనుభవించుట చేత పూర్వం సంపాదించిన పుణ్యాలు వ్యయం అవుతాయి. వ్రతాల వలన పాపాలు తొలగిపోతాయి.”