పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుడు స్తుతించుట

  •  
  •  
  •  

7-362-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇవ్విధంబున గృత త్రేతా ద్వాపరంబులను మూఁడు యుగంబు లందును దిర్యఙ్మానవ ముని జలచరాకారంబుల నవతరించి లోకంబుల నుద్ధరించుచు, ధరించుచు, హరించుచు యుగానుకూల ధర్మంబులం బ్రతిష్ఠించుచు నుండుదువు; దేవా! యవధరింపుము.

టీకా:

ఈ = ఈ; విధంబునన్ = విధముగ; కృత = కృతయుగము; త్రేత = త్రేతాయుగము; ద్వాపరంబులన్ = ద్వాపరయుగములను; మూడు = మూడు(3); యుగంబులు = యుగములు; అందును = లోను; తిర్యక్ = జంతువుల, వరాహాది; మానవ = మనుష్యల, రామ కృష్ణాది; ముని = మునుల, నారద వ్యాసాది; జలచర = మత్స్యకూర్మ; ఆకారంబులన్ = రూపములలో; అవతరించి = అవతరించి; లోకంబులన్ = లోకములను; ఉద్ధరించుచు = కాపాడుచు; ధరించుచు = పాలించుచు; హరించుచు = నశింపజేయుచు; యుగ = ఆయా యుగములకు; అనుకూల = అనుకూలమైన; ధర్మంబులన్ = ధర్మములను; ప్రతిష్ఠించుచున్ = పాదుకొలుపుచు; ఉందువు = ఉందువు; దేవా = నరసింహా; అవధరింపుము = వినుము.

భావము:

ఇలా ప్రతి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం అను మూడు యుగాలలోనూ జంతు, మానవ, ఋషి, జలచరాల ఆకారాలతో అవతరించి లోకాలను ఉద్ధరిస్తూ, హరిస్తూ ఉంటావు; ఆయా యుగాలకు అనుకూలమైన ధర్మాలను ప్రతిష్ఠించి పరిపాలిస్తుంటావు. ఓ నరకేసరి దేవా! ఇంకా విను.