పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుడు స్తుతించుట

  •  
  •  
  •  

7-355-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దంష్ట్రా భ్రుకుటీ సటా నఖయు నుగ్రధ్వానయున్ రక్త కే
యున్ దీర్ఘతరాంత్రమాలికయు భాస్వన్నేత్రయున్నైన నీ
సింహాకృతిఁ జూచి నే వెఱవఁ బూర్ణ క్రూర దుర్వార దు
ర్భ సంసారదవాగ్నికిన్ వెఱతు నీ పాదాశ్రయుం జేయవే.

టీకా:

ఖర = వాడియైన; దంష్ట్రా = కోరలు; భ్రుకుటి = బొమముడి; సటా = జటలు; నఖయును = గోరులు; ఉగ్ర = భయంకరమైన; ధ్వానయున్ = ధ్వనికలది; రక్త = రక్తమంటిన; కేసరయున్ = జూలుగలది; దీర్ఘతర = మిక్కిలి పోడవైన {దీర్ఘము - దీర్ఘతరము - దీర్ఘతమము}; ఆంత్ర = పేగులు; మాలికయున్ = మాలలుగలది; భాస్వత్ = వెలుగుతున్న; నేత్రయున్ = కన్నులుగలది; ఐనన్ = అయిన; ఈ = ఈ; నరసింహ = నరసింహుని; ఆకృతిన్ = ఆకారమును; చూచి = చూసి; నేన్ = నేను; వెఱవన్ = బెదరను; పూర్ణ = పూర్తిగ; క్రూర = క్రూరమైన; దుర్వార = దాటరాని; దుర్భర = భరింపరాని; సంసార = సంసారము యనెడి; దావాగ్ని = కార్చిచ్చున; కిన్ = కు; వెఱతు = బెదరెదను; నీ = నీ యొక్క; పాద = పాదములను; ఆశ్రయున్ = ఆశ్రయించినవానినిగా; చేయవే = చేయుము.

భావము:

ప్రభూ! భీకరమైన కోరలూ, కనుబొమలూ, జటలూ, గోళ్ళూ, భీషణ ధ్వనులు, రక్త రంజితమైన కేసరాలూ, మెడలో పొడవుగా వ్రేలాడుతున్న దండల్లా ఉన్న ప్రేగులూ తోటి పరమ భీకరమైన నీ ఉగ్రనరసింహ రూపం చూసి నేను ఏమాత్రం భయపడను. కానీ పూర్తిగా క్రూరమైనదీ, భయంకరమైనదీ, భరింపరానిదీ, నికృష్టమైనది అయిన సంసారమనే దావాగ్నిని చూసి మాత్రం బెదిరిపోతున్నాను. కరుణించి నీ చరణసన్నిధిలో నాకు ఆశ్రయం ప్రసాదించు.