పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుడు స్తుతించుట

  •  
  •  
  •  

7-354-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్త్వాకరుఁడ వైన ర్వేశ! నీ యాజ్ఞ-
శిరముల నిడుకొని చేయువారు
బ్రహ్మాదు లమరులు య మందుచున్నారు-
నీ భీషణాకృతి నేఁడు చూచి;
రోషంబు మాను నీ రుచిరవిగ్రహములు-
ల్యాణకరములు గాని భీతి
రములు గావు లోములకు వృశ్చిక-
న్నగంబుల భంగి యముఁ జేయు

7-354.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సుర మర్దించితివి; సాధుర్ష మయ్యె;
వతరించిన పనిదీఱె లుక యేల?
లుషహారివి సంతోషకారి వనుచు
నిన్నుఁ దలఁతురు లోకులు నిర్మలాత్మ!

టీకా:

సత్త్వాకరుడవు = నారయణుడవు {సత్త్వాకరుడు - సత్త్వగుణమునకు ఆకరుడు (ప్రధానుడు), విష్ణువు}; ఐన = అయిన; సర్వేశ = నరసింహా {సర్వేశుడు - సర్వులకును ఈశుడు, హరి}; నీ = నీ యొక్క; ఆజ్ఞన్ = ఆజ్ఞను; శిరములనిడుకొని = నెత్తినపెట్టుకొని; చేయువారు = చేసెడివారు; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; అదుల్ = మొదలైన; అమరుల్ = దేవతలు; భయమున్ = భయమును; అందుచున్నారు = పొందుతున్నారు; నీ = నీ యొక్క; భీషణ = భయంకరమైన; ఆకృతి = రూపము; నేడు = ఇప్పుడు; చూచి = చూసి; రోషంబున్ = కోపమును; మాను = విడువుము; నీ = నీ యొక్క; రుచిర = అందమైన; విగ్రహములు = రూపములు; కల్యాణ = శుభములను; కరములు = కలిగించెడివి; కాని = తప్పించి; భీతి = భయమును; కరములు = కలిగించెడివి; కావు = కావు; లోకముల్ = లోకముల; కున్ = కు; వృశ్చిక = తేళ్ళు; పన్నగంబుల = పాముల; భంగిన్ = వలె; భయమున్ = భయమును; చేయు = కలిగించెడి; అసురన్ = రాక్షసుని.
మర్ధించితివి = చంపితివి; సాధు = సజ్జనులకు; హర్షము = సంతోషము; అయ్యెన్ = అయినది; అవతరించిన = అవతరించినట్టి; పని = ప్రయోజనము; తీఱెన్ = తీరినది; అలుక = కోపము; ఏల = ఎందుకు; కలుష = పాపములను; హారివి = హరించెడివాడవు; సంతోష = సంతోషములను; కారివి = కలిగించెడివాడవు; అనుచున్ = అనుచు; నిన్నున్ = నిన్ను; తలతురు = భావించెదరు; లోకులు = ప్రజలు; నిర్మలాత్మ = నరసింహా {నిర్మలాత్మ - నిర్మల (స్వచ్ఛమైన) ఆత్మ (స్వరూపుడు), విష్ణువు}.

భావము:

ఓ జగదీశ్వరా! నారసింహా! నీవుసత్త్వగుణ ప్రధానుడవు. నీ ఆజ్ఞలు తలదాల్చు బ్రహ్మాది దేవతలు, ఇవాళ నీ భీషణ ఆకృతి చూసి బెదిరిపోతున్నారు. ప్రభూ! శాంతించు. నీ సుందర రూపాలు లోకానికి కల్యాణకారకాలు భక్తిప్రేరకాలు తప్పించి భయంకరాలు కావు కదా! తేలు లాగా, పాములాగా నిత్యం ప్రజలకు భయం పుట్టించే పాపాత్ముపు దానవుడైన మా తండ్రి హిరణ్యకశిపుని పరిమార్చావు. జనులు అందరికి సంతోషం సమకూరింది. నరకేసరి అవతార ప్రయోజనం సిద్ధించింది. ఇంకా ఈ సంతోష సమయంలో ఇంత కోపం ఎందుకు! ప్రజలు అందరూ నిన్ను సంతోషాలు కలుగజేసేవాడవనీ, పాపాలను తొలగించేవాడవనీ భావిస్తున్నారు నిర్మలమైన ఆత్మ స్వరూపా! నారాయణా!