పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుడు స్తుతించుట

  •  
  •  
  •  

7-352.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్థములు దోఁచుఁ; గావున ధికబుద్ధి
క్తి జేయంగవలయును క్తిఁ గాని
మెచ్ఛఁ డర్థంబు లొసఁగెడు మేరలందుఁ
రమ కరుణుండు హరి భక్తబాంధవుండు.

టీకా:

అజ్ఞుండు = తెలియనివాడు; చేసిన = చేసినట్టి; ఆరాధనములన్ = భక్తిని; చేపట్టడు = స్వీకరింపడు; ఈశ్వరుడు = భగవంతుడు; కృపాళుడు = దయగలవాడు; అగుటన్ = అగుటచేత; చేపట్టున్ = స్వీకరించును; ఒకచోట = ఒక్కోసారి; సిద్ధము = సత్యము; ఈశ్వరున్ = భగవంతుని; కున్ = కి; అర్థంబున్ = ప్రయోజనము; లేకుండున్ = ఉండదు; అతడు = అతడు; పూర్ణుడు = పరిపూర్ణమైనవాడు; ఐనన్ = అయినను; అర్థములు = ఎల్లవిషయములు; ఈశ్వర = భగవంతునికి; అర్పణంబులున్ = సమర్పితములు; కాగన్ = అగునట్లు; చేయుట = చేయుట; ధర్మంబు = న్యాయము; చేసెనేని = చెసినచో; అద్దంబున్ = అద్దము (దర్పణము)న; చూచిన = చూసినచో; అళికలలామంబు = నొసలిబొట్టు; ప్రతిబింబితంబు = ప్రతిబింబించినది; అగు = అయ్యెడి; పగిదిన్ = వలె; మరల = మరల; అర్థములన్ = ప్రయోజనములు; తోచున్ = కలుగును; కావున = కనుక; అధిక = ఉన్నతమైన.
బుద్ధిన్ = బుద్ధితో; భక్తిన్ = భక్తిని; చేయవలయును = చేయవలెను; భక్తిన్ = భక్తిని; కాని = కాని; మెచ్చడు = మెచ్చుకొనడు; అర్థంబుల్ = పదార్థములు; ఒసగెడు = సమర్పించెడి; మేరలు = సమయములలో; అందున్ = అందు; పరమ = అతిమిక్కిలి; కరుణుండు = దయగలవాడు; హరి = విష్ణుమూర్తి; భక్త = భక్తులకు; బాంధవుడు = బంధువు వంటివాడు.

భావము:

భగవానుడు అజ్ఞానులు చేసిన భక్తిని స్వీకరించడు. కాని ఆయన దయాసముద్రుడు కనుక కొందరు అజ్ఞానులు చేసిన ఆరాధనలను కూడా స్వీకరిస్తాడు. ఆయన పరిపూర్ణుడు కనుక భక్తులు చేసే భక్తివలన భగవంతునికి ఏ ప్రయోజనమూ లేదు. అయినా సర్వ కార్యాలు భగవదర్పణంగా చేయవలెను, అలా చేస్తే అద్దంలో నుదుటి బొట్టు కనబడినంత స్వచ్ఛంగా, సర్వ కార్యాలు ప్రయోజనాలు చేకూరుతాయి. భగవంతుడు హరి దయామయుడు, భక్తుల ఎడ బందువాత్సల్యం గలవాడు. ఆయన భక్తిని తప్ప మరి దేనిని మెచ్చడు అందుచేత విష్ణుభక్తి విడుక చేయవలెను.