పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : దేవతల నరసింహ స్తుతి

  •  
  •  
  •  

7-343-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లికెద నని గమకముఁ గొను;
లికినఁ గడు నలుగు విభుఁడు ప్రతివచనములం
లుకఁ డని నిలుచు; శశిముఖి
లువిడి హృదయమునఁ జనవు యమును గదురన్.

టీకా:

పలికెదన్ = పలకరించెదను; అని = అని; గమకముగొను = యత్నించును; పలికినన్ = పలకరించినను; కడు = మిక్కిలి; అలుగు = కోపించును; విభుడు = ప్రభువు; ప్రతి = మారు; వచనములన్ = మాటలు; పలుకడు = పలుకడు; అని = అని; నిలుచున్ = ఆగిపోవును; శశిముఖి = లక్ష్మీదేవి; బలువిడిన్ = వేగముగా; హృదయమునన్ = హృదయమునందు; చనవు = మచ్చిక; భయమునున్ = భయమును; కదురన్ = అతిశయించగా.

భావము:

ఆ చల్లనితల్లి చంద్రవదన శ్రీలక్ష్మి చిరునవ్వుతో శ్రీహరిని పలుకరిద్దాం అనుకుంది. కానీ ఆ ఉగ్ర రూపం చూస్తుంటే, మాట్లాడితే మండిపడతాడేమో బదులు పలుకడేమో అని ఆగిపోయింది. మనస్సులో ఒక వైపు చనువు, ఒక వైపు భయమూ కలుగుతుండగా సంకోచంతో అలా నిలబడిపోయింది.
ఈ అమృత గుళిక సర్వలఘు కంద పద్యం. ఇది లక్ష్మీ దేవి తడబాటును చూపుతోంది. అలాగే గజేంద్ర మోక్షణము ఉపాఖ్యానంలో కూడా విష్ణుని వెనుక ఏగుచున్న లక్ష్మీదేవి తడబాటునకు వాడిన అమృత గుళిక “అడిగెద నని” కూడ సర్వలఘు కంద పద్యమే.