పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : దేవతల నరసింహ స్తుతి

  •  
  •  
  •  

7-340-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"హరికిం బట్టపుదేవివి
రిసేవానిపుణమతివి రిగతివి సదా
రిరతివి నీవు చని నర
రిరోషము డింపవమ్మ! రివరమధ్యా!"

టీకా:

హరి = విష్ణుని; కిన్ = కి; పట్టపుదేవివి = ధర్మపత్నివి; హరి = విష్ణుని; సేవా = సేవించుట యందు; నిపుణమతివి = నేర్పుగలదానవు; హరి = విష్ణువే; గతివి = దిక్కుగాగలదానవు; సదా = ఎల్లప్పుడును; హరి = విష్ణుని యెడల; రతివి = ప్రీతిగలదానివి; నీవు = నీవు; చని = వెళ్ళి; నరహరి = నరసింహుని; రోషమున్ = కోపమును; డింపవు = తగ్గింపుము; అమ్మ = తల్లి; హరి = సింహమువలె; వర = చక్కటి; మధ్య = నడుముగలామె.

భావము:

“ఓ లక్ష్మీదేవీ! నువ్వు సాక్షాత్తు శ్రీమహావిష్ణువుకు పట్టపురాణివి. ఆ శేషసాయికి సేవచేయుటలో మిక్కిలి నేర్పరివి. నారాయణుడే అండగా పొందిన నీవు, నిత్యం శ్రీహరి యెడల ప్రీతితో మెలుగుతుంటావు. సింహం వలె చిక్కని సన్నని నడుము గల చక్కని తల్లీ! నీవల్లే అవుతుంది, నరసింహుని శాంతపరచు.”