పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : దేవతల నరసింహ స్తుతి

  •  
  •  
  •  

7-322-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"దుర్ణయుని దైత్యుఁ బొరిగొని
ర్ణాశ్రమ ధర్మసేతు ర్గము మరలం
బూర్ణము చేసితి వే మని
ర్ణింతుము? కొలిచి బ్రతుకువారము దేవా!"

టీకా:

దుర్ణయుని = దుర్నీతిగలవానిని; దైత్యున్ = రాక్షసుని; పొరిగొని = చంపి; వర్ణ = వర్ణముల యొక్క ధర్మముల; ఆశ్రమధర్మ = ఆశ్రమధర్మముల; సేతు = కట్టుబాట్ల; వర్గమున్ = సమూహమును; మరలన్ = తిరిగి; పూర్ణము = పరిపూర్ణము; చేసితివి = చేసితివి; ఏమని = ఏమని; వర్ణింతుము = కీర్తింతుము; కొలిచి = సేవించి; బ్రతుకు = జీవించెడి; వారము = వారిమి; దేవా = నరసింహా.

భావము:

“ఓ దేవా! ఈ దుష్టుని వలన వర్ణాశ్రమ ధర్మాలు ధ్వంసం అయ్యాయి. ఈ రాక్షసుడైన హిరణ్యకశిపుని చంపి తిరిగి ధర్మం సంస్థాపన కావించావు. నిన్ను ఏమని కీర్తించ గలము? ఎలా స్తుతించ గలము? నీ సేవే మాకు జీవనాధారం ప్రభూ!”