పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : దేవతల నరసింహ స్తుతి

  •  
  •  
  •  

7-312-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"దీయాదరలీల లోకముల నుత్పాదించి రక్షింప నేఁ
వి దైత్యేశునిచేత భేదితములై హ్రస్వంబులై యుండ నీ
వినీతున్ నరసింహరూపమున సంహారంబు నొందించి వే
విధిం గ్రమ్మఱ నుద్ధరించితి గదా ర్మానుసంధాయివై."

టీకా:

భవదీయ = నీ యొక్క; ఆదర = ఆదరము యనెడి; లీలన్ = విలాసముచేత; లోకములన్ = లోకములను; ఉత్పాదించి = సృష్టించి; రక్షింపన్ = కాపాడగా; నేడు = ఇప్పుడు; అవి = అవి; దైత్య = రాక్షస; ఈశుని = రాజు; చేత = చేత; భేదితములు = చెరుపబడినవి; ఐ = అయ్యి; హ్రస్వంబులు = క్షీణించినవి, చిక్కిపోయినవి; ఐ = అయ్యి; ఉండన్ = ఉండగా; ఈ = ఈ; అవినీతున్ = నీతిమాలినవాని; నరసింహ = నరసింహుని; రూపమునన్ = స్వరూపముతో; సంహారంబునొందించి = చంపి; వేద = వేదానుసార; విధిన్ = ధర్మమును; క్రమ్మఱన్ = మరల; ఉద్ధరించితి = నిలబెట్టితివి; కదా = కదా; ధర్మ = ధర్మమార్గమును; అనుసంధాయివి = కూర్చెడివాడవు; ఐ = అయ్యి.

భావము:

“ఓ ధర్మసంస్థాపకా! ధర్మమూర్తీ! నీవు ఎంతో ఆదరంతో లోకాలను సృష్టించి, రక్షిస్తున్నావు. కానీ ఇవాళ రాక్షసుడు హిరణ్యకశిపుడు లోకలను ఛిన్నా భిన్నం చేసాడు. ఈ దురహంకారిని నరకేసరిగా అవతరించి, సంహరించావు. వేద ధర్మాన్ని మరల ఉద్ధరించావు.”