పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ఉపోద్ఘాతము

  •  
  •  
  •  

7-2-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మహనీయ గుణగరిష్ఠు లగు న మ్మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుం డయిన సూతుం డి ట్లనియె; నట్లు ప్రాయోపవిష్టుం డయిన పరీక్షిన్నరేంద్రుడు శుకయోగీంద్రు నవలోకించి.

టీకా:

మహనీయ = గొప్ప; గుణ = సుగుణములచే; గరిష్ఠులు = మిన్నలు; అగు = ఐన; ఆ = ఆ; ముని = మునులలో; శ్రేష్ఠుల్ = ఉత్తముల; కున్ = కు; నిఖిల = సమస్తమైన; పురాణ = పురాణములను; వ్యాఖ్యాన = వివరించెడి; వైఖరీ = వాక్శక్తి; సమేతుండు = కలిగి యున్నవాడు; అయిన = ఐన; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; అట్లు = ఆ విధముగ; ప్రాయోపవిష్టుండు = ప్రాయోపవేశమున నున్నవాడు {ప్రాయోపవేశము - అన్నపానాదులు విడిచి మరణమున కెదురు చూచుచుండు నిష్ఠ, ఆమరణనిరాహారదీక్ష}; అయిన = ఐనట్టి; పరీక్షిత్ = పరీక్షిత్తు యనెడి; నరేంద్రుడు = మహారాజు; శుక = శుకుడు యనెడి; యోగి = యోగులలో; ఇంద్రున్ = ఇంద్రునివంటి వానిని; అవలోకించి = దర్శించి.

భావము:

గొప్ప గుణములు కలిగిన ఆ మునీశ్వరులతో అఖిల పురాణాలను వివరించటంలో నేర్పరి అయిన సూతమహర్షి ఇలా అన్నాడు. "ప్రాయోపవేశం చేసి ఉన్న పరీక్షిత్తు మహారాజు శుకమహర్షిని చూసి"