పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : శబళాశ్వులకు బోధించుట

  •  
  •  
  •  

6-253-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి పుణ్యవతులొ? యీ చేడియలు చెప్ప
వతు లేనియట్టి వతులయ్యుఁ
డుప పడసి రెట్టి డుపునఁ బుట్టిరో
డిఁది త్రిజగ మెల్లఁ డుపు గాఁగ.

టీకా:

ఎట్టి = ఎటువంటి; పుణ్యవతులొ = పుణ్యవతులో; ఈ = ఈ; చేడియలు = స్త్రీలు; చెప్ప = చెప్పుటకు; సవతు = సాటి; లేనియట్టి = లేనట్టి; సవతులు = సపత్నులు; అయ్యు = అయినప్పటికిని; కడు = ఎక్కువ మందిని; పడసిరి = (సంతానము) పొందిరి; ఎట్టి = ఎటువంటి; కడుపునన్ = తల్లి కడుపున; పుట్టిరో = జన్మించినారో; కడిది = దుర్లభమైన; త్రిజగము = ముల్లోకములు; ఎల్లన్ = సర్వమును; కడుపు = తమ కడుపున మోసినవారు; కాగ = అగునట్లు.

భావము:

దక్షుని కుమార్తెలు ఎంతటి పుణ్యవతులో చెప్పలేను. సవతులై కూడా సాటిలేని సతీమతల్లులై సంసారం చక్కదిద్దుకున్నారు. వారి తల్లి కడుపు చల్లగా ముల్లోకాలను కడుపులో మోసి కన్నారు.