పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : శబళాశ్వులకు బోధించుట

  •  
  •  
  •  

6-251-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నెయఁగ సాధురూపమున నీ వతిబాలుర కాత్మజాళికిం
ఱుకున భిక్షుమార్గ మగు కందువ చెప్పితి వేల? ధూర్తవై
ఱుఁగక యుండవచ్చునె? కుమారుల నీ దురితంబు పొంద; ని
న్నొఱఁలగఁ ద్రోతు నాదు సమదోగ్ర మహాగ్రహ శాపవహ్నులన్.

టీకా:

నెఱయగ = నేర్పుగా; సాధు = సాధువు; రూపమున = వలె; నీవు = నీవు; అతిబాలుర = చిన్నపిల్లల; కు = కు; ఆత్మజ = నాబిడ్డల; ఆళికిన్ = సమూహమున; కిన్ = కి; కఱుకునన్ = కరుకుగా; భిక్షు = సన్యాసుల; మార్గము = దారి; అగు = అయిన; కందువ = జాడ; చెప్పితివి = చెప్పావు; ధూర్తవు = తిట్ట దగిన వాడవు; ఐ = అయ్యి; మఱుగక = సంతాపము పొందక; ఉండవచ్చునె = ఉండగలమా; కుమారులన్ = పుత్రులను; ఈ = ఇలాంటి; దురితంబు = కలతను; పొంద = పొందగా; నిన్ను = నిన్ను; ఒఱలగన్ = విలపించునట్లు; త్రోతు = తోసెదను; నాదు = నా యొక్క; సమద = మదించిన; ఉగ్ర = భయంకరమైన; మహా = గొప్ప; ఆగ్రహ = కోపముతో కూడిన; శాప = శాపము యనెడి; వహ్నులన్ = మంటలలోకి.

భావము:

“నీవు సాధురూపంలో వచ్చి నా పుత్రులైన పసివారికి మోక్షధర్మాన్ని ఉపదేశించి సన్న్యాసులుగా ఎందుకు మార్చావు? ధూర్తుడవైన నిన్ని ఉపేక్షించవచ్చునా? నా కుమారులకు ఈ గతి పట్టించిన నిన్ను నా శాపాగ్నికి ఆహుతి చేస్తాను.