పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : శబళాశ్వులకు బోధించుట

  •  
  •  
  •  

6-250-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మోము జేవుఱింప ముడిపడ బొమదోయి
చూపు వెంట మంట సుడిగొనంగఁ
బెదవు లడరఁ బండ్లు పెటపెటఁ గొఱుకుచు
క్షుఁ డాగ్రహించి పసిఁ బలికె.

టీకా:

మోము = ముఖము; జేవురింపన్ = ఎఱ్ఱబడగా; ముడిపడన్ = ముడిచివేయగ; బొమదోయి = కనుబొమలజంట యొక్క; చూపు = కనుచూపు; వెంట = వెంట; మంట = మంటలు; సుడిగొనంగ = సుడితిరుగ; పెదవులు = పెదవులు; అడర = అదరగ; పండ్లు = పళ్ళు; పెటపెట = పెటపెట మని; కొఱుకుచున్ = కొరుకుతూ; దక్షుడు = దక్షుడు; ఆగ్రహించి = కోపించి; తపసిన్ = మునిని (నారదుని) తోటి; పలికె = అనెను.

భావము:

ముఖం ఎఱ్ఱబడగా, కనుబొమలు ముడివడగా, చూపులలో మంటలు చెలరేగగా, పెదవులు అదరగా పండ్లు పటపట కొరుకుతూ దక్షుడు నారదునితో ఇలా అన్నాడు.