పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : హంసగుహ్య స్తవరాజము

  •  
  •  
  •  

6-237-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్మ హేతు వైన నకునిర్దేశంబు
నకుఁ జేయరాని నుచుఁ దెలిసి
గుణమయప్రవృత్తి ఘోరాధ్వ నిశ్శ్వాస
నిరతుఁ డగుచుఁ జేయ నేరఁ డతఁడు. "

టీకా:

జన్మహేతువు = తన పుట్టుకకు కారణము; ఐన = అయిన; జనకు = తండ్రి యొక్క; నిర్దేశంబు = ఆజ్ఞ; తన = తన; కున్ = కు; చేయరానిది = చేయరానిది; అనుచున్ = అని; తెలిసి = తెలిసికొని; గుణమయ = గుణమయ మైన; ప్రవృత్తిన్ = ప్రవర్తన గల; ఘోర = ఘోరమైన; అధ్వ = మార్గము నందు; నిశ్వాస = మిక్కిలి; నిరతుడు = ఆసక్తి లేనివాడు; అగుచున్ = అగుచు; చేయనేరడు = చేయలేడు; అతడు = అతడు.

భావము:

ఈ సృష్టి కార్యాన్ని మనతండ్రి అయిన దక్షప్రజాపతికి అతని తండ్రి బ్రహ్మదేవుడు అప్పగించాడు. అతి భయంకరమైన ప్రవృత్తి మార్గం పై ఆసక్తి లేనివాడై మనతండ్రి ఆ కార్యాన్ని పూర్తి చేయలేకపోయాడు.”