పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : హంసగుహ్య స్తవరాజము

  •  
  •  
  •  

6-235-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బంధాను మోక్షణక్రమ
సంధా నైశ్వర్యధుర్య శాస్త్ర సమగ్ర
గ్రంథంబు మాను చిద్రూ
పాంధునకును గర్మగతుల గునే శుభముల్.

టీకా:

బంధ = బంధముల నుండి; అనుమోక్షణ = విమోచన; క్రమ = మార్గ; సంధాన = సంభవించెడి; ఐశ్వర్య = సంపదల యొక్క; ధుర్య = అగ్రస్థితి; శాస్త్ర = శాస్త్రము యొక్క; సమగ్ర = సమగ్రమైన; గ్రంథంబు = గ్రంథమును అభ్యసించుట; మాను = వదలివేసిన; చిత్ = జ్ఞాన; రూప = రూపము యెడల; అంధున్ = గుడ్డివాని; కును = కి; కర్మ = కర్మల; గతులన్ = ఆచరించెడిదారిలో; అగునే = కలుగునా; శుభముల్ = శుభములు.

భావము:

సంసారబంధంలో చిక్కుకొని మోక్షాన్ని అనుసంధానం చేసే ఆధ్యాత్మిక విద్యను పరిత్యజించి కర్మ కలాపంలో పడిన అజ్ఞానాంధుడైన అభాగ్యునికి శుభాలు ఎలా కలుగుతాయి?