పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : హంసగుహ్య స్తవరాజము

  •  
  •  
  •  

6-234-మత్త.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పంవింశతి తత్త్వరాశి కపారదర్పణ మయ్యుఁ దాఁ
గొంమై పురుషుండు తత్త్వముఁగోరి పట్టఁగ నేర కే
మంచుఁ గించుఁ దలంచువాఁడు కధ్వ కర్మము జేయఁగా
మంచిలోకము వానికేటికి మానుగా సమకూరెడిన్?
^ చతుర్వింశతి తత్వములు (25).

టీకా:

పంచవింశతి = ఇరవై ఐదు {పంచవింశతి తత్త్వములు - పంచభూతములు (1-5), పంచజ్ఞానేంద్రియములు (6-10) పంచకర్మేంద్రియములు(11- 15) పంచతన్మాత్రలు(16-20) మనసు(21) బుద్ధి(22) చిత్తము(23) అహంకారము(24) పురుషుడు(25)}; తత్త్వ = తత్త్వముల; రాశి = సమూహమున; కి = కు; అపార = అంతులేని; దర్పణము = అద్దము; అయ్యున్ = అయినప్పటికిని; తాన్ = తను; కొంచము = చిన్నది; ఐ = ఐనట్లు; పురుషుండు = పురుషుడు; తత్త్వమున్ = తత్త్వజ్ఞానమును; కోరి = కోరి; పట్టగనేరక = తెలియలేక; ఏమి = ఏమి; అంచున్ = అనుచు; కించు = తక్కువగా; తలంచు = భావించు; వాడు = వాడు; కదధ్వకర్మము = చెడు మార్గమున నడచు కర్మములు; చేయగా = చేయుచుండగ; మంచిలోకము = ముక్తిమార్గము; వాని = వాడి; కి = కి; ఏటికి = ఎందుకు; మానుగ = తథ్యముగ; సమకూరెడిన్ = లభింపగలదు.

భావము:

పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచతన్మాత్రలు, పంచభూతాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, పురుషుడు అనే ఇరవైయైదు తత్త్వాలను ప్రతిబింబించే అద్దం వంటిది పరతత్త్వం. అటువంటి పరతత్త్వాన్ని పట్టుకొనే ఉపాయం తెలుసుకోకుండా జీవుడు పనికిమాలిన పనులు చేస్తుంటే వానికి ఉత్తమమైన ముక్తిమార్గం ఎందుకు అందుతుంది?