పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : హంసగుహ్య స్తవరాజము

  •  
  •  
  •  

6-231-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్నిష్ఠాగతి లేనివానికి నసత్కర్మప్రచారంబుచే
మున్నే మయ్యెడి నాత్మబుద్ధి గుణ సమ్మోహంబునం దోఁచుచున్
న్నెల్ పెట్టుక వింతబాగుల తఱిన్ ర్తించు దౌర్గుణ్య సం
న్నస్త్రీయును బోలె నెల్లగతులం బ్రఖ్యాతమై యుండగన్.

టీకా:

తత్ = భగవంతుని యెడల; నిష్ఠాగతి = లగ్నమైన విధానము; లేని = లేనట్టి; వాని = వాని; కిన్ = కి; అసత్ = అసత్యమైన; కర్మ = కర్మల; ప్రచారంబు = వ్యాప్తుల; చేన్ = చేత; మున్ను = ముందు; ఏమి = ఏమి; అయ్యెడున్ = ప్రయోజనము; ఆత్మ = ఆత్మ; బుద్ధి = బుద్ధి యొక్క; గుణ = గుణములచే; సమ్మోహనంబునన్ = మోహింపబడుట వలన; తోచుచున్న = అనిపించుతూ; వన్నెల్ = రంగులు; పెట్టుక = వేసుకొని; వింత = అబద్దపు; బాగుల = అందాల; తఱిన్ = వెంట; వర్తించు = తిరిగెడు; దౌర్గుణ్య = దుర్గుణము లనెడి; సంపన్న = సంపదలు గల; స్త్రీయును = స్త్రీని; పోలె = వలె; ఎల్ల = అన్ని; గతులన్ = విధములుగను; ప్రఖ్యాతము = ప్రసిద్ధము; ఐ = అయ్యి; ఉండగన్ = ఉండగా.

భావము:

భగవన్నిష్ఠ లేకుండా దుష్కర్మలు చేసేవారికి ఏమీ ప్రయోజనం ఉండదు. చంచలమైన బుద్ధి చెడు గుణాల వ్యామోహానికి లొంగి రంగులు పులుముకొని వింత వింత వేషాలు వేస్తూ ఉంటుంది. అటువంటి దుర్గుణాల వలయంలో చిక్కుకొని దిక్కుతోచని వానికి మోక్షం అందనే అందదు.