పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : హంసగుహ్య స్తవరాజము

  •  
  •  
  •  

6-227-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని నారదుండు బోధించిన హర్యశ్వులు సహజబుద్ధిచేత నారద వాక్యంబులఁ దమలోన నిట్లని వితర్కించిరి.

టీకా:

అని = అని; నారదుండు = నారదుడు; బోధించిన = తెలియజెప్పగా; హర్యశ్వులు = హర్యశ్వులు; సహజ = సహజసిద్ధమైన; బుద్ధి = జ్ఞానము; చేత = చేత; నారద = నారదుని; వాక్యంబులన్ = మాటలను; తమలోన్ = తమలో తాము; ఇట్లు = ఈ విధముగ; అని = అని; వితర్కించిరి = మిక్కిలిగ తర్కించుకొనిరి.

భావము:

అని నారదుడు బోధించగా హర్యశ్వులు తమ బుద్ధితో విమర్శించుకొని తమలో తాము ఇలా తర్కించుకొన్నారు.