పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : హంసగుహ్య స్తవరాజము

  •  
  •  
  •  

6-225.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నంచ యొకటి యిరువదైదింటి మహిమలఁ
లిగియుండు తెరువు గానరాక
జ్రనిబిడ మగుచు రుసఁ దనంతన
తిరుగుఁ గాష్ఠబిలము దేటపడఁగ.

టీకా:

మీరు = మీరు; అతి = మిక్కిలి; మూఢులు = తెలివితక్కువవారు; మీదటి = రాబోవు; గతిన్ = గతిని; కానరు = చూడలేరు; ఎన్నంగ = తరచి చూసిన; పసి = బాగా చిన్న; బిడ్డలు = పిల్లలు; అన్నలార = అన్నల్లారా; పుడమిన్ = భూమిపై; తాన్ = తను; ఇంత = ఇంత; అని = అని; కడన్ = చివరను; పరికింపరు = చూడరు; ప్రజలన్ = జనులను; పుట్టింపన్ = పుట్టించుటలో; ఏ = ఏమి; ప్రతిభ = గొప్పదనము; కలదు = ఉన్నది; అట్లు = అలా; ఐన = అయినచో; ఒక్క = ఒక్క; మహాత్ముడు = మహాత్ముడు; పురుషుండు = పురుషుడు; బహు = అనేక; రూపములు = స్వరూపములు; కల = కలిగిన; భామ = స్త్రీ; ఒకతె = ఒకామె; పుంశ్చలి = రంకుటాలు {పుంశ్చలి - పురుషుని చూచి చలించునట్టి ఆడుది, రంకుటాలు}; గర్తంబు = గొయ్యి; పురణింపన్ = విజృభించుటకు; ఉభయప్రవాహంబు = రెండు ప్రక్కలకు ప్రవహించుట; కల = ఉన్నట్టి; నది = నది; వఱలన్ = ప్రవర్తించును; కదలని = కదలని; అంచ = హంస, ఆత్మ;
ఒకటి = ఒకటి; ఇరువదైదింటి = పంచవింశతితత్వములు {పంచవింశతి తత్వములు - 1 అవ్యక్తము 2మహత్తు 3అహంకారము 4మనసు 5నుండి14జ్ఞానేంద్రియకర్మేంద్రియములు పది 15నుండి19 తన్మాత్రలు ఐదు 20నుండి24మహాభూతములు ఐదు 25పురుషుడు}; మహిమలన్ = మహిమలను; కలిగియుండు = కలిగి ఉండెడి; తెరువు = దారి; కానగరాక = చూడలేక; వజ్ర = వజ్రమువంటి; నిబిడము = సాంద్రత గలది; అగుచు = అగుచు; వరుసన్ = వరుస లందు; తనంతన = తనంత తాను; తిరుగున్ = తిరుగును; కాష్ఠబిలము = కాష్ఠబిలము; తేటపడగ = తెలియునట్లు.

భావము:

“నాయనలారా! మీరు మిక్కిలి మూఢులుగా ఉన్నారు. భవిష్యత్తును చూడలేకున్నారు. మీరు పసిబిడ్డలు. ఈ భూమి పరిమాణం ఎంతో తెలియనివారు. ఇక జీవులను ఎలా సృష్టించగలరు? మహాత్ముడైన పురుషుడు ఒక డున్నాడు. స్త్రీరూపిణియై అనేక రూపాలు ధరించిన ప్రకృతి ఒకటున్నది. మాయలమారి అయిన ఆ ప్రకృతి పురుషుణ్ణి లోబరచుకుంటుంది. ప్రకృతి, పురుషుడు కలిసి సంసార ప్రవాహాన్ని సాగిస్తారు. ఈ సంసారమనే నది రెండు వైపులనుండి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవాహాన్ని అనుసరించి ఒక హంస విహరిస్తూ ఉంటుంది. ఆ హంసకు ఇరవై అయిదు మహిమ లుంటాయి. అయినా ఆ హంస సరియైన మార్గం కానరాక వజ్రకాంతులతో మెరుస్తున్న జలప్రవాహం పడే గోతి చుట్టూ తిరుగుతూ ఉంటుంది.