పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : హంసగుహ్య స్తవరాజము

  •  
  •  
  •  

6-220-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్వేశుఁడు సర్వాత్ముఁడు
ర్వగతుం డచ్యుతుండు ర్వమయుండై
ర్వంబుఁ జేరి కొలువఁగ
ర్వదుఁడై దక్షునకుఁ బ్రన్నుం డయ్యెన్.

టీకా:

సర్వేశుడు = నారాయణుడు {సర్వేశుడు - సర్వ (సమస్తమునకు) ఈశుడు (ప్రభువు), విష్ణువు}; సర్వాత్ముడు = నారాయణుడు {సర్వాత్ముడు - సర్వ (అఖిల జీవులకు) ఆత్ముడు (అంతరాత్మ యైన వాడు), విష్ణువు}; సర్వగతుండు = నారాయణుడు {సర్వగతుడు - సర్వ (సమస్త మందు) గతుడు (ఉండెడి వాడు), విష్ణువు}; అచ్యుతుండు = నారాయణుడు {అచ్యుతుడు - చ్యుతము (పతనము) లేని వాడు, విష్ణువు}; సర్వమయుండు = సర్వము నందు నిండినవాడు {సర్వమయుడు - సర్వము నందు నిండినవాడు, విష్ణువు}; ఐ = అయ్యి; సర్వంబు = అందరు; చేరి = పూని; కొలువగన్ = సేవిస్తుండగా; సర్వదుడు = సర్వము ప్రసాదించువాడు; ఐ = అయ్యి; దక్షున్ = దక్షుని; కున్ = కి; ప్రసన్నుడు = ప్రత్యక్షము; అయ్యెన్ = అయ్యెను.

భావము:

సర్వేశ్వరుడు, సర్వాత్ముడు, సర్వాంతర్యామి, సర్వమయుడు, అచ్యుతుడు అయిన భగవంతుడు అందరూ తనను చేరి సేవిస్తుండగా కోరినవన్నీ ఇచ్చేవాడై దక్షునకు ప్రసన్నుడైనాడు.