పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : హంసగుహ్య స్తవరాజము

  •  
  •  
  •  

6-218.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ల్లమేను మెఱయ గుమొగం బలరంగఁ
ల్ల చూపు విబుధ మితిఁ బ్రోవ
సిఁడికాసెఁ బూని హు భూషణ కిరీట
కుండలముల కాంతి మెండు కొనఁగ.
విష్ణుమూర్తి పరికరాలలో - అష్ట ఆయుధాలు పేర్లు

టీకా:

భర్మాచలేంద్ర = మేరుపర్వతము యొక్క {భర్మాచలేంద్రము - భర్మ (బంగారు) చల (కొండ)లలో ఇంద్రము (శ్రేష్ఠమైనది), మేరుపర్వతము}; ప్రపాత = కొండ చరియల; ద్వయంబునన్ = జంట యందు; కలిగిన = ఉన్నట్టి; నీలంపు = ఇంద్రనీలముల; గనులు = గనులు; అనగ = అన్నట్లు; మొనసి = కలిగి; తార్క్ష్యుని = గరుత్మంతుని; ఇరు = రెండు (2); మోపులు = భుజములు; పైన్ = మీదను; ఇడినట్టి = పెట్టినట్టి; పదముల = పాదముల; కాంతులు = ప్రకాశములు; పరిఢవిల్లన్ = అతిశయించగా; చండ = భయంకరమైన; దిఙ్మండలశుండాల = దిగ్గజముల యొక్క {దిఙ్మండల శుండాలు - దిక్ (దిక్కుల) చివర మండల (స్థలము లందలి) శుండాలములు (ఏనుగులు), దిగ్గజములు}; కరముల = తొండముల; కైవడి = వలె; ఎనిమిది = ఎనిమిది (8); కరములన్ = చేతులలోను; అమరన్ = అమరిన; చక్ర = చక్రము; కోదండ = విల్లు; అసి = ఖడ్గము; శంఖ = శంఖము; నందక = నందకము యనెడి కత్తి; పాశ = త్రాడు; చర్మ = శతచంద్రము; గద = గద; అదుల = మొదలైనవానిని; సరవిన్ = వరుసగా; పూని = ధరించి;
నల్ల = నల్లని; మేను = దేహము; మెఱయన్ = మెరుస్తుండగా; నగు = నవ్వు; మొగంబు = ముఖము; అలరంగ = ప్రకాశించగా; చల్ల = చల్లని; చూపు = చూపు; విబుధ = దేవతల, జ్ఞానుల; సమితిన్ = సమూహమును; ప్రోవన్ = కాపాడుతుండగా; పసిడి = బంగారు; కాసెన్ = కాసెకోక, దట్టి; పూని = ధరించి; బహు = అనేక; భూషణ = అలంకారములు; కిరీట = కిరీటములు; కుండలముల = చెవికుండలముల; కాంతి = వెలుగులు; మెండుకొనగ = అతిశయించగా.

భావము:

శ్రీమహావిష్ణువు గరుత్మంతుని మీద ఆసీనుడై ఉన్నాడు. గరుడుని రెండు భుజాల మీద చాచిన ఆ స్వామి పాదాలు మేరు పర్వతం చరియకు రెండు ప్రక్కలా ప్రకాశించే ఇంద్రనీలమణుల గనులవలె ఉన్నాయి. అతని అష్టబాహువులు అందంగా పైకి చాచిన అష్టదిగ్గజాల తొండాలవలె ప్రకాశిస్తున్నాయి. ఎనిమిది చేతులలో చక్రం, ధనుస్సు, పద్మం, శంఖం, ఖడ్గం, పాశం, డాలు, గదాదండం విరాజిల్లుతున్నాయి. నల్లని దేహంతో, నగుమొగంతో, సాధుజనులను సంరక్షించే చల్లని చూపులతో, బంగారు రంగు పట్టు పీతాంబరంతో, మణిమయ కిరీటంతో, నలుమూలలా కాంతులు విరజిమ్మే భూషణాలతో, మకర కుండలాలతో (ప్రత్యక్షమైనాడు).