పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : హంసగుహ్య స్తవరాజము

  •  
  •  
  •  

6-215-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ల్ల తనువులందు నిరవొంది తనతోడఁ
బొందు చేసినట్టి పొందుకాని
పొందు పొందలేఁడు పురుషుండు గుణము నా
గుణినిఁ బోలు నట్టి గుణి భజింతు.

టీకా:

ఎల్ల = అఖిలమైన; తనువులు = దేహములు; అందు = లోను; ఇరవొంది = నివాస ముండి; తన = తన (ఆత్మ); తోడన్ = తోటి; పొందు = కూడి యుండుట; చేసినట్టి = చేసిన; పొందుకాని = సహచరుని; పొందు = స్నేహము; పొందలేడు = పొందలేడు; పురుషుండు = మానవుడు; గుణమున్ = గుణముల వలన; ఆ = అటువంటి; గుణిని = గుణములు గలవాని; పోలునట్టి = వలె నుండు నట్టి; గుణిన్ = గుణము గల వానిని; భజింతు = పూజించెదను.

భావము:

సమస్త జీవుల దేహాలలో నివసిస్తున్నా జీవులు ఆ అంతర్యామిని గుర్తించడం లేదు. వారు తమలో తాము స్నేహం చేస్తున్నారే కాని పరమాత్మతో పొందు చేయడం లేదు. గుణాలలో చిక్కుకున్న జీవులు గుణాలకు అధీశ్వరుని దర్శింపలేకున్నారు. అటువంటి గుణవంతుడైన భగవంతుణ్ణి స్తుతిస్తున్నాను.