పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : హంసగుహ్య స్తవరాజము

  •  
  •  
  •  

6-214-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విలి గుణుల చేతఁ త్త్వబుద్ధులచేత
నిగిడి కానరాని నెలవువాని
మొదలఁ దాన కలిగి ముక్తి మానావధి
రూమైనవాని ప్రాపుఁ గందు.

టీకా:

తవిలి = పూని; గుణుల = సుగుణములు గలవారి; చేతన్ = చేతను; తత్త్వబుద్ధులు = తత్త్వజ్ఞానుల; చేతన్ = చేతను; నిగిడి = నిక్కి; కానరాని = కనుగొనబడని; నెలవువాని = స్థానము గలవాని; మొదలన్ = సృష్ట్యాదిని; తాన = తను మాత్రమే; కలిగి = ఉండి; ముక్తి = మోక్షము యనెడి; మాన = కొలతకి; అవధి = హద్దునకు; రూపము = మూర్తిత్వము; ఐనవాని = అయినవాని; ప్రాపుగన్ = రక్ష; కందు = పొందెదను.

భావము:

సుగుణవంతులకు కాని, తత్త్వవేత్తలకు కాని తెలియరాని ఉనికి కలవాడు, మొదటినుండి ఉన్నవాడు, మోక్షానికి పరమావధి అయిన రూపం కలవాడు అయిన ఆ భగవంతుని ఆశ్రయిస్తున్నాను.