పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : చంద్రుని ఆమంత్రణంబు

  •  
  •  
  •  

6-210-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు దక్షప్రజాపతి ప్రజాసర్గంబు చాలక చింతించి మంతనంబున లక్ష్మీకాంతుని సంతుష్టస్వాంతుంజేయువాఁడై.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; దక్ష = దక్షుడు యనెడి; ప్రజాపతి = ప్రజాపతి; ప్రజా = ప్రజలను; సర్గంబు = సృష్టించుటతో; చాలక = తృప్తిచెందక; చింతించి = ఆలోచించి; మంతనంబున = ఏకాంతమున; లక్ష్మీకాంతుని = నారాయణుని {లక్ష్మీకాంతుడు - లక్ష్మీదేవి యొక్క కాంతుడు (భర్త), విష్ణువు}; సంతుష్ట = సంతోషించిన; స్వాంతున్ = మనసు గలవానిని; చేయువాడు = చేసెడివాడు; ఐ = అయ్యి.

భావము:

ఈ విధంగా దక్షప్రజాపతి తాను చేసిన సృష్టికి సంతృప్తి పడక ఆలోచించి ఏకాంతంలో శ్రీమహావిష్ణువును సంతృప్తి పరచాలని సంకల్పించి...