పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : చంద్రుని ఆమంత్రణంబు

  •  
  •  
  •  

6-209-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రజాసర్గ బృంహితం యిన జగము
క్షుఁ డీక్షించి మదిలోనఁ దాప మొంది
ఱియు జననంబు నొందించు తము రోసి
రమపురుషుని నాశ్రయింపంగఁ దలఁచె.

టీకా:

ఆ = ఆ; ప్రజాసర్గ = సంతానముచే; బృంహితంబు = నిండినది; అయిన = ఐన; జగము = భువనము; దక్షుడు = దక్షుడు; ఈక్షించి = చూసి; మది = మనసు; లోనన్ = అందు; తాపము = బాధ; ఒంది = పొంది; మఱియు = ఇంకను; జననంబునొందించు = సృష్టించు; మతము = అభిప్రాయము; రోసి = అసహ్యించుకొని; పరమపురుషుని = నారాయణుని; ఆశ్రయింపంగన్ = ఆశ్రయింపవలెనని; తలచె = భావించెను.

భావము:

నానావిధాలైన ప్రాణులతో నిండిన లోకాన్ని చూచి దక్షప్రజాపతి తన మనస్సులో సంతాపం చెంది ఇక సృష్టించడం ఇష్టపడక పరమపురుషుణ్ణి ఆశ్రయించాలనే నిశ్చయానికి వచ్చాడు.