పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : చంద్రుని ఆమంత్రణంబు

  •  
  •  
  •  

6-207-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సుర గరు డోరగ కి
న్న దానవ యక్ష పక్షి గ వృక్షములం
మిడి సృష్టి యొనర్చెను
దిముగ దక్షప్రజాపతి వితతకీర్తిన్.

టీకా:

నర = మానవులు; సుర = దేవతలు; గరుడ = గరుడులు; ఉరగ = పాములు; కిన్నర = కిన్నరలు; దానవ = రాక్షసులు; యక్ష = యక్షులు; పక్షి = పక్షులు; నగ = పర్వతములను, గిరులను; వృక్షములన్ = వృక్షములను; తరమిడి = వరుసపెట్టి; సృష్టి = పుట్టించుట; ఒనర్చెను = చేసెను; తిరముగ = స్థిరముగ; దక్ష = దక్షుడు యనెడి; ప్రజాపతి = ప్రజాపతి; వితత = విస్తారమైన; కీర్తిన్ = యశస్సుతో.

భావము:

దక్షప్రజాపతి మానవులను, దేవతలను, గరుడులను, పాములను, కిన్నరులను, రాక్షసులను, యక్షులను, పక్షులను, వృక్షాలను, పర్వతాలను వరుసగా సృష్టించి గొప్ప కీర్తిని సంపాదించాడు.