పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : చంద్రుని ఆమంత్రణంబు

  •  
  •  
  •  

6-203-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లామంత్రణంబు జేసి, మారిష యను కన్యకను వారల కిచ్చి చంద్రుండు చనియె; అప్పుడు.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; ఆమంత్రణము = నచ్చజెప్పుట, ఉపదేశము; చేసి = చేసి; మారిష = మారిష {మారిష - మరులు (కామమును) కలిగించునది}; అను = అనెడి; కన్యకను = స్త్రీని; వారల = వారి; కిన్ = కి; ఇచ్చి = ఇచ్చి; చంద్రుండు = సోముడు; చనియె = వెళ్ళెను; అప్పుడ = అప్పుడు.

భావము:

అని ఈ విధంగా ప్రాచేతసులకు నచ్చచెప్పి మారిష అనే పేరు కలిగిన ఆ కన్యను వారికిచ్చి చంద్రుడు వెళ్ళిపోయాడు. అప్పుడు...