పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : చంద్రుని ఆమంత్రణంబు

  •  
  •  
  •  

6-201-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఖిల భూతముల దేహాంతస్థమగునాత్మ-
యీశుఁ డచ్యుతుఁడని యెఱుఁగవలయు;
నెఱిఁగి సర్వం బైన యిందిరారమణు లోఁ-
జూపులఁ దనివిగాఁ జూడవలయు;
జూచిన చిద్రూప శుద్ధాత్ము లగు మిమ్ము-
నెనసిన వేడ్కతోనిచ్చమెచ్చు;
మెచ్చిన సర్వాత్ము మీ రెఱింగినచోటఁ-
గోగుణంబులఁ బావలయు;

6-201.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బాపి దగ్ధశేష పాదపజాలంబు
దియ్య మెసఁగ బ్రతుకనియ్యవలయు;
నఘులార! మీర స్మదీయప్రార్థ
నంబు పరఁగఁ జేకొనంగవలయు.

టీకా:

అఖిల = సమస్తమైన; భూతముల = జీవుల; దేహ = శరీరమునకు; అంతస్థము = లోనుండెడిది; అగు = అయినట్టి; ఆత్మ = ఆత్మ; ఈశుడు = నారాయణుడు; అచ్యుతుడు = నారాయణుడు; అని = అని; ఎఱుగవలయు = తెలిసికొనవలెను; ఎఱిగి = తెలిసి; సర్వంబు = సర్వము తానే; ఐన = అయినట్టి; ఇందిరారమణు = నారాయణుని; లోచూపుల = అంతర్దృష్టితో; తనివిగా = సంతృప్తిగా; చూడవలయు = చూడవలెను; చూచిన = అట్లు చూచున్నచో; చిద్రూప = చిద్రూపులు; శుద్ధాత్ములు = పరిశుద్ధాత్ములు; అగు = అయిన; మిమ్ము = మిమ్ములను; ఎలసిన = కలిగిన; వేడ్కన్ = ఆపేక్ష; తోన్ = తోటి; ఇచ్చన్ = ఇష్టపూర్తిగ; మెచ్చు = మెచ్చుకొనును; మెచ్చిన = (అలా) మెచ్చుకొన్నందున; సర్వాత్ము = నారాయణుని; మీరు = మీరు; ఎఱింగినచోట = తెలిసికొన్నచో; కోప = కోపము గల; గుణంబులన్ = గుణములను; పాపవలయు = విడువవలెను; పాప = విడిచిపెట్టి;
దగ్ధ = కాలగా; శేష = మిగిలిన; పాదప = చెట్ల; జాలంబు = సమూహములను; తియ్యము = ఇంపు; ఎసగ = మీరగా; బ్రతుకనియ్యవలయున్ = జీవించ నియ్య వలెను; అనఘులార = పుణ్యులారా; మీరలు = మీరు; అస్మదీయ = మా యొక్క; ప్రార్థనంబు = కోరిక; పరగన్ = ఒప్పుగా; చేకొనంగవలయు = అంగీకరింప వలయును

భావము:

సమస్త జీవరాసుల దేహాలలో సర్వేశ్వరుడు, అచ్యుతుడు అయిన శ్రీమన్నారాయణుడు ఆత్మ స్వరూపంతో ఉన్నాడని తెలుసుకొనండి. అలా తెలిసికొని సర్వాంతర్యామి అయిన ఆ విష్ణువును లోచూపులతో తనివి తీరా చూడండి. అలా చూస్తే జ్ఞానస్వరూపులు, పవిత్రులు అయిన మిమ్మల్ని భగవంతుడు సంతోషంగా మెచ్చుకుంటాడు. అలా మెచ్చుకొన్న పరాత్పరుడు అంతటా ఉన్నాడని తెలిసికొని మీరు మీ కోపాన్ని వదిలిపెట్టాలి. అలా కోపాన్ని వదిలి కాలగా మిగిలిన వృక్షాలను సంతోషంగా బ్రతకనివ్వండి. ఓ పుణ్యాత్ములారా! మీరు నా ప్రార్థనను అంగీకరించాలి.