పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : చంద్రుని ఆమంత్రణంబు

  •  
  •  
  •  

6-200-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్పక యర్భకావళికిఁ ల్లియుఁ దండ్రియు నేత్రపంక్తికిన్
ఱెప్పలు నాతికిం బతియు ఱేఁడు ప్రజావళి కెల్ల నర్ధి కిం
పొప్ప గృహస్థు మూఢులకు నుత్తము లెన్న సమస్తబాంధవుల్
ముప్పునఁ గావలేని కడుమూర్ఖులు గారు నిజాల చుట్టముల్.

టీకా:

తప్పక = తప్పకుండ; అర్భక = పిల్లల; ఆవళిన్ = సమూహమును; తల్లియున్ = తల్లి; తండ్రియున్ = దండ్రి; నేత్ర = కన్నుల; పంక్తి = వరుస; కిన్ = కి; ఱెప్పలు = కనురెప్పలు; నాతి = స్త్రీ; కిన్ = కి; పతియు = భర్త; ఱేడు = రాజు; ప్రజా = పౌరుల; ఆవళి = సమూహము; ఎల్లన్ = సమస్తమునకు; అర్థి = యాచించెడివాని; కిన్ = కి; ఇంపొప్ప = చక్కగా; గృహస్థు = గృహస్థుడు; మూఢుల్ = తెలివితక్కువవారల; కును = కి; ఉత్తములు = ఉత్తములు; ఎన్నన్ = ఎంచిచూసిన; సమస్త = సమస్తమైన; బాంధవుల్ = బంధువులు; ముప్పునన్ = ప్రమాద పరిస్థితులలో; కావలేని = కాపాడలేని; కడు = మిక్కిలి; మూర్ఖులు = మూర్ఖులు; కారు = కారు; నిజాల = నిజమైన; చుట్టముల్ = బంధువులు.

భావము:

పిల్లలకు తల్లిదండ్రులు, కళ్ళకు రెప్పలు, స్తీకి భర్త, ప్రజలకు రాజు, యాచకులకు గృహస్థుడు, మూఢులకు బుద్ధిమంతుడు సంరక్షకులు. వారే నిజమైన బంధువులు. ఆపద సమయంలో ఆదుకొనని మూర్ఖులు బంధువులు కారు.