పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : అజామిళోపాఖ్యానము

  •  
  •  
  •  

6-60-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రనాథ! వినుము కన్యాకుబ్జపురమునఁ-
లఁడు బ్రాహ్మణుఁ డజామిళుఁ డనంగఁ
బాతకుం డతుల నిర్భాగ్యుం డవజ్ఞుండు-
ష్టసదాచారి ష్టరతుఁడు
జూదంబులందు దుర్వాదంబు లందును-
జౌర్యంబునందు మచ్చరము గలిగి
తొత్తాత్మ పత్నిగా త్తుఁడై వరియించి-
కొడుకులఁ బదుగురఁ సి చాల

6-60.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మోహజలధిలోన మునిఁగి ముచ్చట దీఱ
బా లాలనాది లీలఁ దగిలి
పెద్దకాల మతఁడు పెంపార సుఖియించి
లిత మెల్ల వదిలి తితుఁడయ్యె.

టీకా:

నరనాథ = రాజా {నర నాథుడు - నరులకు నాథుడు, రాజు}; వినుము = వినుము; కన్యాకుబ్జపురమునన్ = కన్యాకుబ్జ పురము నందు; కలడు = ఉన్నాడు; బ్రాహ్మణుడు = బ్రాహ్మణుడు; అజామిళుడు = అజామిళుడు; అనంగ = అనెడి; పాతకుండు = పాపిష్ఠివాడు; అతుల = మిక్కిలి; నిర్భాగ్యుండు = నిర్భాగ్యుడు; నష్ట = విడిచిన; సదాచారి = మంచి ఆచారములు గలవాడు; కష్టరతుడు = కష్టములను యిష్టపడెడివాడు; జూదంబులు = జూదములు; అందు = ఎడల; దుర్వాదంబులు = దుష్టవాదనలు; అందును = ఎడలను; చౌర్యంబున్ = దొంగతనములు; అందున్ = ఎడల; మచ్చరము = మాత్సర్యము; కలిగి = కలిగి ఉండి; తొత్తు = దాసి, వేశ్య; ఆత్మ = తన యొక్క; పత్నిగా = భార్యగా; మత్తుడు = మదించినవాడు; ఐ = అయ్యి; వరియించి = కోరి; కొడుకులన్ = పుత్రులను; పదుగురన్ = పదిమందిని (10); పడసి = పొంది; చాల = మిక్కిలి.
మోహ = మోహము యనెడి; జలధి = సముద్రము; లోనన్ = లోపల; మునిగి = మునిగిపోయి; ముచ్చట = ముద్దు; తీఱన్ = కొద్దీ; బాల = సంతానమును; లాలన = లాలించుట; ఆది = మొదలగు; లీలన్ = తిరుగుడులలో; తగిలి = తగుల్కొని; పెద్ద = పెద్ద; కాలము = సమయము; అతడు = అతడు; పెంపార = అతిశయించి; సుఖియించి = సుఖించుతు; ఫలితము = ఫలితము; ఎల్లన్ = సమస్తమును; వదలి = వదలిపెట్టి; పతితుడు = పాడయిపోయినవాడు; అయ్యెన్ = అయ్యెను.

భావము:

“రాజా! విను. కన్యాకుబ్జం అనే పట్టణంలో అజామిళుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు పాపాత్ముడు, దరిద్రుడు, నింద్యచరిత్రుడు, సదాచారాలను విడిచినవాడు, నికృష్ట జీవనుడు, జూదాలను వివాదాలను, దొంగతనాలను ఇష్టపడేవాడు. యౌవనపు మత్తులో ఒక దాసిని భార్యగా చేసికొని, పదిమంది కొడుకులను కన్నాడు. సంసార వ్యామోహమనే సముద్రంలో మునిగి పిల్లల లాలన పాలనలో గడుపుతూ చాలాకాలం సుఖాలు అనుభవించి వృద్ధుడయ్యాడు.

6-61-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిర్మలం బనఁ జాలనెఱయు చిత్తం బన-
ల్లని వెండ్రుకల్ తెల్లనయ్యెఁ;
గు మోహపాశ బంధంబు జాఱినమాడ్కిఁ-
బొలిన యంగముల్ లి వ్రేలె;
నింద్రియంబుల కోర్కులిఁక నొల్ల నను భంగి-
నుడుగక తల చాల డఁక జొచ్చెఁ;
మకంబు ప్రాయంబుఁ గిలిపోయిన మాడ్కి-
లోనంబుల చూడ్కి నీమయ్యె;

6-61.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రు పుట్టె; నంతఁ బొలె దంతంబులు;
నుక్కిసయును దగ్గుఁ బిక్కటిల్లె;
శిరసు నొవ్వఁ దొడఁగెఁ; జెదరె మనం; బంతఁ
డిఁది యైన ముప్పు కాలమునకు.

టీకా:

నిర్మలంబు = నిర్మలమైనది; అనన్ = అనుటకు; చాలన్ = సరిపడనిదని; నెఱయు = అతిశయించిన; చిత్తంబు = మనసు; అనన్ = అన్నట్లు; నల్లని = నల్లగా యుండెడి; వెండ్రుకల్ = వెంట్రుకలు; తెల్లన్ = తెల్లగా; అయ్యెన్ = అయినవి; తగు = తగుల్కొన్న; మోహ = మోహము యనెడి; పాశ = తాడు యొక్క; బంధంబున్ = బంధనము; జాఱిన = జారిపోయిన; మాడ్కిన్ = వలె; పొదలిన = బలిసిన; అంగముల్ = అవయవములు; వదలి = వదులైపోయి; వ్రేలన్ = వేలాడిపోయినవి; ఇంద్రియంబుల = విషయ వాంఛ లందలి; కోర్కులు = కోరికలు; ఇక = ఇంకపై; ఒల్లను = ఒప్పుకొనలేను; అను = అనెడి; భంగిన్ = విధముగ; ఉడుగక = వదలకుండగ; తల = శిరస్సు; చాలన్ = మిక్కిలి; వడఁకన్ = వణకుట; చొచ్చెన్ = మొదలిడెను; తమకంబు = మోహములు; ప్రాయంబున్ = వయసు; తగిలిపోయిన = తరలిపోయిన; మాడ్కిన్ = వలె; లోచనంబులన్ = కళ్ళలోని; చూడ్కి = చూపు; నీచమయ్యె = తగ్గిపోయెను.
వగరు = (నోటిలో) అరుచి; పుట్టెన్ = పుట్టెను; అంతన్ = అంతట; పొగలె = కదలె; దంతంబులున్ = పళ్ళు; ఉక్కిసయును = నుస, ఆయాసము; దగ్గు = దగ్గు; పిక్కటిల్లెన్ = అధిక మయ్యెను; శిరసు = తల; నొవ్వన్ = నొప్పెట్టుట; తొడగెన్ = మొదలిడెను; చెదరె = చెదిరిపోయెను; మనంబున్ = మనస్సు; అంతన్ = అంతట; కడిది = దుర్భరము; ఐన = అయినట్టి; ముప్పు = వార్థకపు; కాలమున్ = కాలమున; కున్ = కు.

భావము:

మనస్సు ఎప్పటికైనా నిర్మల మౌతుందన్నట్లుగా అజామిళుని నల్లని వెండ్రుకలు తెల్లబడ్డాయి. మోహబంధాలు జారిపోతాయన్నట్లుగా అవయవాలు పట్టుదప్పి వ్రేలాడాయి. ఇంద్రియ వాంఛలు ఇక వద్దు అన్నట్లుగా తల అడ్డంగా వణకసాగింది. మోహం వయస్సుతో పాటు తగ్గిపోయినట్లుగా కంటిచూపు తగ్గిపోయింది. నోటి రుచి తగ్గింది. దంతాలు ఊడిపోయాయి. ఆయాసం, దగ్గు ఎక్కువయ్యాయి. తలనొప్పి మొదలయింది. మనస్సు చెదరిపోయింది. ముసలితనం వచ్చింది.

6-62-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నయ నతని కెనుబ దెనిమిది వర్షంబు
లంత నరుగుటయును భ్రాంతుఁ డగుచుఁ
గోరి పిన్నకొడుకు నారాయణాఖ్యుండు
బాలుఁ డగుట మిగుల క్తిఁ జేసి.

టీకా:

ఎనయన్ = ఎంచి చూసిన; అతని = అతని; కిన్ = కి; ఎనుబదెనిమిది = ఎనభైఎనిమిది (88); వర్షంబులు = ఏళ్లు; అంతన్ = అప్పటికి; అరుగుటయును = వెళ్ళుటయును; భ్రాంతుడు = భ్రాంతి చెందినవాడు; అగుచున్ = అగుచూ; కోరి = కోరి; పిన్నకొడుకు = చిన్నకొడుకును; నారాయణ = నారాయణ యనెడి; ఆఖ్యుండు = పేరు గలవాడు; బాలుడు = చిన్న పిల్లవాడు; అగుటన్ = అగుటవలన; మిగులన్ = మిక్కిలి; భక్తిన్ = ముద్దు; చేసి = చేసి.

భావము:

అజామిళుడు ఎనబై ఎనిమిదేండ్లు నిండాయి. కాని భ్రాంతి వీడలేదు. నారాయణ అన్న పేరున్న తన చిన్నకొడుకంటే అతనికి ఎక్కువ ఇష్టం.

6-63-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సతియుఁ దాను గూరిమి
మునఁ బెనఁగొనఁగ నక్కుమారుని ననిశం
బును ముద్దు జేయుచుండెను
వర! వాత్సల్య మాత్మ సందడిఁ గొనఁగన్.

టీకా:

తన = తన యొక్క; సతియున్ = పత్నియును; తానున్ = తను; కూరిమి = ఆపేక్ష; మనమునన్ = మనసులో; పెనగొనగన్ = పెనవేసుకొనగా; ఆ = ఆ; కుమారునిన్ = పుత్రుని; అనిశంబున్ = ఎల్లప్పుడు; ముద్దుజేయుచున్ = ముద్దుచేస్తూ; ఉండెను = ఉండెను; జనవర = రాజా {జన వర - జనులకు వరుడు (పతి), రాజు}; వాత్సల్యము = ఆపేక్ష; అత్మన్ = మనసును; సందడిగొనగన్ = సందడించుచుండగా.

భావము:

రాజా! పుత్రవాత్సల్యం ఆత్మలో పొంగి పొరలగా అజామిళుడు, అతని భార్య ఆ కొడుకును సదా ముద్దుచేస్తూ ఉండేవారు.

6-64-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బాలుని ముగ్ధ వచో ఋజు
ఫాలుని నిజ జనక బంధు రిణామ కళా
శీలుని లోలతఁ గనుఁగొని
యారి బ్రాహ్మణుఁడు నందితాత్ముం డగుచున్.

టీకా:

బాలుని = పిల్లవానిని; ముగ్ధ = ముద్దుగారే; వచస్ = పలుకులు; ఋజు = చక్కటి; ఫాలుని = నుదురు గలవానిని; నిజ = తన యొక్క; జనక = తండ్రి; బంధు = బంధువుల; పరిణామ = వంశపారంపర్య పోలికలు; కళా = ప్రకాశించెడి; శీలుని = లక్షణ మైనవానిని; లోలతన్ = అతి యిచ్చతో; కనుగొని = చూసి; ఆలరి = దుశ్శీలుడైన; బ్రాహ్మణుడు = బ్రాహ్మణుడు; నందిత = సంతోషించెడి; ఆత్ముండు = మనసు గలవాడు; అగుచున్ = అగుచూ.

భావము:

ముద్దు మాటలు మాట్లాడుతూ చక్కని ఫాలభాగం కలిగి, తన తండ్రి బంధువుల పోలికలతో ప్రకాశించే ఆ బాలుని చూచి ఆ దుష్ట బ్రాహ్మణుడు సంతోషిస్తూ...

6-65-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్యంత పాన భోజన
కృత్యంబులఁ బొత్తు గలిగి క్రీడలఁ దత్సాం
త్యంబు వదల కాగత
మృత్యువుఁ గన నేరఁ డయ్యె మిక్కిలి జడుఁడై.

టీకా:

అత్యంత = బహు మిక్కిలిగా; పాన = తాగుట; భోజన = తినుట; కృత్యంబులన్ = పనులలో; పొత్తు = కలిసి యుండుట; కలిగి = కలిగి; క్రీడలన్ = ఆటలలో; తత్ = వాని; సాంగత్యంబున్ = సన్నిహితమును; వదలక = వదిలిపెట్టకుండగ; ఆగత = వస్తున్న; మృత్యువున్ = మరణమును; కనన్ = చూడ; నేరడు = లేనివాడు; అయ్యెన్ = అయ్యెను; మిక్కిలి = అధికముగ; జడుడు = తెలివితక్కువవాడు; ఐ = అయ్యి.

భావము:

ఎక్కువగా ఆ బాలునితోనే త్రాగుతూ, తింటూ అతనితో ఆటలాడుతూ అజామిళుడు రానున్న మృత్యువును తెలుసుకొనలేకపోయాడు.

6-66-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తెలియ కీ రీతి నతఁడు వర్తించుచుండ
యద మగు మృత్యుకాలంబు ప్రాప్తమైన
భూరి వాత్సల్యవృత్తి న ప్పుత్రుఁ దలఁచి
యాత్మఁ బ్రలపించె నారాయణా యటంచు.

టీకా:

తెలియక = తెలియకపోవుటచేత; ఈ = ఈ; రీతిన్ = విధముగ; అతడు = అతడు; వర్తించుచుండ = తిరుగుతుండగా; భయదము = భయంకరము; అగు = అయిన; మృత్యు = మరణ; కాలంబున్ = సమయము; ప్రాప్తము = వచ్చినది; ఐన = అయిన; భూరి = అత్యధికమైన; వాత్సల్య = ఆపేక్ష; వృత్తిన్ = విధానములో; ఆ = ఆ; పుత్రున్ = కొడుకు; తలచి = తలచుకొని; ఆత్మన్ = మనసులో; ప్రలపించెన్ = పలవరించెను; నారాయణా = నారాయణా; అటంచున్ = అనుచూ.

భావము:

ఈ విధంగా రానున్న చావును తెలిసికొనకుండా గడుపుతుండగా భయంకరమైన మరణకాలం వచ్చింది. ఆ సమయంలో అతడు తన కుమారుని తలచుకొని ప్రేమాతిశయంతో “నారాయణా!” అని పలవరించాడు.

6-67-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అప్పుడు.

టీకా:

అప్పుడు = అప్పుడు.

భావము:

ఆ సమయంలో...

6-68-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కింరుల ధర్మరాజ వ
శంరుల దురంత దురిత మధిక జన నా
శంరుల సకలలోక భ
యంరులం గనియె నింద్రియాకులుఁ డగుచున్.

టీకా:

కింకరుల = యమదూతలను; ధర్మరాజ = ధర్మరాజునకు; వశంకరుల = వశములో నుండెడి వారను; దురంత = అంతులేని; దురిత = పాపము; సమధిక = మిక్కిలి అధికమైన; జన = జనులను; నాశంకరులన్ = నాశనము చేసెడి వారను; సకల = సమస్త; లోక = లోకులకు; భయంకరులన్ = భయగొలిపెడి వారిని; కనియెన్ = చూసెను; ఇంద్రియ = ఇంద్రియములు; ఆకులుడు = చీకాకు చెందిన వాడు; అగుచున్ = అగుచూ.

భావము:

అత్యంత పాపాత్ములను బాదించేవారు, సకలలోకాలకు భయంకరులు అయిన యమకింకరులను ఆ అజామిళుడు గుండెలు చెదరిపోగా చూశాడు.

6-69-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఘాతుకుల దండ దండిత
పాకుల మహోగ్ర కర్మ ర నిష్కరుణా
జాకులఁ బ్రేతనాయక
దూక సంతతుల నతఁడు దూరమునందున్.

టీకా:

ఘాతకులన్ = చంపెడివారను; దండ = కఱ్ఱలతో; దండిత = దండించుతూ; పాతకులన్ = దెబ్బలు వేయు వారిని; మహా = మిక్కిలి; ఉగ్ర = భయంకరమైన; కర్మ = పనులతో; భర = నిండిన; నిష్కరుణా = దయమాలిన; జాతకులన్ = లక్షణములు గలవారిని; ప్రేతనాయక = యముని {ప్రేతనాయకుడు - శవములకు నాయకుడు, యముడు}; దూతక = దూతల; సంతతులన్ = సమూహమును; అతడు = అతడు; దూరమునందున్ = దూరముగా.

భావము:

పాపులను చంపేవాళ్ళు, వారిని దండించేవాళ్ళు, దయమాలి భయంకరంగా ప్రవర్తించేవాళ్ళు అయిన యమదూతలను దూరంగా చూశాడు.

6-70-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నియెన్ బ్రాహ్మణుఁ డంత్యకాలమున వీఁకన్ రోషనిష్ఠ్యూతులన్
పీనోష్ఠ వికారవక్త్ర విలసద్గర్వేక్షణోపేతులన్
సంత్రాస కరోద్యతాయత సుపాశ్రేణికా హేతులన్
నవ్యాప్తి విభీతులన్ మువుర నాత్మానేతలన్ దూతలన్.

టీకా:

కనియెన్ = చూసెను; బ్రాహ్మణుడు = బ్రాహ్మణుడు; అంత్యకాలమునన్ = మరణ సమయమున; వీకన్ = పట్టుదలతో; రోష = రోషము; నిష్ఠ్యూతులన్ = వెళ్ళగక్కుతున్న వారిని; ఘన = అతిపెద్దవైన; పీన = లావైన; ఓష్ఠ = పెదవులతో; వికార = వికారమైన; వక్త్ర = ముఖము; విలసత్ = అతిశయించెడి; గర్వ = గర్వముతో కూడిన; ఈక్షణ = చూపులు; ఉపేతులన్ = కలిగినవారను; జన = జనులను; సంత్రాస = భయమును; కర = కొలిపెడి; ఉద్యత్ = పైకెత్తిన; ఆయత = పెద్దపెద్ద; సుపాశ = గట్టిపాశముల; శ్రేణికా = సమూహములతోనూ; ఆహేతులన్ = కత్తులతోనూ; హనన = మరణ; వ్యాప్తి = కలిగించెడి; విభీతులన్ = భయము కలిగించెడి వారను; మువురన్ = ముగ్గురను; ఆత్మ = ఆత్మను; ఆనేతలన్ = తీసుకుపోవు వారిని; దూతలన్ = యమదూతలను.

భావము:

తన అంత్యకాలంలో ఆ బ్రాహ్మణుడు ముగ్గురు యమదూతలను చూశాడు. వాళ్ళు పట్టుదలతో కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. లావుపాటి పెదాలతో, వికారమైన ముఖాలతో, క్రూరమైన చూపులతో ముందుకు దూకుతున్నారు. వాళ్ళు చూడ భయంకరంగా ఉన్నారు. చేతుల్లో భయంకరంగా ఉన్న పాశాలు, కత్తులు సిద్ధంగా ఎత్తి పట్టుకొని ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్నారు.

6-71-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లతి వికృత తుండ గండాభోగ విభాగ విషమ వివృత్త నేత్రులు, నతి పుష్ట నిష్ఠుర తనుయష్ఠి సంవేష్ఠిత మహోర్ధ్వరోములు, నభ్యస్త సమస్త జీవాపహరణ కరణ ప్రశస్త హస్త విన్యస్త పాశధారులు నగు యమభటుల మువ్వురం గనుంగొని యజామిళుండు వికలేంద్రియుండును, వికంపిత ప్రాణుండును, వికృత లోచనుండును, విహ్వలాత్మకుండునై.

టీకా:

ఇట్లు = ఈ విధముగా; అతి = మిక్కిలి; వికృత = వికారమైన; తుండ = ముక్కు; గండ = చెక్కిళ్ళు; భోగ = శరీర; విభాగ = అవయవములు; విషమ = వంకరగా; వివృత్త = తిరిగెడి; నేత్రులు = కన్నులుగలవారు; అతి = మిక్కిలి; పుష్ట = బలమైన; నిష్ఠుర = కఠినమైన; తను = తనువు; యష్ఠి = చేతికఱ్ఱలతో, హారాలతో; సంవేష్ఠిత = గట్టిగా పట్టుకొన్నట్టి, బాగా చుట్టుకుని ఉన్న; మహా = మిక్కిలి; ఊర్థ్వ = నిక్కిన; రోములున్ = వెంట్రుకలు గలవారిని; అభ్యస్త = అలవాటుపడ్డ; సమస్త = సర్వ; జీవ = జీవులను; అపహరణ = కొనిపోవు; కరణ = కార్యములో; ప్రశస్త = ప్రసిద్దిచెందిన; హస్త = చేతులందు; విన్యస్త = కదులుతున్న; పాశ = పాశములను; ధారులున్ = ధరించినవారు; అగు = అయిన; యమభటులన్ = యమభటులను; మువ్వురన్ = ముగ్గురను (3); కనుంగొని = చూసి; అజామిళుండు = అజామిళుడు; వికల = వికలమైన; ఇంద్రియుండును = ఇంద్రియములు కలవాడు; వికంపిత = మిక్కిలి కంపిస్తున్న; ప్రాణుండును = ప్రాణములు గలవాడును; వికృత = వికృతమైన; లోచనుండును = కన్నులు గలవాడును; విహ్వల = విలవిల లాడుతున్న; ఆత్మకుండును = ఆత్మ గలవాడును; ఐ = అయ్యి.

భావము:

ఈ విధంగా మిక్కిలి వికారాలైన ముక్కులు, బలిసిన బుగ్గలు, వికృతంగా తిరుగుతున్న మిడిగ్రుడ్లు, కండలు తిరిగిన కర్కశ దేహాలు, నిక్కపొడుచుకున్న రోమాలు కలిగిన యమకింకరులు అజామిళునికి కనిపించారు. వారి చేతులలో ప్రాణుల ప్రాణాలను బలవంతంగా అపహరించే భయంకరమైన కాలపాశాలు ఉన్నాయి. అటువంటి యమభటులను చూడగానే అజామిళుని ఇంద్రియాలు పట్టు తప్పాయి. ప్రాణాలు కంపించాయి. నిలువుగ్రుడ్లు పడ్డాయి. ఆత్మ గిలగిల లాడింది.

6-72-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దూమున నాడు బాలుఁడు
బోనఁ దన చిత్తసీమఁ బొడగట్టిన నో!
నారాయణ! నారాయణ!
నారాయణ! యనుచు నాత్మనందను నొడివెన్.

టీకా:

దూరమునన్ = దూరము నందు; ఆడు = ఆడుకొనుచున్న; బాలుడు = పిల్లవాడు; బోరనన్ = శ్రీఘ్రమే; తన = తన యొక్క; చిత్తసీమ = మనసు పొరలలో; పొడగట్టినన్ = కనపడగా; ఓ = ఓ; నారాయణ = నారాయణ; నారాయణ = నారాయణ; నారాయణ = నారాయణ; అనుచున్ = అంటూ; ఆత్మ = తన యొక్క; నందనున్ = కొడుకును; నొడివెన్ = పలికెను.

భావము:

దూరంగా ఆడుకుంటున్న కుమారుడు అతని హృదయసీమలో గోచరించగా “ఓ నారాయణా! నారాయణా! నారాయణా!” అంటూ కొడుకును పిలిచాడు.

6-73-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణపువేళ నద్దనుజర్దను సంస్మరణంబు జేయఁ ద
త్పరిసరవర్తు లాత్మపరిపాలకు నామము నాలకించి ని
ష్ఠుగతి నేగుదెంచి పొడచూపి యదల్చిరి కాలుదాసులన్
తరభాషులన్ వికట ల్పిత వేషుల దీర్ఘరోషులన్.

టీకా:

మరణపు = మరణించెడి; వేళ = సమయములో; ఆ = ఆ; దనుజమర్దను = విష్ణుమూర్తిని {దనుజమర్దనుడు - దనుజులు (రాక్షసులను) మర్దనుడు (సంహరించువాడు), హరి}; సంస్మరణంబున్ = తలచుకొనుట; చేయన్ = చేయగా; తత్ = ఆ; పరిసర = చుట్టుపక్కల; వర్తులు = తిరుగుతున్నవారు; ఆత్మ = తమ స్వంత; పరిపాలకు = నాథుని; నామమున్ = పేరును; ఆలకించి = విని; నిష్ఠుర = పరుషమైన; గతిన్ = వేగముతో; ఏగుదెంచి = వచ్చి; పొడచూపి = కనబడి; అదల్చిరి = గద్దించిరి; కాలు = యముని; దాసులన్ = భటులను; ఖరతర = మిక్కిలివాడిగా {ఖరము - ఖరతరము - ఖరతమము}; భాషులన్ = మాట్లాడువారిని; వికట = మిక్కిలి వంకరగా; కల్పిత = ఏర్పరుపబడిన; వేషులన్ = వేషములు ధరించిన వారిని; దీర్ఘ = అధికమైన; రోషులన్ = రోషము గలవారిని.

భావము:

అజామిళుడు మరణ సమయంలో నారాయణ నామస్మరణ చేస్తుండగా ఆ పరిసరాలలో తిరుగుతున్న విష్ణుదూతలు తమ ప్రభువు నామాన్ని విని వేగంగా అక్కడికి వచ్చారు. వికృత వేషాలతో అధికరోషంతో పెద్దగా కేకలు వేస్తున్న యమకింకరులను అదల్చారు.

6-74-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దాసీభర్త నజామిళ
భూసురుఁ దత్తనువువలన బోరన వెలికిం
దీసిన యమభటులఁ దొలఁగఁ
ద్రోసిరి శ్రీవరుని కూర్మిదూతలు కడిమిన్.

టీకా:

దాసీ = దాసీదాని యొక్క; భర్త = భర్త యైనట్టి; అజామిళ = అజామిళుడు యనెడి; భూసురున్ = బ్రాహ్మణుని {భూసురుడు - భూమికి సురుడు (దేవుడు), బ్రాహ్మణుడు}; తత్ = ఆ; తనువు = శరీరము; వలన = నుండి; బోరనన్ = శ్రీఘ్రమే; వెలికిన్ = బయటకు; తీసిన = తీసినట్టి; యమభటులన్ = యమభటులను; తొలగన్ = తొలగిపోవునట్లు; త్రోసిరి = తోసివేసిరి; శ్రీవరుని = విష్ణుమూర్తి యొక్క {శ్రీ వరుడు - శ్రీ (లక్ష్మీదేవి) యొక్క వరుడు (భర్త), హరి}; కూర్మి = ఇష్ట; దూతలు = సేవకులు; కడిమిన్ = పరాక్రమముతో.

భావము:

దాసీ భర్త అయిన ఆ బ్రాహ్మణుని శరీరం నుండి ప్రాణాలను బయటికి గుంజుతున్న యమభటులను విష్ణుదూతలు బలవంతంగా త్రోసి పడవేశారు.

6-75-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు విష్ణుదూతల వలన నిర్ధూత ప్రయత్నులై యమదూత లిట్లనిరి.

టీకా:

ఇట్లు = ఈ విధముగా; విష్ణుదూతల = విష్ణుమూర్తి సేవకుల; వలన = వలన; నిర్ధూత = విడువబడినట్టి; ప్రయత్నులు = ప్రయత్నములు గలవారు; ఐ = అయ్యి; యమదూతలు = యమదూతలు; ఇట్లు = ఈ విధముగా; అనిరి = పలికిరి.

భావము:

ఈ విధంగా తమ ప్రయత్నం విఫలం కాగా యమదూతలు ఇలా అన్నారు.

6-76-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఎవ్వనివారలు? మాతోఁ
జివ్వకుఁ గత మేమి? యిట్లు చిక్కినవానిం
గ్రొవ్వున విడిపించితి; రిఁక
వ్వులకో? జముని శాసనంబులు జగతిన్.

టీకా:

ఎవ్వని = ఎవనికి చెందిన; వారలు = వారు; మా = మా; తోన్ = తోటి; చివ్వ = గొడవ; కున్ = కి; గతము = కారణము; ఏమి = ఏమిటి; ఇట్లు = ఈ విధముగ; చిక్కిన = దొరికిన; వానిన్ = వానిని; క్రొవ్వున = బలముతో; విడిపించితిరి = విడిపించినారు; ఇక = ఇంక; నవ్వులకో = వేళాకోళమునకా ఏమి; జముని = యముని యొక్క; శాసనంబులు = దండనములు; జగతిన్ = ప్రపంచములో.

భావము:

“మీరెవ్వరి దూతలు? మాతో కలహించడానికి కారణం ఏమిటి? ఇలా మా చేతికి చిక్కినవాణ్ణి మీరు బలవంతంగా విడిపించారు. ప్రపంచంలో యముని శాసనాలు ఇక నవ్వులాటకా?

6-77-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదియునుం గాక.

టీకా:

అదియునున్ = అంతే; కాక = కాకుండ.

భావము:

అంతేకాక...

6-78-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వ్వరు మీ రయ్య? యీ భవ్యరూపముల్-
న్నుల కద్భుతక్రమ మొనర్చె;
దివిజులో? భువిజులో? దేవతాప్రవరులో?-
సిద్ధులో? సాధ్యులో? చెప్పరయ్య;
ళిత పాండుర పద్మళ దీర్ఘ నేత్రులు,-
ర పీత కౌశేయ వాసు లరయ
గండమండల నట త్కుండల ద్వయులును,-
టు కిరీటప్రభా భాసితులును,

6-78.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భూరి పుష్కర మాలికా చారువక్షు,
మిత కోమల నవయౌవ నాధికులును,
బాహు కేయూర మణిగణ భ్రాజమాన
న చతుర్భుజు, లభ్రసంకాశ రుచులు.

టీకా:

ఎవ్వరు = ఎవరు; మీరు = మీరు; అయ్య = తండ్రులారా; ఈ = ఈ; భవ్య = దివ్యమైన; రూపముల్ = స్వరూపములు; కన్నుల్ = కన్నుల; కున్ = కు; అద్భుతము = ఆశ్చర్యకర; క్రమమున్ = విధమును; ఒనర్చెన్ = కలిగించెను; దివిజులో = స్వర్గమున పుట్టినవారో; భువిజులో = భూమిపైన పుట్టినవారో; దేవతా = దేవతలలో; ప్రవరులో = శ్రేష్ఠులో; సిద్ధులో = సిద్ధులో; సాధ్యులో = సాధ్యులో; చెప్పరు = చెప్పండి; అయ్య = తండ్రులారా; దళిత = విచ్చుకొన్న; పాండుర = తెల్లని; పద్మ = పద్మముల; దళ = దళములవంటి; నేత్రులు = కన్నులుగలవారు; వర = శ్రేష్ఠమైన; పీత = పచ్చని; కౌశేయ = పట్టుబట్టలు; వాసులు = ధరించినవారు; అరయ = తరచి చూసిన; గండ = చెక్కిలి; మండల = ప్రాంతమున; నటత్ = కదులుచున్న; కుండల = కర్ణకుండలముల; ద్వయంబులును = జంటలును; పటు = బలమైన; కిరీట = కిరీటముల; ప్రభా = ప్రకాశముతో; భాసితులును = వెలుగుతున్న వారును.
భూరి = అత్యధికమైన; పుష్కర = తెల్లతామర; మాలిక = పూలమాలలు గల; చారు = అందమైన; వక్షులు = వక్షస్థలము గలవారు; అమిత = మిక్కిలి; కోమల = మృదువైన; నవ = కొత్త; యౌవన = యౌవనము; అధికులును = అధికముగ గలవారును; బాహు = భుజ; కేయుర = కీర్తుల యొక్క; మణి = మణుల; గణ = సమూహములచే; భ్రాజమాన = ప్రకాశవంతమైన; ఘన = గొప్ప; చతుర్ = నాలుగు (4); భుజులు = చేతులు గలవారు; అభ్ర = మేఘముల; సంకాశ = వంటి; రుచులు = వర్ణములవారు.

భావము:

అయ్యా! మీరెవ్వరు? మీ శుభకరమైన రూపాలు మా కన్నులకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. మీరు నింగిలోని వారా? నేలమీది వారా? దేవతా శ్రేష్ఠులా? సిద్ధులా? సాధ్యులా? వికసించిన తెల్ల తామర రేకుల వంటి విశాల నేత్రాలు కలవారు, శ్రేష్ఠమైన పసుపుపచ్చని పట్టువస్త్రాలను ధరించినవారు, చెక్కిళ్ళపై నాట్యమాడే కుండలాలు ధరించినవారు, మిక్కిలి సుకుమారమైన యౌవన ప్రాయంలో ఉన్నవారు, రత్న ఖచితాలైన భుజకీర్తులతో విరాజిల్లే నాలుగు భుజాలు కలిగినవారు, నీలమేఘాల వంటి దేహచ్ఛాయలు కలవారు అయిన మీరెవ్వరు?

6-79-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నువులు, నిషంగచయములుఁ,
దంబుజ, శంఖ, చక్ర, డ్గ, గదా, సా
ములు ధరియించిన మీ
నువులు లోకముల కద్భుతం బొనరించెన్.

టీకా:

ధనువులు = విల్లులు; నిషంగచయములున్ = అమ్ముల పొదులు; కనత్ = తళుక్కు మంటున్న; అంబుజ = పద్మము; శంఖ = శంఖము; చక్ర = చక్రాయుధము; ఖడ్గ = కత్తి; గదా = గద మొదలగు; సాధనములు = ఆయుధములు; ధరియించిన = దరించినట్టి; మీ = మీ యొక్క; తనువులు = శరీరములు; లోకముల్ = జగములు; కున్ = అందు; అద్భుతంబు = అద్భుతమును; ఒనరించెన్ = చేసెను.

భావము:

ధనుస్సులు, అమ్ముల పొదులు, పద్మం, శంఖం, చక్రం, ఖడ్గం, గద మొదలైన ఆయుధాలను ధరించిన మీ స్వరూపాలు లోకాలకు ఆశ్చర్యాని గొల్పుతున్నాయి.

6-80-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శాంతంబు లయిన మీ తను
కాంతులు జగములను దిశలఁ లిగిన బహుళ
ధ్వాంములఁ బాఱఁదోలుచు
సంస మొనరించె నిపుడు ర్వంకషమై.

టీకా:

శాంతంబులు = శాంత మైనట్టివి; అయిన = ఐనట్టి; మీ = మీ యొక్క; తను = శరీర; కాంతులు = ప్రకాశములు; జగములను = లోకములను; దిశలన్ = దిక్కులను; కలిగిన = ఉన్నట్టి; బహుళ = అనేకమైన; ధ్వాంతములన్ = అంధకారములను; పాఱదోలుచు = పోగొట్టుచు; సంతసమున్ = సంతోషమును; ఒనరించెన్ = కలిగించెను; ఇపుడు = ఇప్పుడు; సర్వ = సమస్తమును; కషము = సానపెట్టుచున్నవి; ఐ = అయ్యి.

భావము:

శాంతంతో కూడిన మీ శరీర కాంతులు లోకమంతా నిండి దిగంతాలకు వ్యాపించే కారు చీకటులను పారద్రోలుతూ సంతోషాన్ని కలిగిస్తున్నాయి.

6-81-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇ ట్లఖిల లోకానందకర కమ్రాకారులు, నఖిల విభ్రాజమాన తేజో దుర్నిరీక్ష్యమాణులును, నిఖిలధర్మపాలురును నగు మీరు ధర్మ పరిపాలుర మమ్ము నడ్డపెట్టం గతం బేమి?" యనిన మందస్మిత కందళిత ముఖారవిందులయి గోవిందుని కందువ మందిరంబు కావలివారలు వారివాహ గంభీర నిర్ఘోష పరిపోషణంబు లైన విశేషభాషణంబుల ని ట్లనిరి.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; అఖిల = సమస్తమైన; లోక = లోకములకు; ఆనంద = సంతోషమును; కర = కలిగించెడి; కమ్ర = చక్కటి; ఆకారులు = స్వరూపములు గలవారు; అఖిల = సమస్తమును; విభ్రాజమాన = విశేషముగ ప్రకాశిస్తున్న; తేజస్ = తేజస్సుతో; దుర్నిరీక్ష్యమాణులును = తేరిపార చూడరానివారు; నిఖిల = సమస్తమైన; ధర్మ = ధర్మమును; పాలురున్ = నడిపించువారు; అగు = అయిన; మీరు = మీరు; ధర్మ = ధర్మమును; పరిపాలురన్ = పరిపాలించెడి వారము; మమ్మున్ = మమ్మలును; అడ్డపెట్టన్ = అడ్డుకొనుటకు; గతంబు = కారణము; ఏమి = ఏమిటి; అనినన్ = అనగా; మందస్మిత = చిరునవ్వుతో; కందళిత = బాగుగా వికసించిన; ముఖ = మోము అనెడి; అరవిందలు = పద్మములు గలవారు; అయి = అయ్యి; గోవిందుని = విష్ణుమూర్తి యొక్క; కందువ = అంతఃపుర, నివాస; మందిరంబు = మందిరమున; కావలి = కాపాలా కాసెడి; వారలు = వారు; వారివహ = మేఘ; గంభీర = గంభీరమైన; నిర్ఘోష = గర్జనలకు; పరిపోషణంబులు = చక్కగా పాలించ గలిగెడివి; ఐన = అయిన; విశేష = విశేషమైన; భాషణంబులన్ = మాటలతో; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

ఈ విధంగా లోకాలన్నింటికి ఆనందాన్ని కలిగించే సుందర విగ్రహాలు కలవారు, చూడడానికి సాధ్యం కాని తేజస్సుతో విరాజిల్లుతున్నవారు, సర్వధర్మాలను పాలించేవారు అయిన మీరు మమ్మల్ని అడ్డగించడానికి కారణమేమిటి?” అని యమదూతలు పలుకగా చిరునవ్వులతో వికసించిన ముఖపద్మాలు కలిగిన ఆ విష్ణుదేవుని మందిర ద్వారపాలకులు గంభీరమైన మేఘ గర్జనలతో సమానమైన మాటలతో ఇలా అన్నారు.

6-82-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మీరు పరేతనాయకుని మేలిమి దూత లఁటేనిఁ బల్కుఁ డా
తోపుఁ బుణ్యలక్షణము, దుష్కృతభావము, దండకృత్యమున్
బీముతోడ నీతని కభీష్టనివాసముఁ, బోలి దండ్యు లె
వ్వాలొ? సర్వభూతములొ? వారొక కొందఱు పాపకర్ములో?"

టీకా:

మీరు = మీరు; పరేతనాయకుని = యముని {పరేత నాయకుడు - పరేత (మరణించినవారి, భూతముల)కి నాయకుడు, యముడు}; మేలిమి = ఉత్తమ; దూతలు = దూతలు; అటేని = అయినచో; పల్కుడా = చెప్పండి; తోరపు = స్థూలమైన; పుణ్య = పుణ్యము చేసినవారి; లక్షణము = లక్షణమును; దుష్కృత = పాపపు; భావమున్ = భావము; దండ = దండించెడి; కృత్యమున్ = పనిని; బీరము = పరాక్రమము; తోడన్ = తోటి; ఈతని = ఇతనియొక్క; అభీష్ట = తగిన; నివాసము = గమ్యము; పూని = పూని; దండ్యులు = దండింపదగినవారు; ఎవ్వారలో = ఎవరో; సర్వ = సమస్తమైన; భూతములో = భూతములో; వారొక = వాటిలో ఒక; కొందఱు = కొంతమంది; పాప = పాపపు; కర్ములో = కర్మలు చేయువారో.

భావము:

“మీరు యమదూతలైతే పుణ్య లక్షణాన్ని, పాప స్వరూపాన్ని, దండనీతిని వివరించండి. ఇతడు ఉండ వలసిన స్థానాన్ని వెల్లడించండి. దండింపదగినవా రెవరు? లోకంలోని సర్వ ప్రాణులా? లేక పాపకర్ములైన కొందరా?”

6-83-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన యమభటు లిట్లనిరి.

టీకా:

అనినన్ = అనగా; యమభటులు = యమభటులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

అని విష్ణుదూతలు పలుకగా యమభటులు ఇలా అన్నారు.

6-84-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"వేప్రణిహితమే యను
మోదంబుగ ధర్మ మయ్యె మున్ను; త దన్యం
బేది యగునది యధర్మం
బాదియు హరిరూపు వేద ని విను కతనన్.

టీకా:

వేద = వేదములచే; ప్రణిహితమే = ఏర్పరుపబడినది మాత్రమే; అనుమోదంబుగ = ఆమోదింపబడినదిగ; ధర్మము = ధర్మము; అయ్యెన్ = అయ్యెను; మున్ను = పూర్వమే; తత్ = దానికి; అన్యంబు = ఇతరము; ఏది = ఏదైతే; అగున్ = అగునో; అది = అది; అధర్మంబు = అధర్మమునకు; ఆదియున్ = మొదలుది; హరి = విష్ణుమూర్తి యొక్క; రూపు = స్వరూపము; వేదము = వేదము; అని = అని; విను = వినెడి; కతనన్ = కారణముచేత.

భావము:

వేదాలలో ఏది చెప్పబడిందో అదే అందరికీ ఆమోదకరమైన ధర్మం. దానికంటే వేరైనది అధర్మం. వేదం సాక్షాత్తు విష్ణుస్వరూపమని విన్నాము కదా!

6-85-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వ్వనిచేఁ దన యిరవొందు త్రిగుణ స్వ-
భావమైనట్టి యీ ప్రాణిచయము
నుగుణ నామక్రియారూపములచేత-
నేర్పడుగతిఁ దాన యెఱుఁగఁబడును
ర్యముం డనలంబు నాకాశమును బ్రభం-
నుఁడు గోచయమును శధరుండు
సంధ్యలు దినములు ర్వరీచయములుఁ-
గాలంబు వసుమతీ జాలములును

6-85.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేహధారికి సాక్షులై తెలుపుచుండు
దండనస్థాన విధము సద్ధర్మగతియుఁ
గులు మీరీ క్రమానురోనముఁ జేసి
ఖిల కర్ములు దండార్హు రయ నెపుడు.

టీకా:

ఎవ్వని = ఎవని; చేన్ = చేతనైతే; తన = తన యొక్క; ఇరవొందున్ = నెలకొనెడి; త్రిగుణ = త్రిగుణములు {త్రిగుణములు - సత్త్వరజస్తమోగుణములు మూడు}; స్వభావము = స్వభావముగా గలవి; ఐనట్టి = అయినట్టి; ఈ = ఈ; ప్రాణి = జీవుల; చయములను = సమూహములను; గుణ = గుణములు; నామ = పేర్లు; క్రియా = పనుల; రూపముల = స్వరూపములు; చేతన్ = వలన; ఏర్పడు = ఏర్పడెడి; గతిన్ = విధముగ; తాన = తనే; ఎఱుగబడును = తెలియబడును; అర్యముండు = సూర్యుడు; అనలంబు = అగ్ని; ఆకాశమును = ఆకాశము; ప్రభంజనుడు = వాయువు; గో = ఆవుల; చయమున్ = సమూహము; శశధరుండు = చంద్రుడు {శశధరుండు - శశము (కుందేలు)ను ధరించినవాడు, చంద్రుడు}; సంధ్యలు = సంధ్యలు; దివములు = పగళ్ళు; శర్వరీ = రాత్రుల; చయములు = సమూహములు; కాలంబున్ = కాలమును; వసుమతీ = భూముల; జాలములును = సమూహములును.
దేహధారి = జీవుని; కిన్ = కి; సాక్షులు = సాక్షులుగా; ఐ = ఉండి; తెలుపుచుండున్ = తెలియజేయు చుండును; దండన = దండించవలసిన; స్థాన = స్థానము; విధమున్ = విధమును; సద్ధర్మ = పుణ్యకర్మముల; గతియున్ = విధానమును; తగులు = చిక్కును; మీరు = మీరు; ఈ = ఈ; క్రమ = పద్దతికి; అనురోధమున్ = అవరోధము చేయుట; చేసి = వలన; అఖిల = సర్వులైన; కర్ములు = జీవులు; దండ = దండనమునకు; అర్హులు = తగినవారు; అరయ = తరచి చూసిన; ఎపుడున్ = ఎల్లప్పుడును.

భావము:

ఎవని వల్ల సత్త్వరజస్తమో గుణ స్వభావంతో ఈ ప్రాణికోటి తమకు అనుగుణమైన గుణాలను, పేర్లను, ప్రవర్తనను, రూపాలను పొంది ఆ విధంగా తనకు తానుగా లోకానికి తెలియబడుతున్నాడో ఆ నారాయణుడు అంతర్యామియై సర్వప్రాణులలో నిండి ఉన్నాడు. సూర్యుడు, అగ్ని, ఆకాశం, గాలి, గోవులు, చంద్రుడు, సంధ్యలు, పగళ్ళు, రాత్రులు, కాలాలు, భూమి మొదలైనవి ఈ దేహధారుడైన జీవుని సర్వ కర్మలకు సాక్షులు. ఈ సాక్ష్యాలను అనుసరించే ధర్మాధర్మాల నిర్ణయం జరిగి అధర్మపరులు దండింపబడతారు. ఇప్పుడు మీరీ క్రమపద్ధతికి అడ్డు తగిలారు. కర్మబద్ధులైన జీవులందరూ దండింపదగినవారే.

6-86-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కోరి కర్మంబు నడపెడు వారి కెల్ల
లిత శుభములు నశుభము ల్గలుగుచుండు;
రయఁగా దేహి గుణసంగి యైన యపుడె
పూని కర్మంబు జేయక మారాదు.

టీకా:

కోరి = కావాలని; కర్మంబున్ = కర్మలను; నడపెడు = చేసెడి; వారు = వారు; కిన్ = కి; ఎల్లన్ = సమస్తము; కలిత = కలిగిన; శుభమున్ = శుభములును; అశుభముల్ = అశుభములును; కలుగుచుండున్ = కలుగుతుండును; అరయగా = తరచి చూసిన; దేహి = జీవుడు; గుణ = గుణములతో; సంగి = సాంగత్యము గలవాడు; ఐన = అయిన; అపుడె = అప్పుడే; పూని = కోరి; కర్మంబున్ = కర్మములను; చేయక = చేయకుండుటను; మానరాదు = మానలేడు.

భావము:

కావాలని కర్మలను చేసేవారికి ఆ కర్మల ననుసరించి శుభాలు, అశుభాలు కలుగుతూ ఉంటాయి. దేహధారుడు సత్త్వరజస్తమో గుణసంపర్కం వల్ల కర్మ చేయకుండా ఉండలేడు.

6-87-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రకృతమునఁ దా నొనర్చిన
సుకృతము దుష్కృతము నెంత చూడఁగ నంతే
వికృతిఁ గని యనుభవించు
న్నకృతమతిం దత్ఫలంబు తి నిపుణుండై.

టీకా:

ప్రకృతమునన్ = ప్రస్తుతము; తాన్ = తను; ఒనర్చిన = చేసిన; సుకృతము = మంచిపని; దుష్కృతము = చెడుపని; ఎంత = ఎంతైతే; చూడగన్ = తరచి చూసిన; అంతే = అంతవరకునే; వికృతిన్ = వికారమును, మార్పును; కని = పొంది; అనుభవించున్ = అనుభవించును; అకృత = పక్వముకాని; మతిన్ = మనసుతో; తత్ = దాని; ఫలంబున్ = ఫలితమును; అతి = మిక్కిలి; నిపుణుండు = నేర్పరి; ఐ = అయ్యి.

భావము:

ఈ జన్మలో తాను ఎంత పుణ్యం చేస్తాడో, ఎంత పాపం చేస్తాడో వాటిని బట్టి భవిష్యత్తులో అంతే వికారాన్ని పొంది అపరిపక్వమైన మనస్సుతో వాటి ఫలితాలను అనుభవిస్తాడు.

6-88-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు వినుండు, జన్మంబు శాంత ఘోర మూఢ గుణంబులచేత నైనను, సుఖదుఃఖ గుణంబులచేత నైనను, ధార్మికాది గుణంబులచేత నైనను, సకల భూతంబులుఁ ద్రైవిధ్యంబు నే ప్రకారంబునం బొందు, నా ప్రకారంబున జన్మాంతరంబునం బొందుచుండు; దేవుండైన యముండు సర్వ జీవాంతర్యామియై ధర్మాధర్మయుక్తం బయిన పూర్వ రూపంబుల మనస్సుచే విశేషంబుగఁ జూచుచుండి, వాని కనురూపంబులఁ జింతించుచుండు; నవిద్యోపాధి జీవుండు తమోగుణయుక్తుం డై ప్రాచీన కర్మంబులచేత నేర్పడిన వర్తమాన దేహంబు, నే నని తలంచుచుండి, నష్ట జన్మ స్మృతి గలవాడై పూర్వాపరంబు లెఱుంగం జాలకుండు; మఱియుఁ గర్మేంద్రియంబులచేతఁ గర్మంబులం జేయుచుండి, జ్ఞానేంద్రియముల చేతఁ దమోవిషయంబు లయిన శబ్ద స్పర్శ రూప రస గంధంబుల నెఱుంగుచుండి, పదియాఱవది యైన మనంబుతోఁ గూడి, పదియేడవవాఁ డగుచుండి, షోడశోపాధ్యంతర్గతుం డై యొక్కరుం డైన జీవుండు, సర్వేంద్రియ విషయ ప్రతిసంధానంబు కొఱకు జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనోవిషయంబులఁ బొందుచుండి, షోడశ కళలు గలిగి, లింగ శరీరం బనం బరఁగి గుణత్రయకార్యం బను నిమిత్తంబున హర్ష శోక భయంబుల నిచ్చుచున్న సంసారంబు ధరియించుచుండు; విజితషడ్వర్గు డైన దేహి కర్మంబు లొల్లని బుద్ధి నెఱింగియు, వినియుఁ, గర్మంబులు జేయుచుండి, తన సంచార కర్మంబునం జుట్టుకొన్న పసిడికాయ పురువునుం బోలె నిర్గమోపాయం బెఱుంగక నాశంబు నొందుచుండు, వర్తమాన వసంతాది కాలంబు, భూత భావి వసంతాది కాలయోగ్యం బైన పుష్ప ఫలాదులు తత్కాల జ్ఞాపకంబు నెట్లు జేయు, నట్లు భూత భావి జన్మంబులకు ధర్మాధర్మంబులు నిదర్శనంబులు జేయుచుం; డొక్క నరుండు నొక క్షణంబును గర్మంబు జేయకుండువాఁడు లేఁడు; పూర్వసంస్కారంబులం గల గుణంబులచేతఁ బురుషుం డవశుండు గావున బలిమిఁ గర్మంబులు చేయింపంబడుచుం; డవ్యక్తనిమిత్తంబు నొంది తదనురూపంబు లయిన స్థూల సూక్ష్మ శరీరంబులు మాతా పితృ సదృశంబు లగుచుండు; నిట్టి విపర్యయంబు పురుషునికిఁ బ్రకృతి సంగమంబునం గలుగుచుండు; నా ప్రకృతి పురాణపురుషుం డయిన యప్పరమేశ్వరుని సేవించినం దలంగుచుండు..
^ షోడశ వికారములు - కళలు మున్నగునవి

టీకా:

మఱియున్ = ఇంకను; వినుండు = వినండి; జన్మంబున్ = ఈ జన్మలో; శాంత = శాంతమైన, సత్వ; ఘోర = ఘోరమైన, రజో; మూఢ = మూఢమైన, తమో; గుణంబుల = గుణముల; చేతన్ = వలన; ఐనను = ఐనట్టి; సుఖ = సుఖ; దుఃఖ = దుఃఖ; గుణంబుల = గుణముల; చేతన్ = వలన; ఐనను = ఐనట్టి; ధార్మిక = ధర్మబద్ధ మైనట్టివి; ఆది = మొదలైన; గుణంబుల = గుణముల; చేతన్ = వలన; ఐనను = ఐనట్టి; సకల = సమస్తమైన; భూతంబులు = జీవులు; త్రైవిధ్యంబున్ = మూడు రకముల ఫలితములు {త్రైవిధ్యము - 1సుఖమయ 2సుఖదుఃఖ మిళితమయ 3దుఃఖమయములైన మూడు విధముల ఫలితములు, ఇంకొకవిధమున 1హర్ష 2శోక 3భయములు}; పొందున్ = పొందునో; ఆ = ఆ; ప్రకారంబునన్ = విధముగనే; జన్మాంతరంబునన్ = ఇతర జన్మముల లోను; పొందుచుండున్ = పొందుతుండును; దేవుండు = భగవంతుడు; ఐన = అయిన; యముండు = యమధర్మరాజు; సర్వ = సమస్తమైన; జీవ = జీవుల; అంతర్యామి = లోపల వ్యాపించి యుండెడివాడు; ఐ = అయ్యి; ధర్మ = ధర్మము; అధర్మ = అధర్మము; యుక్తంబున్ = కూడినవి; అయిన = ఐనట్టి; పూర్వరూపంబులన్ = అసలు స్వరూపములను; మనస్సు = మనసు; చేతన్ = వలన; విశేషంబుగఁ = ప్రత్యేకముగ; చూచుచుండి = దర్శించుచు; వాని = వాటి; కిన్ = కి; అనురూపంబులు = తగినట్టి వానిని; చింతించుచుండును = ఆలోచించుచుండును; అవిద్య = అవిద్యపై; ఉపాధి = ఆధారపడిన; జీవుండు = జీవుడు; తమోగుణ = తమోగుణముతో; యుక్తుండు = కూడినవాడు; ఐ = అయ్యి; ప్రాచీన = పూర్వజన్మలలోని; కర్మంబుల = కర్మల; చేతన్ = వలన; ఏర్పడిన = కలిగిన; వర్తమాన = ప్రస్తుత; దేహంబు = శరీరమే; నేను = తను; అని = అని; తలంచుచుండి = అనుకొనుచు; నష్ట = పోయిన; జన్మ = పూర్వజన్మ; స్మృతి = ఙ్ఞాపకములు; కలవాడు = కలవాడు; ఐ = అయ్యి; పూర్వా = భూత; పరంబుల్ = భవిష్యత్తులు; ఎఱుంగంజాలకుండు = తెలిసికొనలే కుండును; మఱియున్ = ఇంకా; కర్మేంద్రియంబుల్ = పంచకర్మేంద్రియముల (5) {కర్మేంద్రియములు - 1వాక్, 2పాణి, 3పాద, 4పాయు, 5ఉపస్థులు}; చేతన్ = తోటి; కర్మంబులన్ = కర్మములను; చేయుచుండి = చేయుచూ; ఙ్ఞానేంద్రియముల్ = పంచఙ్ఞానేంద్రియముల (5) {ఙ్ఞానేంద్రియములు - 1త్వక్ 2చక్షుస్ 3శోత్ర 4జిహ్వ 5ఘ్రాణములు}; చేతన్ = వలన; తమస్ = తమోగుణముతో కూడిన; విషయంబులు = పంచేంద్రియార్థములు (5); అయిన = ఐనట్టి; శబ్ద = ధ్వని; స్పర్శ = స్పర్శము; రూప = స్వరూపము; రస = రుచి; గంధంబులన్ = వాసనలను; ఎఱుంగుచుండి = తెలిసికొనుచూ; పదియాఱవది = పదహారోది (16); ఐన = అయిన; మనంబు = మనసు; తోన్ = తోటి; కూడి = కలిసి; పదియేడవవాడు = పదిహేడవవాడు (17) (జీవుడు); అగుచుండి = అగుచు; షోడశ = పదహారు (16); ఉపాధి = ఆధారభూతమైనవాని; అంతర్గతుండు = లోను లొంగి యుండువాడు; ఐ = అయ్యి; ఒక్కరుండు = అద్వితీయుండు; ఐన = అయిన; జీవుండు = జీవుడు; సర్వ = సమస్తమైన; ఇంద్రియ = ఇంద్రియముల; విషయ = అర్థంబుల; ప్రతిసంధానంబు = కలియుట; కొఱకున్ = కోసము; ఙ్ఞానేంద్రియ = పంచఙ్ఞానేంద్రియముల (5); కర్మేంద్రియ = పంచకర్మేంద్రియముల (5); మనస్ = మనస్సు (1); విషయంబులన్ = పంచేంద్రియార్థంబులను (5); పొందుచుండి = పొందుతూ; షోడశ = పదహారు (16); కళలు = కళలు; కలిగి = కలిగి; లింగశరీరంబున్ = లింగశరీరము; అనన్ = అనగా; పరగి = ప్రసిద్ధమైన; గుణత్రయ = త్రిగుణాత్మక {త్రిగుణములు - 1సత్త్వ 2రజస్ 3తమో గుణములు}; కార్యంబు = కర్యములు; అను = అనెడి; నిమిత్తంబునన్ = కారణములతో; హర్ష = సంతోషము; శోక = దుఃఖము; భయంబులన్ = భయములను; ఇచ్చుచున్న = ఇచ్చెడి; సంసారంబున్ = సంసారమును; ధరియించుచుండు = మోయుచుండును; విజితషడ్వర్గుడు = అరిషడ్వర్గములను జయించినవాడు {అరిషడ్వర్గములు - 1 కామ 2క్రోధ 3లోభ 4మోహ5మద 6మాత్సర్యములు}; ఐనన్ = అయినను; దేహి = జీవుడు; కర్మంబున్ = కర్మలను; ఒల్లని = ఒప్పుకొనని; బుద్ధి = ఙ్ఞానమును; ఎఱింగియున్ = తెలిసినను; వినియున్ = విన్నవాడైనను; కర్మంబులున్ = కర్మలను; చేయుచుండి = చేయుచూ; తన = తన యొక్క; సంచారకర్మంబు = తన చుట్టూ తాను తిరుగు పనిలో; చుట్టుకొన్న = చుట్టుకుపోతున్న; పసిడికాయపురుగునున్ = పట్టుపురుగును; పోలె = వలె; నిర్గమ = బయటపడు, ముక్తిచెందెడి; ఉపాయంబున్ = ఉపాయమును; ఎఱుంగక = తెలియక; నాశంబున్ = నాశనమును; ఒందుచుండున్ = పొందుచుండును; వర్తమాన = ప్రస్తుతపు; వసంత = వసంతము {వసంతాది - షడృతువులు - 1వసంత 2గ్రీష్మ 3వర్ష 4శరత్ 5హేమంత 6శిశిర ఋతువులు}; ఆది = మొదలైన; కాలంబున్ = కాలములు; భూత = భూతకాలపు; భావి = భావికాలపు; వసంత = వసంతము; ఆది = మొదలైన; కాల = కాలములకు; యోగ్యంబున్ = తగినవి; ఐన = అయిన; పుష్ప = పూలు; ఫల = పండ్లు; ఆదులు = మొదలైనవి; తత్ = ఆయా; కాల = కాలముల; ఙ్ఞాపకంబున్ = ఙ్ఞాపకములను; ఎట్లు = ఏ విధముగా; చేయున్ = చేయునో; అట్లు = ఆ విధముగ; భూత = పూర్వపు; భావి = రాబోవు; జన్మంబుల్ = జన్మమముల; కున్ = కు; ధర్మ = ధర్మము; అధర్మంబులు = అధర్మములు; నిదర్శనంబులు = ఋజువులు; చేయుచుండు = కలుగజేయును; ఒక్క = ఏ ఒక్క; నరుండున్ = మానవుడును; ఒక = ఏ ఒక్క; క్షణంబును = క్షణముకూడ; కర్మంబున్ = కర్మలను; చేయకుండువాడు = చేయకుండా ఉండెడివాడుగ; లేడు = ఉండలేడు; పూర్వ = పూర్వజన్మలలోని; సంస్కారంబులన్ = కర్మములను; కల = ఉన్నట్టి; గుణంబుల = గుణముల; చేతన్ = వలన; పురుషుండు = మానవుడు; వశుండు = లొంగి యుండు వాడు; కావున = కనుక; బలిమిన్ = బలవంతముగ; కర్మంబులున్ = కర్మలను; చేయింపంబడుచుండున్ = చేయింపబడుతూ ఉండును; అవ్యక్త = తెలియబడకుండెడి; నిమిత్తంబునన్ = కారణభూతమును; ఒంది = పొంది; తత్ = వాటికి; అనురూపంబులు = తగినట్టివి; అయిన = అయినట్టి; స్థూల = భౌతిక; సూక్ష్మ = సూక్ష్మ; శరీరంబులు = దేహములు; మాతా = తల్లి; పితృ = తండ్రుల; సదృశంబులు = పోలెడివి; అగుచుండున్ = కలిగి యుండును; ఇట్టి = ఇటువంటి; విపర్యయంబు = వ్యత్యాసము; పురుషుని = మానవుని; కిన్ = కి; ప్రకృతి = ప్రకృతితో; సంగమంబునన్ = కలయిక వలన; కలుగుచుండున్ = పొందుతుండును; ఆ = ఆ యొక్క; ప్రకృతి = సహజపరిమాణము; పురాణ = సృష్ట్యాదినుండి యుండెడి; పురుషుండు = పురుషుడు; అయిన = అయిన; ఆ = ఆ; పరమేశ్వరుని = భగవంతుని; సేవించినన్ = కొలిచినతో; తలగుచుండు = తొలగిపోవుచుండును;

భావము:

ఇంకా వినండి. ఈ లోకంలో ప్రాణులు గుణత్రయ సంబంధం చేత శాంత స్వభావులు, ఘోర స్వభావులు, మూఢ స్వభావులు అని మూడు విధాలుగా ఉంటారు. వీరిలో శాంతస్వభావులు ధర్మమార్గంలో ప్రవర్తిస్తూ సుఖపడతారు. ఘోరస్వభావులు కూడని మార్గాలలో నడచి నానా కష్టాల పాలవుతారు. మూఢస్వభావులు కొంత మంచిగా కొంత చెడుగా ప్రవర్తిస్తూ సుఖ దుఃఖాలను తెచ్చుకుంటారు. వారి ప్రవర్తనలకు అనుగుణంగానే వారికి రాబోయే జన్మలు లభిస్తాయి. ధర్మస్వరూపుడైన యముడు సమస్త జీవులలో అంతర్యామిగా ఉంటాడు. అలా ఉండి ఆయా జీవుల ధర్మాధర్మాల స్వరూపాలను విశేష దృష్టితో గమనిస్తూ వాటికి అనురూపమైన మార్గాలను కల్పిస్తుంటాడు. అజ్ఞానం ఉపాధిగా కల జీవుడు తమోగుణంతో కూడినవాడై పూర్వకర్మల చేత ఏర్పడిన ఇప్పటి ఈ దేహమే తానని భావిస్తాడు. అందువల్ల పూర్వజన్మ స్మృతిని కోల్పోతాడు. కాళ్ళు, చేతులు మొదలైన కర్మేంద్రియాలతో ఏవేవో కర్మలు చేస్తూ ఉంటాడు. కన్నులు, చెవులు మొదలైన జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానాన్ని సముపార్జించకుండా కేవలం శబ్ద స్పర్శ రూప రస గంధాలను మాత్రమే గ్రహిస్తూ ఉంటాడు. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు తన్మాత్రలు, ఒక మనస్సు మొత్తం పదునారు. జీవుడు పదునేడవవాడై ఈ పదునారు ఉపాధులతో సంబంధ సంస్పర్శలు కలిగి సంసార బంధాలలో చిక్కుకొని ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటాడు. పది ఇంద్రియాలు, పంచ తన్మాత్రలు, మనస్సు అనే పదునారు కళలతో కూడి గుణత్రయ విశిష్టమైన లింగశరీరం సత్త్వగుణం వల్ల హర్షాన్ని, రజోగుణం వల్ల శోకాన్ని, తమోగుణం వల్ల భయాన్ని జీవునికి కలిగిస్తుంది. ఈ విధంగా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాన్ని జయించలేక సంసార బద్ధుడైన జీవుడు కర్మలు బంధహేతువులని తెలిసి కూడా పూర్వజన్మ సంస్కార ప్రాబల్యం వల్ల ఇష్టం లేకపోయినా బలవంతంగా కర్మలు చేస్తున్నాడు. పట్టుపురుగు తన నోటిలో నుండి వచ్చిన దారాలతోనే తనచుట్టూ ఒక గూడు అల్లుకొని దానిలోనుండి బయటపడే మార్గంలేక నశించినట్లే జీవుడు స్వయంగా తనచుట్టూ ఏర్పరచుకొన్న కర్మబంధాలలో చిక్కి స్రుక్కి సురిగి పోతున్నాడు. వర్తమాన కాలంలో మనముందు నడుస్తున్న వసంతం మొదలైన ఋతువుల స్వరూప స్వభావాలను బట్టి జరిగిపోయిన, జరుగనున్న వసంతాదులలోని పుష్పాలను, ఫలాలను, శీతోష్ణ స్థితులను ఊహిస్తాము. అదే విధంగా జీవుని వర్తమాన జీవితంలోని నడవడిని బట్టి అతడు పూర్వ జన్మంలో ఎట్లా ఉండేవాడో రాబోయే జన్మలో ఎలా ఉంటాడో నిర్ణయింపవచ్చు. ఏ జీవి అయినా ఒక్క క్షణకాలం కూడా కర్మ చేయకుండా ఉండలేడు. పూర్వజన్మ సంస్కారానికి అనుగుణంగానే పురుషుని గుణాలు ఉంటాయి. ఆ గుణాలు అతణ్ణి లొంగతీసుకొని అతని చేత బలవంతంగా కర్మలు చేయిస్తూ ఉంటాయి. అవ్యక్తమైన ఆ పూర్వజన్మ సంస్కారం నుండి జీవుని స్థూల సూక్ష్మ శరీరాలు ఏర్పడుతుంటాయి. అవి అప్పటి తల్లిదండ్రుల పోలికలను సంతరించుకుంటాయి. పురుషునికి విచిత్రమైన ఈ విపర్యయం ప్రకృతి సంబంధం వల్ల కలుగుతుంది. సంసార కారణమైన ఈ ప్రకృతిని తొలగించుకోవాలంటే పురాణ పురుషుడైన పరమేశ్వరుని సంసేవనం తప్ప మరోమార్గం లేదు.

6-89-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కావున నితఁడు సత్కర్మ వర్తనమున-
భూదేవకులమునఁ బుట్టినాడు;
దాంతుఁడై శాంతుఁడై ర్మసంశీలుఁడై-
కల వేదంబులఁ దివినాఁడు;
నయంబు గురువుల తిథులఁ బెద్దలఁ-
జేరి శుశ్రూషలఁ జేసినాఁడు;
ర్వభూతములకు మబుద్ధియై చాల-
హు మంత్ర సిద్ధులఁ డసినాఁడు;

6-89.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్యభాషణ నియమంబుఁ రపినాఁడు;
నిత్యనైమిత్తికాదుల నెఱపినాఁడు;
దండి లోభాది గుణములఁ రపినాఁడు;
మంచిగుణములు దనయందు రపినాఁడు.

టీకా:

కావునన్ = అందుచేత; ఇపుడు = ఇప్పుడు; సత్కర్మ = మంచిపనులుచేసెడి; వర్తనమున = నడవడికవలన; భూదేవ = బ్రాహ్మణ; కులమునన్ = కులములో; పుట్టినాడు = జన్మంచాడు; దాంతుడు = తపఃక్లేశము నోర్చుకొను వాడు; ఐ = అయ్యి; శాంతుడు = శాంతమైన స్వభావి; ఐ = అయ్యి; దర్మ = ధర్మబద్ధమైన; సంశీలుండు = చక్కటి శీలము గలవాడు; ఐ = అయ్యి; సకల = సమస్తమైన; వేదంబులన్ = వేదములను; చదివినాడు = చదువుకొన్నాడు; అనయంబున్ = ఎల్లప్పుడును; గురువులన్ = గురువులను; అతిథులన్ = అతిథులను; పెద్దలన్ = పెద్దవారిని; చేరి = వద్దకు చేరి; శుశ్రూషలన్ = సేవలను; చేసినాడు = చేసెను; సర్వ = సమస్తమైన; భూతముల = జీవులను; కున్ = ఎడల; సమబుద్ధి = సమబుద్ధి గలవాడు; ఐ = అయ్యి; చాలన్ = మిక్కిలి; బహు = అధికమైన; మంత్ర = మంత్రములను; సిద్ధులన్ = సిద్ధులను; పడసినాడు = పొందినాడు.
సత్య = సత్యమునే; భాషణ = మాట్లాడెడి; నియమంబున్ = నియమమును; జరపినాడు = నడిపించెను; నిత్య = నిత్యమూ చేయు కర్మలు; నైమిత్తిక = ప్రయోజనమునకు ఉద్దేశించిన కర్మలు; ఆదులన్ = మొదలైనవి; నెఱపినాడు = చేసెను; దండిన్ = మిక్కిలిగా; లోభ = లోభము; ఆది = మొదలైన; గుణములన్ = గుణములను; తరపినాడు = తొలగించుకొనెను; మంచి = మంచి; గుణములు = గుణములు; తన = తన; అందున్ = లో; మరపినాడు = అలవాటు చేసెను.

భావము:

ఈ అజామిళుడు పూర్వజన్మంలో చేసిన సత్కర్మల వలన బ్రాహ్మణ కులంలో జన్మించాడు. ఇంద్రియాలను జయించి, శాంతచిత్తుడై ధర్మమార్గాన నడిచి, వేదాలన్నింటినీ పఠించాడు. సర్వదా గురువులను, అతిథులను, పెద్దలను ఆశ్రయించి సేవలు చేశాడు. సర్వజీవుల యందు సమబుద్ధి కలవాడై ఎన్నెన్నో మంత్రసిద్ధులను పొందినాడు. సత్యసంధుడై నియమంగా నిత్యకృత్యాలను నైమిత్తిక కర్మలను నెరవేర్చాడు. లోభం మొదలైన దుర్గుణాలను విడిచి సద్గుణాలనే తనయందు నిల్పుకున్నాడు.

6-90-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తాచార సమంచిత
తియై సుజ్ఞానమునకు రగెడు తఱి నా
గతి నాతని కంగజ
మై నవయౌవనాగమం బెడ జొచ్చెన్.

టీకా:

సతత = ఎల్లప్పుడును; సదాచార = మంచి యాచారములతో; సమంచిత = కూడిన; మతి = బుద్ధిగలవాడు; ఐ = అయ్యి; సుజ్ఞానమున = మంచి జ్ఞానమున; కున్ = కు; మరగెడు = అలవాటుపడెడు; తఱిన్ = సమయములో; ఆయత = విస్తారమైన; గతిన్ = వేగముతో; ఆతను = అతని; కిన్ = కి; అంగజ = మన్మథుని; మతము = విధానము; ఐ = అయ్యి; నవయౌవన = నవయౌవనము; ఆగమంబు = ప్రవేశము; ఎడజొచ్చెన్ = తోసుకొచ్చినది.

భావము:

ఎల్లప్పుడు సదాచారాన్ని పాటించే బుద్ధి కలవాడై ఉత్తమమైన జ్ఞానమార్గాన్ని అవలంబించే సమయంలో మదనోన్మాదాన్ని కలిగించే నవయౌవనం అతని హృదయంలో జొరబడింది.

6-91-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డకంట యౌవనర్వంబు పొడగట్టె-
దిలోన నుద్రేక దము దొట్టెఁ;
డుమేనఁ గామ వికారంబు దలచూపె-
ముఖమునఁ జిరునవ్వు మొలక లెత్తె;
తి పుష్ఠి నిష్ఠురం య్యె; దేహం బెల్లఁ-
చ భారమున నెఱిప్పు మెఱసెఁ;
టిభారమున నూరు కాండముల్ జిగి మీఱె-
బాహుశాఖలు దీర్ఘ భంగిఁ దోఁచె;

6-91.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నురము విపుల మయ్యె; నుల్లస ద్వర కాంతి
పూర మంగళమునఁ బొందు పడియె;
భూరితేజుఁ డయిన భూసురాన్వయునకు
భినవైక యౌవనాగమమున.

టీకా:

కడకంటన్ = కంటి చివర్ల నుండి; యౌవన = యౌవనము యొక్క; గర్వంబున్ = గర్వము; పొడగట్టెన్ = కనపడ జొచ్చినది; మది = మనసు; లోనను = లోపల; ఉద్రేక = ఉద్రేకము; మదము = గర్వము; తొట్టెన్ = వ్యాపించెను; కడున్ = మిక్కిలిగా; మేనన్ = శరీరములో; కామవికారంబున్ = కామవికారములు; తలచూపెన్ = కలగజొచ్చెను; ముఖమునన్ = మోము నందు; చిరునవ్వు = చిరునవ్వు; మొలకెత్తెన్ = మొలచినది; అతి = మిక్కిలి; పుష్ఠి = బలము; నిష్ఠురంబు = అధికము; అయ్యెన్ = అయ్యెను; దేహంబున్ = శరీరము; ఎల్లన్ = అంతటను; కచ = వెంట్రుకల; భారమున = విస్తారమువలన; నెఱికప్పు = జుట్టుముడి; మెఱసెన్ = ప్రకాశించెను; కటి = మొలప్రదేశపు; భారమునన్ = భారమువలన; ఊరు = తొడలు యనెడి; కాండముల్ = స్తంభములు; జిగిమీఱెన్ = మెఱయ జొచ్చెను; బాహు = బాహువులు యనెడి; శాఖలు = కొమ్మలు; దీర్ఘ = పెద్దవైన; భంగిన్ = వలె; దోచెను = కనిపించుచున్నవి; ఉరము = రొమ్ము;
విపులము = విశాలము; అయ్యెను = అయినది; ఉల్లసత్ = ఉల్లాసముతో; వర = శ్రేష్ఠమైన; కాంతి = ప్రకాశముతో; పూర = నిండిన; మంగళమునన్ = శుభములను; పొందుపడియెన్ = కలిగెను; భూరి = అత్యధికమైన; తేజుడు = తేజస్సు గలవాడు; అయిన = అయినట్టి; భూసుర = బ్రాహ్మణ; ఆన్వయున్ = వంశపువాని; కున్ = కి; అభినవైక = సరికొత్త; యౌవన = యౌవనము; ఆగమమునన్ = రాక వలన.

భావము:

అజామిళుడు కడకన్నులలో యౌవన గర్వం కనిపించింది. మనస్సులో ఉద్రేకం ఉప్పొంగింది. శరీరమంతటా కామవికారం తలచూపింది. ముఖంపై చిరునవ్వు మొలకెత్తింది. దేహమంతా బాగా బలిసి గట్టిపడింది. వెండ్రుకలు నల్లగా నిగనిగ మెరిసాయి. నడుము పెద్దదయింది. తొడలు సన్నబడ్డాయి. బాహువులు పొడవైనాయి. రొమ్ము విశాలమయింది. అవయవాలన్నీ నవనవ కాంతులతో మెరుస్తూ కుదురుకున్నాయి. ఈ విధంగా ఆ బ్రాహ్మణుడు యౌవనంలో అడుగుపెట్టి మిక్కిలి తేజోవంతు డైనాడు.

6-92-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హృయమునఁ బొడము యౌవన
ము వెలిం దోచు భంగి మానిత రుచిఁ ద
ద్వనమున నూగుమీసలు
పొలుచుఁ గప్పడరి చూడఁ బొంకం బయ్యెన్.

టీకా:

హృదయమునన్ = మనసులో; పొడమెన్ = పుట్టెను; యౌవన = యౌవనమువలన; మదము = గర్వము; వెలిన్ = బయటకు; తోచు = కనబడు; భంగిన్ = విధముగ; మానిత = మన్నింపదగిన; రుచిన్ = విధముగ; తత్ = అతని; వదనమునన్ = మోము నందు; నూగుమీసలు = నూనూగు మీసములు; పొదలుచున్ = పెరుగుచు; కప్పు = నల్లదనము; అడరి = వ్యాపించి; చూడన్ = చూచుటకు; పొంకంబు = పొందిక గలవి; అయ్యెన్ = అయ్యెను.

భావము:

హృదయంలో మొలకెత్తిన యౌవనమదం బయటికి ఉబికి వచ్చిన విధంగా అందమైన అతని ముఖంపై నూనూగు మీసాలు మొలకెత్తి చూడ ముచ్చటగా కనిపించాయి.

6-93-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియును.

టీకా:

మఱియును = ఇంకా.

భావము:

ఇంకా...

6-94-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మ్మివిరి మీఁద వ్రాలిన
తుమ్మెద పంక్తియును బోలెఁ దోరపు లీలం
గ్రమ్ముకొని విప్రతనయుని
నెమ్మొగమునఁ గానబడియె నెఱిమీసంబుల్.

టీకా:

తమ్మి = పద్మము; విరి = పూవుల; మీద = పైన; వ్రాలిన = వాలినట్టి; తుమ్మెద = తుమ్మెదల; పంక్తియును = వరుసల; పోలెన్ = వలె; తోరపు = వత్తైన; లీలన్ = విధముగ; క్రమ్ముకొని = గుమిగూడి; విప్ర = బ్రాహ్మణ; తనయుని = పుత్రుని; నెఱి = నిండైన; మొగమునన్ = మోమునందు; నెఱి = అందమైన; మీసంబుల్ = మీసములు.

భావము:

తామరపుష్పం మీద వ్రాలిన తుమ్మెదల బారులాగా ఆ బ్రాహ్మణ కుమారుని నెమ్మోముపై అందమైన మీసాలు క్రమ్ముకొని వచ్చాయి.

6-95-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత ననంగబ్రహ్మ తంత్రమునకు వసంతు డొనర్చు నంకురార్ప ణారంభంబునుం బోలె లలిత కిసలయ విసర ప్రసార భాసుర బహు పాదపాది పురోపవన పవన జనన ప్రభావ పరికంపిత విటవిటీ జన హృదయ ప్రఫుల్ల పల్లవ భల్లంబును, ననూన ప్రసూన నిర్భర గర్భావిర్భూత సురభి పరాగపటల పటఘటిత నభోమంలంబును, నమంద నిష్యంద మరంద బిందు సందోహ కందళిత చిత్త మత్త మధుప సంకుల ఝంకార ముఖరిత సకల దిశావలయంబును, నిరంతర ధారాళ రసభరిత పరిపక్వ ఫలానుభవ ప్రభావ సమ్మోదవాద శుక ప్రముఖ పతంగ కోలాహలంబునునై, మధుమాసంబు సర్వ జన మనోహరంబునునై, నిఖిల వనపాదపంబుల నలంకరించె; నయ్యవసరంబున నజామిళుండు పితృనిర్దేశంబునం గుశ సమిత్పుష్ప ఫలార్థంబు వనంబున కరిగి, తిరిగి వచ్చు సమయంబున, నొక్క లతాభవనంబున.

టీకా:

అంతన్ = అంతటను; అనంగబ్రహ్మ = మన్మథుని {అనంగ బ్రహ్మ - అనంగ (దేహములేని) బ్రహ్మ (దేవుడు), మన్మథుడు}; తంత్రమున్ = తంతున, యజ్ఞమున; కున్ = కు; వసంతుడు = వసంతుడు; ఒనర్చు = చేసెడి; అంకురార్పణ = ప్రారంభించెడి {అంకురార్పణ - నవధాన్యములను మొలకెత్తించి సమర్పించుట ద్వారా చేసెడి వేదోక్త ప్రారంభ కర్మ, ప్రారంభము}; ఆరంభంబునున్ = ప్రయత్నము; పోలెన్ = వలె; లలిత = మనోజ్ఞమైన; కిసలయ = చిగురుటాకుల; విసర = గుత్తులు; ప్రసార = ప్రసరించెడి; భాసుర = ప్రకాశవంతమైన; బహు = అనేక; పాదప = చెట్లు; ఆది = మొదలగునవి; పురః = నగరము యొక్క; ఉపవన = ఉద్యానవనముల యొక్క; పవన = గాలి; జనన = కలిగిన; ప్రభావ = ప్రభావమువలన; పరికంపిత = మిక్కిలి చలిస్తున్న; విట = కాముకులు; విటీ = కాముకురాళ్ళు అయిన; జన = వారి; హృదయ = మనసులు యనెడి; ప్రపుల్ల = చిగురించిన; పల్లవ = చిగురుటాకు లనెడి; భల్లంబును = బాణములు గలదియును; అనూన = వెలితిలేని; ప్రసూన = పూల; నిర్భర = నిండు; గర్భ = గర్భములనుండి; ఆవిర్భూత = వెలువడిన; సురభి = మనోజ్ఞమైన; పరాగ = పుప్పొడి; పటల = రేణువుల సమూహ మనెడి; పట = తెరచే; ఘటిత = కప్పబడిన; నభోమండలంబునున్ = ఆకాశమును; అమంద = మిక్కిలి; నిష్యంద = చిందుతున్న; మరంద = మకరందపు; బిందు = చుక్కల; సందోహ = జడిచే; కందళిత = తడసిన; చిత్త = మనసులు; మత్త = మత్తెక్కిన; మధుప = తుమ్మెదలచే; సంకుల = వ్యాపింప చేయబడిన; ఝంకార = ఝంమను శబ్దముచే; ముఖరిత = మారుమోగుచున్న; సకల = సమస్తమైన; దిశావలయంబును = దిక్ఛక్రమును; నిరంతర = దట్టమైన; ధారాళ = ఎడతెగని; రస = పలరసముచే; భరిత = నిండిన; పరిపక్వ = బాగుగా పండిన; ఫల = పండ్లను; అనుభవ = ఆరగించిన; ప్రభావ = ప్రభావమువలన; సమ్మోదిత = మిక్కిలి సంతోషము నిండిన; వాద = శబ్దములు పలుకుచున్న; శుక = చిలుక; ప్రముఖ = మొదలైన; పతంగ = పక్షుల; కోలాహలంబును = కలకలారావము గలదియును; ఐ = అయ్యి; మధుమాసంబు = చైత్రమాసము; సర్వ = సమస్తమైన; జన = వారి; మనోహరంబును = మనసులను రంజిల్ల జేసెడిది; ఐ = అయ్యి; నిఖిల = సమస్తమైన; వన = ఉద్యానవనముల యొక్క; పాదపంబులన్ = చెట్లను; అలంకరించెన్ = అలంకరించెను; ఆ = ఆ; అవసరంబున = సమయము నందు; అజామిళుండు = అజామిళుడు; పితృ = తండ్రి; నిర్దేశంబునన్ = ఆజ్ఞ ప్రకారము; కుశ = దర్భలు; సమిత్ = వంటచెరకు; పుష్ప = పూలు; ఫల = పండ్లు; అర్థంబున్ = కొరకై; వనంబున్ = అడవి; కున్ = కు; అరిగి = వెళ్ళి; తిరిగి = వెనుకకు; వచ్చు = వచ్చెడి; సమయంబునన్ = సమయము నందు; ఒక్క = ఒక; లతాభవనంబునన్ = పొదరిల్లు నందు.

భావము:

అంతలో వసంత ఋతువు వచ్చింది. మన్మథుడనే బ్రహ్మదేవుడు ప్రారంభించిన యజ్ఞానికి వసంతుడనే పురోహితుడు అంకురారోపణం చేసినట్లు ఉద్యావవనాలలోని చెట్లకొమ్మలు క్రొత్త చిగుళ్ళు తొడిగాయి. వాయువేగానికి ఆ చిగురాకులు కంపిస్తున్న జారజారిణీ జన హృదయాలలో గ్రుచ్చుకొనే బాకుల వలె ఉన్నాయి. చక్కగా వికసించిన పువ్వులలోనుండి చెలరేగిన పుప్పొడి దుమారాలు ఆకాశంలో వ్రేలాడగట్టిన చాందినీలవలె ప్రకాశిస్తున్నాయి. పూలలో చిందుతున్న మకరంద బిందువుల విందులతో మైమరచిన తుమ్మెదల ఝంకార నాదాలతో దిక్కులన్నీ పిక్కటిల్లుతున్నాయి. బాగా పండి పగిలిన ఫలాలను ఆరగిస్తూ ఆనందంతో చిలుకలు మొదలైన పక్షులు కలకల ధ్వనులు చేస్తున్నాయి. ఈ విధంగా అందరికీ ఆనంద దాయకమైన మధుమాసం చెట్లన్నింటికీ క్రొత్త సొగసులను చేకూర్చింది. ఆ సమయంలో అజామిళుడు తన తండ్రి ఆజ్ఞానుసారం దర్భలు, సమిధలు, పుష్పాలు, పండ్లు తీసుకొని రావటం కోసం తోటలోనికి వెళ్ళి తిరిగి వస్తూ ఒక దట్టమైన పొదరింట్లో...

6-96-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ద్ధానురాగయై స్మర
యుద్ధంబున కలరు బుద్ధి నురు కామకళా
సిద్ధి యగు వృషలితోఁ బ్రియ
వృద్ధిం దగఁ గూడియున్న విటు నొరుఁ గాంచెన్.

టీకా:

బద్ధ = కట్టి వేసెడి; అనురాగ = అనురాగము గలది; ఐ = అయ్యి; స్మర = మన్మథ; యుద్ధంబున్ = క్రీడ; కున్ = కి; అలరు = అలరారే; బుద్ధిన్ = మనసుతో; ఉరు = అధికముగ; కామకళ = కామకళ యందు; సిద్ధి = నేర్పు కలిగినవాడు; అగు = అయిన; వృషలి = వృషలి {వ్యు. వృష (వర్షణే) + కలచ్ (జీష్), కృ.ప్ర., శూద్రజాతిస్త్రీ, కన్యక, రజస్వల అయి తండ్రి ఇంట ఉన్న పడచు}; తోన్ = తోటి; ప్రియ = ప్రేమ; వృద్ధిన్ = పెరిగిపోగా; తగన్ = తగినట్లు; కూడియున్న = కలసి యున్న; విటుని = విటుడిని; ఒరు = ఒకనిని; కాంచెన్ = చూసెను.

భావము:

పొంగి పొరలే కామోద్రేకంతో, అతిశయిస్తున్న ఆసక్తితో రతిక్రీడలో చతురురాలైన తన ప్రియురాలైన స్వైరిణి వృషలితో ఆనందిస్తున్న ఒక కాముకుణ్ణి చూశాడు.

6-97-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

టునిన్ రతిశాస్త్ర కళా
ర్భటునిన్ వర యౌవనానువ మదవిభవో
ద్భటునిన్ సురతేచ్ఛా సం
టునిన్ విగతాంబరోరుటునిన్ విటునిన్.

టీకా:

భటునిన్ = పనివాడిని; రతిశాస్త్ర = కామశాస్త్రము యనెడి; కళ = కళ యందు; భటునిన్ = పనిమంచుడిని, నేర్పరిని; వర = ఉత్తమమైన; యౌవనానుభవ = సురత; అనుభవ = అనుభవముచే; మద = గర్వము యొక్క; విభవ = వైభవముచే; ఉద్భటునిన్ = పొంగిపొర్లుచున్నవానిని; సురత = స్త్రీసంగమమందు; ఇచ్ఛా = యధేచ్ఛగా; సంఘటునిన్ = కలియుచున్నవానిని; విగత = విడిచిన; అంబర = బట్టగల; ఊరు = తొడలు; కటునిన్ = కటిప్రదేశము గలవానిని; విటునిన్ = విటుడిని.

భావము:

కార్యనిమగ్నుడు, రతిశాస్త్ర కళలలో ఆరితేరినవాడు, నవ యౌవనంతో కామోన్మత్తుడు, సంభోగ కాంక్షతో తహతహ లాడుతున్నవాడు, దిగంబరంగా ఉన్న కటిప్రదేశం కలవాడు అయిన విటుణ్ణి (చూశాడు).

6-98-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హాలా ఘూర్ణిత నేత్రతో మదన తంత్రారంభ సంరంభతో
ఖేలాపాలన యోగ్య భ్రూవిభవతోఁ గీర్ణాలకాజాలతో
హేలాలింగన భంగి వేషవతితోఁ నిచ్ఛావతీమూర్తితోఁ
గేళిం దేలుచునున్నవానిఁ గనెఁ బుంఖీభూత రోమాంచుఁడై.

టీకా:

హాల = కల్లు, సారాయి వలన; ఘూర్ణిత = తిరుగుచున్న; నేత్ర = కన్నులు; తో = తోటి; మదన = కామ; తంత్ర = తంతు; ఆరంభ = ఆరంభించెడి; సంరంభ = ఆతృత; తో = తోటి; ఖేలా = క్రీడ; పాలన = నడుపుటకు; యోగ్య = తగిన; భ్రూ = కనుబొమల; విభవ = వైభవము; తోన్ = తోటి; కీర్ణ = చెదరిన; అలక = ముంగురుల; జాల = సమూహము; తో = తోటి; హేల = విలాసముగా; ఆలింగన = కౌగలింతల; భంగి = భంగిమలను; వేషవతి = ధరించినయామె; తో = తోటి; ఇచ్ఛావతీ = కాముకత్వము; మూర్తి = రూపు దాల్చిన యామె; తో = తోటి; కేళిన్ = (కామ) క్రీడయందు; తేలుచున్న = మునిగి తేలుచున్న; వానిన్ = ఆమెను; కనెన్ = చూసెను; పుంఖీభూత = నిక్కబొడిచిన; రోమ = రోమముల; అంచుడు = వరుసలు గలవాడు; ఐ = అయ్యి.

భావము:

కల్లు త్రాగిన మైకంలో కళ్ళు తిరుగుతున్నది, కామ తంత్రాన్ని ఆరంభించాలనే తొందర గలది, రతిక్రీడకు రెచ్చగొట్టే భ్రూవిన్యాసం కలది, చెదరిన ముంగురులు కలది, కౌగిలింతల కోసం వేగిర పడే వివిధ భంగిమలను ప్రదర్శిస్తున్నది, కాముకత్వం మూర్తీభవించినది అయిన ప్రియురాలితో శృంగారకేళిలో తేలియాడుచున్నవాణ్ణి అజామిళుడు చూశాడు. అతని పులకించిన రోమాలు నిక్కబొడుచుకున్నాయి.

6-99-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లికి వరు మదన కదనపుఁ
లుకుల కలకలము బెడఁగు డు మేఖల ము
వ్వ రవళిఁ దగిలి గతిగొనఁ
కంఠి రతంబు సలుపు మకముఁ గనియెన్.

టీకా:

కలికి = (ఆ) స్త్రీ యొక్క; వరు = ప్రియుని; మదనకదనపు = రతిక్రీడ యొక్క; పలుకుల = మాటల; కలకలము = కలకలారావము; బెడగుపడు = మనోజ్ఞ మగు; మేఖల = మొలనూలు యందలి; మువ్వల = మువ్వల; రవళిన్ = చిరుశబ్దములకు; తగిలి = తగుల్కొని; గతిగొనన్ = తాళము వేయగా; కలకంఠి = స్త్రీ; రతంబున్ = కామకేళి; సలుపు = చేసెడి; గమకము = యత్నములను; కనియెన్ = చూసెను.

భావము:

రతి పారవశ్యంలో ఆ విటుని కంఠంనుండి వెలువడుతున్న అవ్యక్త మధుర ధ్వనులకు అనుగుణంగా ఆమె నడుమున కదులుతున్న ఒడ్డాణపు మువ్వల సవ్వడి లయ తప్పకుండా తాళం వేస్తున్నది. ఈ విధంగా తన ప్రియునితో రతిక్రీడలో ఆసక్తురాలై ఉన్న ఆ అందగత్తె తమకాన్ని, గమకాన్ని అజామిళుడు చూశాడు.

6-100-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కవనై పదనూపుర
రవ లాగుబ్బుకొన్న తిపతి గతులం
జిచివనై విటు చెవులకు
ళిన్ రతిసల్పు రతుల వరవ గనియెన్.

టీకా:

కవకవను = కవకవ మని ధ్వనించునవి; ఐ = అయ్యి; పదనూపుర = కాలిగజ్జలు; రవరవలు = ధ్వనులు; ఆగుబ్బుకొన్న = అతిశయించుతున్న; రతిపతి = మన్మథ; గతులన్ = క్రీడలో; చివచివన్ = చివచివలాడెడిది; ఐ = అయ్యి; విటు = విటుని; చెవులు = చెవుల; కున్ = కు; రవళిన్ = చిరుశబ్దముతో; రతిన్ = సంగమించుటను; సల్పు = సలిపెడి; రతుల = అనురాగపు; రవరవన్ = స్పర్ధను; కనియెన్ = కాంచెను.

భావము:

ఆమె కాలి అందెలు ఘల్లు ఘల్లుమని ఒకదానితో ఒకటి పోటీపడి ధ్వనిస్తున్నాయి. ఆ అందెల చప్పుళ్ళు విటునికి వీనుల విందుగా వినిపిస్తున్నవి. ఇలా ఒకరిపైకి ఒకరు ఎగబడి సాగిస్తున్న సంభోగ చమత్కారాలను అజామిళుడు చూశాడు.
“కవకవ”, “రవరవ”.... ధ్వన్యనుకరణ పదాలుపైన; “క”, “వ”, “ర” అక్షరాల వృత్యనుప్రాసతో అలంకరించి; శృంగారరసం చిక్కగా అల్లిన సహజ కవి పోతన్న గారికి పాదాభివందనాలు...

6-101-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కురు లళికంబుపై నెగయఁ గ్రొమ్ముడి వీడఁగ గుబ్బదోయిపై
ములు చౌకళింపఁ గటిసంగతి మేఖల తాళగింప స
త్క వర కంకణావళులు ర్జిలఁ గౌ నసియాడ మీఁదుగా
రుని వినోదముల్ సలిపె మానిని యౌవ్వన గర్వరేఖతోన్.

టీకా:

కురులు = వెంట్రుకలు; అళికంబు = నుదుటి; పైన్ = మీద; ఎగయన్ = ఎగిరి పడుతుండగ; క్రొమ్ముడి = జుట్టుముడి; వీడగన్ = విడిపోగా; గుబ్బదోయి = స్తన ద్వయము; పైన్ = మీద; సరములు = హారములు; చౌకళింపన్ = గంతులు వేయుచుండగ; కటి = కటిప్రదేశమును; సంగతి = కూడిన; మేఖల = మొలనూలు; తాళగింప = తాళము వేయుచుండగ; సత్ = మంచి; కర = చేతి; వర = శ్రేష్ఠమైన; కంకణ = గాజుల; ఆవళులు = సమూహములు; గర్జిలన్ = గలగల లాడుచుండగ; కౌను = నడుము; అసియాడ = ఊగిసలాడుచుండగ; మీదుగాన్ = పైనుండి; మరునివినోదముల్ = సురతక్రియలు; సలిపెన్ = జరిపెను; మానిని = స్త్రీ; యౌవన = యౌవనము యొక్క; గర్వరేఖ = గర్వపు గుర్తుల; తోన్ = తోటి.

భావము:

కురులు నుదుటిపై ఎగురుతుండాగా, కొప్పుముడి వీడగా, వక్షోజాలపై ముత్యాల సరాలు నాట్యమాడగా, మొలనూలు చిరుగంటలు తాళం వేయగా, అందాల కరకంకణాలు ధ్వనింపగా, నడుము తూగాడగా యౌవన గర్వంతో ప్రియుని పైకొని ఆ మగువ మన్మథకేళి సల్పింది.

6-102-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వ్వపు సుకుమారాంగిని
వ్వని నుపగూహనాది ముచిత రతులన్
నివ్వటిలుదానిఁ గని మది
నువ్విళ్లూరంగ మన్మథోద్దీపనుఁడై.

టీకా:

మవ్వపు = కోమలపు; సుకుమార = సుకుమారమైన {సుకుమారాంగని - సుకుమారమైన దేహముగలామె, స్త్రీ}; అంగిని = దేహము గలామె; జవ్వనిన్ = స్త్రీని; ఉపగూహన = కౌగలింత; ఆది = మొదలగు; సముచిత = తగినట్టి; రతులన్ = రతిక్రీడ లందు; నివ్వటిలు = అతిశయించుతున్న; దానిన్ = ఆమెను; కని = చూసి; మదిన్ = మనసు; ఉవ్విళ్ళూరంగ = ఉవ్విళ్లూరుతుండగ; మన్మథ = కామము; ఉద్దీపనుడు = ఉద్రేకించినవాడు; ఐ = అయ్యి.

భావము:

మిసమిసలాడే మృదువైన శరీరం గలది, నవయౌవనవతి, కౌగిలింతలు మొదలైన శృంగార క్రీడలలో ఆరితేరినది అయిన ఆ వెలయాలిని చూచి అజామిళుడు కామోద్రేకంతో ఉవ్విళ్ళూరాడు.

6-103-త.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హుళ దృక్పరిపాక మోహ నిద్ధుఁ డౌచు మనంబులో
జ కర్మము వేదశాస్త్రము సాత్త్వికంబుఁ దలంచి త
న్నిహిత చిత్తము పట్టి పట్టఁగ నేరఁ డయ్యె సదా మనో
నమందు మరుండు పావకు కైవడిం జరియింపగాన్.

టీకా:

బహుళ = అనేకమైన విధముల; దృక్ = చూపు లనెడి; పరిపాక = పండిన; మోహ = మోహముచే; నిబద్ధుడు = బంధింపబడిన వాడు; ఔచున్ = అగుచు; మనంబు = మనసు; లోన్ = లో; సహజకర్మము = స్వధర్మము; వేదశాస్త్రము = వేదశాస్త్రము; సాత్త్వికంబున్ = సాత్విక స్వభావములు; తలచి = తలచుకొని; తత్ = ఆమె యందు; నిహిత = లగ్నమైన; చిత్తమున్ = మనసును; పట్టిపట్టగనేరడయ్యెన్ = పట్టి ఉంచుకొనలేకపోయెను; సదా = అస్తమాను; మనస్ = మనసు యనెడి; గహనము = అడవి; అందున్ = అందు; మరుండు = మన్మథుడు; పావకున్ = అగ్ని; కైవడిన్ = వలె; చరియింపగన్ = తిరుగుచుండగ.

భావము:

మాటిమాటికి ఏపు మీరిన ఆమె చూపులనే మోహపాశాలలో చిక్కుకొన్న ఆ బ్రాహ్మణ కుమారుడు నిత్యకృత్యాలైన వైదిక కర్మలను, శాస్త్ర పాఠాలను, జపతపాలను మరిచిపోయాడు. అతని మనస్సనే అరణ్యంలో కామేద్రేకమనే కార్చిచ్చు చెలరేగ సాగింది. నియమబద్ధమైన అతని చిత్తం పట్టు తప్పిపోయింది.

6-104-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లీలావతి గండపాళికలపై హాసప్రసాదంబు పై
నాలోలాలక పంక్తి పై నళికపై నాకర్ణ దృగ్భూతి పై
హేలాపాది కుచద్వ యోరు కటిపై నిచ్చల్ పిసాళింపఁగా
జాలిం బొందుచు నాత్మఁ గుందుచు మనోజాతానలోపేతుఁడై.

టీకా:

ఆ = ఆ; లీలావతి = విలాసవతి యొక్క; గండపాళికల = నిండు చెక్కిళ్ళ; పైన్ = మీద; హాసప్రసాదంబు = చిరునవ్వు చిలకరింపు; పైన్ = మీద; ఆలోల = ఊగుతున్న; అలక = ముంగురులు; పంక్తి = వరుసల; పైన్ = మీద; అళిక = నుదురు; పైన్ = మీద; ఆకర్ణ = చెవులవరకు సాగిన; దృక్ = కన్నుల; భూతి = వైభవము; పై = మీద; హేల = విలాసములు; ఆపాది =కలిగించు; కుచ = స్తనముల; ద్వయ = జంట; ఊరు = తొడలు; కటి = కటిప్రదేశముల; పై = మీద; ఇచ్చల్ = కోరికలు; పిసాళింపగా = చెలరేగుతుండగా; జాలిన్ = జాలిని; పొందుచు = చెందుతూ; ఆత్మన్ = మనసున; కుందుచున్ = కుంగిపోతూ; మనస్ = మనసున; జాత = పుట్టిన; అనల = అగ్ని; ఉపేతుడు = కలవాడు; ఐ = అయ్యి.

భావము:

అప్పటినుండి అజామిళుడు ఆమె చిక్కని చెక్కిళ్ళను, చక్కని చిరునవ్వును, కదులుతున్న ముంగురులను, నున్నని నుదురును, చెవులదాకా వ్యాపించిన వాల్గన్నులను, బిగువైన కుచాలను, విశాలమైన కటి ప్రదేశాన్ని మాటిమాటికి స్మరింపసాగాడు. అతని మనస్సులో ఆమెను పొందాలనే కోరిక చెలరేగింది. దిగులుతో క్రుంగిపోయాడు. విచారించాడు. కామావేశానికి లోనయ్యాడు.

6-105-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఱి కులాచార వర్తన మాటు చేసి
రఁగు పిత్రర్థములు దాని పాలు చేసి
సాధు లక్షణ గుణవృత్తిఁ జాలు చేసి
లోలలోచన పసఁ జెంది లోలుఁ డయ్యె.

టీకా:

మఱి = ఇంకను; కుల = వంశ; ఆచార = ఆచారములప్రకారము; వర్తన = నడచుట; మాటుచేసి = వెనకపెట్టి; పరగు = ప్రసిద్ధములైన; పితృ = తండ్రి యొక్క; అర్థములు = సంపదలు; దాని = ఆమె; పాలుచేసి = పరము జేసి; సాధు = సాధుత్వ; లక్షణ = లక్షణముల; గుణ = సుగుణమల; వృత్తి = వర్తనను; చాలుచేసి = చాలించి; లోల = చంచలమైన; లోచన = కన్నుల గలామె; పసజెంది = రుచిమరగి; లోలుడు = చలించిపోయినవాడు; అయ్యె = అయ్యెను.

భావము:

అజామిళుడు కులాచార మర్యాదలను కూలద్రోశాడు. తండ్రి సంపాదించిన ఆస్తి నంతటినీ దాని పాలు చేసాడు. సాధు లక్షణాలైన సద్గుణాలను విడనాడాడు. బాగా రుచి మరిగి ఆ వాలుగన్నుల వెలయాలి అందచందాలకు లొంగిపోయాడు.

6-106-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్యాను సుమాస్త్ర ఖేలన
కామఁ గులస్త్రీలలామఁ మనీయగుణ
స్తో నిజభామ నొల్లక
ధామున నటించెఁ గ్రించుఁ నమున జడుఁడై.

టీకా:

శ్యామను = యౌవనవతిని; సుమాస్త్ర = మరుని {సుమాస్త్ర – పూలబాణముల వాడు, మన్మథుడు}; ఖేలన = క్రీడ యందు; కామన్ = కోరిక కలామెను; కులస్తీలలామన్ = శ్రేష్ఠమైన కులీన స్త్రీని {కులస్త్రీలలామ - కులస్త్రీ (కులీన స్త్రీ) ల యందు, వ్యు. సత్కుల సంజాత, లలామ (శ్రేష్ఠురాలు)}; కమనీయ = చక్కటి; గుణ = గుణములు; స్తోమను = కలిగి నామెను; నిజ = తన యొక్క; భామను = భార్యను; ఒల్లక = అంగీకరింపక; ధామమున = ఇంటిలో; నటించెన్ = కటటముతో ప్రవర్తించెను; క్రించుదనమునన్ = నీచత్వముతో; జడుడు = తెలివితక్కువవాడు; ఐ = అయ్యి;

భావము:

యౌవనవతి, కామక్రీడాసక్తురాలు, చక్కటి కులీనురాలు, మనోహరమైన గుణవంతురాలు అయిన తన భార్యను ఇష్టపడక, నీచుడై తెలివితక్కువతనంతో తనింట్లో తాను కపటముతో మెలగసాగాడు.

6-107-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బంధులఁ దిట్టి సజ్జనులఁ బాధలఁ బెట్టి యనాథకోటిఁ బెం
బందెలు చుట్టి యీరములు ట్టి పథంబులు గొట్టి దిట్టయై
నింల కోర్చి సాధులకు నిందితుఁడై గడియించు విత్త మా
సుంరి కిచ్చి మచ్చికలు సొంపెదఁ గూర్చి వసించెఁ దత్కృపన్.

టీకా:

బంధులన్ = బంధువులను; తిట్టి = దూషించి; సజ్జనులన్ = మంచివారిని; బాధలబెట్టి = బాధించి; అనాథ = దిక్కులేనివారి; కోటిన్ = సమూహములను; పెంపున్ = నాశనము చేసెడి; పందెలు = జూదరులతో; చుట్టి = స్నేహము చేసి; ఈరములు = పొదలలో; పట్టి = దూరి యుండి; పథంబులుగొట్టి = దారిదోపిడీలు చేసి; దిట్ట = ఆరితేరినవాడు; ఐ = అయ్యి; నిందలు = తిట్ల; కున్ = కు; ఓర్చి = ఓర్చుకొనుచు; సాధుల = సాధుజనుల; కున్ = చేత; నిందితుండు = నిందింపబడువాడు; ఐ = అయ్యి; గడియించు = సంపాదించెడి; విత్తము = ధనమును; ఆ = ఆ; సుందరి = స్త్రీ; కిన్ = కి; ఇచ్చి = ఇచ్చివేసి; మచ్చికలు = చనువుల; సొంపు = అందమును; ఎదన్ = మనసున; కూర్చి = కూర్చుకొని; వసించె = జీవించెను; తత్ = ఆమె; కృపన్ = దయతో.

భావము:

బంధువులను తిట్టి, సజ్జనులను బాధించి, దిక్కులేని దీనులను చిక్కులపాలు చేసి, దారులు కొట్టి దోచుకొనడంలో దిట్టయై, నిందలను లెక్క చేయకుండా సంపాదించిన ధనాన్ని ఆ సుందరి కిచ్చి ఆమె చనువును, అందాన్ని మెచ్చిన మనస్సుతో జీవింపసాగాడు.

6-108-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ముచిత శ్రుతిచర్చఁ ర్చింప నొల్లక-
తి కుచద్వయచర్చఁ ర్చ జేయు;
ర్క కర్కశ పాఠ ర్కంబు గాదని-
లికితోఁ బ్రణయ తర్కంబు జేయు;
స్మృతి పదవాక్య సంతి గాక తత్సతి-
దవాక్య సంగతి రఁగ జేయు;
నాటకాలంకార నైపుణం బుడిగి త-
న్నాటకాలంకార పాటిఁ దిరుగుఁ;

6-108.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రఁగఁ జిరకాల మీ రీతిఁ బాపనియతి
మణ దాసీ కుటుంబ భాము వహించి
ది కుటుంబి నిగాఁగఁ బాపాత్ముఁ డగుచు
శుచియును దుష్టవర్తనుఁ డై మెలంగె.

టీకా:

సముచిత = (తనకు) తగిన; శ్రుతి = వేదశాస్త్ర; చర్చన్ = చర్చలను; చర్చింపన్ = చర్చించుటకు; ఒల్లక = ఒప్పుకొనక; సతి = ప్రియురాలి; కుచ = స్తనముల; ద్వయ = జంటను; చర్చన్ = గంధపుపూతను; చర్చజేయు = చర్చించును; తర్క = తర్కశాస్త్రపు; కర్కశ = కఠినమైన; పాఠ = పాఠముల; తర్కంబు = ఆలోచనలను; కాదని = ఒప్పుకొనక; కలికి = స్త్రీ; తోన్ = తోటి; ప్రణయ = ప్రణయ విషయములను; తర్కంబుజేయు = చర్చించును; స్మృతి = ధర్మశాస్త్రము లందలి; వాక్య = సూక్తుల; సంగతిన్ = విషయములను; కాక = కాకుండగ; తత్ = ఆ; సతి = స్త్రీ; వాక్య = మాటల; సంగతిన్ = విషయమై; పరగజేయు = తెలుపుతుండును; నాటక = నాటకములు; అలంకార = అలంకారశాస్త్రములను; నైపుణంబు = నేర్పును; ఉడిగి = వదలివేసి; తత్ = ఆ; నాటకాలంకారపాటిన్ = నాటకాలాడిని గూడి; తిరుగున్ = తిరుగును; పరగ = ప్రసిద్ధముగ; చిరకాలము = అదికమైన కాలము; ఈ = ఈ; రీతిన్ = విధముగ; పాప = పాపపు; నియతిన్ = విధానములతోటి.
రమణ = ప్రీతిగా; దాసీ = దాసీ యొక్క; కుటుంబ = కుటుంబము యొక్క; భారమును = బరువును; వహించి = మోసి; అది = ఆమె; కుటుంబిని = సంతానవతి; కాగన్ = అవ్వగా; పాపాత్ముడు = పాపాత్ముడు; అగుచున్ = అగుచు; అశుచియును = అశుభ్రమైన వాడు; దుష్టవర్తనుడు = చెడు ప్రవర్తన గలవాడు; ఐ = అయ్యి; మెలంగె = వర్తిల్లెను.

భావము:

ఉచితమైన వేదాలను గురించి చర్చించడం ఇష్టపడక ప్రియురాలి పాలిండ్లమీద చందనం పూతల మీద చర్చ సాగిస్తాడు. కఠినమైన తర్కశాస్త్ర పాఠాల ఆలోచనను కాదని ఆ స్త్రీతో ప్రణయతర్కాలు చేస్తాడు. ధర్మశాస్త్రాలలోని పదాలను వాక్యాల సంగతి విడిచి ఆమె పదాలను, వాక్యాలను మెచ్చుకొని ముచ్చటిస్తాడు. నాటకాలలోని అలంకారాలలోని నైపుణ్యాన్ని వదలి ఆమె నాట్యాన్ని, సింగారింపును వర్ణిస్తూ తిరుగసాగాడు. ఈ విధంగా చాలాకాలం అజామిళుడు భ్రష్టాచారుడై ఆ వేశ్య కుటుంబాన్ని పోషిస్తూ ఆమెనే భార్యగా భావిస్తూ పాపచిత్తుడై మలినదేహుడై చెడుమార్గంలో ప్రవర్తింపసాగాడు.

6-109-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

టు గాన పాపకర్మునిఁ
గుటిలుని సుజనార్తు ధూర్తుఁ గ్రూరుని నే మా
మునఁ గొని యేగెద మం
దండమువలన నితఁడు న్యత నొందున్. "

టీకా:

అటుగాన = అందుచేత; పాపకర్మునిన్ = పాపపు పనులు చేయువానిని; కుటిలుని = వంకర బుద్ధి వానిని; సుజన = మంచివారిని; ఆర్తున్ = బాధించువానిని; ధూర్తునిన్ = తిట్టదగినవానిని; క్రూరునిన్ = క్రూరపు బుద్ధి గలవానిని; నేము = మేము; ఆరాటమునన్ = ఆర్భాటముతో; కొని = తీసుకొని; ఏగెదము = పోయెదము; అంతటన్ = దానితో; దండము = శిక్ష; వలన = మూలమున; ధన్యతన్ = పవిత్రతను; ఒందున్ = పొందును.

భావము:

అందువల్ల ఈ పాపాత్ముడు, కుటిల చిత్తుడు, సజ్జన కంటకుడు, ధూర్తుడు అయిన ఈ క్రూరుణ్ణి బలవంతంగా తీసుకొని పోతున్నాము. తరువాత ఇతడు తగిన దండనం పొంది ధన్యుడౌతాడు”

6-110-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు పలుకుచున్న యమదూతల వారించి, నయకోవిదు లైన భగవద్దూత లిట్లనిరి.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; పలుకుచున్న = మాట్లాడుతున్నట్టి; యమదూతలన్ = యమదూతలను; వారించి = ఆపి; నయకోవిదులు = మిక్కిలి జ్ఞానము గలవారు; ఐన = అయిన; భగవత్ = భగవంతుని; దూతలు = దూతలు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

ఈ విధంగా మాట్లాడుతున్న యమదూతలను నివారించి, నీతిశాస్త్ర పండితులైన విష్ణుదూతలు ఇలా అన్నారు.

6-111-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"అవురా! ధర్మవివేక
ప్రరుల పస గానఁబడియెఁ బాపము పుణ్యో
ద్భవుల యదండ్యుల దండన
విరం బొనరింపఁ బడియె విధి యెఱుఁగమిచేన్.

టీకా:

అవురా = ఔరా; ధర్మ = ధర్మాధర్మ; వివేక = విచక్షణ; ప్రవరుల = శ్రేష్ఠుల; పస = సామర్థ్యము; కానబడియె = తెలిసిపోయినది; పాపము = పాపము; పుణ్య = పుణ్యము; ఉద్భవులన్ = కలిగినవారిని; అందున్ = వారిలో; అదండ్యులన్ = దండనార్హులు కానివారిని; దండన = దండించెడి; వివరంబున్ = వివరములు; ఒనరింపబడియె = చేయబడెను; విధి = చేయవలసిన విధి; ఎఱుగమి = తెలికపోవుట; చేన్ = చేత.

భావము:

“ఔరా! మీ ధర్మాధర్మ విచక్షణా సామర్థ్యం తెలిసిపోయింది. అజ్ఞానంతో మీరు పుణ్యాత్ములను, దండింపరాని వారిని దండిస్తారన్న విషయం వెల్లడి అయింది.

6-112-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ములును సాధులున్ విహితశాసనులున్సుదయాళురున్ శుభో
త్తగుణులైన యట్టి తలిదండ్రులు బిడ్డల కెగ్గు జేయుచోఁ
గ్రమున వార లెవ్వరికిఁ గైకొని కుయ్యిడఁజాలువారు సం
భ్రమున మీ మనంబులఁ దిరంబుగఁ జర్చయొనర్చి చూడుఁడా;

టీకా:

సములు = సమబుద్ధి గలవారు; సాధులున్ = సాధు స్వభావులును; విహిత = విధింపబడిన; శాసనులున్ = నియమములు గలవారు; సుదయాళురున్ = మంచి దయ గలవారు; శుభ = శుభకరమైన; ఉత్తమ = ఉత్తమమైన; గుణులు = గుణములు గలవారు; ఐన = అయిన; అట్టి = అటువంటి; తల్లిదండ్రులు = తల్లిదండ్రులు; బిడ్డలు = సంతానమున; కున్ = కు; ఎగ్గు = అపకారము; చేయుచో = చేయుచున్నట్లయిన; క్రమమునన్ = పద్ధతిగా; వారలు = వారు; ఎవ్వారి = ఎవరి; కిన్ = కి; కైకొని = చేపట్టి; కుయ్యిడజాలువారు = మొరపెట్టుకొన గలరు; సంభ్రమమునన్ = తొట్రుపాటుతో; మీ = మీ యొక్క; మనంబులన్ = మనసులలో; తిరంబుగన్ = స్థిరముగ; చర్చన్ = తరచి ఆలోచించుట; ఒనర్చి = చేసి; చూడుడా = చూడండి.

భావము:

సమబుద్ధి కలవారు, సాధువర్తనులు, నియమ బద్ధులు, మంచి దయాపరులు, గొప్ప సుగుణాలు కలిగిన తల్లిదండ్రులే తమ బిడ్డలకు కీడు చేయ తలపెట్టితే ఇక ఆ బిడ్డలు ఎవరితో మొరపెట్టుకుంటారు? మీ మనస్సులలో మీరే ఆలోచించి చూడండి.

6-113-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఱుక గలుగు నాతఁ డేది యొనర్చిన
ది యొనర్తు రితరు లైన వార
తఁడు సత్య మిట్టి నె నేని లోకంబు
త్ప్రవర్తనమునఁ గిలి యుండు.

టీకా:

ఎఱుకగలుగునాతడు = తెలిసినవాడు, జ్ఞాని; ఏది = ఏదైతే; ఒనర్చినన్ = చేసినచో; అది = దానిని; ఒనర్తురు = చేసెదరు; ఇతరులైన = మిగిలిన; వారలు = వారు; అతడు = అతడు; సత్యము = సత్యము; ఇట్టిది = ఇది; అనెను = అనిన; ఏని = చో; లోకంబు = లోకము; తత్ = ఆ; ప్రవర్తనమునన్ = నడవడికను; తగిలి = లగ్నమై; ఉండు = ఉండును.

భావము:

లోకంలో జ్ఞానవంతుడు ఏది చేస్తే ఇతరులు కూదా దానినే చేస్తారు. అతడు దేనిని సత్యం అని నిర్ణయిస్తాడో లోకం దానినే నమ్మి అదే విధంగా ప్రవర్తిస్తుంది.

6-114-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నెమ్మిఁ దొడలమీఁద నిద్రించు చెలికాని
మ్మఁదగినవాఁడు యము విడిచి
ద్రోహబుద్ధిఁ జంప దొడరునే? యెందైనఁ
బ్రీతి లేక ధర్మదూలార!

టీకా:

నెమ్మిన్ = ప్రేమగా; తొడల = తొడల; మీద = పైన; నిద్రించు = నిద్రపోవుచున్న; చెలికాని = స్నేహితుని; నమ్మదగినవాడు = నమ్మకస్తుడు; నయము = న్యాయమును; విడిచి = వదలేసి; ద్రోహ = మోసపు; బుద్ధిన్ = బుద్ధితో; చంపన్ = చంపుటకు; తొడరునె = యత్నించునా; ఎందైనన్ = ఎక్కడైనను; ప్రీతి = ప్రేమ; లేక = లేకుండగ; ధర్మదూతలార = యమదూతలారా.

భావము:

యమదూతలారా! నమ్మి తన తొడలపై నిద్రించే మిత్రుణ్ణి నీతి విడిచి ద్రోహబుద్ధితో ప్రీతి లేకుండా ఎక్కడైనా ఎవ్వడైనా చంపడానికి పూనుకుంటాడా?

6-115-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చిత్తమెల్ల నిచ్చి చెలితనంబున వచ్చి
చ్చి కలయ మెచ్చి మ్మువానిఁ
రుణ గలుగువాఁడు డుసౌమ్యుఁ డగువాఁడు
చింతజేయ కెట్లు చెఱుప నేర్చు?

టీకా:

చిత్తము = మనసు; ఎల్లన్ = అంతయును; ఇచ్చి = సమర్పించి; చెలితనంబునన్ = స్నేహముతో; వచ్చి = చేరి; నచ్చి = ఇష్టముగా; కలయమెచ్చి = మిక్కిలిగా కీర్తించి; నమ్మువానిన్ = నమ్మెడివానిని; కరుణగలుగువాడు = దయామయుడు; కడు = మిక్కిలి; సౌమ్యుడగువాడు = సౌమ్యుడు; చింతజేయక = ఆలోచించక; ఎట్లు = ఏ విధముగ; చెఱుపన్ = పాడుచేయ; నేర్చు = యత్నించును.

భావము:

మనస్సు నిచ్చి స్నేహభావంతో వచ్చి, తనకు నచ్చి, తనను మెచ్చి నమ్ముకున్న వ్యక్తికి బుద్ధిమంతుడు ఆలోచించకుండా ఎలా కీడు చేస్తాడు?

6-116-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదియునుం గాక

టీకా:

అదియునున్ = అంతే; కాక = కాకుండగ.

భావము:

అంతేకాక...

6-117-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తఁడు కోటిసంఖ్యలకు నెక్కుడు పుట్టువులందుఁ జెంది యా
యాము లైన పాప నివహంబుల నన్నిటిఁ బాఱఁ దోలెఁ బ్ర
ఖ్యామతిన్ మహా మరణ కాలమునన్ హరిపుణ్యనామ సం
భూ సుధామయాద్భుత విభూతిక రాక్షర సంగ్రహంబునన్.

టీకా:

ఈతడు = ఇతడు; కోటిసంఖ్యల = కోటి; కున్ = కంటె; ఎక్కుడు = ఎక్కువైన; పుట్టువులు = జన్మములు; అందున్ = లో; చెంది = జన్మించి; ఆయతములు = వచ్చిపడినవి; ఐన = అయినట్టి; పాప = పాపపు; నివహంబులన్ = సమూహములను; అన్నిటిన్ = సమస్తమును; పాఱదోలెన్ = పోగొట్టుకొనెను; ప్రఖ్యాత = ఖ్యాతికెక్కిన; మతిన్ = బుద్ధితో; మహా = గొప్పగ; మరణ = మరణించెడి; కాలమునన్ = సమయములో; హరి = నారాయణుని; పుణ్య = పుణ్యవంతమైన; నామ = నామము వలన; సంభూత = పుట్టిన; సుధామయ = అమృతమయ; అద్భుత = అద్భుతమైన; విభూతిన్ = వైభవమును; కర = కలిగించెడి; అక్షర = అక్షరముల; సంగ్రహంబునన్ = కూర్పుతోటి.

భావము:

ఇతడు మరణ సమయంలో అమృతమయమైన అద్భుతమైన అక్షరాలతో కూడిన భగవంతుని పుణ్యనామాన్ని స్వీకరించడం వలన కోటి కంటే ఎక్కువ జన్మాలలో చేసిన పాపాల నన్నింటినీ పోగొట్టుకున్నాడు.

6-118-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బ్రహ్మహత్యానేక పాపాటవుల కగ్ని-
కీలలు హరినామ కీర్తనములు;
గురుతల్ప కల్మష క్రూరసర్పములకుఁ-
గేకులు హరినామ కీర్తనములు;
పనీయ చౌర్య సంమసంబునకు సూర్య-
కిరణముల్ హరినామ కీర్తనములు;
ధుపాన కిల్బిష దనాగ సమితికిఁ-
గేసరుల్ హరినామ కీర్తనములు;

6-118.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హిత యోగోగ్ర నిత్యసమాధి విధుల
లరు బ్రహ్మాది సురలకు నందరాని
భూరి నిర్వాణ సామ్రాజ్య భోగభాగ్య
ఖేలనంబులు హరినామ కీర్తనములు;

టీకా:

బ్రహ్మహత్య = బ్రహ్మహత్య మొదలైన; అనేక = అనేకమైన; పాప = పాపములు యనెడి; అటవులు = అడవుల; కున్ = కి; అగ్నికీలలు = నిప్పులమంటలు వంటివి; హరి = విష్ణుమూర్తి; నామ = నామములను; కీర్తనములు = కీర్తించుటలు; గురు = గురువు; తల్ప = భార్యా సంగమ; కల్మష = పాపము యనెడి; క్రూర = క్రూరమైన; సర్పములు = పాములకు; కేకులు = నెమళ్ళు వంటివి; హరి = విష్ణుమూర్తి; నామ = నామములను; కీర్తనములు = కీర్తించుటలు; తపనీయ = బంగారమును; చౌర్య = దొంగతనము యనెడి; సంతమసంబున్ = చిక్కటి చీకట్ల; కున్ = కు; సూర్య = సూర్యుని; కిరణముల్ = కిరణముల వంటివి; హరి = విష్ణుమూర్తి; నామ = నామములను; కీర్తనములు = కీర్తించుటలు; మధుపాన = మద్యము త్రాగిన; కిల్బిష = పాపము యనెడి; మద = మదించిన; నాగ = ఏనుగుల; సమితి = సమూహమున; కిన్ = కి; కేసరుల్ = సింహముల వంటివి; హరి = విష్ణుమూర్తి; నామ = నామములను; కీర్తనములు = కీర్తించుటలు;
మహిత = గొప్ప; యోగ = యోగములలో; ఉగ్ర = తీవ్రమైనవాని; నిత్య = శాశ్వతమైన; సమాధి = సమాధి; విధులన్ = కర్మము లందు; అలరు = అలరారెడి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆది = మొదలగు; సురలు = దేవతల; కున్ = కు; అందరాని = అందకోలేని; భూరి = అత్యంత గొప్పదైన; నిర్వాణ = మోక్ష; సామ్రాజ్య = సామ్రాజ్యము యొక్క; భోగ = భోగములు; భాగ్య = భాగ్యములతో కూడిన; ఖేలనంబులు = విలాసములు; హరి = విష్ణుమూర్తి; నామ = నామములను; కీర్తనములు = కీర్తించుటలు.

భావము:

హరి నామ సంకీర్తనలు బ్రహ్మహత్య మొదలైన పాపాలనే అడవులకు అగ్నిజ్వాలలు. గురుద్రోహమనే క్రూర సర్పాలకు నెమళ్ళు. బంగారాన్ని దొంగిలించడం అనే చిక్కని చీకట్లకు సూర్యకిరణాలు. మధుపానమనే పాపపు టేనుగులకు సింహాలు. ఆ హరినామ కీర్తనలు బ్రహ్మ మొదలైన దేవతలకు కూడా అందరాని మోక్ష సామ్రాజ్య వైభవ విలాసాలు.

6-119-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ముక్తికాం తైకాంత మోహన కృత్యముల్-
కేలిమై హరినామ కీర్తనములు;
త్యలోకానంద సౌభాగ్యయుక్తముల్-
కేలిమై హరినామ కీర్తనములు;
హిత నిర్వాణ సామ్రాజ్యాభిషిక్తముల్-
కేలిమై హరినామ కీర్తనములు;
హుకాల జనిత తపఃఫల సారముల్-
కేలిమై హరినామ కీర్తనములు;

6-119.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పుణ్యమూలంబు లనపాయ పోషకంబు
భిమతార్థంబు లజ్ఞాన రణ కరము
లాగమాం తోపలబ్దంబు మృతసేవ
లార్తశుభములు హరినామ కీర్తనములు;

టీకా:

ముక్తి = మోక్ష మనెడి; కాంత = స్త్రీతోటి; ఏకాంత = ఏకాంతమైన; మోహన = మనోహరమైన; కృత్యముల్ = పనులు యనెడి; కేలిమై = క్రీడల వంటివి; హరి = విష్ణుమూర్తి; నామ = నామములను; కీర్తనములు = కీర్తించుటలు; సత్యలోక = సత్యలోకపు; ఆనంద = ఆనందములు; సౌభాగ్య = సౌభాగ్యములతో; యుక్తములు = కూడినవియైన; కేలిమై = క్రీడలవంటివి; హరి = విష్ణుమూర్తి; నామ = నామములను; కీర్తనములు = కీర్తించుటలు; మహిత = గొప్ప; నిర్వాణ = మోక్ష; సామ్రాజ్య = సామ్రాజ్యపు; అభిషిక్తములు = పట్టాభిషేకముల; కేలిమై = క్రీడలవంటివి; హరి = విష్ణుమూర్తి; నామ = నామములను; కీర్తనములు = కీర్తించుటలు; బహు = అధికమైన; కాల = కాలము; జనిత = కలిగిన; తపః = తపస్సుయొక్క; ఫలసారముల్ = ఫలితముల; కేలిమై = క్రీడలవంటివి; హరి = విష్ణుమూర్తి; నామ = నామములను; కీర్తనములు = కీర్తించుటలు;
పుణ్య = పుణ్యములకు; మూలంబులు = కారణభూతములు; అనపాయ = ఎడబాటులేని; పోషకంబులు = పోషించునవి; అభిమత = కోరిన; అర్థంబులు = కోరికలు; అజ్ఞాన = అజ్ఞానమును; హరణ = హరించుట; కరములు = చేయునవి; ఆగమాంత = వేదాంతమున; ఉపలబ్దంబులు = లభించెడివి; అమృత = అమృతమును; సేవలు = సేవించుటలు; ఆర్త = బాధలలో నుండు వారికి; శుభములు = శుభకర మైనవి; హరి = విష్ణుమూర్తి; నామ = నామములను; కీర్తనములు = కీర్తించుటలు

భావము:

హరినామ కీర్తనలు ముక్తికాంత ఏకాంత మోహన విహారాలు, సత్యలోక నివాసాన్ని ప్రసాదించే ఆనంద సౌభాగ్య విలాసాలు, మోక్ష సామ్యాజ్య పట్టాభిషేక స్వరూపాలు, ఎంతోకాలం చేసిన తపస్సుకు ఫలాల సారాంశాలు, పుణ్యాలకు కారణాలు, ప్రమాదాలనుండి రక్షించి పోషించేవి, కోరిన ప్రయోజనాల నిచ్చేవి, అజ్ఞానాన్ని హరించేవి, అమృతం వంటి వేదాంతసారాన్ని అందించేవి, ఆర్తులకు శుభాల నిచ్చేవి.

6-120-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కామంబు పుణ్యమార్గ
స్థేమంబు మునీంద్ర సాంద్రచే తస్సరసీ
ధామంబు విష్ణు నిర్మల
నామంబుఁ దలంచువాఁడు నాథుఁడు గాడే?

టీకా:

కామంబు = కోరదగినది; పుణ్య = పుణ్యవంతమైన; మార్గ = విధానమునకు; స్థేమంబు = స్థిరమైన స్థానములు; ముని = మునులలో; ఇంద్ర = ఇంద్రుని వంటివారి; సాంద్ర = చిక్కటి; చేతస్ = మనసు యనెడి; సరసీ = సరస్సుల; ధామంబులు = నివాసములు; విష్ణు = విష్ణుమూర్తి యొక్క; నిర్మల = స్వచ్ఛమైన; నామంబున్ = నామములను; తలచువాడు = స్మరించెడివాడు; నాథుడు = ప్రభువు; కాడే = కాడా ఏమి.

భావము:

కోరదగినది, పుణ్యమార్గాలకు నిలయమైనది, మునీంద్రుల మనస్సులనే సరోవరాలే నివాసంగా ఉన్నది అయిన విష్ణు పవిత్ర నామాన్ని స్మరించేవాడు ప్రభువే కదా!

6-121-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డెందంబు పుత్రు వలనం
జెందిన దని తలఁప వలదు శ్రీపతి పే రే
చంమున నైనఁ బలికిన
నంకధరుఁ డందుఁ గలఁడు నాథుం డగుచున్.

టీకా:

డెందంబు = మనసు; పుత్రు = కుమారుని; వలనన్ = వలన; చెందినది = సంబంధించినది; అని = అని; తలపన్ = అనుకొన; వలదు = వద్దు; శ్రీపతి = నారాయణుని {శ్రీపతి - శ్రీ (లక్ష్మీదేవి) పతి (భర్త), విష్ణువు}; పేరు = నామమును; ఏ = ఎట్టి; చందమునన్ = విధముగ; ఐనన్ = అయినప్పటికిని; పలికిన = పలికినట్లయిన యెడల; నందకధరుడు = నారాయణుడు {నందకధరుడు - నందకము యనెడి ఖడ్గమును ధరించెడివాడు, విష్ణువు}; అందున్ = దానిలో; కలడు = ఉన్నాడు; నాథుండు = పాలించెడివాడు; అగుచున్ = అగుచూ.

భావము:

ఇతడు “నారాయణా!” అని పిలిచినప్పుడు ఇతని మనస్సు కుమారుని మీద ఆసక్తమై ఉన్నదని మీరు అనుకోవద్దు. భగవంతుని పేరును ఏ విధంగా పలికినా శ్రీహరి రక్షకుడై అందులోనే ఉంటాడు.

6-122-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బిడ్డపేరు పెట్టి పిలుచుట విశ్రామ
కేళి నైన మిగులఁ గేలి నయినఁ
ద్య గద్య గీత భావార్థముల నైనఁ
మలనయనుఁ దలఁపఁ లుషహరము.

టీకా:

బిడ్డ = పుత్రుని; పేరు = పేరు; పెట్టి = తో; పిలుచుట = పిలుచుట; విశ్రామ = కాలక్షేపపు; కేళిన్ = ఆటలకి; ఐనన్ = అయినప్పటికిని; మిగులన్ = మిక్కిలి; గేలిన్ = పరిహాసమునకు; అయినన్ = అయినప్పటికిని; పద్యగద్య = కావ్య రూపములు; గీత = కీర్తనలలోని; భావ = భావములు; అర్థములన్ = అర్థములతో; ఐనన్ = అయినప్పటికిని; కమలనయను = నారాయణుని {కమల నయనుడు - కమలముల వంటి నయనములు గలవాడు, విష్ణువు}; తలపన్ = స్మరించిన; కలుష = (అవి) పాపములు; హరము = నశింపజేయును.

భావము:

కుమారుని పేరు పెట్టి పిలిచినా, విశ్రాంతి వేళలోనైనా, ఆటలోనైనా, పరిహాసంగానైనా, పద్య వచన గీత భావార్థాలతోనైనా కమలాక్షుణ్ణి స్మరిస్తే పాపాలు తొలగిపోతాయి.

6-123-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కూలినచోటఁ గొట్టుపడి కుందినచోట మహాజ్వరాదులం
బ్రేలినచోట సర్పముఖ పీడల నందినచోట నార్తులై
తూలినచోట విష్ణు భవదూరునిఁ బేర్కొనిరేని మీఁద న
క్కాలుని యాతనావితతిఁ గానరు పూనరు దుఃఖభావముల్.

టీకా:

కూలిన = కూలబడిపోయిన; చోటన్ = సమయములోను; కొట్టుబడి = దెబ్బతిని; కుందిన = కుంగిపోయిన; చోటన్ = సమయములోను; మహా = పెద్దపెద్ద; జ్వర = జ్వరము; ఆదులన్ = మొదలగువాని యందు; ప్రేలిన = వేగుతున్న; చోటన్ = సమయములోను; సర్ప = పాము; ముఖ = మొదలైన; పీడలన్ = బాధలను, పీడించువానిని; అందిన = చెందిన; చోటన్ = సమయములోను; ఆర్తులు = దుఃఖపడువారు; ఐ = అయ్యి; తూలిన = చలించిపోయిన; చోటన్ = సమయములోను; విష్ణున్ = నారాయణుని; భవదూరునిన్ = నారాయణుని {భవదూరుడు - భవబంధములను దూరము చేయువాడు, విష్ణువు}; పేర్కొనిరి = స్మరించిరి; ఏని = అయినచో; మీదన్ = ఆపైన; కాలుని = యముని; యాతన = తీవ్రవేదనల, కారియపెట్టుటల; వితతిన్ = సమూహమును; కానరు = చూడరు; పూనరు = పొందరు; దుఃఖ = దుఃఖపూరిత; భావముల్ = భావనలను.

భావము:

తూలి పడినప్పుడు, దెబ్బలు తిని దుఃఖపడినప్పుడు, భయంకర జ్వరాలతో పిచ్చిగా ప్రేలినప్పుడు, పాము మొదలైన విషజంతువుల బాధ కలిగినప్పుడు, బాధలతో అలమటించి నప్పుడు భవబంధాలను నాశనం చేసే విష్ణు నామాన్ని ఉచ్చరిస్తే చాలు యమబాధలు కాని, దుఃఖాలు కాని పొందరు.

6-124-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తిపాపములకుఁ బ్రత్న పూర్వకముగఁ-
నుపాపముల కమితంబు గాఁగ
న్ముని వరులచే సంప్రోక్తమై యుండు-
నిర్మలం బగు పాప నిష్కృతములు
గ్రమరూపమున నుపమనంబులగుఁ గాని-
త్పాపచయములు రువ లేవు;
ర్వకర్మంబుల సంహార మొనరించి-
చిత్తంబునకుఁ దత్త్వసిద్ధి నొసఁగు

6-124.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నొనర నీశు సేవ, యోగిమానస సరో
వాసు సేవ, హేమవాసు సేవ,
వేదవేద్యు సేవ, వేదాంత విభు సేవ,
రమపురుష పాదద్మ సేవ.

టీకా:

అతి = మిక్కిలి; పాపముల = పాపముల; కున్ = కు; ప్రయత్నపూర్వకముగన్ = కావాలని చేసిన; తనుపాపముల = పెద్ద పాపముల; కున్ = కు; అమితముగా = మిక్కిలిగా; కాగ = అగునట్ల; సత్ = మంచి; ముని = మునులలో; వరుల = ఉత్తముల; చేన్ = చేత; సంప్రోక్తము = ఉపదేశింపబడినవి; ఐ = అయ్యి; ఉండు = ఉండెడి; నిర్మలంబు = స్వచ్ఛమైనవి; అగు = అయిన; పాప = పాపములను; నిష్కృతములు = ప్రాయశ్చిత్తములు; క్రమరూపమునను = క్రమక్రమముగా; ఉపశమనంబులు = ఉపశమనము నిచ్చునవి; అగున్ = అగును; కాని = కాని తత్ = ఆ; పాప = పాపముల; చయములున్ = సమూహములను; తరువ = తరింప, దాటించ; లేవు = లేవు; సర్వ = సమస్తమైన; కర్మంబులన్ = కర్మలను; సంహారము = నాశనము; ఒనరించి = చేసి; చిత్తంబున్ = మనసు; కున్ = కు; తత్త్వ = పరతత్త్వ; సిద్ధి = సిద్ధిని; ఒసగు = కలుగజేయును; ఒనరన్ = చక్కగా; ఈశు = భగవంతుని; సేవ = భక్తి.
యోగిమానససరోవాసు = నారాయణుని {యోగి మానస సరోవాసుడు - యోగి (యోగుల యొక్క) మానస (మనసు లనెడి) సరః (సరస్సు లందు) వాసుడు (నివసించెడివాడు), విష్ణువు}; సేవ = భక్తి; హేమవాసు = నారాయణుని {హేమ వాసుడు - బంగారు అంబరములను ధరించువాడు, విష్ణువు}; సేవ = భక్తి; వేదవేద్యు = నారాయణుని {వేద వేద్యుడు - వేదములచే వేద్యుడు (తెలియబడువాడు), విష్ణువు}; సేవ = భక్తి; వేదాంతవిభు = నారాయణుని {వేదాంత విభుడు - వేదాంతములు (ఉపనిషత్తాదులు) యందలి విభుడు (ప్రభువు), విష్ణువు}; సేవ = భక్తి; పరమపురుష = నారాయణుని {పరమ పురుషుడు - సర్వమునకు పరమైన పురుషుడు, విష్ణువు}; పాద = పాదము లనెడి; పద్మ = పద్మముల; సేవ = భక్తి.

భావము:

పెద్ద పాపాలకు పెద్ద ప్రాయశ్చిత్తాలను, చిన్న పాపాలకు చిన్న ప్రాయశ్చిత్తాలను మహానుభావులైన మునులు నిర్ణయించి ఉంచారు. కాని ఆ ప్రాయశ్చిత్తాల వల్ల ఆ పాపాలు తాత్కాలికంగా ఉపశమిస్తాయి తప్ప పూర్తిగా పరిహారం కావు. సమస్త పాపాలను సంపూర్ణంగా సంహరించి మనస్సును పరిశుద్ధం చేయాలంటే భగవంతుని సేవ ఒక్కటే సరియైన త్రోవ. ఆ పరమేశ్వరుణ్ణి, ఆ యోగిమానస వాసుణ్ణి, ఆ బంగారు వస్త్రాలు ధరించు వాణ్ణి, ఆ వేదవేద్యుణ్ణి, ఆ వేదాంత ప్రభువును, ఆ పురుషోత్తముణ్ణి స్మరిస్తూ ఆయన పాదాలు సేవిస్తే మోక్షం లభిస్తుంది.

6-125-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రి నెఱుగని యా బాలుఁడు
రిభక్తులతోడఁ గూడి రి యను వాఁడున్
రియై దోషము లడఁచును
రువలితో నగ్ని దృణముఁ గాల్చిన భంగిన్.

టీకా:

హరిన్ = నారాయణుని; ఎఱుగని = తెలియని; ఆ = ఆ; బాలుడు = పిల్లవాడు; హరి = నారాయణుని; భక్తుల్ = భక్తుల; తోడన్ = తోటి; కూడి = కలిసి; హరి = నారాయణ; అను = అనెడి; వాడున్ = వాడు కూడ; సరి = సమానము; ఐ = అయ్యి; దోషములన్ = పాపములను; అడచును = అణచివేయును; కరువలి = గాలి; తోన్ = తోకూడిన; అగ్ని = నిప్పు; తృణమున్ = గడ్డిపరకలను; కాల్చిన = కాల్చివేయు; భంగిన్ = విధముగ.

భావము:

భగవంతుడంటే ఏమిటో ఎరుగని బాలుడు హరిభక్తులలో చేరి “హరి హరి” అంటే చాలు, అగ్ని గాలితో కూడి గడ్డిని కాల్చివేసినట్లు హరినామ స్మరణం పాపాలన్నిటినీ అణచివేస్తుంది.

6-126-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

య వీర్యవంత మగు నౌషధమెట్లు యదృచ్ఛఁ గొన్న ద
చ్చారు గుణంబు రోగములఁ య్యనఁ బాపెడు మాడ్కిఁ బుణ్య వి
స్పారుని నంబుజోదరునిఁ బామరుఁ డజ్ఞుఁ డవజ్ఞఁ బల్కినన్
వాక తత్ప్రభావము ధ్రువంబుగ నాత్మగుణంబుఁ జూపదే?

టీకా:

ఆరయన్ = తరచి చూసిన; వీర్యవంతము = బలమైనది; అగు = అయిన; ఔషధము = మందు; ఎట్లు = ఏవిధముగనైతే; అదృచ్ఛన్ = చూడకుండగ; కొన్నన్ = తీసుకొన్నప్పటికిని; తత్ = దాని; చారు = మంచి; గుణంబు = గుణములు; రోగములన్ = జబ్బులను; చయ్యన = శ్రీఘ్రమే; పాపెడు = పోగొట్టెడు; మాడ్కిన్ = విధముగనే; పుణ్యవిస్ఫారునిన్ = నారాయణుని {పుణ్య విస్పారుడు - పుణ్యములకు విస్పారుడు (అధికముగా కలవాడు), విష్ణువు}; అంబుజోదరునిన్ = నారాయణుని {అంబుజోదరుడు - అంబుజము (పద్మము) ఉదరుడు (ఉదరమున గలవాడు), విష్ణువు}; పామరుడు = నీచు డైనను; అజ్ఞుడు = తెలివిలేనివాడు; అవజ్ఞ = తిరస్కారముతో; పలికినను = పలికినప్పటికిని; వారక = తప్పక; తత్ = దాని (భగవన్నామ); ప్రభావము = ప్రభావము; ధ్రువంబుగన్ = తప్పనిసరిగ; ఆత్మ = తన; గుణంబున్ = స్వభావమును; చూపదే = చూపించదా ఏమి.

భావము:

సారవంతమైన ఔషధాన్ని అనుకోకుండా పొరపాటున సేవించినా దాని గుణం వృధాగా పోదు. దాని ప్రభావం రోగాలను పోగొడుతుంది. అదే విధంగా పరమ పావనుడైన భగవంతుని నామం తెలియక పలికినా, తిరస్కార భావంతో పలికినా దాని ప్రభావం ఊరకే పోదు. దాని మహత్తర గుణాన్ని అది తప్పక చూపిస్తుంది.

6-127-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధృతి దప్పిన తఱినిఁ బురా
కృమునఁ గాకెట్లు దోఁచుఁ గేశవుఁడు మదిన్
మితి లేని జగముఁ దాల్చిన
తఁ డొక్కని మనములోన డఁగెడు వాఁడే?

టీకా:

ధృతి = వంటిమీది తెలివి; తప్పిన = తప్పిపోయిన; తఱిన్ = సమయము నందు; పురాకృతమునన్ = పూర్వజన్మ సుకృతము వలన; కాక = కాకుండగ; ఎట్లు = ఏ విధముగ; తోచున్ = స్మరణకు వచ్చును; కేశవుడు = నారాయణుడు; మదిన్ = మనసు నందు; మితి = పరిమితి; లేని = లేనట్టి; జగమున్ = లోకములను; తాల్చిన = ధరించిన; అతడు = అతడు; ఒక్కని = ఒక్క మానవుని; మనము = మనసు; లోననే = లోపల; అడగెడువాడే = అణిగి ఉండువాడా ఏమి.

భావము:

అంత్యకాలంలో ధైర్యం సన్నగిల్లినప్పుడు పూర్వజన్మ పుణ్య విశేషం ఉంటేనే కాని కేశవుడు మనస్సుకు తోచడు. లోకాలన్నింటిని తనలో ధరించిన ఆ భగవంతుడు కేవలం ఒక్కని మనస్సులోనే ఇమిడేవాడు కాడు.

6-128-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నితంబై నిరవద్యమై నిఖిల చిన్నిర్మాణమై నిత్యమై
నిహంకార గుణాఢ్యమై నియమమై నిర్దోషమైనట్టి శ్రీ
రి నామస్మర ణామృతం బితఁడు ప్రత్యక్షంబు సేవించెఁ దా
ణాంతంబున నిట్టి సజ్జనుని ధర్మంబేల వ్యర్థం బగున్."

టీకా:

నిరతంబు = ఎడతెగనిది; ఐ = అయ్యి; నిరవద్యము = లోపము లేనిది; ఐ = అయ్యి; నిఖిల = సమస్తమైన; చిత్ = చైతన్యమును; నిర్మాణము = నిర్మించునది; ఐ = య్యి; నిత్యము = శాశ్వతమైనది; ఐ = అయ్యి; నిరహంకార = అహంకారములేని; గుణ = సద్గుణములు కలిగి ఉండుటలో; ఆఢ్యము = శ్రేష్ఠమైనది; ఐ = అయ్యి; నియమము = సర్వ నియామక మైనది; ఐ = అయ్యి; నిర్దోషము = దోషములు లేనిది; ఐనట్టి = అయినట్టి; శ్రీ = శుభకరమైన; హరి = నారాయణుని; నామ = నామమును; స్మరణ = స్మరించుట యనెడి; అమృతంబున్ = అమృతమును; ఇతడు = ఇతడు; ప్రత్యక్షంబున్ = ఇంద్రియల పూర్వకముగా; సేవించెన్ = కొలిచెను; మరణాంతంబునన్ = చనిపోవు సమయము నందు; ఇట్టి = ఇటువంటి; సజ్జనుని = మంచివాని యొక్క; ధర్మంబు = ధర్మము; ఏలన్ = ఎందులకు; వ్యర్థంబు = ఉపయోగపడనిది; అగున్ = అగును.

భావము:

శాశ్వతమూ, నిర్దోషమూ, సమస్త చైతన్యానికి ఆలవాలమూ, నిత్యసత్యమూ, అహంకారం లేని గుణాలతో కూడినదీ, నియమబద్ధమూ, నిర్మలమూ అయిన శ్రీహరి నామమనే అమృతాన్ని ఈ అజామిళుడు ప్రత్యక్షంగా సేవించాడు. ఈ హరినామ స్మరణ మనే ధర్మం ఈ సత్పురుషుని మరణానంతరం ఎందుకు వృథా అవుతుంది?”

6-129-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లు భగవద్దూతలు భాగవతధర్మంబు నిర్ణయించి, యియ్యర్థంబున మీకు సంశయంబు గలదేని మీ రాజు నడుఁగుడు; పొం" డని పలికి బ్రాహ్మణుని నతిఘోరం బైన యామ్యపాశబంధ నిర్ముక్తునిం గావించి, యమభటుల వలని యుదుటు వాపి; రంత నా యమదూత లా భగవద్దూతల సంభాషణ ప్రభావంబునఁ దమ మనంబుల శాంతి నొంది భగవత్తత్త్వ జిజ్ఞాసులై చేయునది లేక నిరాకృతులై, యమలోకంబునకుం జని, పితృపతికి సర్వంబును నెఱింగించి; రంత.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; భగవత్ = భగవంతుని; దూతలు = సేవకులు; భాగవత = భగవంతుని యొక్త; ధర్మంబు = ధర్మమును; నిర్ణయించి = నిశ్చయించి పలికి; ఈ = ఈ; అర్థంబునన్ = విషయములో; మీకు = మీకు; సంశయంబున్ = అనుమానము; కలదు = ఉన్నట్లు; ఏని = అయినచో; మీ = మీ యొక్క; రాజు = ప్రభువును; అడుగుడు = అడగండి; పొండు = వెళ్ళండి; అని = అని; పలికి = చెప్పి; బ్రాహ్మణుని = విప్రుని; అతి = మిక్కిలి; ఘోరంబు = భయంకరము; ఐన = అయిన; యామ్య = యముని యొక్క; పాశ = పాశముల; బంధ = బంధములనుండి; నిర్ముక్తినిన్ = విడిపింప బడినవానిగా; కావించి = చేసి; యమభటులు = యమభటుల; వలని = వలని; ఉదుటు = అదురు, భయము; పాపిరి = పోగొట్టిరి; అంతన్ = అంతట; ఆ = ఆ; యమదూతలు = యమదూతలు; ఆ = ఆ; భగవత్ = నారాయణుని; దూతల = సేవకుల; సంభాషణ = మాటల యొక్క; ప్రభావంబునన్ = ప్రభావమువలన; తమ = తమ యొక్క; మనంబులన్ = మనసులందు; శాంతిన్ = శాంతిని; ఒంది = పొంది; భగవత్ = భగవంతుని; తత్త్వ = తత్త్వము నందు; జిజ్ఞాసులు = ఆసక్తి గలవారు; ఐ = అయ్యి; చేయునది = చేసెడిది; లేక = లేక; నిరాకృతులు = తిరస్కరింపబడిన వారు; ఐ = అయ్యి; యమలోకంబున్ = యమలోకమున; కున్ = కు; చని = వెళ్ళి; పితృపతి = యముని; కిన్ = కి; సర్వంబునున్ = సమస్తమును; ఎఱింగించిరి = తెలిపిరి; అంతన్ = అంతట.

భావము:

అని ఈ విధంగా విష్ణుదూతలు భాగవత ధర్మాన్ని నిరూపించి “ఈ విషయంలో మీకు సందేహం ఉంటే మీ యమధర్మరాజును అడగండి. పొండి” అని చెప్పి, బ్రాహ్మణుడైన అజామిళుని భయంకరమైన యమపాశాల నుండి విడిపించి యమభటుల వల్ల కలిగిన భయాన్ని పోగొట్టారు. అప్పుడు ఆ యమదూతలు శాంతించి, చేసేది లేక యమలోకానికి వెళ్ళి, యమునికి జరిగినదంతా తెలియజేశారు. అప్పుడు...

6-130-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తఁడును బాశచ్యుతుఁడై
భయుఁడై ప్రకృతినొంది డునుత్సవ సం
తిఁ జూచి మ్రొక్కి మదిలో
తులిత ముద మొదవి పొదలి రిదాసులకున్.

టీకా:

అతడునున్ = అతడు కూడ; పాశ = పాశము; చ్యుతుడు = వీడిన, పడిపోయిన వాడు; ఐ = అయ్యి; గత = పోయిన; భయుడు = భయము గలవాడు; ఐ = అయ్యి; ప్రకృతిన్ = స్వస్థతను; ఒంది = పొంది; కడున్ = మిక్కిలి; ఉత్సవ = ఉత్సాహము; సంగతిన్ = కూడి; చూచి = చూసి; మ్రొక్కి = నమస్కరించి; మదిన్ = మనసు; లోన్ = లో; అతులిత = సాటిలేని; ముదము = సంతోషము; ఒదవి = పొంది; పొదలి = అతిశయించి; హరి = నారాయణుని; దాసులు = సేవకుల; కున్ = కు.

భావము:

ఆ అజామిళుడు యమపాశాలనుండి బయటపడి భయం తొలగిపోగా ధైర్యాన్ని పొంది ఎదుట ఉన్న విష్ణుదూతలకు ఎంతో ఆనందంతో నమస్కరించాడు.

6-131-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిలిచి కేలు మొగిచి లుక నుద్యోగించి
చెలఁగుచున్న లోనిలఁపు దెలిసి
క్రధరుని కూర్మి హచరు లరిగి ర
దృశ్యు లగుచు దేవదేవు కడకు.

టీకా:

నిలిచి = నిలబడి; కేలు = చేయి; మొగిచి = మోడ్చి; పలుకన్ = చెప్పుటకు; ఉద్యోగించి = ప్రయత్నించి; చెలగుచున్న = చెలరేగుతున్న; లోని = లోపలి; తలపు = ఆలోచనలు; తెలిసి = తెలిసికొని; చక్రధరుని = నారాయణుని {చక్రధరుడు - చక్ర (చక్రాయుధమును) ధరుడు (ధరించువాడు), విష్ణువు}; కూర్మి = ఇష్ట; సహచరులు = సేవకులు; అరిగిరి = వెళ్ళిరి; అదృశ్యులు = అదృశ్యమైనవారు; అగుచున్ = అగుచు; దేవదేవు = నారాయణుని {దేవదేవుడు - దేవతలకే దేవుడు, విష్ణువు}; కడకు = వద్దకు.

భావము:

ఆ అజామిళుడు నిలబడి చేతులెత్తి నమస్కరించి ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. విష్ణుభటులు అతని మనస్సులోని భావాన్ని తెలుసుకొని అంతర్ధానం చెంది ఆ దేవదేవుని సన్నిధికి వెళ్ళిపోయారు.

6-132-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వేత్రయ సంపాద్యము
మోదంబు గుణాశ్రయంబు మొగి భగవద్ధ
ర్మాదేశంబగు తద్భట
వాదంబు నజామిళుండు దలక వినుచున్.

టీకా:

వేద = వేదములు; త్రయ = మూటివలన; సంపాద్యము = ఆర్జింపబడినది; మోదంబు = సంతోషదాయకము; గుణ = కల్యాణగుణములకు; ఆశ్రయంబు = ఆశ్రయమైనది; మొగిన్ = సంపూర్ణముగ; భగవత్ = భగవంతుని; ధర్మ = ధర్మము యొక్క; ఆదేశంబు = ఉపదేశము కలది; అగు = అయిన; తత్ = ఆ; భట = సేవకుల; వాదంబున్ = సంభాషణమును; అజామిళుండు = అజామిళుడు; వదలక = విడువక; వినుచున్ = వినుచూ.

భావము:

మూడు వేదాల సారమూ, ఆనందదాయకమూ, కళ్యాణ గుణాలకు ఆలవాలమూ, భగవంతుని ధర్మాన్ని ప్రబోధించేదీ అయిన ఆ విష్ణుదూతల యమభటుల సంవాదాన్ని అజామిళుడు సమగ్రంగా వింటూ...

6-133-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీన్నారాయణ పద
తారసధ్యానసలిల ధౌత మహాఘ
స్తోముండై సద్భక్తికి
ధామం బగుచుండెఁ దెలిసి త్క్షణమాత్రన్.

టీకా:

శ్రీమత్ = శుభకరమైన; నారాయణ = విష్ణుమూర్తి యొక్క; పద = పాదములనెడి; తామరస = పద్మముల యెడలి; ధ్యాన = ధ్యానము యనెడి; సలిల = మంచినీటిచే; ధౌత = ప్రక్షాళన చేయబడిన; మహా = గొప్ప; అఘ = పాపముల; స్తోముండు = సమూహము గలవాడు; ఐ = అయ్యి; సత్ = మంచి; భక్తి = భక్తి; కిన్ = కి; ధామంబు = నివాసము; అగుచుండెన్ = అగుతుండెను; తెలిసి = ఉద్దేశపూర్వకముగా; తత్క్షణమాత్రన్ = ఆ క్షణము నందే.

భావము:

శ్రీమన్నారాయణుని పాదపద్మాల స్మరణమనే నిర్మలజలంతో తన పాపాలన్నిటినీ కడిగికొని ఆ క్షణం నుండి తనలో నిశ్చలమైన విష్ణుభక్తిని నిలుపుకున్నాడు.

6-134-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వసమున నరికట్టిన
దురితంబులఁ దలఁచి దలఁచి తుదిఁ దాపమునన్
రి నీశు నాశ్రయించుచుఁ
రితాపము నొంది పలికె బ్రాహ్మణుఁ డంతన్.

టీకా:

బరవసమునన్ = ధైర్యముగ; అరికట్టిన = నాశనము చేయబడిన; దురితంబులన్ = పాపములను; తలచిదలచి = మరల మరల తలచుకొనుచు; తుదిన్ = చివరకు; తాపమునన్ = వేదనతో; హరిన్ = నారాయణుని; ఈశున్ = నారాయణుని; ఆశ్రయించుచున్ = ఆశ్రయించుతూ; పరితాపమున్ = మిక్కిలి బాధతో; పలికెన్ = పలికెను; బ్రాహ్మణుడు = బ్రాహ్మణుడు; అంతన్ = అంతట.

భావము:

అతని మనస్సులో అణిచిపెట్టబడినవి అయిన పాపాలు మాటిమాటికి తలంపుకు వచ్చి, పశ్చాత్తాపంతో క్రుంగిపోయి, ఆ బ్రాహ్మణుడు పరమేశ్వరుడైన శ్రీహరిని ఆశ్రయించి తనలో ఇలా అనుకున్నాడు.

6-135-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"వృషలియం దనురాగ వృద్ధిఁ బిడ్డలఁ గని-
కులము గోదావరిఁ గూలఁ ద్రోచి
చ్చల కెక్కి పెన్ జ్జుచేఁతల సరి-
వారిలోపలఁ దలవంపు చేసి
ట్టఁడిముదుక నై ర్మబంధంబుల-
పుట్టనై నిందల ప్రోవ నగుచుఁ
రుణుల రోఁతలఁ విలి భోగించిన-
డిఁది నా జన్మంబు గాలిపోయె;

6-135.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దువు చట్టుబడియె; శాస్త్రంబు మన్నయ్యె;
బుద్ధి పురువు మేసెఁ బుణ్య మడఁగె;
నీతి మట్టుబడియె నిర్మలజ్ఞానంబు
మొదలి కుడిగె బోధ మూరిఁ బోయె.

టీకా:

వృషలి = వృషలి {వ్యు. వృష (వర్షణే) + కలచ్ (జీష్), కృ.ప్ర., శూద్రజాతిస్త్రీ, కన్యక, రజస్వల అయి తండ్రి ఇంట ఉన్న పడచు,}; అందు = అందలి; అనురాగ = ప్రేమ; వృద్ధిన్ = అతిశయముతో; బిడ్డలను = పిల్లలను; కని = పొంది; కులమున్ = వంశము; గోదావరిన్ = గోదావరిలో; కూలద్రోచి = కలిపేసి; రచ్చల్ = కలహముల; కున్ = కు; ఎక్కి = పూనుకొని; పెన్ = పెద్ద పెద్ద; రజ్జు = పనికిమాలిన; చేతలన్ = పనుల వలన; సరివారి = తోటివారి; లోపలన్ = అందు; తలవంపు = సిగ్గుపడెడి పనులు; చేసి = చేసి; కట్టడి = క్రూరపు; ముదుకను = ముసలివాడను; ఐ = అయ్యి; కర్మబంధంబులన్ = కర్మబంధనముల; పుట్టను = నిండుగా కలవాడను; ఐ = అయ్యి; నిందల = నిందల; ప్రోవన్ = సమూహము గలవాడను; అగుచున్ = అగుచూ; తరుణుల = స్త్రీ లనెడి; రోతలన్ = అసహ్యములను; తవిలి = తగుల్కొని; భోగించిన = అనుభవించిన; కడిది = దుర్లభమైన; నా = నా యొక్క; జన్మంబు = జన్మ; కాలిపోయె = నశించిపోయింది.
చదువు = చదువు; చట్టుబడియె = చట్టుబండలయిపోయింది; శాస్త్రంబు = శాస్త్రజ్ఞానము; మన్నయ్యె = మట్టిపాలయిపోయింది; బుద్ధి = బుద్ధి; పురువుమేసె = పురుగులుపట్టిపోయింది; పుణ్యము = పుణ్యము; అడగె = నశించినది; నీతి = నీతి; మట్టుబడియె = మట్టిలో కలిసిపోయింది; నిర్మల = స్వచ్ఛమైన; జ్ఞానంబు = జ్ఞానము; మొదలి = మొత్తమున; కిన్ = కు; ఉడిగెన్ = పోయింది; బోధ = బోధ; మూరిఁబోయె = నశించిపోయింది.

భావము:

వృషలి మీద మోహం పెంచుకొని సంతానాన్ని కన్నాను. కులగౌరవాన్ని గోదావరిలో కలిపాను. నా బ్రతుకును రచ్చ కెక్కించాను. సిగ్గుమాలిన పనులు చేసి సాటివారిలో తలవంపులు తెచ్చుకున్నాను. వార్ధక్యం పైబడినా సంసార బంధాలనుండి బయట పడలేక, లోకనిందలను లెక్కచేయక, స్తీల రోత సుఖాల రొచ్చులో మునిగి నా జీవితాన్ని భస్మం చేసుకున్నాను. చదువు చట్టుబండలైపోయింది. శాస్త్రజ్ఞానం మట్టిపాలయింది. బుద్ధికి పురుగు పట్టింది. పుణ్యం నశించింది. నీతి అడుగంటింది. తెలివి నశించింది. స్వచ్ఛమైన జ్ఞానం మొత్తానికే లేకుండా పోయింది.

6-136-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చిక్కని చక్కని చన్నుల
క్కువ యిల్లాలి విడిచి మాయలుగల యీ
వెక్కసపు మద్యపానపు
డొక్కపసం దగిలి దుర్విటుఁడనై చెడితిన్.

టీకా:

చిక్కని = గట్టివి; చక్కటి = చక్కనైనవి యైన; చన్నులన్ = స్తనములతో; మక్కువ = ప్రేమ ఉన్న; ఇల్లాలిన్ = భార్యను {ఇల్లాలు - ఇల్లు నందు యుండెడి ఆలు, భార్య}; విడిచి = వదలుకొని; మాయలు = మాయామర్మము; కల = కలిగిన; ఈ = ఈ; వెక్కసపు = దుస్సహమైన; మద్యపానపు = మద్యము తాగెడి; డొక్క = డొక్కు; పసన్ = చాతుర్యమునకు; తగిలి = తగుల్కొని; దుర్విటుడను = మహ చెడ్డ జాఱుడను; ఐ = అయ్యి; చెడితిన్ = చెడిపోతిని.

భావము:

చక్కని సౌందర్యంతో నన్ను ఇష్టపడే ఇల్లాలిని విడిచి మద్యం త్రాగే ఈ డొక్కు మాయలాడికి విటుణ్ణై చెడిపోయాను.

6-137-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్కట! ఘోర దుష్కృత మహానలకీలలు నన్ను ముట్టి పే
రుక్కడఁగింప కిట్లు ధృతి నుండఁగ నిచ్చెనహో! దురాత్మునిం
గ్రక్కునఁ దల్లిదండ్రుల నల్మషచిత్తులఁ బెద్దలన్ మఱే
దిక్కును లేనివారిఁ బలు త్రిక్కులఁ బెట్టుచుఁ బాఱఁ దోలితిన్.

టీకా:

అక్కటన్ = అయ్యో; ఘోర = ఘోరమైన; దుష్కృత = పాపములు యనెడి; మహా = గొప్ప; అనల = అగ్ని; కీలలు = మంటలు; నన్నున్ = నన్ను; ముట్టి = చుట్టుముట్టి; పేరు = మిక్కిలి; ఉక్కడింపక = చచ్చిచెడకుండగ; ఇట్లు = ఈ విధముగ; ధృతిన్ = ధైర్యముతో; ఉండగనిచ్చె = ఉండనిచ్చెను; అహో = ఓహో; దురాత్మునిన్ = చెడ్డవానిని; గ్రక్కునన్ = శీఘ్రముగా; తల్లిదండ్రులన్ = తల్లిదండ్రులను; అకల్మష = కల్మషము లేని; చిత్తులన్ = మనసులు గలవారిని; పెద్దలన్ = పెద్దవారిని; మఱి = ఇంకొకటి; ఏ = ఎట్టి; దిక్కును = దిక్కును; లేని = లేనట్టి; వారిన్ = వారిని; పలు = అనేకములైన; త్రిక్కులన్ = చిక్కులను, తిప్పలను; పెట్టుచున్ = పెడుతూ; పాఱదోలితిన్ = వెళ్ళగొట్టాను.

భావము:

అయ్యో! నా భయంకర పాపాగ్ని జ్వాలలు దుర్మార్గుడనైన నన్ను చుట్టుముట్టి కాల్చి భస్మం చెయ్యకుండా ఎందుకు విడిచి పెట్టాయో కదా! నేను తప్ప మరో దిక్కు లేని వృద్ధులైన నా తల్లి దండ్రులను ఎన్నెన్నో బాధలు పెట్టి ఇంటినుండి వెళ్ళగొట్టాను.

6-138-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కృతజ్ఞుఁడ నై విడిచితిఁ
బ్రకృతిం గల బంధువులను బాల్యమున ననున్
వికృతిఁ జనకుండఁ బెంచిన
సుకృతుల మజ్జనకవరుల శోభనకరులన్.

టీకా:

అకృతజ్ఞుడను = కృతజ్ఞత లేనివాడను; ఐ = అయ్యి; విడిచితిన్ = విడిచిపెట్టితిని; ప్రకృతిన్ = సహజ సిద్ధముగ; కల = కలిగిన; బంధువులను = బంధువులను; బాల్యమున = చిన్నతనములో; ననున్ = నన్ను; వికృతిన్ = రోగము లందు; చనకుండన్ = పడకుండగ; పెంచిన = పెంచినట్టి; సుకృతులన్ = మంచి పనులు చేయువారిని; మత్ = నా యొక్క; జనకవరులన్ = ఉత్తమ తల్లిదండ్రులను; శోభనకరులన్ = శుభములను కలిగించువారిని.

భావము:

కృతఘ్నుడనై ఆత్మీయులైన చుట్టాలను, చిన్నప్పుడు ఏ లేటు లేకుండా నన్ను పెంచి పెద్ద చేసిన పుణ్యాత్ములను, నా మేలు కోరే నా దాయాదులను వదలివేశాను.

6-139-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అప్పుడు.

టీకా:

అప్పుడు = ఆ సమయమున.

భావము:

ఆ సమయంలో...

6-140-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పెక్కు పాతకముల భృశదారుణం బైన
దొడ్డ నరకమందుఁ డ్డ నున్న
నాపదలకుఁ బాపి రికట్టి రక్షించి
రిట్టి ధర్మపురుషు లెందు వారొ?

టీకా:

పెక్కు = అనేకములైన; పాతకములన్ = పంచమహాపాపములను {పాతకములు - 1స్వర్ణస్థేయము 2సురాపానము 3బ్రహ్మహత్య 4గురుపత్నీగమనము 5ఇవి చేయువారి తోడి స్నేహము, పంచమహాపాతకములు}; భృశ = మిక్కిలి; దారుణంబు = భయంకరము; ఐన = అయిన; దొడ్డ = గొప్ప; నరకము = నరకము; అందున్ = లో; పడ్డనున్నన్ = పడిపోవుచున్న; ఆపదలు = ఆపదల; కున్ = నుండి; పాపి = పోగొట్టి; అరికట్టి = ఆపివేసి; రక్షించిరి = కాపాడిరి; ఇట్టి = ఇటువంటి; ధర్మ = ధర్మబద్ధమైన; పురుషులు = వీరు; ఎందువారో = ఎక్కడివారో.

భావము:

ఎన్నెన్నో పాపాలకు ఒడిగట్టి అత్యంత భయంకరమైన నరకంలో పడి కొట్టుకొని పోతున్న నన్ను దయతలచి అడ్డుకొని ఆపదలు బాపి రక్షించిన ఆ పుణ్యపురుషు లెవరో? ఎక్కడివారో?

6-141-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చోద్యంబై కలవోలె నీ క్షణమునం జూడంగఁ బ్రత్యక్షమై
వేద్యం బయ్యెను నన్ను నీడ్చిన మహావీరుల్ భృశోదగ్రు లా
యుద్యోగంబులవారు పాశధరు లీ యుత్సాహముల్ మాని సం
పాద్యానేక వికారరూప కుటిలప్రఖ్యాతు లెందేగిరో?

టీకా:

చోద్యంబు = ఆశ్చర్యకరము; ఐ = అయ్యి; కల = స్వప్నము; పోలెన్ = వలె; ఈ = ఈ; క్షణమునన్ = క్షణములోనే; చూడంగన్ = చూచుచుండగ; ప్రత్యక్షము = ప్రత్యక్షము; ఐ = అయ్యి; వేద్యంబు = తెలియబడువారు; అయ్యెను = అయ్యెను; నన్నున్ = నన్ను; ఈడ్చిన = బయటకీడ్చిన; మహా = గొప్ప; వీరుల్ = వీరులు; భృశ = మిక్కిలి; ఉదగ్రులు = విజృంభించినవారు; ఆ = ఆ; ఉద్యోగంబులవారు = ప్రయత్నశీలురు; పాశ = యమపాశములను; ధరులు = ధరించినవారు; ఈ = ఈ; ఉత్సాహముల్ = విజృంభణములు; మాని = వదలివేసి; సంపాద్య = సాధించదగిన; అనేక = అనేకమైన; వికార = వికారపు; రూప = రూపములుగల; కుటిల = వంకర మార్గములు; ప్రఖ్యాతులు = బాగుగాతెలిసినవారు; ఎందున్ = ఎక్కడకు; ఏగిరో = వెళ్ళినారో.

భావము:

ఆశ్చర్యంగా కలలా అనిపించి మరుక్షణంలో ప్రత్యక్షంగా కనిపించింది. నన్ను మృత్యుపాశాలలో బంధించి ఈడ్చుకొని వచ్చిన ఆ భయంకర స్వరూపాలు గల మహావీరులు, వికృతాకారులు, వక్రమార్గ సంచారులు తమ ఉద్రేకాన్ని, ఉత్సాహాన్ని వదలిపెట్టి ఎక్కడికి వెళ్ళారో?

6-142-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దారుణ పాశబంధన విధానములన్ నరకార్ణవంబులోఁ
గూరిన నన్ను నేఁడు చెడకుండ నొనర్చిన పుణ్యమూర్తు లం
భోరుహనేత్రు లుజ్జ్వల నభోమణితేజులు లోచనోత్సవుల్
చారుదయా సమంచిత విచారులు నల్వురు నెందు నేఁగిరో?

టీకా:

దారుణ = భయంకరమైన; పాశ = యమపాశములచే; బంధన = బంధించబడిన; విధానములన్ = పద్ధతులలో; నరక = నరకము యనెడి; ఆర్ణవము = సముద్రములో; లోన్ = లో; కూరిన = కూరుకుపోయిన; నన్ను = నన్ను; నేడు = ఈ దినమున; చెడకుండ = చెడిపోకుండగ; ఒనర్చిన = చేసిన; పుణ్య = పుణ్యమే; మూర్తులు = స్వరూపముగా గలవారు; అంభోరుహ = పద్మమువంటి {అంభోరుహము - అంభస్ (నీరు) యందు రుహము (పుట్టినది), పద్మము}; నేత్రులు = కన్నులు గలవారు; ఉజ్జ్వల = మిక్కిలి కాంతివంతమైన; నభోమణి = సూర్యుని వంటి {నభోమణి - నభస్ (ఆకాశమునకు) మణి (మణి వంటి వాడు), సూర్యుడు}; తేజులు = తేజస్సు గలవారు; లోచన = కన్నులకు; ఉత్సవుల్ = ఉత్సాహము కలిగించువారు; చారు = చక్కటి; దయా = దయతో; సమంచిత = కూడిన; విచారులు = విచారించుటలు గలవారు; నల్వురు = నలుగురు (4); ఎందున్ = ఎక్కడకు; ఏగిరో = వెళ్ళినారో.

భావము:

భయంకరమైన పాశబంధాలతో నరక సముద్రంలో పడుతున్న నన్ను నాశనం కాకుండా రక్షించిన పుణ్యమూర్తులు, కమలనేత్రులు, సూర్యతేజులు, కనువిందు చేసేవాళ్ళు, దయాసముద్రులు అయిన ఆ నలుగురు ఎక్కడికి వెళ్ళిపోయారో?

6-143-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ను రక్షించిన పుణ్యవంతులు కనన్నాళీకపత్రాక్షు లం
సంకాశులు శంఖచక్రధరు లాజానూరుబాహుల్ స్మితా
ను లాలంబిత కర్ణవేష్టన సువర్ణచ్ఛాయ దివ్యాంబరుల్
కారుణ్య రసైకపూర్ణులు సమగ్రస్ఫూర్తి నెం దేఁగిరో?

టీకా:

ననున్ = నన్ను; రక్షించిన = కాపాడినట్టి; పుణ్యవంతులు = పుణ్యాత్ములు; కనత్ = తళుక్కుమంటున్న; నాళీకపత్ర = పద్మపత్రములవంటి; అక్షులు = కన్ను లున్నవారు; అంజన = కాటుకు; సంకాశులు = సమానమైన వర్ణము గలవారు; శంఖ = శంఖము; చక్ర = చక్రమును; ధరులు = ధరిండెడివారు; ఆజాను = మోకాళ్ళవరకు తాకుతున్న; ఉరు = పెద్ద; బాహులు = చేతులుగలవారు; స్మిత = చిరునవ్వుగల; ఆననులు = ముఖము గలవారు; ఆలంబిత = వేళ్ళాడుతున్న; కర్ణవేష్టన = కుండలములు, చెవిపోగులు; సువర్ణ = బంగారు; ఛాయ = రంగు; దివ్య = దివ్యమైన; అంబరుల్ = వస్త్రములు గలవారు; ఘన = అతిగొప్ప; కారుణ్య = దయా; రస = రసము; ఏక = అంతయు; పూర్ణులు = నిండినవారు; సమగ్ర = సంపూర్ణమైన; స్ఫూర్తిన్ = శోభతో; ఎందున్ = ఎక్కడకు; ఏగిరో = వెళ్ళినారో.

భావము:

నన్ను రక్షించిన ఆ పుణ్యమూర్తులు, పద్మాక్షులు, నీలవర్ణులు, శంఖచక్రాలను ధరించినవాళ్ళు, ఆజానుబాహులు, కనకాంబర ధారులు, చిరునవ్వు లొలకబోసే ముఖాలు కలిగినవాళ్ళు, భుజాల వరకు వ్రేలాడే మకర కుండలాలను ధరించినవాళ్ళు, కరుణారస పరిపూర్ణులు, పూర్ణశోభతో కూడిన ఆ మహాత్ములు ఎక్కడికి వెళ్ళిపోయారో?

6-144-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పాతకుండ నగు నాకు నవ్విబుధోత్తమ దర్శనంబు పురాకృతంబగు మదీయ పుణ్య విశేషంబునం గాని పొంద శక్యంబు గాదు; తత్సందర్శనం బాత్మకు నతిసుప్రసన్నంబయి యొప్పె; నట్లు గాకుండెనేనిఁ గలుషవర్తనంబున వృషలీభర్తనై యుండి మృతిఁ బొందుచున్న నాదు జిహ్వకు శ్రీమన్నారాయణనామ గ్రహణంబు సంభవింప నేరదు; మఱియును.

టీకా:

పాతకుండను = పాతకములు యొనర్చువాడను; అగు = అయిన; నా = నా; కున్ = కు; ఆ = ఆ; విబుధ = దేవతా; ఉత్తమ = శ్రేష్ఠుల యొక్క; దర్శనంబు = దర్శనము; పురాకృతంబు = పూర్వజన్మములలో చేసినట్టివి; అగు = అయిన; మదీయ = నా యొక్క; పుణ్య = పుణ్యముల; విశేషంబునన్ = ప్రత్యేకతవలన; కాని = కాని; పొందన్ = పొందుటకు; శక్యంబు = సాధ్యము; కాదు = కాదు; తత్ = వారి; సందర్శనంబు = చక్కటి దర్శనము; ఆత్మ = మనసున; కున్ = కు; అతి = మిక్కిలి; ప్రసన్నంబు = ప్రసన్నతకలది; అయి = అయ్యి; ఒప్పెన్ = చక్కగానున్నది; అట్లు = ఆ విధముగ; కాకుండెనేని = కాకపోయినచో; కలుష = పాపపు; వర్తనంబున = ప్రవర్తనములతో; వృషలీ = స్వైరిణి యొక్క; భర్తను = మొగుడను; ఐ = అయ్యి; ఉండి = ఉండినను; మృతి = మరణము; పొందుచున్న = పొందుచున్నట్టి; నాదు = నా యొక్క; జిహ్వ = నాలుక; కున్ = కు; శ్రీమన్నారాయణ = శ్రీహరి; నామ = నామమును; గ్రహణంబు = స్వీకరించుట; సంభవింపన్ = కలుగుట; నేరదు = సాధ్యముగాదు; మఱియును = ఇంకను.

భావము:

పాపాత్ముడనైన నాకు ఆ దేవతా శ్రేష్ఠుల సందర్శనం పూర్వ జన్మలో చేసిన పుణ్యవిశేషం వల్లనే కాని లభించదు. వాళ్ళ దర్శనం నా ఆత్మకు ఎంతో ఆనందాన్ని చేకూర్చింది. అలా కాకుంటే పాపవర్తనంతో స్వైరిణికి భర్తనై మరణిస్తున్న సమయంలో నా నాలుకకు భగవంతుని నామాన్ని ఉచ్చరించే భాగ్యం ఎలా అబ్బుతుంది?

6-145-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పాతకుండ జడుఁడ బ్రహ్మఘాతుకుఁడను
మాన లోభ మోహ త్సరుండ
నాకు నెట్లు దొరకు? నారాయణుని దివ్య
నామ విమల కీర్తనంబు మదికి.

టీకా:

పాతకుండన్ = మహాపాపిని; జడుడన్ = తెలివితక్కువవాడిని; బ్రహ్మఘాతకుడను = బ్రహ్మహత్య చేసినవాడను; మాన = అభిమానము; లోభ = లోభము; మోహ = మోహ; మత్సరుండన్ = మత్సరములుగలవాడను; నా = నా; కున్ = కు; ఎట్లు = ఏ విధముగ; దొరకు = దొరకును; నారాయణుని = విష్ణుమూర్తి యొక్క; దివ్య = దివ్యమైన; నామ = నామమును; విమల = స్వచ్ఛమైన; కీర్తనంబు = కీర్తించుటలు; మది = మనసున; కి =కు.

భావము:

నేను పాపాత్ముణ్ణి, మూర్ఖుణ్ణి, బ్రహ్మహత్య చేసినవాణ్ణి, దురభిమానం పిసినిగొట్టుతనం మోహం మాత్సర్యం కలిగినవాణ్ణి. అటువంటి నాకు ఆ భగవంతుని దివ్యనామ సంకీర్తనం ఎలా దొరుకుతుంది?

6-146-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దారుణ మోహాంధకార పూరితుఁడను-
రి విస్మయస్మరణార్హ మతినె?
పంచ మహాతీవ్ర పాతకోపేతుఁడ-
రి విస్మయస్మరణార్హ మతినె?
కౌటిల్య కితవ వికార పారీణుండ-
రి విస్మయస్మరణార్హ మతినె?
ఖిల దుఃఖైక ఘోరార్ణవ మగ్నుండ-
రి విస్మయస్మరణార్హ మతినె?

6-146.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిందలకు నెల్ల నెలవైన నిర్గుణుండ
మందభాగ్యుండ నే నేఁడ? ధువిదారి
దివ్య గుణనామ కీర్తన తెఱఁ గదేడఁ?
బూర్వ సుకృతంబు లే కెట్లు పొందఁ గలుగు? "

టీకా:

దారుణ = భయంకరమైన; మోహ = మోహము యనెడి; అంధకార = చీకటితో; పూరితుండను = నిండినవాడను; హరి = నారాయణుని; విస్మయ = ఆశ్చర్యకర వైభవములను; స్మరణ = స్మరించుటకు; అర్హ = అర్హత గల; మతినె = మనసు గలవాడనా ఏమి; పంచ = ఐదు; మహా = మిక్కిలి; తీవ్ర = తీవ్రమైన; పాతక = మహాపాపములతో {పంచమహాపాతకములు - 1స్వర్ణస్థేయము 2సురాపానము 3బ్రహ్మహత్య 4గురుపత్నీగమనము 5ఇవిచేయువారితోడి స్నేహము}; ఉపేతుడన్ = కూడినవాడను; హరి = నారాయణుని; విస్మయ = ఆశ్చర్యకర వైభవములను; స్మరణ = స్మరించుటకు; అర్హ = అర్హత గల; మతినె = మనసు గలవాడనా ఏమి; కౌటిల్య = కుటిలత్వము; కితవ = జూదరుల, మోసగాళ్ళ; వికార = వికృతలక్షణములలో; పారీణుండన్ = ఆరితేరినవాడను; హరి = నారాయణుని; విస్మయ = ఆశ్చర్యకర వైభవములను; స్మరణ = స్మరించుటకు; అర్హ = అర్హత గల; మతినె = మనసు గలవాడనా ఏమి; అఖిల = సమస్తమైన; దుఃఖ = దుఃఖముల; ఏక = నిండిన; ఘోర = భయంకరమైన; ఆర్ణవ = సముద్రమున; మగ్నుండ = మునిగినవాడను; హరి = నారాయణుని; విస్మయ = ఆశ్చర్యకర వైభవములను; స్మరణ = స్మరించుటకు; అర్హ = అర్హత గల; మతినె = మనసు గలవాడనా ఏమి;
నిందల్ = నిందింపబడుటలు; కున్ = కు; ఎల్ల = సమస్తమునకు; నెలవు = స్థానము; ఐన = అయినట్టి; నిర్గుణుండ = గుణహీనుండను; మంద = అతి తక్కువ; భాగ్యుండ = సౌభాగ్యములు గలవాడను; నేను = నేను; ఏడ = ఎక్కడ; మధువిదారి = నారాయణుని {మధువిదారి - మధు యనెడి రాక్షసుని విదారి (సంహరించినవాడు), విష్ణువు}; దివ్య = దివ్యమైన; గుణ = గుణములు గలిగిన; నామ = నామమును; కీర్తన = కీర్తించెడి; తెఱగు = దారి, విధానము; అది = అది; ఏడ = ఎక్కడ; పూర్వ = పూర్వజన్మల; సుకృతము = పుణ్యము; లేక = లేకుండగ; ఎట్లు = ఏ విధముగ; పొందగలుగు = పొందగలుగును.

భావము:

భయంకరమైన మోహమనే చీకటిలో నిండిన నేను, తీవ్రమైన పంచ మహా పాపాలతో కూడిన నేను, కుటిల స్వభావంతో జూదగాడినైన నేను, నానా విధాలుగా దుఃఖసముద్రంలో మునిగి తేలుతున్న నేను విస్మయాన్ని కలిగించే హరి నామ స్మరణకు అర్హుణ్ణి ఎలా అవుతాను? నిందలకు నిలయమైనవాణ్ణి, గుణహీనుణ్ణి, దురదృష్టవంతుణ్ణి నే నెక్కడ? భగవంతుని పవిత్ర నామాన్ని ఆలపించడం ఎక్కడ? ఇదంతా పూర్వపుణ్యం లేనిదే ఎలా సాధ్యం?

6-147-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని వితర్కించి.

టీకా:

అని = అని; వితర్కించి = విచారించుకొని.

భావము:

అని విచారించుకొని...

6-148-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

" చిత్తేంద్రియమారుతుండ నగుచున్ త్నం బొనర్తున్ హరి
వ్ర సంపత్తికిఁ బుణ్యవృత్తికిఁ జిదావాసోన్ము ఖాసక్తికిన్
యు నిర్వాణ పదానురక్తికి సుఖోద్యోగక్రియాశక్తికిన్
ధృతి లబ్ధోత్తమ ముక్తికిన్ సకల ధాత్రీధుర్య సద్భక్తికిన్.

టీకా:

యత = నియమింపబడిన; చిత్త = మనసు; ఇంద్రియ = ఇంద్రియములు; మారుతుండన్ = ప్రాణవాయువులు గలవాడను; అగుచున్ = అగుచూ; యత్నంబు = ప్రయత్నము; ఒనర్తున్ = చేసెదను; హరి = నారాయణుని; వ్రత = వ్రతము యనెడి; సంపత్తి = సంపద; కిన్ = కోసము; పుణ్య = పుణ్యవంతమైన; వృత్తి = వర్తనమున; కిన్ = కోసము; చిత్ = చైతన్యమున; ఆవాస = వసించెడి స్థానమునకు; ఉన్ముఖ = వెళ్లెడి; ఆసక్తి = ఆసక్తి కలిగి యుండుట; కిన్ = కోసము; యుత = కూడిన; నిర్వాణపద = మోక్షపదము నందు; అనురక్తి = ప్రీతి; కిన్ = కోసము; సుఖ = మోక్షసుఖమునకైన; ఉద్యోగ = సంకల్పమును; క్రియాశక్తి = నడిపించెడి శక్తి; కిన్ = కోసము; ధృతి = తప్పక; లబ్ధ = లభించెడి; ఉత్తమ = శ్రేష్ఠమైన; ముక్తి = మోక్షపదమున; కిన్ = కి; సకల = సమస్తమైన; ధాత్రీ = భూమండలమును; ధుర్య = భరించగల; సత్ = గొప్ప; భక్తి = భక్తి; కిన్ = కి.

భావము:

నేను నా మనస్సును, ఇంద్రియాలను, శ్వాసను నియంత్రించి శ్రీమన్నారాయణుని శరణు పొందుతాను. శ్రీహరి భక్తి సమస్త విశ్వానికి ఆధారమైనది. పుణ్యప్రవృత్తికి మూలమైనది. ఆత్మజ్ఞానానికి ఆలవాలమైనది. మోక్షమార్గానికి సాధనమైనది. సుఖంగా సుముఖంగా ముందుకు నడిపించేది. ధైర్యాన్ని చేకూర్చి దైన్యాన్ని పోగొట్టేది.

6-149-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విడిచితి భవబంధంబుల
డఁచితి మాయావిమోహ మైన తమంబు
న్నొడిచితి నరివర్గంబులఁ
చితి నా జన్మ దుఃఖ ర్మార్ణవమున్.

టీకా:

విడిచితి = వదలేసాను; భవ = సాంసారిక; బంధంబులన్ = బంధములను; అడచితి = అణచివేసుకొన్నా; మాయా = మాయతో కూడిన; విమోహము = మోహ పూరితం; ఐన = అయిన; తమంబున్ = అజ్ఞానాన్ని; ఒడిచితిన్ = జయించాను; అరివర్గంబులన్ = అరిష్వర్గంబులను {అరిష్వర్గంబులు - 1 కామ 2క్రోధ 3మోహ 4లోభ 5మద 6మాత్సర్యములు}; గడచితిన్ = దాటేసాను; ఆజన్మ = జనన మరణా లనే; దుఃఖ = దుఃఖ పూరిత; కర్మ = కర్మబందాల; ఆర్ణవమున్ = సముద్రమును.

భావము:

భవబంధాలను విడిచివేశాను. మాయతో కూడిన అజ్ఞానాంధకారాన్ని అణచివేశాను. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే ఆరుగురు శత్రువులను జయించాను. జనన మరణాలనే సముద్రాన్ని తరించాను.

6-150-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యోషిద్రూపంబున నను
నేణ ముఖగహ్వరమున నెగ మ్రింగి కడున్
ద్వేమున గోతి నేసిన
దోద యగు నాత్మ మాయఁ దొలఁగం గంటిన్. "

టీకా:

యోషిత్ = స్త్రీ; రూపంబునన్ = రూపములో; నను = నన్ను; ఈషణ = కోరికలలెడి; ముఖ = ముఖముయొక్క; గహ్వరమునన్ = గుహ, నోటితో; ఎగన్ = అవశ్యము; మ్రింగి = మింగేసి; కడున్ = మిక్కిలి; ద్వేషమునన్ = ద్వేషముతో; గోతిన్ = గోతిలోనికి; ఏసిన = తోసేసిన; దోషద = దోషములనుకలిగించెడిది; అగు = అయిన; ఆత్మ = మనసు యొక్క; మాయన్ = మాయను; తొలగన్ = తొలగించుకొన; కంటిన్ = కలిగితిని.

భావము:

జారస్త్రీ రూపంతో ఎదురు వచ్చి కోరికలు అనే నోరు తెరచి మాయ నన్ను మ్రింగివేసింది. ద్వేషంతో నన్ను గోతిలోకి దించింది. కోతిని చేసి ఆడించింది. అటువంటి దోషభూయిష్టమైన మాయ నుండి తొలగి బైటపడ్డాను.

6-151-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లు వైష్ణవజ్ఞానదీపం బాత్మస్నేహంబునం దోఁచిన నా బ్రాహ్మణుండు.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; వైష్ణవ = విష్ణుమూర్తి గురించిన; జ్ఞాన = జ్ఞానము యనెడి; దీపంబున్ = దీపమును; ఆత్మ = పరమాత్మతో; స్నేహమును = ప్రేమను; తోచిన = పొంది నట్టి; ఆ = ఆ; బ్రాహ్మణుండు = బ్రాహ్మణుడు.

భావము:

అని ఈ విధంగా హృదయంలో ఆత్మజ్ఞానమనే తైలంతో బ్రహ్మజ్ఞానమనే దీపం ప్రకాశించిగా ఆ బ్రాహ్మణుడు...

6-152-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వద్ధర్మపరాయ ణోత్తముల సంభాషైక మంత్రంబులన్
మిగులన్ జ్ఞానము పుట్ట మోహ భవ సమ్మిశ్రాత్మ బంధంబులన్
తె ఖండించి సబంధు మిత్ర సుత పత్నీ మోహ విశ్రాంతుఁడై
తీనాథు రమేశు కృష్ణుని దయైశ్వర్యంబులం గోరుచున్.

టీకా:

భగవత్ = భగవంతుని; ధర్మ = ధర్మము నందు; పరాయణ = లగ్నమైనవారిలో; ఉత్తముల = శ్రేష్ఠుల యొక్క; సంభాష = మాట లనెడి; ఏక = ముఖ్య; మంత్రంబులన్ = మంత్రములను; మిగులన్ = మిక్కిలి; జ్ఞానము = జ్ఞానము; పుట్టన్ = కలుగగ; మోహ = మోహము; భవ = సంసారముల; సమ్మిశ్ర = కూడిన; ఆత్మ = ఆత్మ; బంధంబులన్ = బంధములను; తెగ = తెగ; ఖండించి = గొట్టి; స = కలిగిన; బంధు = బంధువులు; మిత్ర = మిత్రులు; సుత = పుత్రులు; పత్నీ = భార్య లందలి; మోహ = మోహమునండి; విశ్రాంతుడు = వదలివేసినవాడు; ఐ = అయ్యి; జగతీనాథున్ = నారాయణుని {జగతీ నాథుడు - జగతిన్ (లోకములకు) నాథుడు (ప్రభువు), విష్ణువు}; రమేశున్ = నారాయణుని {రమేశుడు - రమ (లక్ష్మీదేవి) కి ఈశుడు (భర్త), విష్ణువు}; కృష్ణుని = నారాయణుని; దయ = కృప; ఐశ్వర్యంబులన్ = ఐశ్వర్యములను; కోరుచున్ = కోరుకొనుచు.

భావము:

అతడు భగవద్భక్తులైన ఉత్తమ పురుషులతో జరిపిన సంభాషణలే మంత్రాలై జ్ఞానాన్ని చేకూర్చాయి. మోహం వల్ల కలిగిన సంసార బంధాలన్నీ తెగిపోయాయి. బంధువులు, మిత్రులు, కుమారులు, భార్యలు అనే వ్యామోహం నశించింది. జగన్నాథుడు, లక్ష్మీవల్లభుడు అయిన కృష్ణుని దయ అనే భాగ్యాన్ని కోరుకున్నాడు.

6-153-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రిభక్తులతో మాటలు
నెన్నఁడుఁ జెడని పుణ్యనముల మూటల్
ముక్తికాంత తేటలు
రిషడ్వర్గంబు చొరని రుదగు కోటల్.

టీకా:

హరి = నారాయణుని; భక్తుల = భక్తుల; తో = తోటి; మాటలు = సంభాషణములు; ధరన్ = భూమిపైన; ఎన్నడున్ = ఎప్పటికి; చెడని = చెడిపోని; పుణ్య = పుణ్యము యనెడి; ధనముల = సంపదల; మూటల్ = మూటలు; వర = ఉత్తమమైన; ముక్తి = ముక్తి యనెడి; కాంత = స్త్రీ యొక్క; తేటలు = సుద్దులు స్వచ్ఛమైన ప్రసంగములు; అరిషడ్వర్గంబు = అరిషడ్వర్గములు; చొరని = ప్రవేశించలేని; అరుదగు = అద్భుతమైన; కోటల్ = కోటలు.

భావము:

హరిభక్తులతో మాట్లాడే మాటలు ఎన్నటికీ చెడిపోని పుణ్యధనాలు, మోక్షలక్ష్మి విహరించే తోటలు. కామక్రోధాది శత్రువులు ప్రవేశింపరాని అద్భుతమైన కోటలు.

6-154-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుచు నా బ్రాహ్మణుం తి తత్త్వవేదియై-
వబంధముల నెల్లఁ బాఱఁ దోలి
మొనసి గంగాద్వారమున కేగి యచ్చటఁ-
బ్రబ్బిన దేవతావనమందు
నాసీనుఁడై యోగ మాశ్రయించి చెలంగు-
దేహేంద్రియాదుల తెరువువలన
నుఁ బాపుకొని పరత్త్వంబుతోఁ గూర్చి-
మానుగా నాత్మసమాధిచేత

6-154.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గుణగణంబుఁ బాసి కొమ రొప్పిన భగవ
నుభవాత్మయందు నాత్మఁ గలిపి
మణఁ దన్ను మొదల క్షించినట్టి యా
పురుషవరులఁ గాంచి పొసఁగ మ్రొక్కె.

టీకా:

అనుచున్ = అనుచూ; ఆ = ఆ; బ్రాహ్మణుండు = బ్రాహ్మణుడు; అతి = మిక్కిలి; తత్త్వవేది = తత్త్వము తెలిసిన వాడు; ఐ = అయ్యి; భవబంధములన్ = సంసారబంధములను; ఎల్లన్ = సర్వమును; పాఱదోలి = వదలివేసి; మొనసి = పూని; గంగా = గంగానది యొక్క; ద్వారమున్ = ద్వారమున; కున్ = కు; ఏగి = వెళ్ళి; అచ్చటన్ = అక్కడ; ప్రబ్బిన = వర్తిల్లుచున్న; దేవతాభవనము = దేవాలయము; అందున్ = లో; ఆసీనుడు = కూర్చొన్నవాడు; ఐ = అయ్యి; యోగమున్ = యోగాభ్యాసమును; ఆశ్రయించి = అభ్యసించుట ద్వారా; చెలంగు = చెలరేగెడు; దేహ = శరీరము; ఇంద్రియ = ఇంద్రియములు; ఆదులన్ = మొదలైనవాని; తెరువు = వర్తనల; వలన = వలన; తన్ను = తనను; పాపుకొని = దూరము చేసికొని; పరతత్త్వంబు = పరబ్రహ్మతత్త్వము; తోన్ = తోటి; కూర్చి = కలిపి; మానుగాన్ = మనోజ్ఞముగా; ఆత్మసమాధి = యోగసమాధి; చేత = ద్వారా.
గుణగణంబున్ = త్రిగుణ సమూహమును; పాసి = వదలివేసి; కొమరొప్పిన = పరిపక్వమైన; భగవత్ = భగవంతుని యొక్క; అనుభవాత్మ = అనుభవము నిచ్చెడి యాత్మ; అందున్ = లో; ఆత్మన్ = తన యాత్మను; కలిపి = కలిపేసి; రమణన్ = మనోజ్ఞముగా; మొదలన్ = ఇంతకు ముందు; రక్షించిన = తనను కాపాడిన; అట్టి = అటువంటి; ఆ = ఆ; పురుషవరులన్ = ఉత్తములను; కాంచి = దర్శించి; పొసగన్ = తగ్గట్టు; మ్రొక్కె = కొలిచెను.

భావము:

అని ఆ బ్రాహ్మణుడైన అజామిళుడు గొప్ప తత్త్వజ్ఞానియై, సంసార బంధాలన్నిటినీ పారద్రోలి గంగా ద్వారానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న ఒక దేవాలయంలో కూర్చొని యోగమార్గాన్ని ఆశ్రయించాడు. దేహం ఇంద్రియాలు మొదలైన వాని మార్గం నుండి విడివడి తన యోగ సమాధి ద్వారా పరతత్త్వంతో జోడించాడు. త్రిగుణాతీతుడై తన ఆత్మను పరమాత్మలో లీనం చేశాడు. అప్పుడు అతనికి మొదట తనను రక్షించిన ఆ దివ్యపురుషులు కనిపించారు. అతడు వారికి నమస్కరించాడు.

6-155-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లజామిళుండు యోగమార్గంబున దేహంబు విడిచి పుణ్య శరీరుండై యగ్రభాగంబునం బ్రాగుపలబ్ధులైన మహాపురుష కింకరులం గాంచి, సమంచిత రోమాంచిత చలచ్ఛటాపింజరిత స్వేదబిందుసందోహ మిష నిష్యంద మహానందవల్లీకామతల్లికాంకుర సంకుల పరిశోభిత తనుండును, హర్ష నికర్షమాణ మానసోద్యోగ యోగప్రభావోత్సాహ విస్మయ మందస్మిత కందళిత ముఖారవిందుండును, నిఖిల జగజ్జేగీయమానాఖండ శుభప్రద శుభాకార సందర్శన సమాసాదిత కుతూహల మానసుండును నై, ప్రణామంబు లాచరించుచు భాగీరథీ తీరంబునఁ గళేబరంబు విడిచి, తత్క్షణంబ హరిపార్శ్వవర్తు లైన దాసవరుల స్వరూపంబుఁ దాల్చి, యా విష్ణుసేవకులతోడం గూడి దివ్య మణిగణఖచితంబై సువర్ణమయంబైన యసమాన విమానం బెక్కి, నిఖిలానంద భోగభాగ్యానుభ వాకుంఠితం బైన వైకుంఠనగరంబునకు శ్రీమన్నారాయణ పదారవింద సేవాచరణ పరిమాణ స్థితికిం జనియెను; నిట్లు విప్లావిత సర్వధర్ముండైన దాసీపతి, గర్హిత కర్మంబులచేతఁ బతితుండును, హతవ్రతుండును నై నరకంబునం గూలుచుండి భగవన్నామ గ్రహణంబున సద్యోముక్తుం డయ్యెఁ; గావున.

టీకా:

అట్లు = ఆ విధముగ; యోగమార్గంబునన్ = యోగమార్గములో; దేహంబు = శరీరమును; విడిచి = వదలి; పుణ్యశరీరుండు = పుణ్యవంతమైన దేహము గలవాడు; ఐ = అయ్యి; అగ్ర = ముందు; భాగంబునన్ = భాగములో; ప్రాక్ = ఇంతకు ముందు; లబ్ధులు = దర్శనమిచ్చిన వారు; ఐన = అయిన; మహాపురుష = నారాయణుని; కింకరులన్ = సేవకులను; కాంచి = చూసి; సమంచిత = చక్కగా నొప్పుచున్న; రోమాంచిత = గగుర్పాటు వలన; చలత్ = చలిస్తున్న; చటాపింజరిత = చివళ్ల యందు రంగులు గలిగిన; స్వేదబిందు = చెమటబిందువుల; సందోహ = సమూహము; మిష = అనుపేర; నిష్యంద = కారుతున్న; మహా = గొప్ప; ఆనంద = సంతోష మనెడి; వల్లికామతల్లికా = తీగ యొక్క; అంకుర = చివుళ్ళ; సంకుల = సమూహముచేత; పరిశోభిత = మిక్కిలి శోభ గలిగిన; తనుండును = శరీరము గలవాడును; హర్ష = ఆనందము; నికర్షమాణ = పొంగిపొర్లుతున్న; మానస = మానసిక; ఉద్యోగ = ప్రయత్నపు; యోగ = యోగపు; ప్రభావ = ప్రభావము యొక్క; ఉత్సహ = ఉత్సాహము; విస్మయ = ఆశ్చర్యకరమైన; మందస్మిత = చిరునవ్వుతో; కందళిత = తడసిన; ముఖ = ముఖ మనెడి; అరవిందుండును = పద్మము గలవాడును; నిఖిల = సమస్త; జగత్ = లోకము లందు; జేగీయమాన = కీర్తింపబడుతున్న; అఖండ = అఖండమైన; శుభప్రద = శుభప్రదమైన; శుభాకార = శుభాకారులను; సందర్శన = దర్శించుటవలన; సమాసాదిత = పొందినట్టి; కుతూహల = కుతూహలము గల; మానసుండును = మనసు గలవాడు; ఐ = అయ్యి; ప్రణామంబులు = నమస్కారములు; ఆచరించుచు = చేయుచు; భాగీరథి = గంగానది యొక్క; తీరంబునన్ = తీరములో; కళేబరంబున్ = దేహమును; విడిచి = వదలి; తత్క్షణంబ = ఆ క్షణములోనే; హరి = నారాయణుని; పార్శవర్తులు = అనుచరులు; ఐన = అయిన; దాస = సేవకులలో; వరుల = ఉత్తముల; స్వరూపంబున్ = స్వరూపమును; తాల్చి = ధరించి; ఆ = ఆ; విష్ణు = నారాయణుని; సేవకుల = దాసుల; తోడన్ = తోటి; కూడి = కలిసి; దివ్య = దివ్యమైన; మణి = మణులు; ఖచితంబు = పొదిగినట్టిది; ఐ = అయ్యి; సువర్ణ = బంగారముతో; మయంబున్ = చేయబడినది; ఐన = అయిన; అసమాన = సాటిలేని; విమానంబున్ = విమానమును; ఎక్కి = అధిరోహించి; నిఖిల = సర్వమైన; ఆనంద = సంతోషములు; భోగ = భోగములు; భాగ్య = భాగ్యముల; అనుభవ = అనుభవముల; అకుఠింతంబు = కుంటుపడనిది; ఐన = అయిన; వైకుంఠనగరంబున్ = వైకుంఠపురమున; కున్ = కు; శ్రీమన్నారాయణ = విష్ణుమూర్తి యొక్క; పద = పాదము లనెడి; అరవింద = పద్మములను; సేవా = కొలుచుట వలని; పరిమాణ = అనుభవపు; స్థితి = స్థితి; కిన్ = కి; చనియెన్ = వెళ్ళెను; ఇట్లు = ఈ విధముగ; విప్లావిత = చక్కగా వికసించిన; సర్వ = అఖిల; ధర్ముండు = ధర్మములు గలవాడు; ఐన = అయిన; దాసీపతి = శూద్రస్త్రీ యొక్క భర్త; గర్హిత = నిందార్హమైన; కర్మంబుల = పనులు; చేతన్ = వలన; పతితుండును = పతనమైన వాడును; హత = నష్టమైన; వ్రతుండు = నియమములు గలవాడును; ఐ = అయ్యి; నరకంబునన్ = నరకములో; కూలుచుండి = కూలిపోవుతూ; భగవత్ = భగవంతుని; నామ = నామమును; గ్రహణంబునన్ = గ్రహించుటచేత; సద్యోముక్తుండు = వెంటనే మోక్షము పొందినవాడు; అయ్యె = అయ్యెను; కావున = అందుచేత.

భావము:

ఈ విధంగా అజామిళుడు యోగమార్గం ద్వారా తన శరీరాన్ని విడిచి దివ్యమైన పుణ్యశరీరం ధరించినవాడై తన ఎదుట పూర్వం తనను రక్షించిన విష్ణుకింకరులను చూశాడు. అతని దేహం ఆనందంతో పులకించింది. పారవశ్యంతో ఒడలంతా చెమర్చింది. ఆనందవల్లి చిగుర్చింది. హృదయం హర్షంతో నిండింది. యోగప్రభావం ప్రకాశించింది. విస్మయంతో ఉత్సాహంతో కూడిన మందహాసం అతని ముఖారవిందం మీద చిందులు త్రొక్కింది. సమస్త లోకాలను ప్రకాశింప జేసేదీ, మంగళ ప్రదమైనదీ అయిన భగవంతుని శుభాకారాన్ని సందర్శించాలనే కుతూహలం మనస్సులో కలిగింది. అజామిళుడు విష్ణుదూతలకు చేతులు మోడ్చుతూ గంగాతీరంలో శరీరం విడిచాడు. వెనువెంటనే అతనికి నారాయణ పార్శ్వచరులైన మహాభక్తుల స్వరూపం ప్రాప్తించింది. అనంతరం అతడు విష్ణుదూతలతో కలిసి వైకుంఠ నగరంలో ప్రవేశించి శ్రీమన్నారాయణుని పాదపద్మాలను సేవించే పరిణత దశకు చేరుకున్నాడు. ఈ విధంగా సర్వ ధర్మాలను ఉల్లంఘించినవాడు, దాసీపుత్రిని పెండ్లాడినవాడు, దుష్కర్మల చేత భ్రష్టుడైనవాడు అయిన అజామిళుడు నరకంలో పడబోతూ నారాయణ నామ స్మరణం వల్ల క్షణమాత్రలో మోక్షాన్ని అందుకున్నాడు.

6-156-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్మంబు లెల్లఁ బాయను
ర్మము దెలుపంగ లేదు ధురిపు పేరే
పేర్మిని నొడువుటకంటెను
దుర్మదమునఁ జిత్త మెన్ని త్రోవలఁ జన్నన్.

టీకా:

కర్మంబులు = కర్మలు; ఎల్లన్ = సర్వమును; పాయను = వదలివేసెడి; మర్మము = సుళువు; తెలుపంగ = చెప్పుటకు; లేదు = లేదు; మధురిపు = నారాయణుని {మధు రిపుడు - మధు యనెడి రాక్షసుని శత్రువు, విష్ణువు}; పేరే = నామమే; పేర్మినిన్ = కూర్మితో; నుడువుట = పలుకుట; కంటెను = కంటె; దుర్మదమున = మహచెడ్డ గర్వముతో; చిత్తము = మనసు; ఎన్ని = ఎన్ని రకముల; త్రోవలు = దార్లలో; చన్నన్ = తిరిగినను.

భావము:

కర్మాలన్నీ విడిపోవటానికి వేరే ఉపాయం ఏదీ లేదు. చెప్పిన మాట వినకుండా ఎదురు తిరిగి మనస్సు ఎన్ని మార్గాల్లో పోయినా సర్వదా నారాయణ నామాన్ని ఉచ్చరించటమే సరైన ఉపాయం.

6-157-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పాంవవంశపావన! నృపాలక! యీ యితిహాస మెవ్వఁడే
నొండొక భక్తి లేక విను నోర్పుమెయిం బఠియించు నాతఁ డు
ద్దంత ముక్తికామినికిఁ దానకమై దనుజారిలోకమం
దుండు మహావిభూతి యమదూతల చూడ్కికగోచరాకృతిన్.

టీకా:

పాండవవంశ = పాండవవంశమును; పావన = పవిత్రము చేసినవాడ; నృపాలక = రాజా {నృపాలకుడు - నృ (నరులను) పాలకుడు, రాజు}; ఈ = ఈ; ఇతిహాసమున్ = ఇతిహాసమును; ఎవ్వడేని = ఏవరైనాసరే; ఒండొక = వేరొక దాని పైన; భక్తి = శ్రద్ద; లేక = లేకుండగ; వినున్ = వినునో; ఓర్పు = ఓర్పు; మెయిన్ = కొద్దీ; పఠియించున్ = చదువునో; ఆతడు = అతడు; ఉద్దండత = గట్టిగా; ముక్తి = ముక్తి యనెడి; కామిని = స్త్రీ; కిన్ = కి; తానకము = స్థానము; ఐ = అయ్యి; దనుజారి = నారాయణుని {దనుజారి - దనుజుల (రాక్షసుల)కి అరి (శత్రువు), విష్ణువు}; లోకము = లోకము; అందున్ = లో; ఉండు = ఉండును; మహా = గొప్ప; విభూతిన్ = వైభవముతో; యమదూతల = యమదూతల; చూడ్కి = చూపుల; కిన్ = కి; అగోచర = కనపడని; ఆకృతిన్ = రూపుతో.

భావము:

పాండవ వంశాన్ని పవిత్రం చేసే పరీక్షిన్మహారాజా! ఈ ఇతిహాసాన్ని ఎవడైనా సరే ఏకాగ్రచిత్తంతో విన్నా, చదివినా అతడు ముక్తికాంతకు నెలవై యమదూతలకు కనబడని రూపంతో విష్ణులోకంలో మహావైభవంతో ఉంటాడు.

6-158-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రయఁ బుత్రోపచారిత మైన విష్ణు
నామ మవసానకాలంబును భజించి
శార్ఙ్గి నిలయంబుఁ జేరె నజామిళుండు
నిట్లు సద్భక్తిఁ దలఁచిన నేమిజెప్ప?

టీకా:

అరయన్ = తరచి చూసిన; పుత్ర = కుమారుని యందు; ఉపచారితము = వాడబడినది; ఐన = అయిన; విష్ణు = నారాయణుని; నామము = నామమును; అవసానకాలముననున్ = మరణ సమయమున; భజించి = స్మరించి; శార్ఙ్గి = నారాయణుని; నిలయంబున్ = నివాసమును; చేరెన్ = చేరగలిగెను; అజామిళుండు = అజామిళుడు; ఇట్లు = ఈ విధముగ; సద్భక్తిన్ = మంచి భక్తితో; తలచినన్ = స్మరించినచో; ఏమిచెప్ప = ఏమి చెప్పవలెను.

భావము:

మరణకాలంలో అజామిళుడు తన కుమారుని పేరు పెట్టి పిలిచి విష్ణునామాన్ని ఉచ్చరించిన కారణంగా హరి సాన్నిధ్యాన్ని చేరగలిగాడు. ఇక భక్తితో భగవంతుని నామాన్ని పలికితే చెప్పే దేమున్నది?

6-159-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కోరినవారల కెల్లను
జేరువ కైవల్యపదము శ్రీవరుని మదిం
గోనివారల కెల్లను
దూము మోక్షాప్తి యెన్ని త్రోవలనైనన్."

టీకా:

కోరిన = కోరెడి; వారల = వారి; కిన్ = కి; ఎల్లన్ = అందరకు; చేరువ = దగ్గరగా నుండును; కైవల్యపదము = ముక్తిమార్గము; శ్రీవరుని = నారాయణుని; మదిన్ = మనసున; కోరని = వాంఛించని; వారల = వారి; కిన్ = కి; ఎల్లన్ = అందరకు; దూరము = అందనిది; మోక్షాప్తి = మోక్షప్రాప్తి; ఎన్ని = ఎన్ని రకముల; త్రోవలన్ = మార్గములను; ఐనన్ = అయినప్పటికిని.

భావము:

శ్రీమన్నారాయణుని మనస్సులో కోరుకున్నవారి కందరికీ మోక్షమార్గం సమీపంలో ఉంటుంది. కోరని వారికి ఎన్ని విధాల ప్రయత్నించినా మోక్షమార్గం చాలా దూరంగా పోతుంది.

6-160-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనినం బరీక్షిన్నరేంద్రుం డిట్లనియె "మునీంద్రా! యాజ్ఞాభ్రష్టుం డై యమధర్మరాజు శ్రీవిష్ణు నిర్దేశకులచే విహతులైన భటులచేత వర్ణింపం బడిన నారాయణుని నామప్రభావం బాకర్ణించి, వారల కేమనియె? మఱియు, నెన్నఁడేని యమదండంబు విఫలం బై పోయిన తెఱంగు గలదేని వినవలయు; నీ సందేహంబుఁ బాప మహాత్మా! నీవు దక్కఁ దక్కిన వారలు సమర్థులు గారని తలంచుచున్నవాఁడ; చిత్తంబును బ్రసాదాయత్తంబుగా భవదీయ వచన సుధాధారలం బ్రసాదింపవలయు;" ననిన శుకుం డిట్లనియె.

టీకా:

అనినన్ = అనగా; పరీక్షిత్ = పరీక్షిత్తు యనెడి; నరేంద్రుండు = రాజు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; ముని = మునులలో; ఇంద్రా = ఇంద్రుని వంటివాడ; ఆజ్ఞాభ్రష్టుండు = తన యాజ్ఞ వమ్ము యైనవాడు; ఐ = అయ్యి; యమధర్మరాజు = యమధర్మరాజు; శ్రీవిష్ణు = నారాయణుని; నిర్దేశకుల = అనుయాయుల; చేన్ = చేత; విహతులు = ఓడింపబడినవారు; ఐన = అయిన; భటుల = యమభటుల; చేత = చేత; వర్ణింపబడిన = వర్ణింపబడిన; నారాయణుని = నారాయణుని; నామ = నామము యొక్క; ప్రభావంబు = ప్రభావమును; ఆకర్ణించి = విని; వారల = వారి; కిన్ = కి; ఏమి = ఏమి; అనియె = చెప్పెను; మఱియు = ఇంకను; ఎన్నడేని = ఎప్పుడైనా; యమదండంబు = యముని దండనము; విఫలంబు = వ్యర్థము; ఐపోయిన = అయిపోయిన; తెఱంగు = విధము; కలదేని = ఉన్నచో; వినవలయున్ = వినవలెను; ఈ = ఈ; సందేహంబున్ = అనుమానమును; పాప = పోగొట్టుటకు; మహాత్మ = గొప్పవాడ; నీవు = నీవు; తక్క = తప్పించి; తక్కినవారలు = ఇతరులు; సమర్థులు = తగినవారు; కారు = కారు; అని = అని; తలంచుచున్నవాడ = అనుకొనుచున్నాను; చిత్తంబును = మనసున; ప్రసాద = దయచేయుటకు; ఆయత్తంబుగా = సిద్ధపరచి; భవదీయ = నీ యొక్క; వచన = మాటలు యనెడి; సుధా = అమృతపు; ధారలన్ = ధారలచే; ప్రసాదింపవలయు = అనుగ్రహింపవలసినది; అనిన = అనగా; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అని శుకమహర్షి చెప్పగా పరీక్షిత్తు ఇలా అన్నాడు “మునీంద్రా! తన ఆజ్ఞ వ్యర్థమైన యమధర్మరాజు విష్ణుదూతలచే తిరస్కరింపబడిన తన భటులు వర్ణించిన భగవంతుని నామ ప్రభావాన్ని విని వారితో ఏమన్నాడు? ఇంకా ఎన్నడైనా యమదండనం వ్యర్థమైన సందర్భం ఉన్నదా? ఉంటే వినాలని ఉంది. మహాత్మా! ఈ సందేహాన్ని తొలగించడానికి నీవు కాక సమర్థులు మరెవ్వ రున్నారు? నా హృదయం ఆనందమయం అయ్యేటట్లు నీ వచామృత ధారలు ప్రసాదించు” అని పలుకగా శుకుడు ఇలా అన్నాడు.

6-161-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"శ్రీకృష్ణభటులచేత ని
రాకృతులై యామ్యభటులు మునకు నాత్మ
స్వీకృత విప్రకథా క్రమ
మీ క్రియ ము న్దెలిపి రదియు నెఱింగింతుఁ దగన్.

టీకా:

శ్రీకృష్ణ = నారాయణుని; భటుల = సేవకుల; చేత = చేత; నిరాకృతులు = యత్నభంగమైనవారు; ఐ = అయ్యి; యామ్యభటులు = యమునిభటులు; యమున్ = యమధర్మరాజున; కున్ = కి; ఆత్మ = తమచే; స్వీకృత = ధరింపబడినశ్రీకృష్ణ = నారాయణుని; భటుల = సేవకుల; చేత = చేత; నిరాకృతులు = యత్నభంగ మైనవారు; ఐ = అయ్యి; యామ్యభటులు = యముని భటులు; యమున్ = యమధర్మరాజున; కున్ = కి; ఆత్మ = తమచే; స్వీకృత = ధరింపబడిన; విప్ర = బ్రాహణముని; కథ = కథా; క్రమము = విధమును; ఈ = ఈ; క్రియన్ = విధముగ; మున్ = ముందు; తెలిపిరి = తెలియజేసిరి; అదియున్ = అదికూడ; ఎఱింగింతున్ = తెలిపెదను; తగన్ = చక్కగా.; విప్ర = బ్రాహణముని; కథ = కథా; క్రమము = విధమును; ఈ = ఈ; క్రియన్ = విధముగ; మున్ = ముందు; తెలిపిరి = తెలియజేసిరి; అదియున్ = అదికూడ; ఎఱింగింతున్ = తెలిపెదను; తగన్ = చక్కగా.

భావము:

విష్ణుదూతలచేత తిరస్కరింపబడిన యమదూతలు తమ చేతులలో నుండి విముక్తుడైన బ్రాహ్మణుని కథాక్రమాన్ని యముని ముందు విన్నవించిన విధానాన్ని విశదంగా చెప్తాను.

6-162-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"చేరి త్రైవిధ్యమున మించు జీవతతికిఁ
ర్మఫలములఁ దెలిపెడు కారణంబు
గుచు శిక్షించువార లీ వనిమీఁద
దేవ! యెందఱు గలరయ్య! తెలియవలయు.

టీకా:

చేరి = చేరి; త్రైవిధ్యమునన్ = మూడు రకముల ఫలితములతో {త్రైవిధ్యము - 1హర్ష 2శోక 3భయములు}; మించు = అతిశయించెడి; జీవతతి = సర్వప్రాణుల; కిన్ = కి; కర్మఫలములన్ = చేసిన కర్మలకు ఫలితమును; తెలిపెడు = తెలియజేసెడు; కారణంబులు = కారణభూతులు; అగుచున్ = అగుచూ; శిక్షించు = శిక్షించెడి; వారలు = వారు; ఈ = ఈ; అవని = ప్రపంచము; మీద = అందు; దేవ = భగవంతుడా; ఎందఱు = ఎంతమంది; కలరు = ఉన్నారు; అయ్య = తండ్రి; తెలియవలయు = తెలుపుము.

భావము:

(దూతలు యమునితో ఇలా అన్నారు) “దేవా! సాత్త్విక రాజస తామస స్వభావలతో మూడు విధాల కర్మలు చేసే జీవసమూహానికి వారి వారి కర్మఫలాలకు తగినట్లుగా శిక్షించేవారు ఎందున్నారో తెలియజేయండి.

6-163-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్షిణదిశాధినాయక!
శిక్ష దగం జేయువారు క్షితిఁ బెక్కండ్రే
నీ క్షయమును నక్షయమును
సాక్షాత్తుగ నెందు రెండు సంపన్న మగున్?

టీకా:

దక్షిణదిశాధినాయక = యమధర్మరాజా {దక్షిణదిశాధినాయకుడు - దక్షిణపు దిక్కునకు అధినాయకుడు (ప్రభువు), యమధర్మరాజు}; శిక్ష = శిక్షలను; తగన్ = తగినట్లు; చేయువారు = చేసెడివారు; క్షితిన్ = లోకమున; పెక్కండ్రేని = ఎక్కువమందైతే; ఈ = ఈ; క్షయమున్ = మరణము; అక్షయమున్ = పుట్టుకలు; సాక్షాత్తుగా = ప్రత్యక్షముగ; ఎందున్ = దేనిలో; రెండున్ = రెండును (2); సంపన్నము = సాధింపబడినవి; అగున్ = కలుగుచున్నది.

భావము:

దక్షిణ దిక్కుకు అధిపతివైన ఓ యమధర్మరాజా! శిక్షించేవారు చాలమంది ఉన్నట్లయితే లోకంలో ఈ చావు పుట్టుకలు రెండూ ఎట్లా సంపన్నమౌతాయి?

6-164-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టమైనట్టి కర్మబంముల నెల్ల
నాజ్ఞ బెట్టెడువారు పెక్కైన చోట
కట! శాస్తృత్వ ముపచార య్యెఁ గాదె?
శూరులై నట్టి మండలేశులకుఁ బోలె.

టీకా:

దట్టము = గట్టిది; ఐనట్టి = అయినట్టి; కర్మబంధమునన్ = కర్మబంధములను; ఎల్లన్ = సమస్తమును; ఆజ్ఞపెట్టెడి = శాసించెడి; వారు = వారు; పెక్కైన = చాలా మంది; ఐన = అయిన; చోటన్ = చో; అకట = అయ్యో; శాస్తృత్వము = శాసన పని; ఉపచారము = అలంకారప్రాయపుది, నామమాత్రపుది; అయ్యెగాదె = అయిపోదా ఏమి; శూరులు = వీరులు; ఐనట్టి = అయినట్టి; మండలేశులు = మండలాధికారుల; కున్ = కు; పోలెన్ = వలె.

భావము:

తరగని కర్మబంధాల ననుసరించి శిక్షలను విధించేవారు ఎక్కువైతే శాసకుడు అన్న మాట కేవలం మర్యాద కోసమే కదా! మండలాధిపతులను పరిపాలకు లన్నట్లు నామమాత్రమే అవుతుంది.

6-165-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కావున నీవ యొక్కఁడవ ర్తవు మూఁడు జగంబులందు సం
భావిత భూతకోటిఁ బరిపాకవశంబున శిక్షజేయఁగా
నీ ర శాసనం బఖిలనిర్ణయమై తనరారుచుండ నేఁ
డీలఁ గ్రమ్మఱింప మఱి యెవ్వఁడు శక్తుఁడు? ధర్మపాలనా!

టీకా:

కావున = అందుచేత; నీవ = నీవు మాత్రమే; ఒక్కడవ = ఒక్కడివే; కర్తవు = శాసకుడవు; మూడు = మూడు (3); జగంబులు = లోకములు; అందున్ = లోను; సంభావిత = జన్మంచిన; భూత = జీవ; కోటి = తతికి; పరిపాక = పరిపక్వతను; వశంబునన్ = అనుసరించి; శిక్షజేయగాన్ = శిక్షించుటకు; నీ = నీ యొక్క; వర = ఉత్తమమైన; శాసనంబు = శాసనము; అఖిల = సమస్తమును; నిర్ణయము = నిర్ణయించెడిది; ఐ = అయ్యి; తనరారుచుండన్ = విలసిల్లుతుండగా; నేడు = ఈ దినమున; ఈవల = ఈవిధముగ; క్రమ్మఱింపన్ = మరలించుటకు; మఱి = మఱి; ఎవ్వడు = ఎవరు; శక్తుడు = సమర్థుడు; ధర్మపాలన = యమధర్మరాజ {ధర్మపాలన - ధర్మమును పాలించెడివాడు, యమధర్మరాజు}.

భావము:

కనుక ముల్లోకాలలో జన్మించిన ప్రాణికోటిని కర్మఫలాలను అనుసరించి శిక్షించటానికి నీ వొక్కడవే కర్తవు. నీ శ్రేష్ఠమైన శాసనం అన్నివిధాల తిరుగులేనిది. ఓ ధర్మపాలకా! నీ శాసనాన్ని మరలించడానికి ఈ లోకంలో ఎవడికి సాధ్యం?

6-166-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చం కర తనయ! యొరులకు
దంధరత్వంబు గలదె? గ జగమున ను
ద్దంధరవృత్తి నొత్తిలి
దండింతువు నిన్ను దండరుఁడని పొగడన్.

టీకా:

చండకరతనయ = యమధర్మరాజ {చండకర తనయుడు - చండకర (తీవ్రమైన కిరణములు గల సూర్యుని) తనయుడు, యముడు}; ఒరుల్ = ఇతరులు; కున్ = కు; దండధరత్వంబు = శిక్షించెడి అధికారము; కలదె = ఉన్నదా; తగ = తగ; జగమునన్ = లోకమున; ఉద్దండధర = మిక్కిలి శాసకత్వపు; వృత్తిన్ = విధానముతో; ఒత్తిలి = గట్టిగా; దండింతువు = శిక్షించెదవు; నిన్ను = నిన్ను; దండధరుడు = దండధరుడు; అని = అని; పొగడన్ = కీర్తించుచుండగా.

భావము:

సూర్యుని కుమారుడవైన యమధర్మరాజా! దండించే అధికారం లోకంలో నీకు గాక మరెవ్వరి కున్నది? నీవు దండింప దగినవారిని ఉద్దండంగా దండిస్తావు. అందుకే అందరు నిన్ను దండధరుడని స్తుతిస్తారు.

6-167-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి నీ దండంబ యీ మూఁడుజగములఁ-
దెగువమై నేఁడు వర్తిల్లుచుండ
నుజలోకంబున హితాద్భు తాకార-
సిద్ధుల మిగులఁ బ్రసిద్ధు లైన
వారు నల్వురు వేగ చ్చి నిర్దేశంబు-
భంగించి మమ్మంత చెంగఁదోలి
నీ శాసనంబున నే మీడ్చి కొనువచ్చు-
క్రూరచిత్తునిఁ బుచ్చికొని యదల్చి

6-167.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పాశబంధంబు లీసునఁ ట్టి త్రెంచి
లిమి మిగులంగ మమ్మును బాఱఁదోలి
యిచ్ఛఁ జనినారు వారు దా మెచటివార
లాదరమ్మున మాకు నేఁ డానతిమ్ము. "

టీకా:

ఇట్టి = ఇటువంటి; నీ = నీ యొక్క; దండంబ = శిక్ష; ఈ = ఈ; మూడుజగములన్ = ముల్లోకము లందు {ముల్లోకములు - 1స్వర్గలోకము 2మర్త్యలోకము 3పాతాళలోకము}; తెగువము = తిరుగులేనిది; ఐ = అయ్యి; నేడు = ఈ దినమున; వర్తిల్లుంచుండ = నడచుచుండగా; మనుజలోకమున = మానవలోకమున; మహిత = గొప్ప; అద్భుత = అద్భుతమైన; ఆకార = ఆకరము; సిద్ధుల = సిద్ధులతోను; మిగులన్ = మిక్కిలి; ప్రసిద్ధులు = ప్రసిద్ధులు; ఐన = అయిన; వారు = వారు; నల్వురు = నలుగురు (4); వేగ = వేగముగా; వచ్చి = వచ్చి; నిర్దేశంబు = ఆదేశమును; భంగించి = భంగపరచి, మరలించి; మమ్ము = మమ్ములను; అంత = అంతట; చెంగదోలి = ఓడించి; నీ = నీ యొక్క; శాసనంబునన్ = ఆజ్ఞ ప్రకారము; నేము = మేము; ఈడ్చుకొనువచ్చు = తీసుకొచ్చెడి; క్రూర = క్రూరమైన; చిత్తుని = మనసు గలవానిని; పుచ్చుకొని = తీసుకొని; అదల్చి = అదరగొట్టి.
పాశ = యమపాశపు; బంధంబులు = కట్లు; ఈసున = పట్టుదలగా; త్రెంచి = తెంపేసి; బలిమిన్ = బలము; మిగులంగ = అతిశయించి; మమ్మును = మమ్ములను; పాఱదోలి = పారదోలి; ఇచ్చన్ = ఇష్టాసారముగా; చనినారు = వెళ్ళిరి; వారు = వారు; ఎచటి = ఎక్కడి; వారలు = వారు; ఆదరమున = దయచేసి; మాకు = మాకు; నేడు = ఈ దినమున; ఆనతిమ్ము = తెలుపుము.

భావము:

ఇలాంటి శాసనం ముల్లోకాలలో నేడు నిరాటంకంగా వర్తిస్తున్నది. అటువంటప్పుడు మానవలోకంలో ఇందుకు భిన్నంగా ఒక విచిత్రం జరిగింది. ఎవరో నలుగురు దివ్యపురుషులు వేగంగా వచ్చి నీ శాసనం మేరకు మేము ఈడ్చుకొని వస్తున్న క్రూరాత్ముణ్ణి బలవంతంగా తీసుకొని పోయారు. మీ ఆజ్ఞను భంగం చేశారు. మమ్మల్ని పారద్రోలారు. వాడికి కట్టిన పాశ బంధాలను త్రెంచివేశారు. మమ్మల్ని తరిమికొట్టి స్వేచ్ఛగా వెళ్ళిపోయారు. దయచేసి వాళ్ళు ఎక్కడివాళ్ళో మాకు తెలియజేయండి”

6-168-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని" రని మఱియు శుకుం డిట్లనియె "నట్లు దూతలు పరితాప సమేతులై పలికిన, దండధరుఁడు పుండరీకాక్షుని చరణకమలంబులు దన మానసంబున సన్నిహితంబుగఁ జేసికొని, వందంనం బాచరించి, పరమ భక్తిపరుండై వారల కిట్లనియె.

టీకా:

అనిరి = అనిరి; అని = అని; మఱియు = ఇంకను; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; అట్లు = ఆ విధముగ; దూతలు = యమదూతలు; పరితాప = మిక్కిలి బాధతో; సమేతులు = కూడినవారు; ఐ = అయ్యి; పలికిన = మాట్లాడగా; దండధరుడు = యమధర్మరాజు {దండధరుడు - శిక్షించెడి బాధ్యత ధరించినవాడు, యముడు}; పుండరీకాక్షుని = నారాయణుని {పుండరీకాక్షుడు - పుండరీకములు (తెల్లతామరలు) వంటి అక్షుడు (కన్నులు గలవాడు), విష్ణువు}; చరణ = పాదము లనెడి; కమలంబులు = పద్మములను; తన = తన యొక్క; మానసంబునన్ = మనసు నందు; సన్నిహితంబుగ = దగ్గరగా; చేసికొని = చేసికొని; వందనంబు = నమస్కారము; ఆచరించి = చేసి; పరమ = అత్యధికమైన; భక్తి = భక్తి; పరుండు = కలిగివాడు; ఐ = అయ్యి; వారలు = వారి; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అన్నారు” అని చెప్పి శుకుడు మళ్ళీ ఇలా అన్నాడు “ఆ విధంగా దూతలు బాధపడుతూ చెప్పగా, యముడు విష్ణు పాద పద్మాలను తన హృదయంలో నిలుపుకొని నమస్కరించి భక్తిపరవశుడై వారితో ఇలా అన్నాడు.

6-169-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"లఁడు మదన్యుండు నుఁ డొక్కఁ డతఁ డెందు-
వెలికిఁ గానఁగరాక విశ్వమెల్లఁ
తిలీనమై మహాద్భు సమగ్రస్ఫూర్తి-
నుండును గోకఁ నూలున్నభంగి
దామెనఁ బశువులు గిలి యుండెడు మాడ్కి-
నాసంకీర్తన స్థేగతుల
విహరించు నెవ్వఁడు విలసిత మత్పూజ-
లెవ్వని పదముల నివ్వటిల్లుఁ

6-169.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుట మనుట చనుట ల్గు నెవ్వని లీల
లందు లోక మెవనియందుఁ బొందు
నెన్నఁబడుచుఁ బుడమి నెవ్వని నామముల్
ర్మబంధనముల పేర్మి నడఁచు.

టీకా:

కలడు = ఉన్నాడు; మత్ = నా కంటెను; అన్యుడు = ఇతరమైనవాడు; ఘనుడు = గొప్పవాడు; ఒక్కడు = ఒకడు; అతడు = అతడు; ఎందున్ = ఎక్కడను; వెలికి = బయటకు; కానగరాగ = కనబడకుండగ; విశ్వము = జగత్తు; ఎల్లన్ = అంతటి యందు; అతి = మిక్కిలిగా; లీనమై = కలసిపోయి; మహా = గొప్ప; అద్భుత = అద్భుతమైన; సమగ్ర = సంపూర్ణమైన; స్పూర్తిన్ = స్ఫూర్తితో; ఉండును = ఉండును; కోకన్ = చీరలలో; నూలు = దారములు; ఉన్న = ఉండెడి; భంగిన్ = విధముగ; దామెనన్ = పలుపుతాడునకు {దామెన - పశువులను కట్టెడి తాడు, పలుపుతాడు}; పశువులు = పశువులు; తగిలి = తగుల్కొని; ఉండెడు = ఉండెడి; మాడ్కిన్ = విధముగ; నామ = నామమును; సంకీర్తన = కీర్తించుటల; స్థేమ = స్థిరమైన; గతులన్ = వర్తనలలో; విహరించున్ = విహరించుచుండునో; ఎవ్వడు = ఎవరో; విలసిత = విలసిల్లెడి; మత్ = నా యొక్క; పూజలు = కొలచుటలు; ఎవ్వని = ఎవని యొక్క; పదములన్ = పాదములందు; నివ్వటిల్లున్ = కలుగునో; కనుట = పుట్టుట.
మనుట = బ్రతుకుట; చనుట = గిట్టుట; కల్గున్ = సంభవించును; ఎవ్వని = ఎవని యొక్క; లీలలు = లీలలు; అందున్ = లోను; లోకము = జగత్తు; ఎవని = ఎవని; అందున్ = అందు; పొందున్ = చెందునో; ఎన్నబడుచున్ = అతిశయించి; పుడమి = భూమండలము; ఎవ్వని = ఎవని యొక్క; నామముల్ = నామములు; కర్మబంధనముల = కర్మబంధములను; పేర్మి = పూని; అడచు = అణచివేయునో.

భావము:

“నాకంటె ఘనుడు ఒక్క డున్నాడు. అతడు బయటికి కనిపించక విశ్వమంతా నిండి ఉన్నాడు. అత్యద్భుతంగా సమగ్రంగా చీరలో దారాల వలె వ్యాపించి ఉన్నాడు. అతని ఆజ్ఞానుసారం జీవులందరు త్రాళ్ళతో అంటగట్టబడిన పశువుల మాదిరిగా ఆయా పేర్లతో, సంకేతాలతో గిరిగిరా తిరుగుతున్నారు. నేను చేసే పూజలన్నీ ఆయన పాదాలకే అంకితం. జనం పుట్టడం, బ్రతకడం, మరణించడం అన్నీ ఆయన లీలావిలాసాలే. ఈ సమస్త జగత్తు ఆయనలోనే లీనమై ఉంటుంది. ఆయన నామాలు ఉచ్చరిస్తే చాలు సమస్త కర్మబంధాలు నిర్మూలమై పోతాయి.

6-170-త.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వినుఁడు నేను మహేంద్రుఁ డప్పతి వీతిహోత్రుఁడు రాక్షసుం
నిలుఁ డర్కుఁడు చంద్రుఁడుం గమలాసనుండు మరుద్గణం
బును మహేశుఁడు రుద్రవర్గము భూరి సంయమి సిద్ధులున్
మొసి కన్గొనజాల రెవ్వని మూర్తి విశ్రుతకీర్తిమై.

టీకా:

వినుడు = వినండి; నేను = నేను; మహేంద్రుడు = మహేంద్రుడు; అప్పతి = వరుణుడు {అప్పతి - అప్పు (నీరు) నకు పతి (ప్రభువు), వరుణుడు}; వీతిహోత్రుడు = అగ్నిదేవుడు; రాక్షసుండు = నిరృతి; అనిలుడు = వాయుదేవుడు; అర్కుడు = సూర్యుడు; చంద్రుడున్ = చంద్రుడు; కమలాసనుండు = బ్రహ్మదేవుడు {కమలాసనుడు - కమలము ఆసనముగా గలవాడు, బ్రహ్మ}; మరుద్గణంబులు = మరుత్తు గణములు; మహేశుడు = శివుడు; రుద్రవర్గము = రుద్రగణములు; భూరి = గొప్ప, అత్యధికమైన; సంయమి = మునులు (సంయమి - సంయమనము సాధించిన వారు, ముని); సిద్ధులున్ = సిద్ధులు; మొనసి = పూని; కన్గొనజాలరు = కనుగొనలేరు; ఎవని = ఎవని యొక్క; మూర్తి = స్వరూపమును; విశ్రుత = మిక్కిలిగ వినబడెడి; కీర్తిమై = కీర్తిగలది.

భావము:

వినండి. నేను, ఇంద్రుడు, వరుణుడు, అగ్నిదేవుడు, నైరృతి, వాయుదేవుడు, సూర్యుడు, చంద్రుడు, బ్రహ్మ, దేవగణాలు, శివుడు, ప్రమథ గణాలు, గొప్ప మునులు, సిద్ధులు అందరమూ కలిసి కూడా సుప్రసిద్ధమైన ఆయన మూర్తిని కనుగొనజాలము.

6-171-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్త్వేతర గుణపాశ వ
త్త్వంబునఁ బొంద వీరు లజాక్షు సదై
త్త్వంబు గాన నోపరు
త్త్వప్రాధాన్యు లితర నముల తరమే?

టీకా:

సత్త్వ = సత్త్వగుణమునకు; ఇతర = ఇతరమైన; గుణ = గుణము లనెడి; పాశ = పాశముల; వశత్వంబునన్ = ప్రభావమున బడినచో; పొంద = పొందుటకు; వీరు = ఇటువంటి వారు; జలజాక్షు = నారాయణుని {జలజాతాక్షు - పద్మనయనుడు, విష్ణువు}; సత్ = సత్యమైన; ఏకత్వంబున్ = సర్వవ్యాపకత్వమును; కానన్ = గుర్తించ; ఓపరు = సమర్థులు గారు; సత్త్వ = సత్త్వగుణము; ప్రాధాన్యులున్ = ప్రధానముగా కలవా రైనను; ఇతర = మిగతా; జనముల = వారికి; తరమే = సాధ్యమా.

భావము:

సత్త్వగుణ ప్రధాను లైనవారు సైతము రజస్తమోగుణాలనే పాశాలతో బద్ధులైనచో విష్ణుమూర్తి సర్వవ్యాపకత్వాన్ని గుర్తించలేరు. ఇక తక్కినవారికి సాధ్యమా?

6-172-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వు నమేయు నవ్యయు ననంతు ననారతుఁ బూని మేనిలో
నుయము నై వెలుంగు పురుషోత్తముఁ గానరు చిత్తకర్మ వా
గ్వివ గరిష్ఠులై వెదకి వీఱిఁడి ప్రాణులు; సర్వవస్తువుల్
శుగతిఁ జూడనేర్చి తనుఁ జూడఁగనేరని కంటిపోలికన్.

టీకా:

అభవున్ = నారాయణుని {అభవుడు - పుట్టుక లేనివాడు, విష్ణువు}; అమేయున్ = నారాయణుని {అమేయుడు - పరిమితులు లేనివాడు, విష్ణువు}; అవ్యయున్ = నారాయణుని {అవ్యయుడు - వ్యయము లేనివాడు, విష్ణువు, విష్ణుసహస్ర నామాలలో 13 నామం అవ్యయః - శ్రీశంకర భాష్యం వినాశము కాని వికారము కాని లేనివాడు, వ్యు, న అస్య వ్యయః ఇతి అవ్యయః}; అనంతున్ = నారాయణుని {అనంతుడు - అంతము లేనివాడు, విష్ణువు}; అనారతున్ = నారాయణుని {అనారతడు - అనవరతము యుండెడివాడు, విష్ణువు}; పూని = పూని; మేనిలోను = దేహములోపల {పరమాత్మ త్రైవిధ్యము - దేహము (మొదటివాడు) దేహి (జీవుడు, రెండవవాడు), దేహములో (సర్వాంతర్యామి, మూడవవాడు) తానై యుండుట}; ఉభయమును = దృశ్యము ద్రష్ట రెండును; ఐ = అయ్యి; వెలుంగు = ప్రకాశించెడి; పురుషోత్తమున్ = నారాయణుని; కానరు = గుర్తించలేరు; చిత్త = జ్ఞానము నందు; కర్మ = వైదికకర్మ లందు; వాక్ = ప్రవచనములు చేయుట యందు; విభవ = వైభవము గలిగి ఉండుటలో; గరిష్ఠులు = గొప్పవారు; ఐ = అయ్యి; వెదకి = వెదకి; వీఱిడి = అవివేకి; ప్రాణులు = మానవులు, జీవులు; సర్వ = సమస్తమైన; వస్తువుల్ = వస్తువులు; శుభగతిన్ = చక్కగా; చూడన్ = చూడ; నేర్చి = గలిగినను; తనున్ = తననుతాను; చూడగన్ = చూచుటను; నేరని = సమర్థతలేని; కంటి = కన్ను; పోలికన్ = వలె.

భావము:

జన్మరహితుడు, హద్దులు లేనివాడు, అనంతుడు, అవ్యయుడు, శాశ్వతుడు, మానవుల శరీరంలో క్షరపురుషుడు, అక్షర పురుషుడు అయి వెలిగే పురుషోత్తముణ్ణి మనోవాక్కాయ కర్మల వైభవంలో ఆరితేరిన మానవులు దర్శింపలేరు. సర్వ వస్తువులను సందర్శించే కన్ను తనను తాను చూచుకోలేదు కదా!

6-173-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ముని భక్తలోక పరిపాలన శీలుని దుష్టలోక సం
రుని పతంగపుంగవ విహారుని కూరిమిదూత లామనో
రులు సురేంద్రవందితులు నా హరిరూప గుణస్వభావులై
తిరుగుచునుందు రెల్లడలఁ దిక్కులఁ దేజము పిక్కటిల్లఁగన్.

టీకా:

పరముని = నారాయణుని {పరముడు - సర్వమునకు పరమైనవాడు, విష్ణువు}; భక్తలోకపరిపాలనశీలుని = నారాయణుని {భక్త లోక పరిపాలన శీలుడు - భక్తులు లోక (సర్వులను) పరిపాలన (పాలించెడి) శీలుడు (వర్తన గలవాడు), విష్ణువు}; దుష్టలోకసంహరుని = నారాయణుని {దుష్ట లోక సంహరుడు - దుష్టులు లోక (సర్వులను) సంహరుడు (సంహరించెడి వాడు), విష్ణువు}; పతంగపుంగవవిహారుని = నారాయణుని {పతంగపుంగవ విహారుడు – పతంగ పుంగవ (పక్షులలో ఉత్తముడు గరుత్మంతుడు) పై విహారుడు (విహరించెడి వాడు), విష్ణువు}; కూరిమి = ఇష్ట; దూతలు = సఖులు; ఆ = ఆ; మనోహరులు = అందమైనవారు; సురేంద్ర = దేవేంద్రునిచే; వందితులున్ = నమస్కరింపబడు వారు; ఆ = ఆ; హరి = నారాయణుని; రూప = రూపము; గుణ = గుణములు; స్వభావులు = స్వభావములు గలవారు; ఐ = అయ్యి; తిరుగుచున్ = విహరించుచును; ఉందురు = ఉండెదరు; ఎల్ల = అన్ని; ఎడల = చోట్లను; దిక్కులన్ = దిక్కు లందు; తేజము = ప్రకాశము; పిక్కటిల్లగన్ = అతిశయించగ.

భావము:

పరమాత్ముడు, భక్తులను పరిపాలించేవాడు, దుష్టులను సంహరించేవాడు, గరుడవాహనుడు అయిన విష్ణుదేవుని దూతలు ఆ నలుగురు. ఆ అందమైన వారికి దేవేంద్రుడైనా నమస్కరిస్తాడు. వారు రూపంలోను, గుణాలలోను శ్రీహరి అంతటివారై దివ్యతేజస్సుతో అంతటా సంచరిస్తూ ఉంటారు.

6-174-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లెక్కకు నెక్కువై కసటులేని మహాద్భుత తేజ మెల్లెడం
బిక్కటిలం జరింతు రతి భీమబలాఢ్యులు విష్ణుదూత లా
క్కని ధర్మశాంతు లతిసాహసవంతులు దేవపూజితుల్
గ్రిక్కిఱియన్ జగంబునను గేశవసేవక రక్షణార్థమై.

టీకా:

లెక్కకునెక్కువ = అత్యధికమైనవి; ఐ = అయ్యి; కసటు = మాలిన్యములు; లేని = లేనట్టి; మహా = గొప్ప; అద్భుత = అద్భుతమైన; తేజంబు = తేజస్సు; ఎల్ల = అన్ని; ఎడలన్ = చోట్లను; పిక్కటిలన్ = అతిశయించగ; చరింతురు = తిరిగెదరు; అతి = మిక్కిలి; భీమ = అధికమైన; బల = బలము గలవారిలో; ఆఢ్యులు = శ్రేష్ఠులు; విష్ణుదూతలు = విష్ణుదూతలు; ఆ = ఆ; చక్కని = చక్కటి; ధర్మ = ధర్మము నందు; శాంతులు = శాంతించువారు; అతి = మిక్కిలి; సాహసవంతులు = ధైర్యశాలురు; దేవ = దేవతలచే; పూజితుల్ = కొలువబడెడి వారు; క్రిక్కిఱియన్ = సర్వ వ్యాపకులుగా; జగంబునను = లోకము నందు; కేశవ = నారాయణుని {కేశవ - కేవలము శుభకర మైనవాడు, విష్ణువు}; సేవక = భక్తులను; రక్షణార్థమై = కాపాడుటకై.

భావము:

లెక్కకు మిక్కిలిగా ఉన్న ఆ విష్ణుదూతలు కళంకం లేని మహా తేజస్సుతో, మహాబలాఢ్యులై, ధర్మంతో కూడిన శాంత స్వభావం కలవారై, మిక్కిలి సాహసవంతులై, దేవతల పూజలందుతూ విష్ణుభక్తుల రక్షణ కోసం ఈ లోకంలో క్రిక్కిరిసి సంచరిస్తూ ఉంటారు.

6-175-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నా లనను మీ వలనను
దేవాసుర గణము వలనఁ ద్రిజగంబులలో
నే గలఁ బొందఁకుండఁగఁ
గావం గలవారు పుడమిఁ ల వైష్ణవులన్.

టీకా:

నా = నా; వలనను = మూలమున; మీ = మీ; వలనను = మూలమున; దేవ = దేవతలు; అసుర = రాక్షసులు; గణము = సమూహముల; వలనన్ = మూలమున; త్రిజగంబుల = ముల్లోకముల; లో = లోను; ఏ = ఎలాంటి; వగలన్ = బాధలను; పొందకుండగన్ = పొందకుండగా; కావంగలవారు = కాపాడ గలవారు; పుడమిన్ = భూమిపై; కల = ఉన్నట్టి; వైష్ణవులన్ = విష్ణుమూర్తి భక్తులను.

భావము:

నా వలన, మీ వలన, దేవతల వలన, రాక్షసుల వలన ముల్లోకాలలో ఏ కష్టాన్నీ పొందకుండా విష్ణుభక్తులను కాపాడేవారు ఆ విష్ణుదూతలు.

6-176-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వత్ప్రణిహిత ధర్మం
పడ దెవ్వారి మతికి నిమిష గరుడో
సిద్ధ సాధ్య నర సుర
తాపస యక్ష దివిజ చరుల కైనన్.

టీకా:

భగవత్ = భగవంతునిచే; ప్రణిహిత = ఒప్పుకొనబడిన; ధర్మంబు = ధర్మము; అగపడదు = కనబడదు; ఎవ్వరి = ఎవరి; మతి = బుద్ధి; కిన్ = కిని; అనిమిష = దేవతల {అనిమిషులు - నిమిష (కనురెప్పపాటులు) లేనివారు, దేవతలు}; గరుడ = గరుడుల; ఉరగ = సర్పముల; సిద్ధ = సిద్ధుల; సాధ్య = సాధ్యుల; నర = మానవుల; సుర = దేవతల; ఖగ = పక్షుల; తాపస = మునుల; యక్ష = యక్షుల; దివిజ = దేవతల {దివిజులు - దివి (స్వర్గమున) జులు (జనించినవారు), దేవతలు}; ఖచరుల = దేవతల {ఖచరులు - ఖ (ఆకాశమున) చరులు (తిరుగువారు), దేవతలు}; కైనన్ = అయినప్పటికిని.

భావము:

దేవతలు, గరుడులు, నాగులు, సిద్ధులు, సాధ్యులు, మానవులు, పక్షులు, మునులు, యక్షులు, విద్యాధరులు, ఖేచరులు మొదలైన వారెవ్వరు కూడా భగవంతుని తత్త్వాన్ని గుర్తించలేరు.

6-177-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్నఁడుఁ దెలియఁగ నేరరు
న్నగపతిశాయి తత్త్వభావము మేనం
న్నుల వేల్పును డాపలఁ
న్నమరిన వేల్పు ముదుక దువుల వేల్పున్.

టీకా:

ఎన్నడు = ఎప్పుడును; తెలియగనేరరు = తెలిసికొనలేరు; పన్నగపతిశాయి = నారాయణుని {పన్నగపతిశాయి - పన్నగపతి (ఆదిశేషుని) పై శాయి (శయినించువాడు), విష్ణువు}; తత్త్వ = తత్త్వము యొక్క; భావమున్ = లక్షణమును; మేనంగన్నులవేల్పును = ఇంద్రుడైన {మేనం గన్నుల వేల్పు - మేనన్ (దేహమున) కన్నుల (కళ్ళు గల) వేల్పు (దేవుడు), ఇంద్రుడు}; డాపలజన్నమరినవేల్పు = శివుడైన {డాపల జన్నమరిన వేల్పు - డాపల (ఎడమ ప్రక్కన) చన్ను (స్తనము) అమరిన (చక్కగా నున్న) వేల్పు (దేవుడు), శివుడు}; ముదుకచదువులవేల్పును = బ్రహ్మదేవుడైన {ముదుక చదువుల వేల్పు - ముదుక (పరిపక్వమైన) చదువుల(జ్ఞానముల)కి వేల్పు (దేవుడు), బ్రహ్మదేవుడు}.

భావము:

ఒంటినిండా కన్నులున్న ఇంద్రుడు కాని, అర్ధనారీశ్వరుడైన శివుడు కాని, వేదవేత్త అయిన బ్రహ్మ కాని ఆ శేషశయనుడైన విష్ణువు తత్త్వాన్ని తెలుసుకోలేరు.

6-178-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర మహాద్భుత మైన వైష్ణవజ్ఞానంబుఁ-
దిరముగా నెవ్వరు దెలియఁగలరు?
దేవాదిదేవుండు త్రిపురసంహరుఁ డొండెఁ-
మలసంభవుఁ డొండెఁ గార్తికేయ
పిల నారదు లొండె గంగాత్మజుం డొండె-
ను వొండె బలి యొండె నకుఁ డొండెఁ
బ్రహ్లాదుఁ డొండె నేర్పాటుగా శుకుఁ డొండె-
భాసురతరమతివ్యాసుఁ డొండెఁ

6-178.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గా యన్యుల తరమె? యీ లోమందు
నీ సుబోధంబు సద్బోధ మీ పదార్థ
మీ సదానంద చిన్మయ మీ యగమ్య
మీ విశుద్ధంబు గుహ్యంబు నీ శుభంబు.

టీకా:

వర = ఉత్తమమైన; మహా = గొప్ప; అద్భుతము = ఆశ్చర్యకరము; ఐన = అయిన; వైష్ణవ = విష్ణువు గురించిన; జ్ఞానంబు = జ్ఞానము; తిరముగా = ధ్రువముగా, ఖాయముగా; ఎవ్వరు = ఎవరు; తెలియగలరు = తెలిసికొనగలరు; దేవాదిదేవుండు = దేవతలకే ముఖ్య దేవుడు; త్రిపురసంహరుడు = పరమశివుడు {త్రిపుర సంహరుడు - త్రిపురములను నాశనము చేసినవాడు, శివుడు}; ఒండె = కాని; కమలసంభవుడు = బ్రహ్మదేవుడు {కమల సంభవుడు - కమలము లందు సంభవుడు (పుట్టినవాడు), బ్రహ్మ}; ఒండె = కాని; కార్తికేయ = కార్తికేయుడు; కపిల = కపిలుడు; నారదులు = నారదుడులు; ఒండె = కాని; గంగాత్మజుండు = భీష్ముడు; ఒండె = కాని; మనువు = మనువు; ఒండె = కాని; బలియున్ = బలిచక్రవర్తి; ఒండె = కాని; జనకుడు = జనకమహారాజు; ఒండె = కాని; ప్రహ్లాదుడు = ప్రహ్లాదుడు; ఒండె = కాని; ఏర్పాటుగా = ప్రకటముగా; శుకుడు = శుకమహాముని; ఒండె = కాని; భాసుర = మిక్కిలి ప్రకాశిస్తున్న; మతి = మనసు గలవాడు; వ్యాసుడు = వ్యాసభగవానుడు; ఒండె = కాని; కాక = కాకుండగ.
అన్యుల = ఇతరుల; తరమె = సాధ్యమే; ఈ = ఈ; లోకము = లోకము; అందు = లో; ఈ = ఈ; సుబోధంబు = ఉత్తమ జ్ఞనము; సద్భోధము = విశేష జ్ఞానము; ఈ = ఈ; పదార్థము = బ్రహ్మ పదార్థం; ఈ = ఈ; సదానంద = శాశ్వతమైన ఆనందపు; చిత్ = మనసు; మయము = పూరము;ఈ = ఈ; అగమ్యము = అంతుపట్టనిది; ఈ = ఈ; విశుద్ధంబు = పరిశుద్ధము; గుహ్యంబు = రహస్యమైవది; ఈ = ఈ; శుభంబు = శుభములు.

భావము:

దేవాదిదేవుడు త్రిపురాంతకుడు అయిన శివుడు, బ్రహ్మ, కుమారస్వామి, కపిలుడు, నారదుడు, భీష్ముడు, మనువు, బలి చక్రవర్తి, జనకుడు, ప్రహ్లాదుడు, శుకుడు, వ్యాసుడు అనేవాళ్ళు తప్ప విశేషమూ, బ్రహ్మపదార్థమూ, సదానంద చిన్మయమూ, అగమ్యమూ, పరిశుద్ధమూ, పరమ రహస్యమూ, శుభకరమూ అయిన ఈ వైష్ణవ జ్ఞానాన్ని ఎవరు తెలుసుకోగలరు?

6-179-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్నిద్దఱు దక్కఁగ
నోరు తక్కొరులు దెలియ నుపనిష దుచిత
శ్రీతినామ మహాద్భుత
దీపిత భాగవత ధర్మ దివ్యక్రమమున్.

టీకా:

ఈ = ఈ; పన్నిద్దఱున్ = పన్నిండు మంది (12); తక్కగ = తప్పించి; ఓపరు = సమర్థులు గారు; తక్కొరులు = ఇతరులు; తెలియను = తెలిసికొనుటకు; ఉపనిషత్ = ఉపనిషత్తులలో; ఉచిత = చెప్పబడిన, ఉచ్చరింపబడిన; శ్రీపతి = నారాయణుని {శ్రీపతి - శ్రీ (లక్ష్మీదేవి, సంపదలు) కి పతి (ప్రభువు), విష్ణువు}; నామ = నామము యొక్క; మహా = గొప్ప; అద్భుత = అద్భుతమైన; దీపిత = ప్రకాశవంతమైన; భాగవత = భాగవత; ధర్మ = ధర్మము యొక్క; దివ్య = దివ్యమైన; క్రమమున్ = విధమును.

భావము:

ఈ పన్నెండుమంది తప్ప తక్కిన వారెవ్వరూ ఉపనిషద్రహస్యమైన విష్ణునామంతో అద్భుతంగా ప్రకాశించే దివ్యమైన భాగవత ధర్మాన్ని తెలిసికొనలేరు.

6-180-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ది జపియింప నమృతమై యెసఁగుచుండు
నేది సద్ధర్మపథ మని యెఱుఁగ దగిన
దియె సద్భక్తి యోగంబు నావహించు
మూర్తిమంతంబు దా హరికీర్తనంబు.

టీకా:

ఏది = ఏదైతే; జపియింపన్ = నామజపము చేయుచుండగ; అమృతము = అమృతము; ఐ = అయ్యి; ఎసగుచుండున్ = ఒప్పుచుండును; ఏది = ఏదైతే; సద్ధర్మ = ఉత్తమ ధర్మము యొక్క; పథము = మార్గము; అని = అని; ఎఱుగ = తెలిసికొన; తగినది = తగినట్టిది; అదియె = అదే; సద్భక్తి = శ్రేష్ఠమైన భక్తి; యోగంబున = యోగమువలన; ఆవహించు = కలుగుట; మూర్తిమంతంబు = మూర్తీభవించినది; తాన్ = అది; హరి = నారాయణుని; కీర్తనంబు = కీర్తించుటలు.

భావము:

ఏది జపించిన కొద్దీ అమృతమై అలరారుతుందో, ఏది ఉత్తమమైన ధర్మమార్గమో, ఏది మూర్తీభవించిన భక్తియోగమో అదే హరినామ కీర్తనం.

6-181-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కంటిరే మీరు సుతులార! మలనేత్రు
వ్య మగు నామకీర్తన లము నేఁడు
విలి మృత్యువు పాశబంములవలన
జాణతనమున నూడె నజామిళుండు.

టీకా:

కంటిరే = చూసితిరా; మీరు = మీరు; సుతులారా = పిల్లలూ; కమలనేత్రు = నారాయణుని {కమల నేత్రుడు – కమల నయనుడు, విష్ణువు}; భవ్యము = శుభమైనది; అగు = అయిన; నామ = నామము యొక్క; కీర్తన = సంకీర్తనకు; ఫలము = ఫలితము; నేడు = ఈ దినమున; తవిలి = పూని; మృత్యువు = యముని; పాశ = పాశముల; బంధముల = బంధనముల; వలన = వలన; జాణతనమునన్ = మిక్కిల నేర్పుతో; ఊడెన్ = విడివడెను; అజామిళుండు = అజామిళుడు.

భావము:

నాయనలారా! భగవంతుని పవిత్రమైన నామ సంకీర్తన ఫలాన్ని నేడు చూశారు కదా? దాని ఫలితంగా మృత్యుదేవత పాశబంధాల నుండి అజామిళుడు నేర్పుగా బయటపడ్డాడు.

6-182-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

టికి జాలిఁ బొంద? నరులే క్రియఁ గృష్ణుని కీర్తనంబు పా
పావులన్ దహింపఁ గల దౌటకు సందియ మేల? యిప్పు డీ
తూఁరి దోషకారి పెనుదోషి యజామిళుఁ డంతమొందుచుం
బాటిగ విష్ణునామ సుతుఁ ల్కుచుఁ గేవలముక్తి కేగఁడే?

టీకా:

ఏటికి = ఎందులకు; జాలిన్ = దిగులు; పొందన్ = చెందగా; నరులు = మానవులు; ఏ = ఏ; క్రియన్ = విధముగ; కృష్ణుని = శ్రీకృష్ణుని; కీర్తనంబు = సంకీర్తనములు; పాప = పాపముల యొక్క; అటవులన్ = అడవులను; దహింపగలది = కాల్చి వేయ గలిగినది; ఔట = అగుట; కు = కు; సందియము = సందేహము; ఏల = ఎందులకు; ఇప్పుడు = ఇప్పుడు; ఈ = ఈ; తూటరి = తుంటరి; దోషకారి = పాపములు చేయువాడు; పెను = మిక్కిలి; దోషి = పాపాత్ముడు; అజామిళుడు = అజామిళుడు; అంతమొందుచు = మరణించుచు; పాటిగ = నేర్పుగ; విష్ణు = నారాయణుని; నామ = నామము గల; సుతున్ = పుత్రుని; పల్కుచున్ = పిలుచుచు; కేవలముక్తి = కైవల్యమున; కిన్ = కి; ఏగడే = వెళ్ళలేదా,

భావము:

మానవులు ఈ విధంగా దిగులు చెందట మెందుకు? భగవంతుని నామ సంకీర్తనం పాపాల అడవులను కాల్చివేస్తుం దనడంలో సందేహ మెందుకు? ఇప్పుడు ఈ తుంటరి, దుష్టుడు, పాపాత్ముడైన అజామిళుడు మరణిస్తూ ఏదో పాటిగా భగవంతుని పేరును ఉచ్చరించి మోక్షాన్ని పొందలేదా?

6-183-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇంయును దథ్య మని మది
నింయుఁ దెలియంగలేరు హీనాత్ములు దు
ర్దాంతర ఘటిత మాయా
క్రాంతాత్యంతప్రకాశ గౌరవ జడులై.

టీకా:

ఇంతయును = ఇదంత; తథ్యము = నిజము; అని = అని; మదిన్ = మనసులో; ఇంతయును = కొంచముకూడ; తెలియంగ = తెలిసికొన; లేరు = లేరు; హీనాత్ములు = అల్పులు; దుర్దాంతతర = మిక్కిలి అణపపరానిదై {దుర్దాంతము - దుర్దాంతతరము - దుర్దాంతతమము}; ఘటిత = కూడిన; మాయా = మాయచే; ఆక్రాంత = ఆక్రమింపబడిన; అత్యంత = అత్యధికమైన; ప్రకాశ = జ్ఞాన ప్రకాశము యొక్క; గౌరవ = అధిక్యమును; జడులు = తెలిసికొనలేని వారు; ఐ = అయ్యి.

భావము:

అల్పులైన మానవులు దాట శక్యం కాని మహామాయలో చిక్కుకొని తెలివిని కోల్పోయి, మందబుద్ధులై ఈ యథార్థాన్ని కొంచెమైనా తెలిసికొనలేక పోతున్నారు.

6-184-మం
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విధమునన్ విబుధు లేకతమ చిత్తముల నేకతము లేక హరి నీశున్
భామున నిల్పి తగు భాగవతయోగ పరిపాకమున నొందుదురు వారిం
దేలదు దండన గతిం జనదు మాకు గురితింప నఘముల్ దలగు మీదన్
శ్రీరుని చక్రము విశేషగతి గాచు సురసేవితులు ముక్తి గడు బెద్దల్.

టీకా:

ఈ = ఈ; విధమునన్ = విధముగ; విబుధులు = జ్ఞానులు; ఏకతమ = మిక్కిలి ఏకాగ్రమైన {ఏకము - ఏకతరము - ఏకతమము}; తమ = తమ యొక్క; చిత్తములన్ = మనసులలో; ఏ = ఏ; కతము = కారణము; లేక = లేకుండగ; హరిన్ = నారాయణుని; ఈశున్ = నారాయణుని; భావమునన్ = మనసున; నిల్పి = నిలుపుకొని; తగు = తగినట్టి; భాగవతయోగ = భాగవత యోగము యొక్క; పరిపాకమునన్ = పరిపక్వమును; ఒందుదురు = పొందెదరు; వారిన్ = వారిని; తేవలదు = తీసుకు రావద్దు; దండనగతి = శిక్షించుట; చనదు = శక్యము కాదు; మాకు = మాకు; గుఱుతింపన్ = గుర్తించినచో; అఘముల్ = పాపములు; తలగున్ = తొలగిపోవును; మీదన్ = అంతేకాక, ఆపైన; శ్రీవరుని = నారాయణుని; చక్రము = చక్రాయుధము; విశేష = విశేషమైన; గతిన్ = విధముగ; కాచు = కాపాడును; సుర = దేవతలచే; సేవితులు = సేవింపబడువారు; ముక్తిన్ = మోక్షమార్గము; కడు = మిక్కిలి; పెద్దల్ = శ్రేష్ఠులు.

భావము:

ఈ విధంగా జ్ఞానులు కారణం లేకుండానే ఏకాగ్రతతో తమ మనస్సులలో శ్రీహరిని నిలుపుకొని యోగసాధనతో పరమ భాగవతులై వెలుగొందుతున్నారు. అటువంటి వారిని మీరు తీసుకొని రావద్దు. వారిని నేను శిక్షింపలేను. అటువంటి వారిని గుర్తిస్తే పాపాలు తొలగిపోతాయి. వారిని విష్ణుచక్రం ప్రత్యేకంగా కాపాడుతూ ఉంటుంది. వారు దేవతలచేత సేవింపబడుతూ మోక్షాన్ని పొందే పెద్దలు.

6-185-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వ్వరు సిద్ధ సాధ్య ఖచరేశ లసత్పరిగీత గాథలం
దెవ్వరు ముక్తిభోగతల హేమ మనోహర చంద్రశాలలం
దెవ్వరు శంఖచక్ర గురుహేతి గదా రుచిరోగ్రపాణు లా
వ్వపు రూపవంతు లసమానులు పో ధరలోని వైష్ణవుల్.

టీకా:

ఎవ్వరు = ఎవరు; సిద్ధ = సిద్ధుల; సాధ్య = సాధ్యుల; ఖచర = ఆకాశగమనుల; ఈశ = దేవతలచే; లసత్ = తళుక్కు మనెడి; పరి = చక్కటి; గీత = గేయములు; గాధలు = కథలు; అందు = లో; ఎవ్వరు = ఎవరు; ముక్తి = మోక్షము యనెడి; భోగ = భోగించెడి; తల = తలము యొక్క; హేమ = బంగారపు, శ్రేష్ఠమైన; మనోహర = మనోహరమైన; చంద్రశాలలు = చంద్రకాంతశాలలు; అందు = లో; శంఖ = శంఖము; చక్ర = చక్రము; గురు = పెద్ద; హేతి = ఖడ్గము; గదా = గదలు; రుచిర = కాంతివంతమైన; ఉగ్ర = భయంకరమైన; పాణులు = చేతు లందు ధరించినవారు; ఆ = ఆ; మవ్వపు = సుకుమారమైన; రూపవంతులు = అందమైనవారు; అసమానులు = సాటిలేనివారు; పో = తిరుగులేదు; ధర = లోకము; లోని = అందలి; వైష్ణవుల్ = విష్ణుభక్తులు.

భావము:

విష్ణుభక్తుల కీర్తిని సిద్ధులు, సాధ్యులు, ఖేచరులు లలిత గీతాలతో గానం చేస్తుంటారు. ఆ భాగవతులు ముక్తిసౌధంలోని అందమైన చంద్రశాలల్లో నివసిస్తూ ఉంటారు. సాటిలేనివారు, సౌందర్యవంతులు అయిన ఆ వైష్ణవుల అరచేతులలో శంఖ చక్ర గదా ఖడ్గ రేఖలు విరాజిల్లుతూ ఉంటాయి.

6-186-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రుత్యంత విశ్రాంత త్యనుక్రమణీయ-
గవత్ప్రసంగతుల్ భాగవతులు;
నకాది ముని యోగిన సదానందైక-
రమ భాగ్యోదయుల్ భాగవతులు;
కృష్ణపదధ్యాన కేవలామృతపాన-
రిణామ యుతులు శ్రీభాగవతులు;
హుపాత కానీక రిభవ ప్రక్రియా-
రుషోగ్ర మూర్తులు భాగవతులు;

6-186.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భావ తత్త్వార్థవేదులు భాగవతులు;
బ్రహ్మవా దానువాదులు భాగవతులు;
సిరులు దనరంగ నెన్నఁడుఁ జేటులేని
దవి నొప్పారువారు పో భాగవతులు.

టీకా:

శ్రుత్యంత = వేదాంతము లందు; విశ్రాంత = విశ్రమించిన; మతి = బుద్ధిని; అనుక్రమణీయ = అనుసరించి పోవునట్టి; భగవత్ = నారాయణుని; ప్రసంగతుల్ = సంగములు చేయువారు; భాగవతులు = భాగవత తత్త్వజ్ఞులు; సనక = సనకుడు; ఆది = మొదలైన; ముని = మునులు; యోగి = యోగులు; జన = ఐన వారి; సదానంద = శాశ్వతమైన ఆనందము; ఏక = మొదలైన; పరమ = అత్యుత్తమమైన; భాగ్య = భాగ్యములను; ఉదయుల్ = కలిగించెడివారు; భాగవతులు = భాగవతులు; కృష్ణ = కృష్ణుని; పద = పాదములను; ధ్యాన = సంస్మరించెడి; కేవల = కేవలమైన; అమృత = అమృతమును; పాన = ఆస్వాదించెడి; పరిణామ = క్రమము; యుతులు = కూడినవారు; శ్రీ = శుభకరమైన; భాగవతులు = భాగవతులు; బహు = మిక్కిలి; పాతక = పెద్దపాపముల; అనీక = సమూహములను; పరిభవ = పరాభవము చేసెడి; ప్రక్రియా = విధానములతో; పరుష = కఠినమైన; ఉగ్ర = ఉగ్రమైన; మూర్తులు = స్వరూపములు గలవారు; భాగవతులు = భాగవతులు;
భావ = భవమునకు చెందిన; తత్త్వార్థ = తత్త్వలక్షణములను; వేదులు = బాగుగా తెలిసికొన్నవారు; భాగవతులు = భాగవతులు; బ్రహ్మవాద = పరబ్రహ్మతత్వమును; అనువాద = వివరించుటలో నేర్పరులు; భాగవతులు = భాగవతులు; సిరులు = సంపదలు; తనరంగ = అతిశయించగ; ఎన్నడును = ఎల్లప్పుడును; చేటులేని = చెడిపోవుటలేని; పదవిన్ = మహోన్నత స్థానమున; ఒప్పారువారు = చక్కగ నుండువారు; పో = తప్పక; భాగవతులు = భాగవతులు.

భావము:

భాగవతులు వేదాంత వీధులలో విహరిస్తూ భగవంతునికి చెందిన ప్రసంగాలు చేస్తుంటారు. వారు సనక సనందాది యోగులు అనుభవించే బ్రహ్మానందాన్ని అందుకోగల అదృష్టవంతులు. శ్రీకృష్ణుని పాదాలను ధ్యానించడమనే అమృతాన్ని పానం చేసి బ్రతుకు పండించుకొంటారు. భయంకరమైన పెక్కు పాపాల సమూహాన్ని చెండాడుతారు. పరతత్త్వాన్ని గుర్తించి బ్రహ్మస్వరూపాన్ని ఆరాధిస్తూ ఉండే పరమైశ్వర్య సంపన్నులు భాగవతులు. వారు తమ మహోన్నత స్థానం నుండి చలించరు.

6-187-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దిగాన విష్ణుభక్తులఁ
దియఁగఁ జనవలదు మీరు రివరదు లస
త్పపద్మ వినతి విముఖులఁ
దుది నంటఁగఁ గట్టి తెండు ధూర్తులు వారల్.

టీకా:

అదిగాన = అందుచేత; విష్ణుభక్తులన్ = విష్ణుభక్తులను; కదియగన్ = దగ్గరకు; చనవలదు = వెళ్ళవద్దు; మీరు = మీరు; కరివరదు = నారాయణుని {కరి వరదు - కరి (గజేంద్రుని) కి వరదుడు (వరముల నిచ్చిన వాడు), విష్ణువు}; లసత్ = మెరిసెడి; పద = పాదము లనెడి; పద్మ = పద్మములకు; వినతి = కొలచుట యందు; విముఖులన్ = అయిష్టులను; తుదినంటగన్ = మొదలంటా; కట్టి = కట్టివేసి; తెండు = తీసుకురండి; ధూర్తులు = చెడ్డవారు; వారల్ = వారు.

భావము:

కావున, మీరు విష్ణుభక్తులను సమీపించవద్దు. శ్రీహరి పాదపద్మారాధనకు విముఖులైన ధూర్తులను పట్టి బంధించి తీసుకురండి.

6-188-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కసక్కెమున కైన నిందిరారమణునిఁ-
లుకంగలేని దుర్భాషితులను
లలోన నైన శ్రీకాంతుని సత్పాద-
మలముల్ చూడని ర్మరతుల
వ్వుచు నైనఁ గృష్ణప్రశంసకుఁ జెవిఁ-
దార్పనేరని దుష్కథా ప్రవణుల
యాత్రోత్సవంబుల నైన నీశుని గుడి-
త్రోవఁ ద్రొక్కఁగలేని దుష్పదులను

6-188.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రమ భాగవతుల పాదధూళి సమస్త
తీర్థసార మనుచుఁ దెలియలేని
వారి వారివారి వారిఁ జేరినవారిఁ
దొలుతఁ గట్టి తెండు దూతలార!

టీకా:

ఎకసెక్కెమున = ఎగతాళిచేయుట; కైనన్ = కోసమైన; ఇందిరారమణునిన్ = నారాయణుని {ఇందిరా రమణుడు - ఇందిర (లక్ష్మీదేవి)కి రమణుడు (మనోహరుడు), విష్ణువు}; పలుకంగ = కీర్తించ; లేని = లేని; దుర్భాషితులను = చెడు మాట లాడువారు; కల = స్వప్నము; లోనన్ = లోపల; ఐనన్ = అయినను; శ్రీకాంతుని = నారాయణుని {శ్రీకాంతుడు - శ్రీ (లక్ష్మీదేవి) కాంతుడు (భర్త), విష్ణువు}; సత్ = మంచి; పాద = పాదములు యనెడి; కమలముల్ = పద్మములను; చూడని = చూడనట్టి; కర్మ = కర్మ లందు; రతులన్ = ఆసక్తి గలవారు; నవ్వుచున్ = నవ్వులాటలకు; ఐనన్ = అయినప్పటికి; కృష్ణ = కృష్ణుని; ప్రశంస = కీర్తించుట; కున్ = కు; చెవిదార్ప = వినిపించుకొన; నేరని = లేని; దుష్కథా = చెడ్డకథ లందు; ప్రవణులన్ = ఆసక్తులు; యాత్ర = తీర్థయాత్ర; ఉత్సవంబులన్ = ఉత్సవములలో; ఐనన్ = అయినప్పటికి; ఈశుని = నారాయణుని; గుడి = ఆలయపు; త్రోవ = దారి; త్రొక్కగలేని = తొక్కలేనట్టి; దుష్పదులను = చెడునడత వారిని; పరమ = మిక్కిలి పవిత్రమైన; భాగవతుల = భాగవతుల యొక్క;
పాద = పాదముల; ధూళి = దుమ్ము; సమస్త = నిఖిల; తీర్థ = తీర్థముల యొక్క; సారము = సారము; అని = అని; తెలియ = తెలుసుకొన; లేని = లేని; వారిన్ = వారిని; వారివారిన్ = వారి యొక్క వారిని; వారిన్ = వారిని; చేరినవారి = అనుసరించు వారిని; తొలుతన్ = ముందుగ; కట్టి = కట్టివేసి; తెండు = తీసుకురండి; దూతలార = సేవకులూ.

భావము:

దూతలారా! ఎగతాళిగానైనా హరి నామాన్ని ఉచ్చరించని వదరుబోతును, కలలోనైనా శ్రీపతి పాదపద్మాలను దర్శించని పొగరుబోతులను, చెడ్డ కథలంటే ఆసక్తి చూపుతూ నవ్వులాటకైనా విష్ణుదేవుని ప్రశంసను వినని వారిని, ఉత్సవ దినాలలోనైనా గుడికి పోని దుర్మార్గులను, భగవద్భక్తుల పాదధూళి పరమ పవిత్రమని తెలుసుకోలేని వారిని, వారికి సంబంధించిన వారిని ముందుగా పాశాలతో కట్టి తీసుకొని రండి.

6-189-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ల్ల పాపములకు నిల్లైన యింటిలో
ద్ధతృష్ణు లగుచు బుద్ధి దలఁగి
మహంసకులము గుఱిదప్పి వర్తించు
ధూర్తజనులఁ దెండు దూతలార!

టీకా:

ఎల్ల = సమస్తమైన; పాపముల = పాపముల; కున్ = కు; ఇల్లు = నివాసము; ఐన = అయిన; ఇంటిలో = నివాసములలో; బద్ధతృష్ణులు = ఆశలకు లోనైనవారు; అగుచు = అగుచూ; బుద్ధిన్ = తెలివి; తలగి = తప్పి; పరమహంస = పరమహంసల; కులము = సమూహములను; గుఱితప్పి = దారితప్పి; వర్తించు = ప్రవర్తించెడి; ధూర్తజనులన్ = చెడ్డవారిని; తెండు = తీసుకురండి; దూతలార = సేవకులు.

భావము:

దూతలారా! సమస్త పాపాలకు నిలయమైన ఇంటిలో ఆశలకు లొంగి, తెలివిమాలి, మహాత్ముల దారి విడిచి నడచుకొనే దుష్టులను తీసుకురండి.

6-190-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రయఁ దనదు జిహ్వ రిపేరు నుడువదు
చిత్త మతని పాదచింతఁ జనదు;
లఁపఁ దమకు ముక్తి తంగేటి జున్నొకో
కల విష్ణు భక్తుకును బోలె?

టీకా:

అరయన్ = తరచిచూసిన; తనదు = తన యొక్క; జిహ్వ = నాలుక; హరి = నారాయణుని; పేరు = నామమును; నుడువదు = పలుకదు; చిత్తము = మనసు; అతని = అతని యొక్క; పాద = పాదముల; చింతన్ = ఆలోచన లందు; చనదు = వెళ్ళదు; తలప = తరచిచూసిన; తమ = తమ; కున్ = కు; ముక్తి = మోక్షప్రాప్తి; తంగేటిజున్నొకో = అంత సుళువైనదా ఏమి {తంగేటిజున్ను - అందుబాటులో ఉన్న వస్తువు, తంగేడు చెట్టు యందున్న తేనెపట్టు యొక్క జున్ను (తేనె)}; సకల = అందరు; విష్ణుభక్తులు = విష్ణుభక్తుల; కును = కు; పోలెన్ = వలె.

భావము:

నాలుకతో భగవంతుని పేరు పలుకక, మనస్సులో అతని పాదాలను చింతించక ఉండే వీళ్ళకు విష్ణుభక్తులకు లభించే ముక్తి తంగేటి చెట్టుకు పట్టిన తేనెపట్టులాగా సులభంగా ఎలా లభిస్తుంది?

6-191-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ద్మనయను మీఁది క్తి యోగం బెల్ల
ముక్తి యోగ మనుచు మొద లెఱుంగు
వారి వారివారి వారిఁ జేరినవారి
త్రోవఁ బోవ వలదు దూతలార!

టీకా:

పద్మనయను = నారాయణుని; మీది = పైగల; భక్తియోగంబు = భక్తియోగము; ఎల్లన్ = సమస్తమును; ముక్తియోగము = ముక్తిప్రదమైన యోగము; అనుచు = అనుచు; మొదలు = ముందుగనే; ఎఱుంగు = తెలిసిన; వారి = వారి; వారివారి = వారి యొక్క వారి; వారిన్ = వారిని; చేరినవారి = అనుసరించెడి వారి; త్రోవన్ = దారిలో; పోవవలదు = పోవద్దు; దూతలార = సేవకులు.

భావము:

దూతలారా! పద్మాక్షుని మీది భక్తియోగమే ముక్తియోగమని భావించే వారి జోలికి, వారికి సంబంధించినవారి జోలికి మీరు వెళ్ళవద్దు”

6-192-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికె" నని చెప్పి మఱియు శుకుం డిట్లనియె "శ్రీకృష్ణనామ కీర్తనంబు జగన్మంగళం బనియును, జగన్మోహనం బనియును, జగజ్జేగీయమానం బనియును, నిఖిలపాపైక నిష్కృతి యనియును, నిఖిల దుఃఖ నివారణం బనియును, నిఖిలదారిద్ర్య నిర్మూలనం బనియును, నిఖిల మాయా గుణవిచ్ఛేదకం బనియును, నుద్దామంబు లగు హరి వీర్యంబుల నాకర్ణించు వారల చిత్తంబు లతి నిర్మలంబులగు భంగిం దక్కిన వ్రతాచరణంబులం గావనియును, శ్రీకృష్ణ పదపద్మంబులు హృత్పద్మంబుల నిలుపు వార లన్య పాపకర్మంబు లగు నవిద్యా వ్యసనంబులం బొరయ నేరరనియును, నిజస్వామియైన యమధర్మ రాజుచేతఁ గీర్తింపంబడిన భగవన్మహత్త్వంబు నాకర్ణించి, విస్మితులై కాలకింకరులు నాఁటనుండియు వైష్ణవజనంబులం దేఱిచూడ వెఱతురు; నరేంద్రా! పరమగుహ్యంబగు నీ యితిహాసంబును బూర్వకాలంబున సకల విజ్ఞానగోచరుండైన కుంభసంభవుండు సకలదుఃఖ విలయంబును సకలపుణ్య నిలయంబును నైన మలయంబునఁ బురాణపురుషుండైన పురుషోత్తము నారాధనంబు చేయుచుండి నాకెఱింగించెను;" అని చెప్పిన విని విస్మయానంద హృదయుండై పరీక్షిజ్జనపాలుం డిట్లనియె.

టీకా:

అని = అని; పలికెను = చెప్పెను; అని = అని; చెప్పి = చెప్పి; మఱియు = ఇంకను; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; శ్రీకృష్ణ = శ్రీకృష్ణుని; నామ = నామమును; కీర్తనంబు = సంకీర్తనములు; జగత్ = భువనమునకే; మంగళంబు = శుభకరములు; అనియును = అని; జగత్ = భువనమునకే; మోహనంబు = మోహింపజేయునది; అనియును = అని; జగత్ = భువనమునకే; జేగీయమానంబు = కీర్తింపదగినది; అనియును = అని; నిఖిల = సమస్తమైన; పాప = పాపములు; ఏక = సమస్తమునకు; నిష్కృతి = నివారించునది; అనియును = అని; నిఖిల = సర్వ; దుఃఖ = దుఃఖములను; నివారణంబు = పోగొట్టునది; అనియును = అని; నిఖిల = సమస్త; దారిద్ర్య = దారిద్ర్యములను; నిర్మూలంబు = నిర్మూలిండెడిది; అనియును = అని; నిఖిల = సమస్తమైన; మాయా = మాయా; గుణ = గుణములను; విచ్ఛేదకంబు = నాశనము చేయునది; అనియును = అని; ఉద్దామంబులు = తిరుగు లేనివి; అగు = అయిన; హరి = నారాయణుని; వీర్యంబులన్ = పరాక్రమములు; ఆకర్ణించువారల = వినెడి వారి; చిత్తంబులన్ = మనసులు; అతి = మిక్కిలి; నిర్మలంబులు = స్వచ్ఛమైనవి; అగు = అయ్యెడి; భంగిన్ = విధముగ; తక్కిన = ఇతరమైన; వ్రత = వ్రతములను; ఆచరణంబులు = చేయుటలు; కావు = కావు; అనియును = అని; శ్రీకృష్ణ = శ్రీకృష్ణుని; పద = పాదము లనెడి; పద్మంబులు = పద్మములను; హృత్ = హృదయము యనెడి; పద్మంబులన్ = పద్మములలో; నిలుపు = నిలుపుకొనెడి; వారలు = వారు; అన్య = ఇతరమైన; పాపకర్మంబులు = పాపిష్టి పనులు; అగు = అయిన; అవిద్యా = అవిద్య; వ్యసనంబులన్ = వ్యసనములను విషయవాంఛలు {సప్తవ్యసనములు - కామక్రోధాదుల వలన కలిగెడు దోషములు ఇవి ఏడు (1పానము 2స్త్రీ 3మృగయ 4ద్యూతము (ఇవి కామమువలన పుట్టినవి) 5వాక్పారుష్యము 6దండపారుష్యము 7అర్థపారుష్యము (ఇవి కోపమువలన పుట్టునవి)}; పొరయ = పొందుటను; నేరరు = నేర్వలేరు; అనియును = అని; నిజ = తనయొక్క; స్వామి = ప్రభువు; ఐన = అయిన; యమధర్మరాజు = యుముని; చేతన్ = వలన; కీర్తింపబడిన = స్తుతింపబడిన; భగవత్ = నారాయణుని; మహత్త్వంబున్ = మహత్యమును; ఆకర్ణించి = విని; విస్మితులు = ఆశ్చర్యచకితులు; ఐ = అయ్యి; కాలకింకరులు = యమభటులు; నాట = ఆనాటి; నుండియు = నుండి; వైష్ణవ = విష్ణుమూర్తి యొక్క; జనంబులన్ = జనులను; తేఱిచూడ = తేరిపారచూచుటకు; వెఱతురు = భయపడుదురు; నరేంద్రా = రాజా {నరేంద్రా - నరులకు ఇంద్రుని వంటివాడు, రాజు}; పరమ = అతిపవిత్రమైన; గుహ్యంబు = రహస్యమైనది; అగున్ = అయిన; ఈ = ఈ; ఇతిహాసంబును = ఇతిహాసమును; పూర్వ = పూర్వపు; కాలంబునన్ = కాలములో; సకల = సమస్తమైన; విజ్ఞాన = విజ్ఞానములను; గోచరుండు = దర్శించ గలవాడు; ఐన = అయిన; కుంభసంభవుండు = అగస్త్యమహర్షి {కుంభ సంభవుడు - కుంభమున పుట్టిన వాడు, అగస్త్యుడు}; సకల = సమస్త; దుఃఖ = దుఃఖములకు; విలయంబును = నాశనము చేయునది; సకల = సమస్త; పుణ్య = పుణ్యములకు; నిలయంబును = నివాసమును; ఐన = అయిన; మలయంబునన్ = మలయపర్వతమువద్ద; పురాణపురుషుండు = ఆదినారాయణుడు {పురాణ పురుషుడు - సృష్టిపూర్వమునుండి ఉన్న పురుషుడు, విష్ణువు}; ఐన = అయిన; పురుషోత్తమున్ = నారాయణుని {పురుషోత్తముడు - పురుషు లందరిలోను ఉత్తముడు, విష్ణువు}; ఆరాధనంబు = పూజించుట; చేయుచుండి = చేస్తూ; నాకున్ = నాకు; ఎఱింగించెను = తెలియజేసెను; అని = అని; చెప్పిన = చెప్పగా; విని = విని; విస్మయ = ఆశ్చర్యము; ఆనంద = ఆనందములు గల; హృదయుండు = హృదయము గలవాడు; ఐ = అయ్యి; పరీక్షిత్ = పరీక్షిత్తు యనెడి; జనపాలుండు = రాజు {జనపాలుడు - జన (ప్రజలను) పాలుడు (పాలించెడివాడు), రాజు}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అని యముడు చెప్పాడు” అని చెప్పి శుకుడు ఇంకా ఇలా అన్నాడు “శ్రీకృష్ణుని నామ సంకీర్తన లోకానికి శుభకరమనీ, లోకాన్ని సమ్మోహింప జేస్తుందనీ, లోకంలో కీర్తింపబడేదనీ, సమస్త మాయాబంధాలను త్రెంచేదనీ భావించి, సాటిలేని హరి పరాక్రమ కథలను వినేవారి మనస్సులు పవిత్రాలౌతాయి. తక్కిన వ్రతాలను ఆచరించడం వల్ల కావు. శ్రీకృష్ణుని పాదపద్మాలను తమ మనస్సనే పద్మాలలో నిలుపుకొన్నవారు పాపాలకు మూలాలైన అజ్ఞానం, వ్యసనాలకు దూరంగా ఉంటారు” అని భగవంతుని మహత్తును తమ ప్రభువైన యమధర్మరాజు పొగడగా విని, ఆశ్చర్యపడి యమదూతలు నాటినుండి విష్ణుభక్తుల వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడసాగారు. రాజా! పరమ రహస్యమైన ఈ ఇతిహాసాన్ని పూర్వం సర్వజ్ఞుడైన అగస్త్య మహర్షి సమస్త దుఃఖాలను హరించేదీ, సకల పుణ్యాలకు నిలయమైనదీ అయిన మలయపర్వతంపై పురాణ పురుషుడైన విష్ణువును ఆరాధిస్తూ నాకు తెలియజేశాడు” అని శుకమహర్షి చెప్పగా విని ఆశ్యర్యం, ఆనందం నిండిన మనస్సు కలవాడై ఆ పరీక్షిన్మహారాజు ఇలా అన్నాడు.