పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : కథా ప్రారంభము

  •  
  •  
  •  

6-55-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రికి నర్థముఁ బ్రాణ ర్పితంబుగ నుండు-
వాని కైవల్య మెవ్వనికి లేదు
నజలోచను భక్తరుల సేవించిన-
వాని కైవల్య మెవ్వనికి లేదు
వైకుంఠ నిర్మల వ్రతపరుండై నట్టి-
వాని కైవల్య మెవ్వనికి లేదు
రసిజోదరు కథాశ్రవణ లోలుం డైన-
వాని కైవల్య మెవ్వనికి లేదు

6-55.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లేదు తపముల బ్రహ్మచర్యాది నియతి
మ దమాదుల సత్యశౌముల దాన
ర్మ మఖముల సుస్థిర స్థానమైన
వైష్ణవజ్ఞాన జనిత నిర్వాణపదము.

టీకా:

హరి = నారాయణుని; కిన్ = కి; అర్థమున్ = ప్రయోజనములు; ప్రాణము = ప్రాణములు; అర్పితంబుగన్ = అర్పణజేసి; ఉండు = ఉండెడి; వాని = వాని యొక్క; కైవల్యమున్ = ముక్తి; ఎవ్వని = ఎవరి; కిన్ = కిని; లేదు = లేదు; వనజలోచను = నారాయణుని {వనజ లోచనుడు - పద్మనేత్రుడు, హరి}; భక్త = భక్తిలో; పరులు = లగ్నమైనవారిని; సేవించిన = కొలచిన; వాని = వాని యొక్క; కైవల్యమున్ = ముక్తి; ఎవ్వని = ఎవరి; కిన్ = కిని; లేదు = లేదు; వైకుంఠ = నారాయణుని ఎడల {వైకుంఠుడు - వైకుంఠమున నుండువాడు, హరి}; నిర్మల = స్వచ్ఛమైన; వ్రత = దీక్ష యందు; పరుండు = లగ్నమైన వాడు; ఐనట్టి = అయినట్టి; వాని = వాని యొక్క; కైవల్యమున్ = ముక్తి; ఎవ్వని = ఎవరి; కిన్ = కిని; లేదు = లేదు; సరసిజోదరు = నారాయణుని {సరసిజోదరుడు - సరసిజము (పద్మము) ఉదరుడు (ఉదరమున గలవాడు), హరి}; కథ = కథలను; శ్రవణ = వినుట యందు; లోలుండు = మునిగిన; ఐన = అయినట్టి; వాని = వాని యొక్క; కైవల్యమున్ = ముక్తి; ఎవ్వని = ఎవరి; కిన్ = కిని; లేదు = లేదు.
లేదు = లేదు; తపములన్ = తపస్సులందు; బ్రహ్మచర్య = బ్రహ్మచర్యము; ఆది = మొదలైన; నియతిన్ = నియమములందు; శమ = శమము; దమ = దమము; ఆదులన్ = మొదలైనవాని యందు; సత్య = సత్యము; శౌచములన్ = శౌచము లందు; దాన = దానములు; ధర్మ = ధర్మములు; మఖములన్ = యజ్ఞము లందు; సుస్థిర = మిక్కిలి స్థిరమైన; స్థానము = స్థానము; ఐన = అయినట్టి; వైష్ణవ = విష్ణుభక్తి యొక్క; జ్ఞాన = జ్ఞానము చేత; జనిత = కలిగెడి; నిర్వాణపదము = మోక్షమార్గము.

భావము:

ఎవరైతే శ్రీహరికి తమ అర్థాన్ని, ప్రాణాన్ని సమర్పిస్తారో, ఎవరైతే పుండరీకాక్షుని భక్తులను సేవిస్తారో, ఎవరైతే నారాయణ వ్రత పరాయణులో, ఎవరైతే మాధవ కథలను ఆసక్తితో వింటారో అటువంటి వారికి లభించే మోక్షం మరెవ్వరికీ లభించదు. విష్ణుభక్తి వల్ల లభించే సుస్థిరమైన కైవల్యపదం తపస్సుల వల్ల కాని, బ్రహ్మచర్యాది నియమాల వల్ల కాని, అంతరింద్రియ బాహ్యేంద్రియ నిగ్రహం వల్లకాని, సత్యపరిపానం వల్ల కాని, శుచిత్వం వల్ల కాని, దానధర్మాల వల్ల కాని, యజ్ఞాలు చేయటం వల్ల కాని ప్రాప్తించదు.