పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : షష్ఠ్యంతములు

  •  
  •  
  •  

6-36-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యోగిమాన సాంతః
ణ సుధాంభోధి భావల్లోల లస
త్పతత్త్వశేషశాయికిఁ
జిదాయికి సకలభక్తచింతామణికిన్

టీకా:

వరయోగిమానసాంతఃకరణసుధాంభోధిభావకల్లోలలసత్పరతత్త్వశేషశాయి = నారాయణుడు {వర యోగి మానసాంతఃకరణ సుధాంభోధి భావకల్లోలల సత్పరతత్త్వ శేషశాయి - వర (ఉత్తమ) యోగి (యోగుల) మానస (మనసుల) అంతఃకరణములు యనెడి సుధాంభోధి (పాలసముద్రము నందలి) భావము లనెడి కల్లోల (కెరటములపై) లసత్ (ప్రకాశించుతున్న) పరతత్త్వ (పరబ్రహ్మ స్వరూపుడైన) శేష (ఆదిశేషుడు) శాయి (శయ్యగ గలవాడు), విష్ణువు}; కిన్ = కి; సకలభక్తచింతామణి = నారాయణుడు {సకల భక్త చింతామణి - సకల (సమస్తమైన) భక్త (భక్తులకు) చితామణి (కోరిన కోరికల నిచ్చు మణి వంటివాడు), విష్ణువు}; కిన్ = కి.

భావము:

పరమ యోగీంద్రుల అంతఃకరణమనే పాలసముద్రంలో భావ తరంగాలలో తేలియాడే శేషతల్పంపై శయనించే పరతత్త్వం, భక్తుల పాలిటి చింతామణియై శాశ్వతమైన మేలును కలిగించేవాడు అయిన శ్రీకృష్ణునికి (ఈ కృతిని సమర్పిస్తున్నాను).