పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : షష్ఠ్యంతములు

  •  
  •  
  •  

6-32-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీతికి మత్పతికి నుత
గోతికిఁ ద్రిలోకపతికి గురుజనబుధ సం
తా నివారణ మతికిని
బ్రాపితసనకాది తతికి హుతర ధృతికిన్,

టీకా:

శ్రీపతి = నారాయణుడు {శ్రీపతి - శ్రీ (లక్ష్మీదేవి) పతి (భర్త), విష్ణువు}; కిన్ = కి; మత్ = నా యొక్క; పతి = దేవుడు; కిన్ = కి; నుత = స్తుతింపబడిన; గోపతి = కృష్ణుని {గోపతి - గోవులకు అధిపతి, కృష్ణుడు}; కిన్ = కి; త్రిలోకపతి = నారాయణుడు {త్రిలోక పతి - ముల్లోకములకు భగవంతుడు, విష్ణువు}; కిన్ = కి; గురుజనబుధసంతాపనివారణమతికి = నారాయణుడు {గురుజన బుధ సంతాప నివారణ మతి - గురుజన (గొప్పవారి) బుధ (జ్ఞానుల) సంతాపములను నివారణ (పోగొట్టెడి) మతి (మనసు గలవాడు), విష్ణువు}; కిన్ = కి; ప్రాపితసనకాదితతి = నారాయణుడు {ప్రాపిత సనకాది తతి - ప్రాపిత (తనను పొందిన) సనక (సనకుడు) ఆది (మొదలగువారి) తతి (సమూహము గలవాడు), విష్ణువు}; కిన్ = కి; బహుతరధృతి = నారాయణుడు {బహుతరధృతి - బహుతర (అనేకమైన) ధృతి (ధీరత్వం కల వాడు), విష్ణువు}; కిన్ = కి.

భావము:

లక్ష్మీదేవికి పతి అయినవాడు, నాకు ఈశ్వరుడైనవాడు, ఇంద్రునిచేత నుతింపబడినవాడు, ముల్లోకాలకు అధిపతి అయినవాడు, గొప్పవారైన పండితుల సంతాపాన్ని నివారించేవాడు, సనక సనందాది మహర్షులకు ఆశ్రయమైనవాడు, గొప్ప ధీరుడు అయిన శ్రీకృష్ణునికి...