పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : గ్రంథకర్త వంశ వర్ణనము

  •  
  •  
  •  

6-26.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లుద్భవించిరి తేజంబు లూర్జితముగ
సొరది మూర్తి త్రయం బన శుభ్రకీర్తిఁ
రఁగి రందులఁ గసువనప్రభువునకును
ముమ్మడమ్మను సాధ్వి యిమ్ములను వెలసె.

టీకా:

శ్రీవత్స = శ్రీవత్స యనెడి; గోత్రుండు = గోత్రములో పుట్టినవాడు; శివ = పరమశివుని ఎడల; భక్తి = భక్తి; యుక్తుడు = కలిగినవాడు; ఆపస్తంబసూత్రుడు = ఆపస్తంబ సూత్రము ననుసరించు వాడు; అపార = అంతులేని; గుణుడున్ = సుగుణములు గలవాడు; ఏర్చూరి = ఏర్చూరును; శాసనుండు = ఏలెడివాడు; ఎఱ్ఱనప్రెగ్గడ = ఎఱ్ఱనప్రెగ్గడ; పుత్రుండు = కొడుకు; వీరన = వీరన; పుణ్యమూర్తి = (ఆ) పుణ్యాత్ముని; కిన్ = కి; ఆత్మజుండు = పుత్రుడు; అగు = అయిన; నాదయామాత్యున్ = నాదయ అమాత్యుని; కున్ = కి; పోలమాంబ = పోలమాంబ; కున్ = కు; నందనులు = పుత్రులు; అమిత = అంతులేని; యశులు = యశస్సు గలవారు; కసువనామాత్యుండు = కసువన అమాత్యుడు; ఘనుడు = గొప్పవాడును; వీరనమంత్రి = వీరనమంత్రియును; సింగధీమణియున్ = సింగధీమణియును; అంచిత = చక్కటి; గుణ = సుగుణములుతో; ఆఢ్యులు = గొప్పవారు; ఉద్భవించిరి = పుట్టిరి.
తేజంబుల్ = తేజస్సులు; ఊర్జితముగ = కూడబెట్టుకొని; సొరదిన్ = వరుసగా; మూర్తిత్రయంబు = మువ్వురు మూర్తులు; అనన్ = అనునట్లు; శుభ్ర = శుభ్రమైన; కీర్తిన్ = యశస్సుతో; పరగిరి = ప్రసిద్ధులైరి; అందులన్ = వారిలో; కసువనప్రభువున్ = కసువన అమాత్యుని; కును = కి; ముమ్మడమ్మ = ముమ్మడమ్మ; అను = అనెడి; సాధ్వి = సాత్వికురాలుకు; ఇమ్ములను = అనుకూలముగా; వెలెసె = వర్థిల్లెను.

భావము:

శ్రీవత్సగోత్రుడు, శివభక్తుడు, ఆపస్తంబ సూత్రుడు, సుగుణ సంపన్నుడు, ఏర్చూరుకు శాసకుడు అయిన ఎఱ్ఱన ప్రెగ్గడ కుమారుడు వీరన్న. ఆ పుణ్యమూర్తి పుత్రుడు నాదయామాత్యుడు. ఆయన భార్య పోలమ్మ. ఆ దంపతులకు కసువన్న, వీరన్న, సింగన్న అనే ముగ్గురు కుమారులు త్రిమూర్తుల వలె జన్మించారు. ఆ ముగ్గురు నిర్మల కీర్తిమంతులై వర్ధిల్లారు. వారిలో కసువన మంత్రికి ముమ్మడమ్మ అనే సాధ్వి అనుకూలవతి అయిన భార్యగా అలరారింది.