పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : మరుద్గణంబుల జన్మంబు

  •  
  •  
  •  

6-526-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"హరి వరదుఁ డయిన వ్రతమట;
రి యంశజు లగుచు నెగడు మరుల జన్మ
స్ఫుణం బఁట; పఠియించిన
యఁగ నురుదీర్ఘపాప రమగు టరుదే."

టీకా:

హరి = విష్ణుమూర్తి; వరదుడు = వరములనిచ్చువాడు; అయిన = ఐన; వ్రతము = వ్రతము; అట = అట; హరి = నారాయణుని; అంశజులు = అంశతో పుట్టినవారు; అగుచున్ = అగుచు; నెగడు = వర్ధిల్లెడి; అమరుల = దేవతల; జన్మ = పుట్టుక; స్ఫురణంబు = తోచెడిది; అట = అట; పఠియించినన్ = చదివిన; అరయగను = చూడగా; ఉరు = అధికమైన; దీర్ఘ = పెద్దవైన, జన్మజన్మల; పాప = పాపమును; హరము = నాశనము; అగుట = అగుట; అరుదే = ఆశచర్యమాఅరుదా ఏమి.

భావము:

“ఇది వరాలను ప్రసాదించే శ్రీహరి వ్రత కథ అట! అతని అంశతో పుట్టిన మరుద్గణాలకు అమరత్వం లభించిన వృత్తాంతమట! ఇటువంటి పుణ్యకథను చదివినవారి పాపాలు నాశనం కావటంలో ఆశ్చర్యమేమున్నది?”