పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-442-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భూస్థలిఁ గల రేణువులకన్న దట్టమై-
డు నొప్పు జీవసంములు గలవు;
జీవములలో నరయ ధర్మాయత-
తి వసించినవారు నుజజాతి;
మనుష్యులలోనఁ గామంబుఁ బెడఁబాసి-
మోక్షార్థు లగువారు మొదల నరిది;
మోక్షమార్గం బాత్మమూలంబుగా నుండు-
వారిలో ముక్తులు లేరు తఱచు;

6-442.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ముక్తు లై నట్టి వారిలో యుక్తిఁ దలఁపఁ
జాల దుర్లభుఁ డమిత ప్రశాంతి పరుఁడు
రమ సుజ్ఞాన నిరతుండు ద్రగుణుఁడు
మణ శ్రీవాసుదేవపరాయణుండు.

టీకా:

భూస్థలిన్ = భూమండలమున; కల = ఉన్నట్టి; రేణువులు = ఇసుక రేణువులు; కన్నన్ = కంటెను; దట్టము = సాంద్రత గలది; ఐ = అయ్యి; కడున్ = మిక్కిలి; ఒప్పు = ఒప్పెడి; జీవ = ప్రాణుల; సంఘములు = జాతులు; కలవు = ఉన్నవి; ఆ = ఆ; జీవముల్ = ప్రాణుల; లోనన్ = అందు; అరయన్ = చూడగా; ధర్మ = ధర్మముతో; ఆయత = కూడిన; మతి = బుద్ధి; వహించిన = ధరించిన; వారు = వారు; మనుజ = మానవ; జాతి = జాతి; ఆ = ఆ; మనుష్యుల్ = మానవుల; లోనన్ = అందును; కామంబున్ = కామమును; ఎడబాసి = విడిచిపెట్టి; మోక్షార్థులు = ముక్తిని కోరెడివారు; అగు = అయిన; వారు = వారు; మొదలన్ = ముందే; అరిది = దుర్లభము; మోక్ష = ముక్తి; మార్గంబున్ = పథమును; ఆత్మ = తమకు; మూలంబుగాన్ = ముఖ్యమైనదిగా; ఉండు = ఉండెడి; వారి = వారి; లోన్ = అందు; ముక్తులు = మోక్షము సాధించినవారు; లేరు = లేరు; తఱచున్ = ఎక్కువగా;
ముక్తులు = మోక్షము సాధించినవారు; ఐనట్టి = అయినట్టి; వారి = వారి; లోన్ = అందు; యుక్తిదలపన్ = తరచిచూసినచో; చాలన్ = మిక్కిలి; దుర్లభుడు = దొరకనివాడు; అమిత = మిక్కిలి; ప్రశాంతి = అత్యంత శాంత గుణుడు; పరమ = అత్యుత్తమమైన; సు = మంచి; జ్ఞాన = జ్ఞానమున; నిరతుండు = మిక్కిలి యాసక్తి గలవాడు; భద్ర = శుభములైన; గుణుడు = గుణములు గలవాడు; రమణన్ = మనోజ్ఞముగా; శ్రీ = శోభనకరమైన; వాసుదేవ = నారాయణుని యెడల {వాసుదేవ - ఆత్మలందు వసించెడి దేవుడు, విష్ణువు}; పరాయణుండు = లగ్నమైనవాడు.

భావము:

ఈ భూతలంపై రేణువుల కంటె అధిక ప్రమాణంలో ప్రాణి సముదాయం ఉన్నది. ఆ ప్రాణులలో ధర్మమార్గాన్ని అతిక్రమించకుండా ఉండేవారు మానవులు. అటువంటి మనుష్యులలో కూడా కామ ప్రవృత్తిని విడిచి మోక్షాన్ని కోరేవారు తక్కువగా ఉంటారు. అటువంటి మోక్షార్థులలో సైతం మోక్షలక్ష్మిని కైవసం చేసుకున్నవారు అరుదు. ఆ విధంగా ముక్తులైన వారిలో కూడా శాంత స్వభావం కలిగి జ్ఞానవంతుడై, సుగుణవంతుడై శ్రీమన్నారాయణ భక్తి పరాయణుడైనవాడు మిక్కిలి దుర్లభుడు.