పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-441.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిర్మలాత్మకు లై నట్టి ర్మపరుల
మరులకుఁ బుణ్యమునులకు నంబుజాక్షు
భూరి కైవల్య సంప్రాప్తి మూలమైన
క్తి వీనికిఁ బోలె నేర్పాటుగాదు.

టీకా:

నావుడు = అనగా; యోగి = యొగులలో; ఇంద్ర = శ్రేష్ఠుడ; నా = నా యొక్క; మనంబు = మనస్సు; ఈ = ఈ; వృత్రు = వృత్రుని; వివరంబున్ = వివరమును; నీ = నీ; చేత = వలన; విన్న = వినినది; మొదలు = మొదలు; కడున్ = మిక్కిలి; అద్భుతంబునన్ = ఆశ్చర్యముతో; కళవళన్ = కలత; అందెడున్ = చెందుతున్నది; కోరి = పూని; రజః = రజోగుణము; తమోగుణములు = తమోగుణములు; అందున్ = అందు; వర్తించున్ = ప్రవర్తించెడి; ఈ = ఈ; పాప = పాపపు మార్గమున; వర్తి = తిరిగెడువాని; కిన్ = కి; ఏ = ఏ; రీతిన్ = విధముగ; మాధవ = నారాయణుని; పద = పాదము లందలి; భక్తి = భక్తి; మదిన్ = మనసులో; వసించె = స్థిరపడెను; సత్త్వ = సత్త్వగుణ; స్వభావులు = స్వభావములు గలవారు; ఐ = అయ్యి; సమ = సమత్వ భావన గల; బుద్ధులు = భావములు గలవారు; ఐ = అయ్యి; తపస్ = తపస్సు; నియమ = నియమములతో; ప్రయత్నులు = ప్రవర్తించెడివారు; ఐ = అయ్యి; నిష్ఠ = పూనిక; చేత = వలన;
నిర్మల = స్వచ్ఛమైన; ఆత్మకులు = ఆత్మలు గలవారు; ఐనట్టి = అయినటువంటి; ధర్మపరుల్ = ధర్మనిష్ఠుల; కున్ = కు; అమరుల్ = దేవతల; కున్ = కు; పుణ్య = పుణ్యులు యైన; మునుల్ = మునుల; కున్ = కు; అంబుజాక్షు = నారాయణుని {అంబుజాక్షుడు - అంబుజము (పద్మము) వంటి అక్షుడు (కన్నులుగలవాడు)} భూరి = అతిగొప్ప; కైవల్య = మోక్షపధము; సంప్రాప్తి = లభ్యమగుటకు; మూలము = మూలకారణము; ఐన = అయిన; భక్తి = భక్తి; వీని = ఇతని; కిన్ = కి; పోలెన్ = వలె; ఏర్పాటు = సంభవింప; లేదు = లేదు.

భావము:

అని శుకమహర్షి చెప్పగా విని పరీక్షిత్తు “యోగీంద్రా! వృత్రుని వృత్తాంతం విన్నది మొదలు నా హృదయం ఆశ్చర్యంతో కళవళపడుతున్నది. రజోగుణం, తమోగుణం ప్రధానంగా ప్రవర్తించే పాపాత్ముడైన వృత్రునికి నారాయణుని పాదపద్మాలపై భక్తి ఎలా సంభవించింది? సత్త్వగుణ సంపన్నులు, సమబుద్ధులు, తపోనిష్ఠులు, నిర్మల స్వభావులు, ధర్మమూర్తులు అయిన మహానుభావులకు, దేవతలకు, మహర్షులకు సైతం లభించని మోక్షానికి మూలకారణమైన భగవద్భక్తి పరమ రాక్షసుడైన వీనికి ఎలా పట్టుబడింది?